Airtel 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 17 Mar 2023 15:21:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Airtel యూజర్లకు ఉచిత 5జీ డేటా, ఇలా యాక్టివేట్ చేసుకోండి! https://www.91mobiles.com/telugu/airtel-unlimited-5g-data-offer-activation-process/ Fri, 17 Mar 2023 15:20:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=5562 ఎయిర్టెల్ సంస్థ తన పోస్ట్‌పెయిడ్ మరియు ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అపరిమిత 5జీ డేటాను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్లాన్ లో డేటా క్యాపింగ్ ని తొలగిస్తున్నట్లు ఎయిర్టెల్ అనౌన్స్ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ఎయిర్టెల్ కస్టమర్లు ఉచితంగా అపరిమిత 5జీ డేటాను పొందవచ్చు. అయితే ఈ ఎయిర్టెల్ ఆఫర్ రూ.239 మరియు అంతకంటే పైన ఉన్న ప్లాన్స్ కి మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం ఎయిర్టెల్ 5జీ యూజర్లకు నెలవారీ […]

The post Airtel యూజర్లకు ఉచిత 5జీ డేటా, ఇలా యాక్టివేట్ చేసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తన కస్టమర్లకు ఉచిత 5జీ డేటా ఇస్తోన్న ఎయిర్టెల్
  • ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు వర్తించనున్న ఆఫర్
  • దేశంలోని 270 నగరాల్లో అందుబాటులో ఉన్న ఎయిర్టెల్ 5జీ సేవలు

ఎయిర్టెల్ సంస్థ తన పోస్ట్‌పెయిడ్ మరియు ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అపరిమిత 5జీ డేటాను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్లాన్ లో డేటా క్యాపింగ్ ని తొలగిస్తున్నట్లు ఎయిర్టెల్ అనౌన్స్ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ఎయిర్టెల్ కస్టమర్లు ఉచితంగా అపరిమిత 5జీ డేటాను పొందవచ్చు. అయితే ఈ ఎయిర్టెల్ ఆఫర్ రూ.239 మరియు అంతకంటే పైన ఉన్న ప్లాన్స్ కి మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం ఎయిర్టెల్ 5జీ యూజర్లకు నెలవారీ ప్లాన్ పై ఎటువంటి డెయిలీ లిమిట్ లేదు.

ఎయిర్టెల్ ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ యూజర్లు అపరిమిత 5జీ డేటాను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియను ఇక్కడ వివరిస్తున్నాం. ఒకసారి చదివి తెలుసుకోండి.

ఎయిర్టెల్ అన్‌లిమిటెడ్ 5జీ ని యాక్టివేట్ చేయడం ఎలా?

స్టెప్ 1: మీ యొక్క ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైస్ పై ఎయిర్టెల్ యాప్ ని తెరవండి.

స్టెప్ 2: మీరు గనుక యాప్ లో కాస్త స్క్రోల్ చేస్తే మీకు Claim Unlimited 5G Data (క్లెయిమ్ అన్‌లిమిటెడ్ 5జీ డేటా) అని కనిపిస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది.

స్టెప్ 3: క్లిక్ చేశాక మీకు కొత్త పేజీ కనిపిస్తుంది. అక్కడ మీకు రూ.0 ధరతో 5జీ డేటా అని ఉంటుంది.

స్టెప్ 4: క్రిందకు స్క్రోల్ చేస్తే మీకు క్లెయిమ్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది.

పైన చెప్పబడిన విధంగా మీరు ఎయిర్టెల్ అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఆఫర్ ని మీ ఫోన్ పై యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే, ప్రీపెయిడ్ యూజర్లు ఈ ఆఫర్ ని పొందాలంటే కనీసం రూ.239 ప్లాన్ ని లేదా అంతకంటే పైస్థాయి ప్లాన్ ని కలిగి ఉండాలి. దీంతో పాటు మీ స్మార్ట్‌ఫోన్ 5జీ డివైజ్ అయ్యుండాలి. అంతేకాదు, మీ ప్రాంతంలో ఎయిర్టెల్ 5జీ నెట్వర్క్ కూడా ఉండాలి. అంటే మీ ప్రాంతంలో ఎయిర్టెల్ 4జీ సిగ్నల్ మాత్రమే వచ్చినట్లైతే మీరు ఈ 5జీ ప్లాన్ ని యాక్టివేట్ చేసుకోలేరు.

ఎయిర్టెల్ 5జీ సర్వీస్

భారతదేశంలోని 270 నగరాల్లో ఎయిర్టెల్ 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, రిలయన్స్ జియో 365 నగరాల్లో 5జీ నెట్వర్క్ ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. 2023 పూర్తయ్యే నాటికల్లా దేశ వ్యాప్తంగా తన 5జీ నెట్వర్క్ ని విస్తరింపజేస్తానని జియో తెలిపింది. మరోవైపు ఎయిర్టెల్ సంస్థ మార్చి 2024 కల్లా దేశ వ్యాప్తంగా 5జీ సేవలను విస్తరింపజేస్తామని చెప్పింది.

ఎయిర్టెల్ 5జీ వేగం ఎంత?

మీ నంబర్ పై ఎయిర్టెల్ అన్‌లిమిటెడ్ 5జీ ఆఫర్ యాక్టివేట్ అయిన వెంటనే, మీకు ఒక మెసేజ్ ద్వారా సమాచారం తెలపబడుతుంది. మీరు 5జీ సర్వీస్ పై 30 రెట్లు వేగంగా ఇంటర్నెట్ వాడుకోగలుగాతరని ఈ సందేశంలో ఉంటుంది. అయితే 3జీ లేదా 4జీ కంటే 30 రెట్లు వేగమా.. అనేది ఎయిర్టెల్ తెలపలేదు. ప్రస్తుతం ఉన్న 4జీ సేవల కంటే కంపెనీ యొక్క 5జీ వేగం 30 రెట్లు ఉంటుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోందని అంచనా వేస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Airtel యూజర్లకు ఉచిత 5జీ డేటా, ఇలా యాక్టివేట్ చేసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో ఫాస్టెస్ట్ 5జీ స్పీడ్స్ కలిగిన 4 నగరాలు https://www.91mobiles.com/telugu/fastest-5g-speeds-india-4-cities/ Mon, 19 Dec 2022 14:18:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=4069 హైలైట్స్ ఢిల్లీ, కోల్ కాతా, ముంబై మరియు వారణాసి నగరాల్లో అందుబాటులో ఉన్న వేగవంతమైన 5జీ 598.58 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ స్పీడ్ తో ఢిల్లీలో ఎయిర్టెల్ కంటే బెటర్ గా ఉన్న జియో 5జీ ఢిల్లీలో ఎయిర్టెల్ డౌన్ లోడ్ స్పీడ్ 197.98 ఎంబీపీఎస్ జియో 5జీ పెర్ఫామెన్స్ బాగుందని తెలిపిన Ookla నివేదిక భారతదేశంలో మెల్లగా 5జీ నెట్వర్క్ విస్తరిస్తోంది. ఎయిర్టెల్ మరియు జియో కంపెనీలు 2024 మార్చి కల్లా పూర్తిస్థాయిలో దేశ వ్యాప్తంగా […]

The post భారత్ లో ఫాస్టెస్ట్ 5జీ స్పీడ్స్ కలిగిన 4 నగరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఢిల్లీ, కోల్ కాతా, ముంబై మరియు వారణాసి నగరాల్లో అందుబాటులో ఉన్న వేగవంతమైన 5జీ
  • 598.58 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ స్పీడ్ తో ఢిల్లీలో ఎయిర్టెల్ కంటే బెటర్ గా ఉన్న జియో 5జీ
  • ఢిల్లీలో ఎయిర్టెల్ డౌన్ లోడ్ స్పీడ్ 197.98 ఎంబీపీఎస్
  • జియో 5జీ పెర్ఫామెన్స్ బాగుందని తెలిపిన Ookla నివేదిక

భారతదేశంలో మెల్లగా 5జీ నెట్వర్క్ విస్తరిస్తోంది. ఎయిర్టెల్ మరియు జియో కంపెనీలు 2024 మార్చి కల్లా పూర్తిస్థాయిలో దేశ వ్యాప్తంగా 5జీని విస్తరింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం, 5జీ నెట్వర్క్ ప్రధాన మెట్రో నగరాల్లో అందుబాటులో ఉంది. వీటిలో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, వారణాసి తదితర నగరాలున్నాయి. 5జీ నెట్వర్క్ విషయానికి వస్తే నెట్వర్క్ స్పీడ్ అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది.

ఢిల్లీలో ఎయిర్టెల్ తో పోల్చితే జియో 5జీ మెరుగ్గా ఉన్నట్లు తాజాగా ఊక్లా నివేదికలో తేలింది. అక్కడ జియో డౌన్ లోడ్ స్పీడ్ 598.58 ఎంబీపీఎస్ కాగా, ఎయిర్టెల్ డౌన్ లోడ్ స్పీడ్ 197.98 గా ఉంది. ఊక్లా రికార్డ్ చేసిన డౌన్ లోడ్ స్పీడ్స్ ని ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చూడండి.

భారత్ లో 5జీ స్పీడ్స్

ముంబై వంటి ప్రముఖ నగరాల్లో జియో కంటే ఎయిర్టెల్ వెనుకంజలో ఉంది. అక్కడ ఎయిర్టెల్ డౌన్ లోడ్ స్పీడ్ 271.07 ఎంబీపీఎస్ కాగా, జియో డౌన్ లోడ్ స్పీడ్ 515.38 ఎంబీపీఎస్ గా ఉంది. కోల్‌కతా లో అయితే ఎయిర్టెల్ డౌన్ లోడ్ స్పీడ్ 33.83 ఎంబీపీఎస్ ఉండగా, జియో డౌన్ లోడ్ స్పీడ్ 482.02 ఎంబీపీఎస్ గా ఉంది.

వారణాసిలో జియో మరియు ఎయిర్టెల్ నడుమ వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ఎయిర్టెల్ 516.57 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ ని కలిగి ఉండగా, జియో 485.22 డౌన్ లోడ్ స్పీడ్ ని కలిగి ఉంది. ఊక్లా రిపోర్ట్ ప్రకారం జియో 5జీ పెర్ఫామెన్స్ బాగుందని తెలుస్తోంది. జియో వాడుతోన్న 5జీ బ్యాండ్ అందుకు కారణమని సమాచారం. సీ-బ్యాండ్ (ఎన్78) డౌన్ లోడ్ స్పీడ్ పెర్ఫామెన్స్ 606.53ఎంబీపీఎస్ మరియు 875.26ఎంబీపీఎస్ మధ్య ఉంటుంది.

700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ (ఎన్28) ద్వారా 5జీ నెట్వర్క్ ని అందిస్తే అప్పుడు డౌన్ లోడ్ స్పీడ్స్ 100 ఎంబీపీఎస్ కంటే తక్కువగా ఉంటాయి. సుమారుగా 78.69 ఎంబీపీఎస్ మరియు 95.13 ఎంబీపీఎస్ మధ్య ఈ స్పీడ్స్ ఉంటాయి.

ఊక్లా నివేదిక ప్రకారం, ఎయిర్టెల్ సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ ద్వారా 365.48 ఎంబీపీఎస్ నుంచి 716.85 ఎంబీపీఎస్ వరకు స్పీడ్స్ ని అందుకోగలిగిందని తెలుస్తోంది. ఇక జియో నెట్వర్క్ విషయానికి వస్తే, గత ఏడాది కాలంలో 5జీ కి సపోర్ట్ చేసే డివైజెస్ లో 67.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. 61.6 శాతంతో రెండో స్థానంలో ఎయిర్టెల్, 56 శాతంతో మూడో స్థానంలో వొడాఫోన్ ఐడియా ఉన్నాయి. 2022 జూన్ నుంచి నమోదు చేయబడిన 5జీ స్పీడ్స్ ని ఈ నివేదికలో పొందుపరిచారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్ లో ఫాస్టెస్ట్ 5జీ స్పీడ్స్ కలిగిన 4 నగరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Airtel 5G మరియు Jio 5G కి సపోర్ట్ చేసే 5G స్మార్ట్ ఫోన్స్ ఇవే https://www.91mobiles.com/telugu/airtel-5g-jio-5g-network-supported-smartphones/ Thu, 01 Dec 2022 09:32:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=3796 హైలైట్స్ దేశంలో 5జీ సేవలను ప్రారంభించిన ఎయిర్టెల్, జియో సంస్థలు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కాతా, వారణాసిల్లో 5జీ సేవలను అందిస్తోన్న జియో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, ముంబై, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసిల్లో 5జీ సేవలందిస్తోన్న ఎయిర్టెల్ జియో 5జీ మరియు ఎయిర్టెల్ 5జీ సేవలకు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్స్ ఏవో ఇక్కడ తెలుసుకుందాం. మీకోసం కంపెనీ వారిగా, మోడల్స్ తో కూడిన పూర్తి జాబితాను అందిస్తున్నాం. మీ స్మార్ట్ ఫోన్ 5జీ […]

The post Airtel 5G మరియు Jio 5G కి సపోర్ట్ చేసే 5G స్మార్ట్ ఫోన్స్ ఇవే first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • దేశంలో 5జీ సేవలను ప్రారంభించిన ఎయిర్టెల్, జియో సంస్థలు
  • హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కాతా, వారణాసిల్లో 5జీ సేవలను అందిస్తోన్న జియో
  • హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, ముంబై, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసిల్లో 5జీ సేవలందిస్తోన్న ఎయిర్టెల్

జియో 5జీ మరియు ఎయిర్టెల్ 5జీ సేవలకు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్స్ ఏవో ఇక్కడ తెలుసుకుందాం. మీకోసం కంపెనీ వారిగా, మోడల్స్ తో కూడిన పూర్తి జాబితాను అందిస్తున్నాం. మీ స్మార్ట్ ఫోన్ 5జీ కాంపాటిబుల్ అయితే, ఈ జాబితాలో మీ ఫోన్ ఉందో లేదో తెలుసుకోండి.

Jio 5G కి సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్స్

జియో 5G కి సపోర్ట్ చేస్తున్న OnePlus స్మార్ట్ ఫోన్స్

OnePlus 10 Pro

OnePlus 10R

OnePlus 9R

OnePlus 8

OnePlus 8 Pro

OnePlus 8T

OnePlus Nord

OnePlus Nord 2

OnePlus Nord CE

OnePlus Nord CE 2

Jio 5G కి సపోర్ట్ చేసే OPPO స్మార్ట్ ఫోన్స్

Oppo Reno 8 Pro

Oppo Reno 8

Oppo Reno 7

Oppo F21 Pro

Oppo F19 Pro+

Oppo K10

Oppo A53s

Jio 5G కి సపోర్ట్ చేసే iPhones

Apple iPhone 12 mini

Apple iPhone 12

Apple iPhone 12 pro

Apple iPhone 12 pro max

Apple iPhone 13 mini

Apple iPhone 13

Apple iPhone 13 pro

Apple iPhone 13 pro max

Apple iPhone SE (2022)

Apple iPhone 14

Apple iPhone 14 Plus

Apple iPhone 14 pro

Apple iphone 14 pro max

ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ 14 సిరీస్‌ల కోసం iOS 16.2 బీటా అప్డేట్ ని ఆపిల్ విడుదల చేసింది. ఈ అప్డేట్ తో జియో 5జీ సపోర్ట్ ఎనేబుల్ అవుతుంది.

Nothing Phone (1) స్మార్ట్ ఫోన్ యూజర్లు కూడా జియో 5జీ సేవలను పొందవచ్చు.

Airtel 5G కి సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్స్

ప్రస్తుతం ఎయిర్టెల్ 5జీ సేవలు 9 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నగరాల్లో యూజర్లు 5జీ నెట్వర్క్ ని పొందవచ్చు. అయితే ఇక్కడ ఎయిర్టెల్ 5జీ కి సపోర్ట్ చేసే డివైజెస్ లిస్ట్ కంపెనీల వారిగా ఇస్తున్నాం. ఓసారి చెక్ చేయండి.

Airtel 5G కి సపోర్ట్ చేసే Realme 5G స్మార్ట్ ఫోన్స్

Realme 9i 5G

Realme 8s 5G

Realme X7 Max 5G

Realme Narzo 30pro 5G

Realme X7 5G

Realme X7pro 5G

Realme 8 5G

Realme X50 Pro

Realme GT 5G

Realme GT ME

Realme GT NEO2

Realme 9 5G

Realme 9 Pro

Realme 9 Pro Plus

Realme Narzo 30 5G

Realme Realme 9 SE

Realme GT2

Realme GT 2 pro

Realme GT NEO3

Realme Narzo 50 5G

Realme Narzo 50 pro

Realme GT Neo 3T

Realme GT Neo 3 150W

 

Airtel 5G కి సపోర్ట్ చేసే Xiaomi, Redmi మరియు Poco 5G ఫోన్లు

Xiaomi Mi 10

Xiaomi Mi 10i

Xiaomi Mi 10T

Xiaomi Mi 10Tpro

Xiaomi Mi 11 Ultra

Xiaomi Mi 11X Pro

Xiaomi Mi 11X

Poco M3 Pro 5G

Poco F3 GT

Xiaomi Mi 11 Lite NE

Xiaomi Redmi Note 11T 5G

Xiaomi 11T Pro

Xiaomi 11i HyperCharge

Xiaomi Redmi Note 10T

Xiaomi Redmi Note 11 pro plus

Poco M4 5G

Poco M4 Pro 5G

Xiaomi 12 pro

Xiaomi 11i

Xiaomi Redmi 11 prime+ 5G

Poco F4 5G

Poco X4 pro

Xiaomi Redmi K50i

Airtel 5G కి సపోర్ట్ చేసే Oppo 5G స్మార్ట్ ఫోన్స్

Oppo Reno 5G Pro

Oppo Reno 6

Oppo Reno 6 pro

Oppo F19 pro plus

Oppo A53s

Oppo A74

Oppo Reno 7 Pro 5G

Oppo F21 Pro 5G

Oppo Reno7

Oppo Reno 8

Airtel 5G కి సపోర్ట్ చేసే Vivo 5G స్మార్ట్ ఫోన్స్

vivo X50 Pro

vivo V20 Pro

vivo X60 Pro+

vivo X60

vivo X60 Pro

vivo V21 5G

vivo V21e

vivo X70 Pro

vivo X70 Pro+

vivo Y72 5G

vivo V23 5G

vivo V23 Pro 5G

vivo V23e 5G

vivo T1 5G

vivo Y75 5G

vivo T1 PRO

vivo X80

vivo X80 pro

vivo V25

vivo V25 Pro

Airtel 5G కి సపోర్ట్ చేసే iQOO 5G స్మార్ట్ ఫోన్స్

iQOO Z6 Pro

iQOO Neo 6

iQOO Z6 Lite 5G

iQOO 3 5G

iQOO 7

iQOO 7 Legend

iQOO Z3

iQOO Z5 5G

iQOO 9 Pro

iQOO 9

iQOO 9 SE

iQOO Z6

iQOO 9T

Airtel 5G కి సపోర్ట్ చేసే ఆపిల్ ఫోన్స్

Apple iPhone 12 mini

Apple iPhone 12

Apple iPhone 12 pro

Apple iPhone 12 pro max

Apple iPhone 13 mini

Apple iPhone 13

Apple iPhone 13 pro

Apple iPhone 13 pro max

Apple iPhone SE (2022)

Apple iPhone 14

Apple iPhone 14 Plus

Apple iPhone 14 pro

Apple iphone 14 pro max

Airtel 5G కి సపోర్ట్ చేసే OnePlus 5G స్మార్ట్ ఫోన్స్

OnePlus 8

OnePlus 8T

OnePlus 8pro

OnePlus 9

OnePlus 9R

OnePlus 9pro

OnePlus Nord

OnePlus Nord 2

OnePlus Nord CE

OnePlus Nord CE 2

OnePlus 10 PRO 5G

OnePlus Nord CE Lite 2

OnePlus 10R

OnePlus Nord 2T

OnePlus 10T

OnePlus 9RT

Airtel 5G కి సపోర్ట్ చేసే Samsung 5G స్మార్ట్ ఫోన్స్

Samsung Galaxy Note 20ultra

Samsung M52

Samsung M42

Samsung Galaxy S21

Samsung Galaxy S21 plus

Samsung Galaxy S21 ultra

Samsung Galaxy Z fold 2

Samsung F42

Samsung M32 5G

Samsung A73

Samsung M13

Samsung A22 5G

Samsung A52s

Samsung F23

Samsung S20FE 5G

Samsung M53

Samsung Galaxy A53 5G

Samsung A33 5G

Samsung Galaxy S21 FE

Samsung Galaxy S22 Ultra

Samsung Galaxy M33

Samsung Flip4

Samsung Galaxy S22

Samsung Galaxy S22+

Samsung Fold4

Samsung Flip3

Samsung Fold3

Airtel 5G కి సపోర్ట్ చేసే Motorola 5G స్మార్ట్ ఫోన్స్

Motorola edge 30 pro

Motorola edge 30

Motorola edge 30 ultra

Motorola edge 30 fusion

Moto g62 5G

Moto g82 5G

Moto g71 5G

Moto g51 5G

Motorola edge 20

Motorola edge 20 pro

Motorola edge 20 fusion

Airtel 5G కి సపోర్ట్ చేసే Tecno, Lava, Infinix, Nokia 5G Smartphones

Lava Blaze 5G

Nokia XR20

Nokia G60

Lava Agni

Tecno Camon 19 Pro 5G

Tecno Pova 5G

Tecno Pova Neo 5G

Infinix Zero 5G

Infinix Note 12 5G

Infinix Note 12 pro 5G

Nothing Phone (1) స్మార్ట్ ఫోన్ యూజర్లు కూడా Airtel 5G నెట్వర్క్ ఎంజాయ్ చేయవచ్చు.

సూచన: ఈ జాబితాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాం. కాబట్టి జాబితాలో మరిన్ని మోడల్స్ జతచేరే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడప్పుడు ఈ ఆర్టికల్ పై ఓ కన్నేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Airtel 5G మరియు Jio 5G కి సపోర్ట్ చేసే 5G స్మార్ట్ ఫోన్స్ ఇవే first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో 4G ధరల మాదిరే ఉండనున్న 5G సేవల ధరలు https://www.91mobiles.com/telugu/5g-roll-out-india-5g-prices/ Fri, 23 Sep 2022 05:44:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=2528 హైలైట్స్: లాంచ్ సమయంలో 4జీ ధరలతో సమానంగానే ఉండనున్న 5జీ ధరలు అక్టోబర్ నుంచి మొదలుకానున్న 5జీ సేవలు, తొలి దశలో ప్రధాన నగరాలకు మాత్రమే ఇప్పటికే 5జీ సేవల రోలౌట్ ను ప్రకటించిన జియో, ఎయిర్టెల్ వచ్చే నెలలో భారతదేశంలో 5జీ నెట్వర్క్ లాంచ్ అవుతోంది. వచ్చే నెల నుంచి 5జీ సేవలు ప్రారంభిస్తామని ప్రముఖ టెలీకామ్ కంపెనీలు ఎయిర్టెల్, జియో ప్రకటించాయి. దీంతో దేశ ప్రజల్లో 5జీ రీచార్జ్ ప్లాన్ ధరలు ఏ విధంగా […]

The post భారత్ లో 4G ధరల మాదిరే ఉండనున్న 5G సేవల ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లాంచ్ సమయంలో 4జీ ధరలతో సమానంగానే ఉండనున్న 5జీ ధరలు
  • అక్టోబర్ నుంచి మొదలుకానున్న 5జీ సేవలు, తొలి దశలో ప్రధాన నగరాలకు మాత్రమే
  • ఇప్పటికే 5జీ సేవల రోలౌట్ ను ప్రకటించిన జియో, ఎయిర్టెల్

వచ్చే నెలలో భారతదేశంలో 5జీ నెట్వర్క్ లాంచ్ అవుతోంది. వచ్చే నెల నుంచి 5జీ సేవలు ప్రారంభిస్తామని ప్రముఖ టెలీకామ్ కంపెనీలు ఎయిర్టెల్, జియో ప్రకటించాయి. దీంతో దేశ ప్రజల్లో 5జీ రీచార్జ్ ప్లాన్ ధరలు ఏ విధంగా ఉంటాయనే ఆసక్తి మొదలైంది. 5జీ సేవలకు కూడా 4జీ మాదిరే వసూలు చేస్తారని సమాచారం.

ఎకనమిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ సంస్థలు 4జీ సేవలను అందిస్తున్న ధరలకే, 5జీ సేవలను అందించనున్నాయట. తొలి దశలో 5జీ సేవలను 4జీ సేవల ధరలోనే అందించడం వల్లన చాలామంది 5జీ నెట్వర్క్ కి మారేందుకు అవకాశాలు చాలా ఉంటాయని రిపోర్ట్ పేర్కొంది.

5జీ నెట్వర్క్ ని లాంచ్ చేసిన తొలినాళ్ళలో 5జీ సేవలకు టెలీకామ్ సంస్థలు ప్రీమియమ్ ప్రైస్ పెట్టే చాన్స్ లేదని తెలుస్తోంది. అనుకున్న యూజర్ బేస్ వచ్చాక, 5జీ సేవలకు ఎక్కువ ధరలను పెట్టాలని టెలీకామ్ కంపెనీలు భావిస్తున్నట్లు పలువురు ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇది అంత త్వరగా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే, జనాలందరి దగ్గర ఇంకా 5జీ ఫోన్లు లేవు. ఇప్పుడిప్పుడే 5జీ ఫోన్లను కొనేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. 5జీ ఫోన్ల ధరలు కూడా తగ్గడం మొదలైంది. రూ.15,000 లోపు అందుబాటులో ఉన్న 5జీ ఫోన్లు చాలా తక్కువగా ఉన్నాయి. రూ.10,000 ధర లోపైతే అసలు లేవు. కాబట్టి టెలీకామ్ సంస్థలు అప్పుడే 5జీ సేవలకు ఓ రేంజ్ లో వసూలు చేయరు.

భారత్ లో 5G ధరలు: నిపుణులు చెబుతున్నదేంటి?

“5జీ ఆపరేటర్లు 4జీ కంటే ఎక్కువ ధరలను వసూలు చేసే అవకాశం లేదు. వారి యొక్క సత్వర లక్ష్యం జనాలు 5జీ కి మారడం, ఎక్కువ మంది 5జీ కస్టమర్లను సంపాదించడం. జనాలు ఎంత ఎక్కువ డేటా వినియోగిస్తే అంత లాభం. ఏఆర్పీయూ వృద్ధి ముఖ్యం.” అని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్ రోహన్ ధమిజా అన్నారు.

అలాగే ధమీజా యూకే ని ఉదాహరణగా చూపారు. తొలుత 5జీ సేవలను ప్రీమియమ్ ధరకు లాంచ్ చేశారు. వారి ఎత్తుగడ బెడిసి కొట్టడంతో, మళ్ళీ ఆ ఆలోచనను విరమించుకుని 4జీ ధరలకే 5జీ సేవలను అందించారని ధమీజా తెలిపారు.

5జీ సేవలకు ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేస్తే, యూజర్లను పొందడం కంపెనీలకు కష్టంగా మారుతుంది. ప్రస్తుతం 5జీ యూస్ కేస్ సింగిల్ డిజిట్స్ కే పరిమితం కానుంది. అని బీఎన్పీ పరిబాస్ ఈక్వైట్ రీసెర్చ్ హెడ్ ఆఫ్ ఇండియా, కునాల్ వోరా అన్నారు.

4జీ ధరల మాదిరే 5జీ ధరలు ఉంటాయని గతంలో 91మొబైల్స్ తో ఎయిర్టెల్ సీటీవో రణదీప్ సెఖాన్ తెలిపారు.

అక్టోబర్ లో లాంచ్ కానున్న 5G సేవలు, కొన్ని ప్రాంతాలకే పరిమితం

తొలి దశలో 5జీ సేవలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కానున్నాయని ET రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. అక్టోబర్ లో తమ 5జీ సేవలను లాంచ్ చేస్తామని ఎయిర్టెల్, జియో ప్రకటించాయి. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా ఇంకా 5జీ రోలౌట్ కి టైమ్ లైన్ నిర్దేశించుకోలేదు.

లేటెస్ట్ టెలీకామ్, స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post భారత్ లో 4G ధరల మాదిరే ఉండనున్న 5G సేవల ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
Airtel 5జీ లాంచ్: రీచార్జ్ ప్లాన్స్ ధరలు ఎలా ఉంటాయో తెలిపిన కంపెనీ https://www.91mobiles.com/telugu/airtel-offers-5g-recharge-plans-for-higher-prices/ Mon, 22 Aug 2022 08:44:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=1794 హైలైట్స్: త్వరలో భారత్ లో లాంచ్ కానున్న 5జీ సేవలు 5జీ నెట్వర్క్ లాంచ్ కి సిద్ధమవుతోన్న ప్రముఖ టెలీకామ్ సంస్థ ఎయిర్టెల్ 5జీ రీచార్జ్ ప్లాన్స్ ఎలా ఉంటాయో వెల్లడించిన ఎయిర్టెల్ Airtel 5జీ ప్లాన్స్ ధరలు: 5జీ వేలం నిర్వహించిన ప్రభుత్వం, టెలీకమ్ కంపెనీలకు 5జీ స్పెక్ట్రమ్ ని కేటాయించడం జరిగింది. ఇక ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీలు 5జీ సేవలను ప్రారంభిస్తాయని జనాలు ఎదురు చూస్తున్నారు. అయితే, 5జీ సేవల […]

The post Airtel 5జీ లాంచ్: రీచార్జ్ ప్లాన్స్ ధరలు ఎలా ఉంటాయో తెలిపిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న 5జీ సేవలు
  • 5జీ నెట్వర్క్ లాంచ్ కి సిద్ధమవుతోన్న ప్రముఖ టెలీకామ్ సంస్థ ఎయిర్టెల్
  • 5జీ రీచార్జ్ ప్లాన్స్ ఎలా ఉంటాయో వెల్లడించిన ఎయిర్టెల్

Airtel 5జీ ప్లాన్స్ ధరలు: 5జీ వేలం నిర్వహించిన ప్రభుత్వం, టెలీకమ్ కంపెనీలకు 5జీ స్పెక్ట్రమ్ ని కేటాయించడం జరిగింది. ఇక ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీలు 5జీ సేవలను ప్రారంభిస్తాయని జనాలు ఎదురు చూస్తున్నారు. అయితే, 5జీ సేవల లాంచ్ కంటే ముందు, అసలు జనాలు 5జీ రీచార్జ్ ప్లాన్స్ కొరకు ఎంత డబ్బులు వెచ్చించాలో అన్న దానిపై ప్రధానంగా చర్చ మొదలైంది. ఇప్పటి వరకు ఏ టెలీకామ్ సంస్థ కూడా దీనిపై పెదవి విప్పలేదు. కానీ, తాజాగా ఎయిర్టెల్ 5జీ రీచార్జ్ ప్లాన్స్ ధరలపై ఓ స్పష్టతనిచ్చింది.

Airtel 5జీ రీచార్జ్ ప్లాన్స్ ధరలు చౌకగా ఉంటాయా లేదా ఖరీదెక్కువుంటాయా?

మింట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతి ఎంటర్‌ప్రైజెస్ వైస్-చైర్మన్ అఖిల్ గుప్తా పలు విషయాలను వెల్లడించారు. తాము సూపర్ ఫాస్ట్ నెట్వర్క్ కోసం జనాల దగ్గర నుంచి ప్రీమియమ్ చార్జీలు వసూలు చేయమని, కానీ హయ్యర్ ప్రైస్ కలిగిన టారిఫ్స్ ఉండటం కస్టమర్లు గమనిస్తారని అఖిల్ గుప్తా వెల్లడించారు. అంటే ఎయిర్టెల్ 5జీ రీచార్జ్ ప్లాన్ ధరలు ఎక్కువగా ఉంటాయని అర్థమవుతోంది.

“5జీ సేవలు చాలా విస్తృతమవుతాయి. ఎవరి దగ్గరైతే 5జీ హ్యాండ్సెట్ ఉంటుందో వారికి 5జీ నెట్వర్క్ అందుతుంది. వారు ఎక్కువ మొత్తం 5జీ వాడకం చేస్తారు. తద్వారా ఆటోమేటిక్ గా హయ్యర్ టారిఫ్ ప్లాన్ కి మారుతారు. దీంతో అత్యధిక లాభాలు పుట్టుకొస్తాయి,” అని అఖిల్ గుప్తా చెప్పారు. స్వచ్ఛమైన 5జీ ని మించింది మరొకటి ఉంటుందని తాను భావించడం లేదన్నారు. కాస్త ఎక్కువ ఖరీదైన టారిఫ్ తో 5జీ సేవలు మొదలవుతాయని అఖిల్ గుప్తా అన్నారు.

5G స్పెక్ట్రమ్ కోసం 4 ఏళ్ళ ముందస్తు చెల్లింపు చేసిన Airtel

దేశంలో త్వరగా 5జీ సేవలను ప్రారంభించాలనే లక్ష్యంలో భాగంగా ప్రముఖ టెలీకామ్ సంస్థ ఎయిర్టెల్ ఇటీవలె కీలకమైన అడుగు వేసింది. టెలీ కమ్యూనికేషన్స్ విభాగానికి ఎయిర్టెల్ 4 ఏళ్ళ అడ్వాన్స్ పేమెంట్ చేసింది. నాలుగేళ్ళ కాలానికి గాను, ఎయిర్టెల్ మొత్తం రూ.8312 కోట్లు చెల్లించింది.

5జీ వేలం ముగిశాక, స్పెక్ట్రమ్ కొరకు మిగతా నగదుని 19 ఏళ్ళ సమయంలో విడతలుగా చెల్లించాలని ప్రభుత్వం ఎయిర్టెల్ కు తెలిపింది. అయితే ఎయిర్టెల్ తన ప్లాన్ లో భాగంగా, ఒకేసారి రూ.8312 కోట్లు చెల్లించింది. ఎయిర్టెల్ సంస్థ 900 మెగాహెర్ట్జ్, 1800 మెగాహెర్ట్జ్, 2100 మెగాహెర్ట్జ్, 2300 మెగాహెర్ట్జ్ బ్యాండ్స్ తో పాటు, 3.5 జీపీఎస్ బ్యాండ్, 26 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ లో పెట్టుబడి పెట్టింది. ఈ బ్యాండ్స్ ప్రత్యేకత ఏంటంటే, తక్కువ ధరలో 100 రెట్లు మెరుగైన కవరేజీని అందిస్తాయి.

లేటెస్ట్ టెలీకామ్, స్మార్ట్ ఫోన్, గ్యాడ్జెట్, ఓటీటీ వార్తలకై 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

The post Airtel 5జీ లాంచ్: రీచార్జ్ ప్లాన్స్ ధరలు ఎలా ఉంటాయో తెలిపిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
ఆగస్టులో 5జీ నెట్వర్క్ ని లాంచ్ చేస్తాం – Airtel https://www.91mobiles.com/telugu/airtel-5g-network-to-launch-in-august/ Thu, 04 Aug 2022 09:27:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=1489 హైలైట్స్: ఈ నెలలో మొదలు కానున్న ఎయిర్టెల్ 5జీ సేవలు ఎరిక్సన్, నోకియా, శాంసంగ్ లతో 5జీ నెట్వర్క్ డెప్లాయ్మెంట్ కై ఒప్పందం చేసుకున్న ఎయిర్టెల్ 5జీ వేలంలో 900MHz, 1800MHz, 2100MHz, 3300MHz, 26GHz ఫ్రీకెన్సీల్లో మొత్తం 19867.8MHz స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేసిన ఎయిర్టెల్ 5జీ స్పెక్ట్రమ్ మెగా వేలం ఇటీవలె పూర్తైంది. ఈ ఏడాది ముగిసే నాటికి 5జీ నెట్వర్క్ ని లాంచ్ చేయాలని టెలీకామ్ సంస్థలు భావిస్తున్నాయి. త్వరలోనే స్పెక్ట్రమ్ కేటాయింపులు, […]

The post ఆగస్టులో 5జీ నెట్వర్క్ ని లాంచ్ చేస్తాం – Airtel first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఈ నెలలో మొదలు కానున్న ఎయిర్టెల్ 5జీ సేవలు
  • ఎరిక్సన్, నోకియా, శాంసంగ్ లతో 5జీ నెట్వర్క్ డెప్లాయ్మెంట్ కై ఒప్పందం చేసుకున్న ఎయిర్టెల్
  • 5జీ వేలంలో 900MHz, 1800MHz, 2100MHz, 3300MHz, 26GHz ఫ్రీకెన్సీల్లో మొత్తం 19867.8MHz స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేసిన ఎయిర్టెల్

5జీ స్పెక్ట్రమ్ మెగా వేలం ఇటీవలె పూర్తైంది. ఈ ఏడాది ముగిసే నాటికి 5జీ నెట్వర్క్ ని లాంచ్ చేయాలని టెలీకామ్ సంస్థలు భావిస్తున్నాయి. త్వరలోనే స్పెక్ట్రమ్ కేటాయింపులు, అప్రూవల్ పనులు జరిగిపోతాయని టెలీకామ్ మినిస్టర్ హామీనిచ్చారు. ఈలోపు తాము ఎరిక్సన్, నోకియా, శాంసంగ్ లతో 5జీ డెప్లాయ్మెంట్ కు సంబంధించి ఒప్పందం చేసుకున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. 5జీ సేవలు ఆగస్టు 2022 నుంచి ప్రారంభిస్తామని ఎయిర్టెల్ తెలిపింది. దీన్ని బట్టి, ఎయిర్టెల్ 5జీ రోలౌట్ ని చాలా త్వరగా అందిస్తుందని అంచనా వేయవచ్చు.

చాలా ఏళ్ళ నుంచి ఎరిక్సన్, నోకియాలతో ఎయిర్టెల్ కు అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఎయిర్టెల్ నిర్ణయంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. అయితే శాంసంగ్ తో ఎయిర్టెల్ భాగస్వామ్యం ఈ ఏడాది నుంచే మొదలవుతుంది.

Ericsson, Nokia, Samsung లతో భాగస్వామ్యాన్ని ప్రకటించిన Airtel

2022 ఆగస్టులో 5జీ సేవలను ప్రారంభించేందుకు తాము ఎరిక్సన్, నోకియా, శాంసంగ్ లతో చేతులు కలుపుతున్నామని ఎయిర్టెల్ ప్రకటించింది.స్పెక్ట్రమ్ వేలం ముగిసిన కొన్ని రోజుల్లోనే ఎయిర్టెల్ ఈ ప్రకటనతో ముందుకొచ్చింది. 5జీ వేలంలో 900MHz, 1800MHz, 2100MHz, 3300MHz, 26GHz ఫ్రీకెన్సీల్లో మొత్తం 19867.8MHz స్పెక్ట్రమ్ ని ఎయిర్టెల్ కొనుగోలు చేసింది. మల్టీపుల్ పార్ట్నర్స్ ఉండటం వల్లన, అల్ట్రా-హై స్పీడ్స్, లో-లేటెన్సీ, లార్జ్ డేటా హ్యాండ్లింగ్ కేపబులిటీస్ విషయంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎయిర్టెల్ తెలిపింది.

ఇది అద్భుతమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ ని అందిస్తుందని ఎయిర్టెల్ తెలిపింది. ఎంటర్‌ప్రైజ్ మరియు ఇండస్ట్రీ కస్టమర్లు కొత్త విధానాలను అనుభూతి చెందేందుకు దోహదపడుతుందని సదరు సంస్థ చెప్పింది. మల్టీ-ఇయర్ డీల్ లో నోకియా తన యొక్క మార్కెట్ లీడింగ్ ఎయిర్‌స్కేల్ పోర్ట్ ఫోలియో ద్వారా ఎక్విప్మెంట్ ను అందించడంతో పాటు, నెట్వర్క్ మేనేజ్మెంట్ పరిష్కారాలు, సేవలు, పంపిణీ, ప్రణాళిక, ఆప్టిమైజేషన్ వంటి సేవలను అందించనుంది.

మరోవైపు దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ అయిన శాంసంగ్, 5జీ నెట్వర్క్ ని డెప్లాయ్ చేయడంలో ఎయిర్టెల్ కి సాయం చేయనుంది. ఈ రెండు సంస్థలు కలిసి పని చేయడం ఇదే తొలిసారి. దేశ వ్యాప్తంగా 5జీ సేవలను త్వరగా అందించేందుకు ఎయిర్టెల్ కు ఇది కచ్చితంగా ఉపయోగపడనుంది.

“ఆగస్టులో 5జీ సేవలను ఎయిర్టెల్ రోలౌట్ చేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. మా నెట్వర్క్ ఒప్పందాలు పూర్తయ్యాయి. కస్తమర్లకు ఉత్తమమైన 5జీ నెట్వర్క్ ని అందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బెస్ట్ టెక్నాలజీ పార్ట్నర్స్ తో కలిసి పని చేస్తున్నాం. డిజిటల్ ఎకానమీ లోకి భారతదేశ ప్రయాణం టెలీకామ్ రంగం ద్వారా జరగనుంది. ఇండస్ట్రీలు, ఎంటర్‌ప్రైజెస్ డిజిటల్ గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యేందుకు, భారత్ యొక్క సోషియో-ఎకానమిక్ డెవలప్మెంట్ కోసం 5జీ ఎంతగానో ఉపయోగపడనుంది. ” అని ఎయిర్టెల్ ఎండి, సీఈవో గోపాల్ విఠల్ చెప్పారు.

The post ఆగస్టులో 5జీ నెట్వర్క్ ని లాంచ్ చేస్తాం – Airtel first appeared on 91Mobiles Telugu.

]]>