
రూ.15 వేల లోపు ధరలో లభించే 5జీ ఫోన్లు
- Vivo T2x 5G
- Samsung Galaxy F14 5G
- Infinix HOT 20 5G
- Samsung Galaxy M14 5G
- Redmi 11 Prime 5G
- iQOO Z6 Lite 5G
1. Vivo T2x 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో రూ.15 వేల లోపు బడ్జెట్ లో Vivo T2x 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ డివైజ్ 4జిబి వేరియంట్ ధర రూ.12,999 గా ఉంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 50ఎంపి+2ఎంపి కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
2. Samsung Galaxy F14 5G
Samsung F14 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,990 గా ఉంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఎగ్జినోస్ 1330 చిప్, 50ఎంపి + 2ఎంపి కెమెరా, 13ఎంపి ఫ్రంట్ కెమెరా, 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉన్నాయి.
3. Infinix HOT 20 5G
Infinix HOT 20 స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,499 గా ఉంది. ఈ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్, 50ఎంపి + ఏఐ లెన్స్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
4. Samsung Galaxy M14 5G

Samsung Galaxy M14 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 401పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 50ఎంపి + 2ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 13ఎంపి ఫ్రంట్ కెమెరా, ఎగ్జినోస్ 1330 చిప్సెట్, 13 5జీ బ్యాండ్స్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, వన్‌యూఐ కోర్ 5.0 కస్టమ్ స్కిన్, 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. 4జిబి + 128జిబి వేరియంట్ ధర అమెజాన్ లో రూ.14,490 గా ఉంది.
5. Redmi 11 Prime 5G
Redmi 11 Prime 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, 90హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 7 5జీ బ్యాండ్స్ ఉన్నాయి. ఈ డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర అమెజాన్ లో రూ.12,999 గా ఉంది.
6. iQOO Z6 Lite 5G
iQOO Z6 Lite 5G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర అమెజాన్ లో రూ.13,999 గా ఉంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి మెయిన్ కెమెరా ఉన్నాయి.




![Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/10/Best-camera-phones-under-25k-oct-218x150.jpg?tr=q-70)
![Best performing phones: రూ.20,000 లోపు బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/10/Best-performing-phones-under-20k-sep-2024-218x150.jpg?tr=q-70)
![Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/09/Fastest-charging-phones-under-25k-218x150.jpg?tr=q-70)








