హైలైట్స్:
- 8 నగరాల్లో అందుబాటులోకి వచ్చిన Airtel 5G Plus
- ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసి, చెన్నై
- రోలౌట్ పూర్తిస్థాయిలో విస్తరించే వరకు, ఇప్పటికే 5జీ ఫోన్లు కలిగి ఉన్న కస్టమర్లు Airtel 5G Plus తో హై-స్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చని తెలిపిన ఎయిర్టెల్
అక్టోబర్ 1 న ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో 5జీ మొబైల్ టెక్నాలజీ లాంచ్ తో భారతీయ టెలీకామ్ రంగంలో కొత్త శకం మొదలైంది. జియో, ఎయిర్టెల్ సంస్థలు ముందుగా 5జీ రోలౌట్ ప్లాన్స్ ప్రకటించాయి. 1జీబీపీఎస్ స్పీడ్ తో ఎంపిక చేయబడిన నగరాల్లో జియో వెల్కమ్ ఆఫర్ ని అనౌన్స్ చేసి 5జీ బీటా ట్రయల్ రన్ చేసింది. ఇప్పుడు ఎయిర్టెల్ సంస్థ Airtel 5G Plus తో యూజర్ల ముందుకు వచ్చింది. 8 నగరాల్లో Airtel 5G Plus సేవలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ నగరాల్లో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసి, చెన్నై ఉన్నాయి.
ప్రస్తుతం ఎవరి వద్దైతే 5జీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో వారు తమ సిమ్స్ మార్చకుండానే Airtel 5G Plus సేవలు పొందవచ్చని ఎయిర్టెల్ చెప్పింది. రోలౌట్ పూర్తిస్థాయిలో విస్తరించే వరకు హై స్పీడ్ ఇంటర్నెట్ ని Airtel 5G Plus ద్వారా పొందవచ్చని తెలిపింది. Airtel 5G Plus ఇప్పుడున్న ఇంటర్నెట్ వేగం కంటే 30 రెట్లు అధక స్పీడ్ అందిస్తుందని ఎయిర్టెల్ చెబుతోంది. అలాగే Airtel 5G Plus ద్వారా అద్భుతమైన వాయిస్ అనుభవం, సూపర్-ఫాస్ట్ కాల్ కనెక్షన్ అందుతాయని ఎయిర్టెల్ అంటోంది. 5జీ యాక్సెస్ ను పొందేందుకు కస్టమర్లు తమ సిమ్ కార్డ్ ని మార్చుకోవాల్సిన పని లేదు.
Airtel 5G Plus పొందే నగరాలివే
- హైదరాబాద్
- ఢిల్లీ
- ముంబై
- బెంగళూరు
- సిలిగురి
- నాగ్‌పూర్
- వారణాసి
- చెన్నై
లాంచ్ అయిన Airtel 5G Plus
దేశ వ్యాప్తంగా 8 నగరాల్లో Airtel 5G Plus అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. తొలిదశలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసి నగరాలకు 5జీ సేవలు అందనున్నాయి. కస్టమర్లు Airtel 5G Plus ని పొందేందుకు సిమ్ కార్డ్ ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కస్టమర్లు వినియోగిస్తోన్న డేటా ప్లాన్స్ తోనే Airtel 5G Plus సేవలు అందనున్నాయి. 5జీ రోలౌట్ పూర్తిస్థాయిలో విస్తరించే వరకు ఇలానే కొనసాగనుంది.
తాను తీసుకొచ్చిన Airtel 5G Plus ద్వారా కస్టమ్లకు 3 విధాలుగా లాభాలు ఉంటాయని ఎయిర్టెల్ తెలిపింది. మొదటిది: ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం పొందిన టెక్నాలజీ పై 5జీ సేవలు అందుతాయి. ఇది ఎంతో ముఖ్యం, ఎందుకంటే భారత్ వ్యాప్తంగా ఎయిర్టెల్ 5జీ సేవలు అన్ని 5జీ స్మార్ట్ ఫోన్స్ లో పని చేస్తాయి. రెండోది: నేడు అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ వేగం కంటే 20 నుంచి 30 రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ అందుతుంది. మూడోది: ప్రత్యేకమైన పవర్ రిడక్షన్ సొల్యూషన్ కలిగిన Airtel 5G Plus పర్యావరణానికి మేలు చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.













