5000mAh battery phones - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 10 Jul 2023 14:36:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.15,000 లోపు ధరలో లభించే 5000mAh బ్యాటరీ గల 5G ఫోన్లు https://www.91mobiles.com/telugu/5g-smartphones-with-5000mah-battery-under-15-thousand-rupees-budget/ Mon, 10 Jul 2023 14:33:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=7145 రూ.15 వేల లోపు ధరలో లభించే 5జీ ఫోన్లు Vivo T2x 5G Samsung Galaxy F14 5G Infinix HOT 20 5G Samsung Galaxy M14 5G Redmi 11 Prime 5G iQOO Z6 Lite 5G 1. Vivo T2x 5G ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో రూ.15 వేల లోపు బడ్జెట్ లో Vivo T2x 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ […]

The post రూ.15,000 లోపు ధరలో లభించే 5000mAh బ్యాటరీ గల 5G ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అన్ని ధరల శ్రేణుల్లో లభిస్తోన్న 5జీ హ్యాండ్సెట్స్
  • రూ.15,000 లోపు ధరలో లభిస్తున్న ఫోన్లకు చక్కటి ఆదరణ
  • 5జీ కనెక్టివిటీ, 5000mAh బ్యాటరీ గల ఫోన్ల జాబితా మీకోసం

రూ.15 వేల లోపు ధరలో లభించే 5జీ ఫోన్లు

  • Vivo T2x 5G
  • Samsung Galaxy F14 5G
  • Infinix HOT 20 5G
  • Samsung Galaxy M14 5G
  • Redmi 11 Prime 5G
  • iQOO Z6 Lite 5G

1. Vivo T2x 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో రూ.15 వేల లోపు బడ్జెట్ లో Vivo T2x 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ డివైజ్ 4జిబి వేరియంట్ ధర రూ.12,999 గా ఉంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 50ఎంపి+2ఎంపి కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

2. Samsung Galaxy F14 5G

Samsung F14 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,990 గా ఉంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఎగ్జినోస్ 1330 చిప్, 50ఎంపి + 2ఎంపి కెమెరా, 13ఎంపి ఫ్రంట్ కెమెరా, 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉన్నాయి.

3. Infinix HOT 20 5G

Infinix HOT 20 స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,499 గా ఉంది. ఈ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్, 50ఎంపి + ఏఐ లెన్స్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

4. Samsung Galaxy M14 5G

Galaxy M14 5G

Samsung Galaxy M14 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 401పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 50ఎంపి + 2ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 13ఎంపి ఫ్రంట్ కెమెరా, ఎగ్జినోస్ 1330 చిప్సెట్, 13 5జీ బ్యాండ్స్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, వన్‌యూఐ కోర్ 5.0 కస్టమ్ స్కిన్, 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. 4జిబి + 128జిబి వేరియంట్ ధర అమెజాన్ లో రూ.14,490 గా ఉంది.

5. Redmi 11 Prime 5G

Redmi 11 Prime 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, 90హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 7 5జీ బ్యాండ్స్ ఉన్నాయి. ఈ డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర అమెజాన్ లో రూ.12,999 గా ఉంది.

6. iQOO Z6 Lite 5G

iQOO Z6 Lite 5G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర అమెజాన్ లో రూ.13,999 గా ఉంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి మెయిన్ కెమెరా ఉన్నాయి.

The post రూ.15,000 లోపు ధరలో లభించే 5000mAh బ్యాటరీ గల 5G ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.10,000 ధర లోపు లభించే పది 5000mAh బ్యాటరీ ఫోన్లు https://www.91mobiles.com/telugu/5000-mah-battery-smartphones-under-10-thousand-rupees-budget/ Tue, 18 Apr 2023 16:46:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=5935 భారతదేశంలో ఉన్న మొబైల్ ఫోన్ యూజర్లలో ఎంట్రీ లెవెల్ ఫోన్లను వాడే వారి శాతం కూడా గణనీయంగానే ఉంది. సాధారణ వాడకం కోసం ఫోన్ వినియోగించే వారు ప్రధానంగా చూసే అంశం ‘బ్యాటరీ’. బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటే, ఫోన్ ఎక్కువ సేపు పని చేస్తుంది. కొన్ని ఫోన్లు ఒక పూర్తి రోజు బ్యాటరీ లైఫ్ ని అందిస్తే, మరికొన్ని ఫోన్లు రెండు రోజుల వరకు కూడా బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. ఈ ఆర్టికల్ లో మనం […]

The post రూ.10,000 ధర లోపు లభించే పది 5000mAh బ్యాటరీ ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అధిక బ్యాటరీ కెపాసిటీ గల ఫోన్లకు జనాల్లో మాంచి డిమాండ్
  • వివిధ కంపెనీల్లో అందుబాటులో ఉన్న 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్లు
  • రూ.10 వేల లోపు ధరలో లభించే 5000mAh బ్యాటరీ ఫోన్ల జాబితా మీకోసం

భారతదేశంలో ఉన్న మొబైల్ ఫోన్ యూజర్లలో ఎంట్రీ లెవెల్ ఫోన్లను వాడే వారి శాతం కూడా గణనీయంగానే ఉంది. సాధారణ వాడకం కోసం ఫోన్ వినియోగించే వారు ప్రధానంగా చూసే అంశం ‘బ్యాటరీ’. బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటే, ఫోన్ ఎక్కువ సేపు పని చేస్తుంది. కొన్ని ఫోన్లు ఒక పూర్తి రోజు బ్యాటరీ లైఫ్ ని అందిస్తే, మరికొన్ని ఫోన్లు రెండు రోజుల వరకు కూడా బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. ఈ ఆర్టికల్ లో మనం రూ.10 వేల లోపు ధరలో లభించే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన 10 స్మార్ట్ ఫోన్ల జాబితా తెలుసుకుందాం.

రూ.10 వేల ధర లోపు లభించే ’10’ 5000ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్లు

  • POCO C55
  • Infinix HOT 30i
  • Motorola G13
  • Infinix Note 12i
  • Samsung Galaxy F04
  • Realme C33
  • Infinix Smart 6 HD
  • Motorola e13
  • Realme C30
  • Redmi A1

1. POCO C55

ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 4జిబి మరియు 6జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. 50ఎంపి మెయిన్ కెమెరా అందించారు. ఈ ఫోన్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.8,499 తో ప్రారంభమవుతుంది.

2. Infinix Hot 30i

ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 50ఎంపి + ఏఐ లెన్స్ తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్ ఈ ఫోన్ లో వాడారు. ఫ్లిప్ కార్ట్ లో ఈ డివైజ్ 8జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.9,499 గా ఉంది.

3. Motorola G13

ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ వాడారు. డాల్బి అట్మాస్ స్పీకర్స్ ఈ ఫోన్ లో అందించారు. ఈ డివైజ్ 4జిబి ర్యామ్ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.9,999 గా ఉంది.

4. Infinix Note 12i

ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉండటం విశేషం. ఈ డివైజ్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.9,999 గా ఉంది.

5. Samsung Galaxy F04

ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ ఈ ఫోన్ లో వాడారు. 8జిబి ఆన్‌బోర్డ్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ డివైజ్ 4జిబి ర్యామ్ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.8,499 గా ఉంది.

6. Realme C33

ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ లో యూనిసాక్ టీ612 చిప్సెట్ వాడారు. 50ఎంపి + 0.3ఎంపి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ డివైజ్ 4జిబి ర్యామ్ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.9,999 గా ఉంది.

7. Infinix Smart 6 HD

ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ కలిగిన ఈ ఫోన్ ధర ఫ్లిప్ కార్ట్ లో కేవలం రూ.5,799 గా ఉంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ అందించారు.

8. Motorola e13

ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో యూనిసాక్ టీ606 ప్రాసెసర్ వాడారు. ఈ డివైజ్ 4జిబి ర్యామ్ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.7,749 గా ఉంది.

9. Realme C30

ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ ఎయిర్టెల్ ఎక్స్‌క్లూజివ్ ప్రొడక్ట్. ఎయిర్టెల్ సిమ్ కార్డ్ తో ఈ ఫోన్ ని వాడుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోన్ 2జిబి ర్యామ్ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.5549 గా ఉంది.

10. Redmi A1

ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో ఏ22 చిప్సెట్ వాడారు. ఇందులో 8ఎంపి డ్యూయల్ ఏఐ మెయిన్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ 2జిబి ర్యామ్ వేరియంట్ ధర అమెజాన్ లో రూ.5,899 గా ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రూ.10,000 ధర లోపు లభించే పది 5000mAh బ్యాటరీ ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>