హైలైట్స్:
- రూ.14,999 ప్రారంభ ధరతో ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ సిరీస్ భారత్ గడ్డపై లాంచ్
- మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ చిప్సెట్, అమోలెడ్ ప్యానెల్, 5,000mAh బ్యాటరీ
- జులై 15 నుంచి ఫ్లిప్ కార్ట్, ఇన్ఫినిక్స్ ఇండియా అధికార వెబ్ సైట్ ద్వారా సేల్ కి రానున్న ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ సిరీస్
Infinix Note 12 5G సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఇవే కంపెనీ నుంచి తొలి 5జీ స్మార్ట్ ఫోన్స్ కావడం విశేషం. వెనీలా ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ, ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5జీ ఈ సిరీస్ లో ఉన్నాయి. కొనాలనుకునేవారు, ఫ్లిప్ కార్ట్, ఇన్ఫినిక్స్ ఇండియా అధికార వెబ్ సైట్ ద్వారా జులై 15 నుంచి ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజీ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ ఇంకేం ఆఫర్ చేస్తుందో ఇక్కడ చూద్దాం.
భారత్ లో Infinix Note 12 5G ధర
Experience #ThrillAndThunder with Infinix NOTE 12 5G series, with Dimensity 810 5G processor & more cool features:
?6.7' FHD+ AMOLED Display
?12 5G Bands
?108 MP Camera
?33W Fast chargeStarting at just ₹12,999*
Sale starts 14th July on Flipkart https://t.co/fFgKtfeMCE pic.twitter.com/mR1v3FSJWX— Infinix India (@InfinixIndia) July 8, 2022
ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ సిరీస్ ఫోర్స్ బ్లాక్ మరియు స్నోఫాల్ వైట్ అనే రెండు రంగుల్లో లభ్యమవ్వనుంది. ఇక బేస్ వేరియంట్ ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ రూ.14,999 కి అమ్ముడవ్వనుంది. ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5జీ రూ.17,999 వద్ద సేల్ అవ్వనుంది. ఫ్లిప్ కార్ట్, ఇన్ఫినిక్స్ ఇండియా అధికార వెబ్ సైట్ ద్వారా ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ సిరీస్ జులై 15 నుంచి కొనుగోలుకి అందుబాటులోకి వస్తుంది. ఇంట్రడక్టరీ ఆఫర్ క్రింద రూ.1500 డిస్కౌంట్ లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ ని కొంటే కనుక ఈ డిస్కౌంట్ లభించనుంది.
Infinix Note 12 5G స్పెసిఫికేషన్స్
6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, వంద శాతం డీసీఐ పీ3 కలర్ గేముత్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజీ, 512జిబి ఎక్స్ ప్యాండబుల్ మెమొరీ, 6జిబి ర్యామ్, 3జిబి ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్, ర్యామ్ ఎక్స్ ప్యాన్షన్ ఫీచర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
కెమెరా విభాగానికి వస్తే, ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఒక ఏఐ లెన్స్ ఉన్నాయి. ఇకపోతే సెల్ఫీల కోసం ముందు వైపు 16ఎంపి షూటర్ ఉంది. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ – 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 స్కిన్ పై పని చేయనుంది.
Infinix Note 12 Pro 5G స్పెసిఫికేషన్స్

ఇక కెమెరా విభాగానికి వస్తే, ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5జీ ఫోన్లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ మరియు ఒక ఏఐ లెన్స్ ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16ఎంపి కెమెరా ఉంది. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 స్కిన్ పై పనిచేస్తుంది.











