240W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న Realme GT Neo 5 Pro

హైలైట్స్

  • 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఫ్లాగ్షిప్ డివైజ్ ని తీసుకురానున్న రియల్మీ సంస్థ
  • 4,600mAh బ్యాటరీతో వస్తోన్న Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్
  • 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ Realme GT Neo 5 Pro లో అందుబాటులో ఉండే అవకాశం

Realme సంస్థ త్వరలో ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఫోన్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. ఈ 240 వాట్ చార్జింగ్ ఆర్కిటెక్చర్ లో-ఓల్టేజీ చార్జింగ్ సొల్యూషన్ గా రానుందని తెలుస్తోంది. 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసేందుకు కేవలం 9 నిమిషాల సమయమే తీసుకుంటుందని నివేదికల ద్వారా తెలుస్తోంది.

2021 లో రియల్మీ 67 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఫోన్, 2022 లో 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫోన్ (Realme GT Neo 3) ని లాంచ్ చేసింది. ఇది 0 నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 20 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఇక 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యం ఏంటో మనం ఊహించుకోవచ్చు. Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ కానుంది. ఈ ఫోన్ యొక్క బేస్ మోడల్ మాత్రం 150 వాట్ చార్జింగ్ కెపాసిటీతో లాంచ్ అవుతుంది.

Realme GT Neo 5 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ 240 వాట్ చార్జింగ్ తో రానున్నట్లు సమాచారం. ఇక బేస్ మోడల్ అయిన Realme GT Neo 5 ఫోన్ 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇకపోతే Realme GT Neo 5 Pro ఫోన్ 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ, బేస్ వేరియంట్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తోంది. Realme GT Neo 5 Pro స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, సోని ఐఎంఎక్స్890 మెయిన్ సెన్సర్, ఓఐఎస్ సపోర్ట్ తో రానుంది.

Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5 కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, ప్లాస్టిక్ ఫ్రేమ్, ఆర్బీజీ లైటింగ్ తో వస్తోంది. Realme GT Neo 5 Pro ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్ తో రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

అయితే కంపెనీ ఇంకా ఈ డివైజ్ కి సంబంధించిన అధికార ప్రకటన చేయలేదు. అలాగే ఎటువంటి స్పెసిఫికేషన్స్ ని కూడా వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ కానుందని కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, Realme 10 4G డివైజ్ 2023 జనవరి 9 న లాంచ్ కానుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ సేల్ కి రానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.