Airtel 5G Plus - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 20 Oct 2023 05:52:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 తెలంగాణలో Airtel 5G Plus వినియోగదారులు 30 లక్షలు దాటినట్లు ప్రకటించిన Airtel https://www.91mobiles.com/telugu/airtel-5g-plus-3-million-users-in-telangana/ Fri, 20 Oct 2023 05:52:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=8485 దేశంలోని టాప్ టెలీకామ్ సంస్థల్లో ఒకటైన ఎయిర్టెల్, జియోకి గట్టి పోటీ ఇస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో ఓ మైలురాయిని దాటింది. ఎయిర్టెల్ 5జీ ప్లస్ కస్టమర్లు తెలంగాణలో 3 మిలియన్లు దాటారని ఆ సంస్థ ప్రకటించింది. ఎయిర్టెల్ 5జీని లాంచ్ చేసిన కేవలం 12 నెలల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎయిర్టెల్ 5జీ సేవలు విస్తరించినట్లు తెలిపింది. TelecomTalk ఎయిర్టెల్ అఛీవ్మెంట్ కి సంబంధించిన కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ మరియు […]

The post తెలంగాణలో Airtel 5G Plus వినియోగదారులు 30 లక్షలు దాటినట్లు ప్రకటించిన Airtel first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తెలంగాణలోని 33 జిల్లాల్లో అందుబాటులోకి Airtel 5G Plus
  • 3 మిలియన్లకు చేరుకున్న Airtel 5G Plus కస్టమర్లు
  • కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపిన ఎయిర్టెల్

దేశంలోని టాప్ టెలీకామ్ సంస్థల్లో ఒకటైన ఎయిర్టెల్, జియోకి గట్టి పోటీ ఇస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో ఓ మైలురాయిని దాటింది. ఎయిర్టెల్ 5జీ ప్లస్ కస్టమర్లు తెలంగాణలో 3 మిలియన్లు దాటారని ఆ సంస్థ ప్రకటించింది. ఎయిర్టెల్ 5జీని లాంచ్ చేసిన కేవలం 12 నెలల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎయిర్టెల్ 5జీ సేవలు విస్తరించినట్లు తెలిపింది. TelecomTalk ఎయిర్టెల్ అఛీవ్మెంట్ కి సంబంధించిన కథనాన్ని ప్రచురించింది.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 5జీ యూజర్లు 2 మిలియన్లకు చేరుకున్నారని మే నెలలో ఎయిర్టెల్ ప్రకటించింది. తాజాగా ఒక్క తెలంగాణలోనే 3 మిలియన్ల 5జీ యూజర్ మార్క్ ని చేరామని ఎయిర్టెల్ ప్రకటించడం విశేషం.

Airtel 5G లభ్యత

భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో జిల్లాల్లో ఎయిర్టెల్ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలోని అన్ని జిల్లాకు 5జీ సేవలను చేరేలా, తమ నెట్వర్క్ ని పెద్దఎత్తున విస్తరించామని కంపెనీ వెల్లడించింది.

తెలంగాణలో Airtel 5G

చారిత్రాత్మక ప్రదేశాలు గోల్కొండ, చార్మినార్, టెంపుల్ సిటీ వరంగల్, నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్, మారుమూల గ్రామం అంజనాపురం లకు తమ 5జీ నెట్వర్క్ విస్తరించిందని ఎయిర్టెల్ తెలిపింది. తమ 5జీ రోలౌట్ ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తామని ఎయిర్టెల్ తెలిపింది.

తాజా మైలురాయిపై భారతి ఎయిర్టెల్ సంస్థ ఈ విధంగా స్పందించింది. “రాష్ట్రంలో హై-స్పీడ్ 5జీ టెక్నాలజీని తీసుకొచ్చిన మొట్టమొదటి టెలీకామ్ సంస్థ మాదే. నేడు కస్టమర్ల జీవితాలను జోడించడంలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఎయిర్టెల్ 5జీ ప్లస్ నెట్వర్క్ వాడుతోన్న 3 మిలియన్ కస్టమర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.”

The post తెలంగాణలో Airtel 5G Plus వినియోగదారులు 30 లక్షలు దాటినట్లు ప్రకటించిన Airtel first appeared on 91Mobiles Telugu.

]]>
నేడు లాంచైన Airtel 5G Plus: తొలిదశలో 8 నగరాలకు సేవలు, SIM మార్చక్కర్లేదు https://www.91mobiles.com/telugu/airtel-5g-plus-launched-today-in-8-cities/ Thu, 06 Oct 2022 10:58:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=2770 హైలైట్స్: 8 నగరాల్లో అందుబాటులోకి వచ్చిన Airtel 5G Plus ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసి, చెన్నై రోలౌట్ పూర్తిస్థాయిలో విస్తరించే వరకు, ఇప్పటికే 5జీ ఫోన్లు కలిగి ఉన్న కస్టమర్లు Airtel 5G Plus తో హై-స్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చని తెలిపిన ఎయిర్టెల్ అక్టోబర్ 1 న ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో 5జీ మొబైల్ టెక్నాలజీ లాంచ్ తో భారతీయ టెలీకామ్ రంగంలో కొత్త శకం మొదలైంది. జియో, ఎయిర్టెల్ […]

The post నేడు లాంచైన Airtel 5G Plus: తొలిదశలో 8 నగరాలకు సేవలు, SIM మార్చక్కర్లేదు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 8 నగరాల్లో అందుబాటులోకి వచ్చిన Airtel 5G Plus
  • ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసి, చెన్నై
  • రోలౌట్ పూర్తిస్థాయిలో విస్తరించే వరకు, ఇప్పటికే 5జీ ఫోన్లు కలిగి ఉన్న కస్టమర్లు Airtel 5G Plus తో హై-స్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చని తెలిపిన ఎయిర్టెల్

అక్టోబర్ 1 న ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో 5జీ మొబైల్ టెక్నాలజీ లాంచ్ తో భారతీయ టెలీకామ్ రంగంలో కొత్త శకం మొదలైంది. జియో, ఎయిర్టెల్ సంస్థలు ముందుగా 5జీ రోలౌట్ ప్లాన్స్ ప్రకటించాయి. 1జీబీపీఎస్ స్పీడ్ తో ఎంపిక చేయబడిన నగరాల్లో జియో వెల్కమ్ ఆఫర్ ని అనౌన్స్ చేసి 5జీ బీటా ట్రయల్ రన్ చేసింది. ఇప్పుడు ఎయిర్టెల్ సంస్థ Airtel 5G Plus తో యూజర్ల ముందుకు వచ్చింది. 8 నగరాల్లో Airtel 5G Plus సేవలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ నగరాల్లో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసి, చెన్నై ఉన్నాయి.

ప్రస్తుతం ఎవరి వద్దైతే 5జీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో వారు తమ సిమ్స్ మార్చకుండానే Airtel 5G Plus సేవలు పొందవచ్చని ఎయిర్టెల్ చెప్పింది. రోలౌట్ పూర్తిస్థాయిలో విస్తరించే వరకు హై స్పీడ్ ఇంటర్నెట్ ని Airtel 5G Plus ద్వారా పొందవచ్చని తెలిపింది. Airtel 5G Plus ఇప్పుడున్న ఇంటర్నెట్ వేగం కంటే 30 రెట్లు అధక స్పీడ్ అందిస్తుందని ఎయిర్టెల్ చెబుతోంది. అలాగే Airtel 5G Plus ద్వారా అద్భుతమైన వాయిస్ అనుభవం, సూపర్-ఫాస్ట్ కాల్ కనెక్షన్ అందుతాయని ఎయిర్టెల్ అంటోంది. 5జీ యాక్సెస్ ను పొందేందుకు కస్టమర్లు తమ సిమ్ కార్డ్ ని మార్చుకోవాల్సిన పని లేదు.

Airtel 5G Plus పొందే నగరాలివే

  • హైదరాబాద్
  • ఢిల్లీ
  • ముంబై
  • బెంగళూరు
  • సిలిగురి
  • నాగ్‌పూర్
  • వారణాసి
  • చెన్నై

లాంచ్ అయిన Airtel 5G Plus

దేశ వ్యాప్తంగా 8 నగరాల్లో Airtel 5G Plus అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. తొలిదశలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసి నగరాలకు 5జీ సేవలు అందనున్నాయి. కస్టమర్లు Airtel 5G Plus ని పొందేందుకు సిమ్ కార్డ్ ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కస్టమర్లు వినియోగిస్తోన్న డేటా ప్లాన్స్ తోనే Airtel 5G Plus సేవలు అందనున్నాయి. 5జీ రోలౌట్ పూర్తిస్థాయిలో విస్తరించే వరకు ఇలానే కొనసాగనుంది.

తాను తీసుకొచ్చిన Airtel 5G Plus ద్వారా కస్టమ్లకు 3 విధాలుగా లాభాలు ఉంటాయని ఎయిర్టెల్ తెలిపింది. మొదటిది: ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం పొందిన టెక్నాలజీ పై 5జీ సేవలు అందుతాయి. ఇది ఎంతో ముఖ్యం, ఎందుకంటే భారత్ వ్యాప్తంగా ఎయిర్టెల్ 5జీ సేవలు అన్ని 5జీ స్మార్ట్ ఫోన్స్ లో పని చేస్తాయి. రెండోది: నేడు అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ వేగం కంటే 20 నుంచి 30 రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ అందుతుంది. మూడోది: ప్రత్యేకమైన పవర్ రిడక్షన్ సొల్యూషన్ కలిగిన Airtel 5G Plus పర్యావరణానికి మేలు చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post నేడు లాంచైన Airtel 5G Plus: తొలిదశలో 8 నగరాలకు సేవలు, SIM మార్చక్కర్లేదు first appeared on 91Mobiles Telugu.

]]>