240W - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 06 Jan 2023 12:20:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 240W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న Realme GT Neo 5 Pro https://www.91mobiles.com/telugu/realme-gt-neo-5-pro-240w-fast-charging-launch-timeline/ Fri, 06 Jan 2023 12:20:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=4369 హైలైట్స్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఫ్లాగ్షిప్ డివైజ్ ని తీసుకురానున్న రియల్మీ సంస్థ 4,600mAh బ్యాటరీతో వస్తోన్న Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ Realme GT Neo 5 Pro లో అందుబాటులో ఉండే అవకాశం Realme సంస్థ త్వరలో ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఫోన్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ […]

The post 240W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న Realme GT Neo 5 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఫ్లాగ్షిప్ డివైజ్ ని తీసుకురానున్న రియల్మీ సంస్థ
  • 4,600mAh బ్యాటరీతో వస్తోన్న Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్
  • 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ Realme GT Neo 5 Pro లో అందుబాటులో ఉండే అవకాశం

Realme సంస్థ త్వరలో ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఫోన్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. ఈ 240 వాట్ చార్జింగ్ ఆర్కిటెక్చర్ లో-ఓల్టేజీ చార్జింగ్ సొల్యూషన్ గా రానుందని తెలుస్తోంది. 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసేందుకు కేవలం 9 నిమిషాల సమయమే తీసుకుంటుందని నివేదికల ద్వారా తెలుస్తోంది.

2021 లో రియల్మీ 67 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఫోన్, 2022 లో 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫోన్ (Realme GT Neo 3) ని లాంచ్ చేసింది. ఇది 0 నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 20 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఇక 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యం ఏంటో మనం ఊహించుకోవచ్చు. Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ కానుంది. ఈ ఫోన్ యొక్క బేస్ మోడల్ మాత్రం 150 వాట్ చార్జింగ్ కెపాసిటీతో లాంచ్ అవుతుంది.

Realme GT Neo 5 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ 240 వాట్ చార్జింగ్ తో రానున్నట్లు సమాచారం. ఇక బేస్ మోడల్ అయిన Realme GT Neo 5 ఫోన్ 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇకపోతే Realme GT Neo 5 Pro ఫోన్ 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ, బేస్ వేరియంట్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తోంది. Realme GT Neo 5 Pro స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, ఓఐఎస్ సపోర్ట్ తో రానుంది.

Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5 కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, ప్లాస్టిక్ ఫ్రేమ్, ఆర్బీజీ లైటింగ్ తో వస్తోంది. Realme GT Neo 5 Pro ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్ తో రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

అయితే కంపెనీ ఇంకా ఈ డివైజ్ కి సంబంధించిన అధికార ప్రకటన చేయలేదు. అలాగే ఎటువంటి స్పెసిఫికేషన్స్ ని కూడా వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ కానుందని కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, Realme 10 4G డివైజ్ 2023 జనవరి 9 న లాంచ్ కానుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ సేల్ కి రానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 240W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న Realme GT Neo 5 Pro first appeared on 91Mobiles Telugu.

]]>