Amazon Prime Video - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sun, 13 Aug 2023 17:56:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OTT: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ తెలుగు సినిమాలు (2023) https://www.91mobiles.com/telugu/best-telugu-films-on-ott-2023/ Sun, 13 Aug 2023 17:52:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=7525 ఇప్పుడంతా ఓటీటీల హవా నడుస్తోంది. ఏ కొత్త సినిమా అయినా సరే, థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతోంది. అయితే ఆడని సినిమాలు ఓటీటీల్లోకి త్వరగా రావడం మామూలు విషయమే. కానీ, ఇటీవలి కాలంలో థియేటర్లలో సినిమా ఆడినా, ఆడకపోయినా సరే, ఓటీటీల్లోకి వెంటనే వచ్చేస్తున్నాయి. థియెట్రికల్ రిలీజ్ కి ముందు నిర్మాతలు చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ విధంగా డిజిటల్ రిలీజెస్ త్వరగా అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక థియేటర్లలో సరిగా ఆడని సినిమాలను ఓటీటీ […]

The post OTT: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ తెలుగు సినిమాలు (2023) first appeared on 91Mobiles Telugu.

]]>

ఇప్పుడంతా ఓటీటీల హవా నడుస్తోంది. ఏ కొత్త సినిమా అయినా సరే, థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతోంది. అయితే ఆడని సినిమాలు ఓటీటీల్లోకి త్వరగా రావడం మామూలు విషయమే. కానీ, ఇటీవలి కాలంలో థియేటర్లలో సినిమా ఆడినా, ఆడకపోయినా సరే, ఓటీటీల్లోకి వెంటనే వచ్చేస్తున్నాయి. థియెట్రికల్ రిలీజ్ కి ముందు నిర్మాతలు చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ విధంగా డిజిటల్ రిలీజెస్ త్వరగా అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక థియేటర్లలో సరిగా ఆడని సినిమాలను ఓటీటీ సంస్థలు అంత ఈజీగా కొనడం లేదు. అంతేకదా, సినిమాలో దమ్ము లేకపోతే ఓటీటీల్లో అయినా ఏ ప్రేక్షకుడు చూస్తాడు చెప్పండి?

సరే, విషయంలోకి వద్దాం. 2023 లో విడుదలై ప్రస్తుతం ఓటీటీల్లో బాగా అలరిస్తోన్న తెలుగు సినిమాలేవో ఇక్కడ తెలుసుకుందాం. ఈ జాబితాలో మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీర సింహారెడ్డి, నాని నటించిన దసరా, నాగ శౌర్య ‘రంగబలి’ వంటి ఎన్నో చిత్రాలున్నాయి. సరే, పదండి మరి ఆ జాబితాపై ఓ లుక్ వేద్దాం.

Best Telugu Films On Netflix (2023)

రంగబలి

రంగబలి చిత్రం 2023 జులై 7 న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో చూసేందుకు అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో నాగశౌర్య, యుక్తి తరేజా ప్రధాన పాత్రలు పోషించారు.

  • సినిమా పేరు: రంగబలి
  • ఐఎండీబి రేటింగ్ – 4.9/10
  • ఎక్కడ చూడాలి – నెట్‌ఫ్లిక్స్
  • నటీనటులు – నాగశౌర్య, యుక్తి తరేజా
  • విడుదల తేదీ – 7 జులై 2023

వాల్తేరు వీరయ్య

వాల్తేరు వీరయ్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. 2023 జనవరి 12 న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: వాల్తేరు వీరయ్య
  • ఐఎండిబి రేటింగ్– 6.2/10
  • ఎక్కడ చూడాలి – నెట్‌ఫ్లిక్స్
  • నటీనటులు – చిరంజీవి, రవితేజ, శృతిహాసన్
  • విడుదల తేదీ – 12 జనవరి 2023

దసరా

దసరా చిత్రంలో నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రం 2023 మార్చి 30 న థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: దసరా
  • ఐఎండిబి రేటింగ్ – 6.7/10
  • ఎక్కడ చూడాలి – నెట్‌ఫ్లిక్స్
  • నటీనటులు – నాని, కీర్తి సురేశ్
  • విడుదల తేదీ – 30 మార్చి 2023

Best Telugu Films On Amazon Prime (2023)

ఆదిపురుష్

ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. రామాయణ గాథను స్పూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం 2023 జూన్ 16 న థియేటర్లలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: ఆదిపురుష్
  • ఐఎండీబి రేటింగ్ – 3.2/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • నటీనటులు – ప్రభాస్, కృతీసనన్
  • విడుదల తేదీ – 16 జూన్ 2023

రుద్రాంగి

జగపతి బాబు, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన రుద్రాంగి చిత్రం 2023 జులై 7 న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. విభిన్న నేపథ్యం ఉన్న చిత్రాన్ని చూడాలనుకుంటే రుద్రాంగి ని చూసేయండి.

  • సినిమా పేరు: రుద్రాంగి
  • ఐఎమ్‌డిబి రేటింగ్ – 7.3/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • నటీనటులు – జగపతి బాబు, మమతా మోహన్ దాస్
  • విడుదల తేదీ – 7 July 2023

స్పై

నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మేనెన్ ప్రధాన పాత్రలు పోషించిన స్పై సినిమా 2023 జూన్ 29 న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: స్పై
  • ఐఎండిబి రేటింగ్ – 5.4/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • నటీనటులు – నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మేనెన్
  • విడుదల తేదీ – 29 జూన్ 2023

రావణాసుర

రవితేజ, దక్షా నగర్కర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషించిన రావణాసుర చిత్రం 2023 ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: రావణాసుర
  • ఐఎండిబి రేటింగ్र – 5.7/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్
  • నటీనటులు – రవితేజ, దక్షా నగర్కర్, ఫరియా అబ్దుల్లా
  • విడుదల తేదీ – 7 ఏప్రిల్ 2023

Best Telugu Films on Disney+ Hotstar (2023)

వీరసింహారెడ్డి

వీరసింహారెడ్డి చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో బాలకృష్ణ, హనీరోజ్, శృతీహాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. 2023 జనవరి 11 న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: వీర సింహారెడ్డి
  • ఐఎండిబి రేటింగ్ – 4.9/10
  • ఎక్కడ చూడాలి – డిస్నీ+ హాట్‌స్టార్
  • నటీనటులు – బాలకృష్ణ, హనీరోజ్, శృతీహాసన్
  • విడుదల తేదీ – 11 జనవరి 2023

బిచ్చగాడు 2

బిచ్చగాడు 2 చిత్రంలో విజయ్ ఆంటోని, కావ్యా తాపర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2023 మే 19 వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: బిచ్చగాడు 2
  • ఐఎండిబి రేటింగ్ – 5.6/10
  • ఎక్కడ చూడాలి – డిస్నీ+ హాట్‌స్టార్
  • నటీనటులు – విజయ్ ఆంటోని, కావ్యా తాపర్
  • విడుదల తేదీ – 19 మే 2023

Best Telugu Films on Sony Liv (2023)

పరేషాన్

పరేషాన్ చిత్రంలో తిరువీర్, పావని కరణం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సోని లివ్ లో స్ట్రీమ్ అవుతోంది. 2023 జూన్ 2 వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: పరేషాన్
  • ఐఎండిబి రేటింగ్ – 6.1/10
  • ఎక్కడ చూడాలి – సోని లివ్
  • నటీనటులు – తిరువీర్, పావని కరణం
  • విడుదల తేదీ – 2 June 2023

Best Telugu Films On Zee5 (2023)

రైటర్ పద్మభూషణ్

రైటర్ పద్మభూషణ్ చిత్రంలో సుహాస్, టీనా శిల్పరాజ్, శ్రీ గౌరి ప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. 2023 ఫిబ్రవరి 3 వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. జీ5 లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: రైటర్ పద్మభూషణ్
  • ఐఎండిబి రేటింగ్ – 7.7/10
  • ఎక్కడ చూడాలి – జీ5
  • నటీనటులు – సుహాస్, టీనా శిల్పరాజ్, శ్రీ గౌరి ప్రియ
  • విడుదల తేదీ – 3 ఫిబ్రవరి 2023

The post OTT: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ తెలుగు సినిమాలు (2023) first appeared on 91Mobiles Telugu.

]]>
Amazon Prime Video లో అందుబాటులో ఉన్న ప్రభాస్ సినిమాలు https://www.91mobiles.com/telugu/prabhas-movies-on-amazon-prime-video/ Thu, 08 Jun 2023 15:28:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=6675 బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు కథానాయకుడు ప్రభాస్. ఆ సినిమాల పరంపర యంగ్ రెబెల్ స్టార్ ని నేషనల్ స్టార్ గా చేసింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 1, 2 చిత్రాలు ప్రభాస్ ని జనాల హృదయాల్లో నిలిచేలా చేసాయి. తన నటన, హావభావాలతో ప్రభాస్ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇక ఆ సినిమాల మొదలు వరుసబెట్టి ప్యాన్ ఇండియా చిత్రాలనే చేస్తున్నారు ప్రభాస్. తాజాగా ఈ సాహో నటుడు ఆదిపురుష్ అనే […]

The post Amazon Prime Video లో అందుబాటులో ఉన్న ప్రభాస్ సినిమాలు first appeared on 91Mobiles Telugu.

]]>

బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు కథానాయకుడు ప్రభాస్. ఆ సినిమాల పరంపర యంగ్ రెబెల్ స్టార్ ని నేషనల్ స్టార్ గా చేసింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 1, 2 చిత్రాలు ప్రభాస్ ని జనాల హృదయాల్లో నిలిచేలా చేసాయి. తన నటన, హావభావాలతో ప్రభాస్ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇక ఆ సినిమాల మొదలు వరుసబెట్టి ప్యాన్ ఇండియా చిత్రాలనే చేస్తున్నారు ప్రభాస్. తాజాగా ఈ సాహో నటుడు ఆదిపురుష్ అనే మరొక ప్యాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు, యావత్ ప్రేక్షకలోకం ఆదిపురుష్ చిత్రం కోసం ఎదురు చూస్తోంది. రామాయణ గాథ ఆధారంగా ఆదిపురుష్ సినిమా రూపొందింది. ఆదిపురుష్ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. ఇక ఓటీటీల్లో కూడా ప్రభాస్ నటించిన సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. వివిధ ఓటీటీ వేదికల్లో ప్రభాస్ చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులో ఉన్న ప్రభాస్ చిత్రాల జాబితాను తెలుసుకుందాం.

Amazon Prime Video లో ప్రభాస్ సినిమాలు

1. రాధేశ్యామ్
2. సాహో
3. మిర్చి
4. రెబెల్
5. బుజ్జిగాడు
6. యోగి
7. రాఘవేంద్ర

1. Radhe Shyam

రాధేశ్యామ్ చిత్రం 2022 లో దేశ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. థియేటర్లో ఈ చిత్రాన్ని చూడకపోతే ఓసారి చూసేయండి. ఇప్పటికే చూసి ఉంటే, మరొకసారి మీ ఫ్యామిలీతో కలిసి వీక్షించండి.

  • థియెటర్ రిలీజ్: మార్చి 11, 2022
  • ఐఎండిబి రేటింగ్: 5.3/10
  • నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే
  • ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో

2. Saaho

సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ప్యాన్ ఇండియా సినిమా సాహో. ఈ చిత్రంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో పై అందుబాటులో ఉంది. చూసి ఆనందించండి.

  • థియేటర్ రిలీజ్: ఆగస్టు 30, 2019
  • ఐఎండిబి రేటింగ్: 5/10
  • నటీనటులు: ప్రభాస్, శ్రద్ధా కపూర్
  • ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో

3. Mirchi

మిర్చి సినిమాలో ప్రభాస్, అనుష్క శెట్టి, రిచా గంగోపాధ్యాయ ప్రధాన పాత్రలు పోషించారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో కి సబ్‌స్క్రైబ్ అయి ఈ సినిమాని చూడండి.

  • థియెటర్ రిలీజ్: ఫిబ్రవరి 8, 2013
  • ఐఎండిబి రేటింగ్: 7.3/10
  • నటీనటులు: ప్రభాస్, అనుష్క శెట్టి
  • ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో

4. Rebel

2012 లో రెబెల్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. రెబెల్ లో ప్రభాస్ తో పాటు తమన్నా, దీక్షా సేఠ్ నటించారు. సీనియర్ నటుడు కృష్ణంరాజు ముఖ్యపాత్ర పోషించారు. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ సంగీతం కూడా సమకూర్చారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రాన్ని చూడండి.

  • థియెటర్ రిలీజ్: సెప్టెంబర్ 28, 2012
  • ఐఎండిబి రేటింగ్: 4.8/10
  • నటీనటులు: ప్రభాస్, తమన్నా
  • ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో

5. Yogi

2004 లో యోగి చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ప్రభాస్, నయనతార ఈ చిత్రంలో జంటగా నటించారు. ప్రభాస్ తల్లిగా కీలక పాత్రలో సీనియర్ నటి శారద నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. మీరు గనుక ఈ సినిమాని చూడకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ తీసుకుని చూసేయండి.

  • థియేటర్ రిలీజ్: జనవరి 10, 2007
  • ఐఎండిబి రేటింగ్: 4.5/10
  • నటీనటులు: ప్రభాస్, నయనతార
  • ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో

6. Bujjigadu

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బుజ్జిగాడు చిత్రం ప్రభాస్ ని విభిన్నశైలిలో ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటుంది. ప్రభాస్ సరసన త్రిష ఈ చిత్రంలో నటించింది. సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించారు.

  • థియెటర్ రిలీజ్: మే 22, 2008
  • ఐఎండిబి రేటింగ్: 6.3/10
  • నటీనటులు: ప్రభాస్, త్రిష
  • ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో

7. Raghavendra

2003 లో రాఘవేంద్ర చిత్రం విడుదలైంది. ప్రభాస్, అన్శు, శ్వేతా అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు. మురళీ మోహన్, ప్రభ, ఆనంద్ రాజ్ సహాయక పాత్రలో కనిపించారు. సురేశ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రాన్ని చూసి ఆనందించండి.

  • థియెటర్ రిలీజ్: మార్చి 23, 2023
  • ఐఎండిబి రేటింగ్: 4.8/10
  • నటీనటులు: ప్రభాస్, అన్శు
  • ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో

The post Amazon Prime Video లో అందుబాటులో ఉన్న ప్రభాస్ సినిమాలు first appeared on 91Mobiles Telugu.

]]>
మీర్జాపూర్ సీజన్ 3 రిలీజ్ అప్డేట్ https://www.91mobiles.com/telugu/mirzapur-season-3-release-update-amazon-prime-video/ Tue, 20 Dec 2022 13:02:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=4086 హైలైట్స్ 2023 ఆరంభంలో స్ట్రీమ్ కానున్న Mirzapur Season 3 ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవ్వనున్న మీర్జాపూర్ సీజన్ 3 వెబ్ సిరీస్ పాత పాత్రలతో పాటు ఎన్నో కొత్త పాత్రలతో వస్తోన్న కొత్త సీజన్ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉన్న మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఓటీటీ ఆడియన్స్ కి మీర్జాపూర్ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశమంతటా ఈ వెబ్ సిరీస్ మొదటి రెండు సీజన్లకు సూపర్బ్ రెస్పాన్స్ […]

The post మీర్జాపూర్ సీజన్ 3 రిలీజ్ అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2023 ఆరంభంలో స్ట్రీమ్ కానున్న Mirzapur Season 3
  • ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవ్వనున్న మీర్జాపూర్ సీజన్ 3 వెబ్ సిరీస్
  • పాత పాత్రలతో పాటు ఎన్నో కొత్త పాత్రలతో వస్తోన్న కొత్త సీజన్
  • హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉన్న మీర్జాపూర్ వెబ్ సిరీస్

ఓటీటీ ఆడియన్స్ కి మీర్జాపూర్ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశమంతటా ఈ వెబ్ సిరీస్ మొదటి రెండు సీజన్లకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ప్రేక్షకులు మీర్జాపూర్ సీజన్ 3 కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తదుపరి సీజన్ లో గోలు గుప్తా, గుడ్డు భయ్యా తమ ప్రతీకారాన్ని తీర్చుకుంటారా? లేదా? అనేది చూడాలని ప్రేక్షకులు వేచి చూస్తున్నారు.

అయితే గత సీజన్ లో కనిపించిన మున్నా భయ్యా పాత్ర రానున్న మూడో సీజన్ లో ఉంటుందా లేదా అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఈ ప్రశ్నలన్నింటి మధ్య, మీర్జాపూర్ 3 కి సంబంధించిన రిలీజ్ డేట్ పై ఓ హింట్ బయటకు వచ్చింది. ఆ హింట్ ఇచ్చింది మరెవరో కాదు, అఫీషియల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ అమెజాన్ ప్రైమ్ వీడియోనే.

మీర్జాపూర్ సీజన్ 3 ని టీజ్ చేస్తూ పోస్ట్ పెట్టిన Amazon Prime Video

అమెజాన్ ప్రైమ్ వీడియో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మీర్జాపూర్ సీజన్ 3 కి సంబంధించిన పోస్ట్ ని షేర్ చేసింది. ఈ పోస్ట్ కి క్యాప్షన్ గా మేం సిద్ధంగా ఉన్నాం అని రాసి ఉంది. దీంతో త్వరలోనే మీర్జాపూర్ సీజన్ 3 విడుదల తేదీ అనౌన్స్ అవుతుందని స్పష్టమవుతోంది.

మీర్జాపూర్ సీజన్ 3 రిలీజ్ అధికారికంగా ఖరారైనప్పటికీ, ప్రీమియమ్ డేట్ మాత్రం ఇంకా నిర్ణయించలేదు. అయితే, రూమర్లను బట్టి, 2023 ఆరంభంలో ఈ వెబ్ సిరీస్ విడుదల ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందేమో చూడాలి.

మీర్జాపూర్ సీజన్ 3 నటీనటులు

మీర్జాపూర్ సీజన్ 3 లో పాత ముఖాలతో పాటు కొన్ని కొత్త ముఖాలు కూడా కనిపించనున్నాయి. సీజన్ 3 లో పంకజ్ త్రిపాఠి, అఖండానంద్ త్రిపాఠి అలియాస్ కలీన్ భయ్యాగా చేస్తున్నాడు. గోవింద్ పండిట్ అలియాస్ గుడ్డు పాత్రలో అలీ ఫజల్ కనిపించనున్నాడు. బీనా త్రిపాఠిగా రసికా దుగ్గల్ చేస్తున్నారు. భరత్ త్యాగి పాత్రలో విజయ్ వర్మ కనిపించనున్నాడు. దేవ్ దత్ త్యాగి అలియాస్ దాదా ఇన్ ద ఫామ్ పాత్రలో లిల్లిపుట్ చేస్తున్నాడు. నీలమ్ సత్యానంద్ త్రిపాఠిగా వివాన్ సింగ్, ఇషా తల్వార్ పాత్రలో మాధురి చేస్తున్నారు. ఇంకా మరెందరో ఈ సీజన్ లో నటిస్తున్నారు.

మీర్జాపూర్ సీజన్ 3 కథ?

మీర్జాపూర్ ఒక క్రైమ్ త్రిల్లర్ డ్రామా. ఉత్తరప్రదేశ్ లోని రెండు కుటుంబాల మధ్య చోటు చేసుకునే పరిణామాల నేపథ్యంలో కథ సాగుతుంది. ఆడియన్స్ నుంచి వస్తోన్న డిమాండ్ మేరకు సీజన్ 3 లో ఎన్నో ఎగ్జైటింగ్ ట్విస్ట్ లు, టర్న్స్ ఉండబోతున్నట్లు సమాచారం.

ఈసారి అలీ ఫజల్ (గుడ్డు పండిట్) మునుపటి కంటే అత్యంత క్రూరమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అలాగే ఈసారి అతడు జైలుకు వెళతాడని తెలుస్తోంది. అయితే మరోవైపు, కలీన్ భయ్యా తన కొడుకి మరణానికి ప్రతీకారం తీర్చుకోనున్నాడట. మొత్తం మీద ఈ సీజన్ 3 పవర్, ఆంబిషన్, రివెంజ్, ద్వేషం అనే వాటి చుట్టూ తిరుగుతుందని అర్థమవుతోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మీర్జాపూర్ సీజన్ 3 రిలీజ్ అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
ఇవాళ OTT లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు సినిమాలు ఇవే https://www.91mobiles.com/telugu/four-telugu-films-streaming-on-ott-today/ Fri, 09 Dec 2022 09:38:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=3903 హైలైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, ఆహా, నెట్‌ఫ్లిక్స్ లలో స్ట్రీమ్ కానున్న పలు తెలుగు సినిమాలు ఓటీటీ ఆడియన్స్ ని పలకరించనున్న నితిన్ మాచర్ల నియోజకవర్గం, అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో, యశోద చిత్రాలు సోని లివ్ లో అందుబాటులో ఉన్న లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమా శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రేమికులకు పండగేనని చెప్పాలి. ఎందుకంటే ఇదే రోజున ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇటీవలి కాలంలో, ఓటీటీల ప్రభావం కూడా చాలా […]

The post ఇవాళ OTT లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు సినిమాలు ఇవే first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, ఆహా, నెట్‌ఫ్లిక్స్ లలో స్ట్రీమ్ కానున్న పలు తెలుగు సినిమాలు
  • ఓటీటీ ఆడియన్స్ ని పలకరించనున్న నితిన్ మాచర్ల నియోజకవర్గం, అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో, యశోద చిత్రాలు
  • సోని లివ్ లో అందుబాటులో ఉన్న లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమా

శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రేమికులకు పండగేనని చెప్పాలి. ఎందుకంటే ఇదే రోజున ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇటీవలి కాలంలో, ఓటీటీల ప్రభావం కూడా చాలా పెరిగింది. దీంతో థియేటర్లలో సినిమాలను మిస్ అయ్యే వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఒకేసారి 4 సినిమాలు ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేశాయి. ఆ సినిమాలేంటో తెలుసుకుందాం పదండి.

1.మాచర్ల నియోజకవర్గం
2.యశోద
3.ఊర్వశివో రాక్షసివో
4.లైక్-షేర్ & సబ్‌స్క్రైబ్

1.మాచర్ల నియోజకవర్గం

నితిన్, కృతిశెట్టి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నితిన్ కలెక్టర్ గా కనిపించారు. పొలిటికల్ త్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో పర్వాలేదనిపించింది. అయితే కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. మరి ఓటీటీ ఆడియన్స్ ని అయినా మెప్పిస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రం జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.

2.యశోద

సమంతా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఇటీవలె థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓపెనింగ్స్ బాగానే రాబట్టినప్పటికీ, తర్వాత అదే ఊపుని కొనసాగించలేకపోయింది. దీంతో త్వరగానే థియేటర్ల నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. సమంతా ఈ చిత్రంలో పోరాట సన్నివేశాల్లో కూడా నటించి మెప్పించింది. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, దివ్య శ్రీపాద ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హరి-హరీశ్ దర్శకత్వం వహించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శివలెంక కే ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.

3.ఊర్వశివో రాక్షసివో

ఈ చిత్రంలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలు పోషించారు. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేటి నుంచి ఆహా ఓటీటీ తో పాటు, నెట్‌ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమ్ అవుతోంది. వివాహం గొప్పదా లేక లివ్-ఇన్ రిలేషన్షిప్ బెటరా? అనే విషయాన్ని ఈ చిత్రంలో చర్చించారు.

4.లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్

ఈ చిత్రంలో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, సుదర్శన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సోనిలివ్ ఓటీటీ లో అందుబాటులో ఉంది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాము తూము ఎడిటింగ్ చేశాడు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

మరింకేంటి, ఈ 4 తెలుగు సినిమాలని చూసేసి ఈ వీకెండ్ ని బాగా ఎంజాయ్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఇవాళ OTT లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు సినిమాలు ఇవే first appeared on 91Mobiles Telugu.

]]>
Prime Video లో స్ట్రీమ్ అవుతోన్న మాస్ మహారాజా సినిమాలు https://www.91mobiles.com/telugu/mass-maharaja-raviteja-films-on-amazon-prime-video/ Tue, 29 Nov 2022 11:01:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=3731 మాస్ మహారాజా రవితేజ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఆయన డబ్బింగ్ సినిమాల ద్వారా రవితేజకు దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఎక్కువగా యాక్షన్ కామెడీ జోనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు రవితేజ. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా రవితేజ తన స్టార్డమ్ ని అలాగే నిలబెట్టకుంటున్నారు. ప్రేక్షకుల్లో కూడా రవితేజ కొత్త సినిమా ఎప్పుడస్తుందా అనే ఉత్సుకత ఉంటుంది. ఆమధ్య కరోనా తో ప్రపంచం అతలాకుతలమైపోతున్న సమయంలో […]

The post Prime Video లో స్ట్రీమ్ అవుతోన్న మాస్ మహారాజా సినిమాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Mass Maharaja Ravi Teja

మాస్ మహారాజా రవితేజ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఆయన డబ్బింగ్ సినిమాల ద్వారా రవితేజకు దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఎక్కువగా యాక్షన్ కామెడీ జోనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు రవితేజ. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా రవితేజ తన స్టార్డమ్ ని అలాగే నిలబెట్టకుంటున్నారు. ప్రేక్షకుల్లో కూడా రవితేజ కొత్త సినిమా ఎప్పుడస్తుందా అనే ఉత్సుకత ఉంటుంది.

ఆమధ్య కరోనా తో ప్రపంచం అతలాకుతలమైపోతున్న సమయంలో సినీ పరిశ్రమ దారుణంగా కుదేలైన సంగతి తెలిసిందే. అప్పుడొచ్చింది రవితేజ నటించిన క్రాక్ సినిమా. మళ్ళీ థియేటర్లకు జనాలను రాబట్టడమే కాదు, బ్లాక్‌బస్టర్ కొట్టి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 50 శాతం ఆక్యుపెన్సీ రేషియోతోనే క్రాక్ సినిమా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసి రవితేజ్ స్టామినా ఏంటో నిరూపించింది.

త్వరలో రవితేజ, చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న వాల్తేరు వీరయ్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో రవితేజ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. అలాగే రవితేజ ప్రధాన పాత్రలో ధమాకా అనే సినిమా కూడా త్వరలో రాబోతోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమ్ అవుతోన్న రవితేజ సినిమాల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి కన్నేయండి.

Amazon Prime Video లో రవితేజ సినిమాలు

 

1. విక్రమార్కుడు

మాస్ మహారాజా రవితేజ, అనుష్క శెట్టి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. రవితేజ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా, దొంగగా డ్యూయల్ రోల్ లో కనిపించారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ తో కూడిన ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం.

2. భద్ర

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టెయినర్ గా వచ్చిన భద్ర చిత్రంలో రవితేజ, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

3. కృష్ణ

వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. చక్రి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో రవితేజ, త్రిష జంటగా నటించారు.

4. సింధూరం

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో సింధూరం చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, రవితేజ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో రవితేజ తన నటనతో నవ్వులు పూయించారు. సంఘవి కథానాయికగా చేసింది.

5. టచ్ చేసి చూడు

ఈ యాక్షన్ కామెడీ చిత్రంలో రవితేజ, రాశీ ఖన్నా, సీరత్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్రెడ్డీ దారువాలా, మురళీశర్మ, సుహాసిని మణిరత్నం ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఈ చిత్రంతో విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయమయ్యారు.

6. అమర్ అక్బర్ ఆంటోని

శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని రాబట్టలేదు. ఈ చిత్రంలో రవితేజ, ఇలియాన జంటగా నటించారు. సునీల్, సాయాజీ షిండే, అభిమన్యు సింగ్, ఆదిత్య ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Prime Video లో స్ట్రీమ్ అవుతోన్న మాస్ మహారాజా సినిమాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Amazon Prime Video లో స్ట్రీమ్ అవుతోన్న కాంతార (Kantara) https://www.91mobiles.com/telugu/kantara-streaming-on-amazon-prime-video/ Thu, 24 Nov 2022 11:20:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=3650 హైలైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రసారమవుతోన్న కాంతార చిన్న సినిమాగా వచ్చి బ్లాక్‌బస్టర్ గా నిలిచిన కన్నడ సినిమా కాంతార రూ.400 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టిన కాంతార, ప్రధాన పాత్ర పోషించిన రిషబ్ శెట్టి కన్నడ సినిమా కాంతార గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అంతటి ప్రభంజనం సృష్టించింది ఈ సినిమా. బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని కన్నడ గిరిజన సంప్రదాయాలను కళ్ళకు కట్టినట్లు చూపించింది. అందుకే యావత్ దేశం ఈ చిత్రానికి […]

The post Amazon Prime Video లో స్ట్రీమ్ అవుతోన్న కాంతార (Kantara) first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రసారమవుతోన్న కాంతార
  • చిన్న సినిమాగా వచ్చి బ్లాక్‌బస్టర్ గా నిలిచిన కన్నడ సినిమా కాంతార
  • రూ.400 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టిన కాంతార, ప్రధాన పాత్ర పోషించిన రిషబ్ శెట్టి

కన్నడ సినిమా కాంతార గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అంతటి ప్రభంజనం సృష్టించింది ఈ సినిమా. బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని కన్నడ గిరిజన సంప్రదాయాలను కళ్ళకు కట్టినట్లు చూపించింది. అందుకే యావత్ దేశం ఈ చిత్రానికి ఫిదా అయ్యింది. కన్నడ తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఘన విజయం సాధించింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం వందల కోట్లను కొల్లగొట్టింది. హొంబలె ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Amazon Prime Video లో స్ట్రీమ్ అవుతోన్న ‘కాంతార’

ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతోంది. నేడు అర్థరాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. దీంతో కాంతార ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అలాగే ఈ చిత్రాన్ని థియేటర్లలో వీక్షించని వారు ఓటీటీ లో చూసేందుకు రెడీ అవుతున్నారు. సబ్‌స్క్రిప్షన్ లేని వారు వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియో కి సబ్‌స్క్రైబ్ అవుతున్నారు. దీంతో కాంతార సినిమా వల్లన ప్రైమ్ వీడియో కి బాగా కలిసి రానుంది. థియేటర్లలో తుపాను రేపిన ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తుందని ఆశిద్దాం.

‘కాంతార’ చిత్ర కథ

‘కాంతార’ ఒక ఫాంటసీ త్రిల్లర్. దక్షిణ భారతీయ సంప్రదాయాన్ని ప్రధానంగా చూపించింది. గిరిజనులకు చెందిన భూమిని కొన్ని శక్తులు కాపాడుతుంటాయి. అయితే కొందరు భూమిని కాజేయాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో గిరిజనులకు, వారికి మధ్య పోరు కొనసాగుతుంది. ఈ మధ్యలో దైవశక్తులు ఏ విధంగా గిరిపుత్రులకు సాయపడతాయో చిత్రకథలో చూసి తరించాల్సిందే.

‘కాంతార’ చిత్రానికి రిషబ్ శెట్టి కథ అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. అతడే ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారి కావడం విశేషం. ఇలా పలు బాధ్యతలు చేపట్టినప్పటికీ, ఎక్కడా తడబడకుండా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించడంలో రిషబ్ శెట్టి విజయం సాధించాడు. అందుకే ప్రేక్షకులు చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళను రాబట్టింది కాంతార.

సప్తిమి గౌడ కాంతార చిత్రంలో కథానాయికగా చేసింది. తక్కువ బడ్జెట్ లో రూపొందిన కాంతార ఎవ్వరూ ఊహించని లాభాలను ఆర్జించి ఔరా అనిపించింది. రిషబ్ శెట్టి ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ కి కూడా కొత్త ముఖమే. అయినప్పటికీ కాంతార భారీ వసూళ్ళను సాధించింది. బాలీవుడ్ లో కాంతార, పుష్ప వసూళ్ళను కూడా బ్రేక్ చేయడం విశేషం.

హొంబలె ఫిల్మ్స్ కాంతార చిత్రాన్ని నిర్మించింది. కాంతార చిత్రానికి వివిధ చిత్రసీమల నుంచి ప్రశంసలు దక్కాయి. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, నటుడు రిషబ్ శెట్టిని ప్రత్యేకంగా చెన్నై లోని తన ఇంటికి ఆహ్వానించి ఓ గోల్డ్ చైన్ మరియు లాకెట్ ని బహూకరించి అభినందించారు. 50 ఏళ్ళో ఒకసారి మాత్రమే కాంతార వంటి అద్భుతాలు జరుగుతాయని రజినీకాంత్ ప్రశంసించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Amazon Prime Video లో స్ట్రీమ్ అవుతోన్న కాంతార (Kantara) first appeared on 91Mobiles Telugu.

]]>
Amazon Prime Video లో అందుబాటులో ఉన్న విజయ్ దేవరకొండ సినిమాలు https://www.91mobiles.com/telugu/vijay-deverakonda-movies-available-on-amazon-prime-video/ Wed, 23 Nov 2022 15:01:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=3615 యువ నటుడు విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తన స్టార్డమ్ ని ఒకే రీతిలో మెయింటెయిన్ చేస్తున్న యంగ్ టాలెంట్ విజయ్ దేవరకొండ. పెళ్ళి చూపులు చిత్రంతో హిట్టు కొట్టిన విజయ్, తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో గా అవతరించాడు. తక్కువ సమయంలో దేశ వ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించిన హీరోగా నిలిచిపోయాడు విజయ్ దేవరకొండ. […]

The post Amazon Prime Video లో అందుబాటులో ఉన్న విజయ్ దేవరకొండ సినిమాలు first appeared on 91Mobiles Telugu.

]]>

యువ నటుడు విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తన స్టార్డమ్ ని ఒకే రీతిలో మెయింటెయిన్ చేస్తున్న యంగ్ టాలెంట్ విజయ్ దేవరకొండ. పెళ్ళి చూపులు చిత్రంతో హిట్టు కొట్టిన విజయ్, తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో గా అవతరించాడు. తక్కువ సమయంలో దేశ వ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించిన హీరోగా నిలిచిపోయాడు విజయ్ దేవరకొండ. సినిమాల్లో తన నటనతో పాటు అలరించడమే కాకుండా, బయట తన ఔట్‌ఫిట్స్ తో ఆకట్టుకుంటూ ఫ్యాషన్ ఐకన్ గా నిలుస్తున్నాడు.

సొంతంగా రౌడీ అనే దుస్తుల బ్రాండ్ ని కలిగి ఉన్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. అలాగే మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి కూడా దిగాడు. ఇటీవలె లైగర్ అనే ప్యాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విజయ్, త్వరలో ఖుషీ అనే ప్రేమకథతో వస్తున్నాడు. ఈ చిత్రంలో సమంతా కథానాయికగా చేస్తోంది. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. సరే, విషయంలోకి వెళ్దాం. విజయ్ దేవరకొండ నటించిన పలు చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులో ఉన్నాయి. ఆ జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. ఓ కన్నేయండి. అలాగే ఆ చిత్రాలను చూడకుంటే గనుక ఓసారి చూసేయండి.

Amazon Prime Video లో విజయ్ దేవరకొండ సినిమాలు

  • ద్వారక
  • ఏ మంత్రం వేసావే
  • నోటా
  • మహానటి
  • అర్జున్ రెడ్డి
  • డియర్ కామ్రేడ్

1. ద్వారక

ఈ చిత్రం 2017, మార్చి 3 న విడుదలైంది. విజయ్ దేవరకొండ, పూజా జవేరి ప్రధాన పాత్రలు పోషించారు. ప్రకాశ్ రాజ్, మురళీశర్మ కీలక పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చాడు. కుటుంబ సమేతంగా చూడదగిన ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసి ఆనందించండి.

2. ఏ మంత్రం వేసావె

ఇదొక రొమాంటిక్ డ్రామా. ఈ చిత్రానికి శ్రీధర్ మర్రి దర్శకత్వం వహించారు. విజయ్ దేవరకొండ, శివాని ప్రధాన పాత్రలు పోషించారు. గోలిసోడ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2013 లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్లన 2018 మార్చి 9 న రిలీజ్ అయ్యింది. విజయ్ దేవరకొండను ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని చూడండి.

3. నోటా

పొలిటికల్ త్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమాని ఆనంద్ శంకర్ తెరకెక్కించాడు. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ తమిళ తెరకు పరిచయమయ్యాడు. మెహ్రీన్ పీర్జాదా విజయ్ కి జతగా నటించింది. సత్యరాజ్, నాజర్, సంచనా నటరాజన్, కరుణాకరన్, ప్రియదర్శి పుల్లికొండ కీలక పాత్రలు పోషించారు.

4. మహానటి

ప్రముఖ నటి సావిత్రి జీవితగాథగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సహాయక పాత్ర పోషించాడు. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ పై ప్రియాంకా దత్ ఈ చిత్రాన్ని నిర్మించింది. కీర్తి సురేశ్ సావిత్రి పాత్రను పోషించగా, దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ పాత్రలో కనిపించాడు.

5. అర్జున్ రెడ్డి

ఇదొక రొమాంటిక్ డ్రామా. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, శాలినీ పాండే ప్రధాన పాత్రలు పోషించారు. రాహుల్ రామకృష్ణ, జియా శర్మ, సంజయ్ స్వరూప్, గోపీనాథ్ భట్, కమల్ కామరాజు, కాంచన సహాయక పాత్రలు పోషించారు. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకుడు.

6. డియర్ కామ్రేడ్

రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ చిత్రానికి భరత్ కమ్మ దర్శకుడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రశ్మికా మందణ్ణ ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Amazon Prime Video లో అందుబాటులో ఉన్న విజయ్ దేవరకొండ సినిమాలు first appeared on 91Mobiles Telugu.

]]>
మొబైల్-ఓన్లీ ప్యాక్ తో వచ్చిన Amazon Prime Video; Disney+ Hotstar, Netflix లకు గట్టిపోటీ ఇవ్వనుందా? https://www.91mobiles.com/telugu/amazon-prime-video-mobile-only-plan-launched-price-benefits-details/ Mon, 07 Nov 2022 12:27:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=3281 హైలైట్స్ భారత్ లో ప్రైమ్ వీడియో మెంబర్షిప్ కోసం కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ని తీసుకొచ్చిన అమెజాన్ మొబైల్ ప్యాక్ ద్వారా అమెజాన్ ఒరిజినల్స్, లైవ్ క్రికెట్, జాతీయ, అంతర్జాతీయ చిత్రాలు పొందనున్న యూజర్లు తన సరికొత్త మొబైల్ ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ లకు గట్టి పోటీ ఇవ్వనున్న అమెజాన్ అమెజాన్ కంపెనీ తన ప్రైమ్ వీడియో మెంబర్షిప్ కోసం భారత్ లో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ని లాంచ్ చేసింది. అమెజాన్ ప్రైమ్ […]

The post మొబైల్-ఓన్లీ ప్యాక్ తో వచ్చిన Amazon Prime Video; Disney+ Hotstar, Netflix లకు గట్టిపోటీ ఇవ్వనుందా? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో ప్రైమ్ వీడియో మెంబర్షిప్ కోసం కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ని తీసుకొచ్చిన అమెజాన్
  • మొబైల్ ప్యాక్ ద్వారా అమెజాన్ ఒరిజినల్స్, లైవ్ క్రికెట్, జాతీయ, అంతర్జాతీయ చిత్రాలు పొందనున్న యూజర్లు
  • తన సరికొత్త మొబైల్ ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ లకు గట్టి పోటీ ఇవ్వనున్న అమెజాన్
Image: Amazon Prime Video

అమెజాన్ కంపెనీ తన ప్రైమ్ వీడియో మెంబర్షిప్ కోసం భారత్ లో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ని లాంచ్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ని కంపెనీ లాంచ్ చేసింది. ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఒక నెల, 3 నెలలు, 12 నెలల కాలపరిమితితో అందుబాటులో ఉంటుంది. అమెజాన్ తన కొత్త మొబైల్-ఓన్లీ ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ లకు గట్టి పోటీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది.

అసలు విషయం ఏంటంటే, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్ ఎన్నో టెలీకామ్ రీచార్జ్ ప్లాన్స్ తో బండిల్ చేయబడి వస్తోంది. ఇప్పుడు ఈ షేర్ ని కొంత మొత్తం కబ్జా చేసేందుకు అమెజాన్ మొబైల్-ఓన్లీ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ ధరను తక్కువ ధరకే తీసుకువచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ధర, ఫీచర్లు ఇతర వివరాల గురించి తెలుసుకుందాం. పదండి.

Amazon Prime Video మొబైల్ ఎడిషన్ విశేషాలు

Amazon ఏడాదికి రూ.599 ధరతో ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ని లాంచ్ చేసింది. స్టాండర్డ్ యాన్యువల్ ప్యాక్ ధర రూ.1,499 గా ఉంది. అయితే మొబైల్-ఓన్లీ ప్లాన్ చాలా తక్కువ ధరకు లభించనుంది. ఈ మొబైల్ ప్లాన్ ద్వారా 480p స్టాండర్డ్ రెజుల్యూషన్ తో వీడియోను చూసే అవకాశం ఉంటుంది. స్టాండర్డ్ ప్యాక్ అయితే 4కే స్ట్రీమింగ్ ఆప్షన్ ఉంటుంది.

మొబైల్ ప్యాక్ ద్వారా అమెజాన్ ఒరిజినల్స్, లైవ్ క్రికెట్, భారతీయ, అంతర్జాతీయ సినిమాలకు యాక్సెస్ లభిస్తుంది. వీటితో పాటు, ఆఫ్ లైన్ లో చూడటానికి డౌన్ లోడ్ ఆప్షన్, ఐఎండీబీ యొక్క ఎక్స్-రే వంటి ఫీచర్లు లభిస్తాయి.

అయితే మొబైల్ ఎడిషన్ ప్యాక్ కొన్ని ముఖ్యమైన ఫీచర్లతో రావడం లేదు. ఫ్రీ-ఫాస్ట్ అమెజాన్ డెలివరీ, యాడ్-ఫ్రీ మ్యూజిక్ (ప్రైమ్ మ్యూజిక్), ప్రైమ్ రీడింగ్ వంటి ఫీచర్లు రాబోవు. ఈ ఫీచర్లు కేవలం రూ.1499 ప్లాన్ కి మాత్రమే పరిమితం. టాప్-టైర్ ప్లాన్ ద్వారా మల్టీ-యూజర్ ప్రొఫైల్స్, వివిధ డివైజెస్ పై స్ట్రీమింగ్ వంటివి లభిస్తాయి. మొబైల్-ఓన్లీ ప్లాన్ యూజర్లు కేవలం ఒకే అకౌంట్ ద్వారా కంటెంట్ ని వినియోగించుకునే వీలుంది.

Amazon Prime India వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ గాంధీ ఈ కొత్త మొబైల్-ఓన్లీ ప్లాన్ ని లాంచ్ చేశారు. 99 శాతం పిన్‌కోడ్స్ నుంచి ప్రైమ్ వీడియో కి వ్యూయర్షిప్ వస్తోందని గాంధీ తెలిపారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ఫామ్ కి భారత మార్కెట్ ఎంతో కీలకమైనదని ప్రైమ్ వీడియో, ఇంటర్నేషనల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ కెల్లీ డే అన్నారు. కొత్త మొబైల్-ఓన్లీ ప్లాన్ తో తమకు యూజర్లు గణనీయంగా పెరుగుతారని అమెజాన్ ఆశిస్తోంది. మరింకెందుకు ఆలస్యం ఓటీటీ కంటెంట్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే ప్రైమ్ వీడియో మొబైల్-ఓన్లీ ప్లాన్ కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మొబైల్-ఓన్లీ ప్యాక్ తో వచ్చిన Amazon Prime Video; Disney+ Hotstar, Netflix లకు గట్టిపోటీ ఇవ్వనుందా? first appeared on 91Mobiles Telugu.

]]>
ఓటీటీ లో దూసుకెళ్తోన్న గ్యాంగ్‌స్టర్ గంగరాజు https://www.91mobiles.com/telugu/gangster-gangaraju-movie-getting-positive-response-on-amazon-prime-video/ Wed, 31 Aug 2022 04:30:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=2024 హైలైట్స్: తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రం థియెట్రికల్ రన్ ముగించుకుని అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారమవుతోన్న సినిమా గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రానికి ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లక్ష్ చదలవాడ ప్రధాన పాత్రలో గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రం రూపొందింది. ఈ చిత్రం జూన్ 24 న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రం హక్కులను ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. గత రెండు వారాల నుంచి […]

The post ఓటీటీ లో దూసుకెళ్తోన్న గ్యాంగ్‌స్టర్ గంగరాజు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రం
  • థియెట్రికల్ రన్ ముగించుకుని అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారమవుతోన్న సినిమా
  • గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రానికి ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన

లక్ష్ చదలవాడ ప్రధాన పాత్రలో గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రం రూపొందింది. ఈ చిత్రం జూన్ 24 న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రం హక్కులను ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. గత రెండు వారాల నుంచి ప్రైమ్ వీడియోలో ప్రదర్శించబడుతోన్న ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన వస్తోంది. మీరు కనుక ఇంకా ఈ చిత్రాన్ని చూడకపోతే, వెంటనే చూసి ఎంజాయ్ చేయండి. గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ నిర్మించింది. ఇషాన్ సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

చిత్ర కథ

జులాయిగా తిరుగుతుండే గంగరాజు (లక్ష్య), ఎస్సై ఉమాదేవి (వేదిక దత్త) తో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ కోసం పరితపిస్తుంటాడు. ఆమె ప్రేమ పొందడం కోసం గంగరాజు చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. ఇక అలా సరదాగా సాగిపోతున్న సమయంలో మన గంగరాజు అనుకోని పరిస్థితుల్లో గ్యాంగ్‌స్టర్ సిద్దప్ప ని హత్య చేసి గ్యాంగ్‌స్టర్ గా అవతరిస్తాడు. దీంతో ఊళ్ళో జనాలంతా మనోడిని గ్యాంగ్‌స్టర్ గంగరాజు అని పిలుస్తుంటారు. తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? ఉమాదేవి ప్రేమను గంగరాజు పొందాడా? అనేది చిత్ర మిగతా కథ.

సినిమా ఎలా ఉంది?

వలయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చక్కటి చిత్రాన్ని అందించిన లక్ష్, విభిన్న కథలను ఎంచుకుంటూ ఆచి తూచి అడుగులేస్తున్నాడు. తాజాగా గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రం తో తన నటనను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు లక్ష్ చదలవాడ. కామెడీ, ఎమోషన్ సీన్స్ లో బాగా చేశాడు. ఇక ఫైట్స్ విషయానికి వస్తే, లక్ష్ కి వంద మార్కులు పడ్డాయి. గంగరాజు కి తండ్రి పాత్రలో గోపరాజు రమణ తన సహజ నటనను తెరపై చూపించారు. ఎమ్మెల్యే నర్సారెడ్డిగా శ్రీకాంత్ అయ్యంగార్ బాగా చేశారు. చరణ్ దీప్, వెన్నెల కిశోర్, నిహార్ కపూర్, రాజేశ్వరి నాయర్, సత్యకృష్ణ, రవితేజ వారి పాత్రల మేరకు నటించారు.

సాంకేతిక బృందం

ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. కణ్ణ పీసీ సినిమాటోగ్రఫర్ గా పని చేశాడు. అనుగోజు రేణుకా బాబు ఎడిటింగ్ చేశాడు. సినిమా యొక్క నిర్మాణ విలువలు బాగున్నాయి. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారమవుతోన్న గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంచి స్పందన వస్తుండటంతో గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రాన్ని హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రం హిందీ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

లేటెస్ట్ ఓటీటీ, స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్ వార్తల కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

The post ఓటీటీ లో దూసుకెళ్తోన్న గ్యాంగ్‌స్టర్ గంగరాజు first appeared on 91Mobiles Telugu.

]]>
నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోన్న Thank You సినిమా https://www.91mobiles.com/telugu/thank-you-movie-streaming-from-today-on-prime-video/ Thu, 11 Aug 2022 14:37:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=1658 హైలైట్స్: నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతోన్న థాంక్యూ ప్రధాన పాత్ర పోషించిన అక్కినేని నాగ చైతన్య, సినిమాకు దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ బాక్సాఫీస్ వద్ద చిత్రానికి నెగటివ్ రివ్యూలు, ఓటీటీ ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో వచ్చిన థాంక్యూ చిత్రం థియెట్రికల్ రన్ ముగించుకుని ఓటీటీ బాట పట్టింది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ […]

The post నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోన్న Thank You సినిమా first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతోన్న థాంక్యూ
  • ప్రధాన పాత్ర పోషించిన అక్కినేని నాగ చైతన్య, సినిమాకు దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్
  • బాక్సాఫీస్ వద్ద చిత్రానికి నెగటివ్ రివ్యూలు, ఓటీటీ ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి

టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో వచ్చిన థాంక్యూ చిత్రం థియెట్రికల్ రన్ ముగించుకుని ఓటీటీ బాట పట్టింది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. కాగా నేటి నుంచి థాంక్యూ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను చూడటం మిస్ అయ్యిన వారు అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ చిత్రాన్ని వీక్షించండి.

థాంక్యూ సినిమాతో జులై నెల్లో థియేటర్లలోకి వచ్చాడు యంగ్ హీరో నాగ చైతన్య. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో చైతన్యకు భారీ ఓటమి తప్పలేదు. దాంతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి భారీ నష్టాలు వచ్చాయి. దీంతో జులై లో టాలీవుడ్ సినిమాల అపజయాల పరంపర కొనసాగింది.

చిత్ర తారాగణం:

ఈ చిత్రంలో నాగచైతన్యకు జంటగా రాశీఖన్నా నటించింది. తమన్ సంగీతం సమకూర్చాడు. మాళవికా నాయర్, సాయి సుశాంత్ రెడ్డి, అవికా గోర్ కీలక పాత్రలు పోషించారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇదివరకు విక్రమ్ కుమార్, నాగ చైతన్య కలిసి మనం అనే సినిమా చేశారు. మనం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అదే నమ్మకంతో నాగ చైతన్య, విక్రమ్ కుమార్ కి మరొక అవకాశమిచ్చాడు. కానీ, ఈసారి ఫలితం తలక్రిందులైంది. దీంతో నాగ చైతన్య ఒక మాంచి హిట్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే లాల్ సింగ్ ఛడ్డా తో నాగ చైతన్య మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఆమిర్ ఖాన్ ఇందులో ప్రధాన పాత్రధారి. కాగా, నాగచైతన్య, బాలరాజు అనే కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రం యొక్క ఫలితం పాజిటివ్ గా వస్తే, నాగ చైతన్యకు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశముంది. నేరుగా అక్కడ సినిమాలు చేసేందుకు ఇదొక బెస్ట్ చాన్స్ అని చెప్పవచ్చు. చివరగా నాగ చైతన్య, బంగార్రాజు సినిమాతో హిట్ కొట్టాడు.

ఆగస్టులో రెండు హిట్స్ కొట్టిన టాలీవుడ్

నితిన్ మాచర్ల నియోజకవర్గం, నిఖిల్ కార్తికేయ 2 చిత్రాలపై ఇప్పటికే మాంచి బజ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమాలు కచ్చితంగా హిట్ కొడతాయని విశ్లేషకులు, ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. కాగా, ఇటీవల వచ్చిన కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార, దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం చిత్రాలు హిట్ టాక్ తో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నాయి. బింబిసార చిత్రం చారిత్రక నేపథ్యంతో పాటు, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా కాగా, సీతారామం ఒక క్లాసిక్ లవ్ స్టోరీ. ఏదేమైనా, విభిన్న జోనర్లలో వచ్చిన ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం శుభపరిణామం.

మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్‌సైట్ ని విజిట్ చేయండి.

The post నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోన్న Thank You సినిమా first appeared on 91Mobiles Telugu.

]]>