హైలైట్స్
- అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, ఆహా, నెట్‌ఫ్లిక్స్ లలో స్ట్రీమ్ కానున్న పలు తెలుగు సినిమాలు
- ఓటీటీ ఆడియన్స్ ని పలకరించనున్న నితిన్ మాచర్ల నియోజకవర్గం, అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో, యశోద చిత్రాలు
- సోని లివ్ లో అందుబాటులో ఉన్న లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమా

శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రేమికులకు పండగేనని చెప్పాలి. ఎందుకంటే ఇదే రోజున ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇటీవలి కాలంలో, ఓటీటీల ప్రభావం కూడా చాలా పెరిగింది. దీంతో థియేటర్లలో సినిమాలను మిస్ అయ్యే వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఒకేసారి 4 సినిమాలు ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేశాయి. ఆ సినిమాలేంటో తెలుసుకుందాం పదండి.
1.మాచర్ల నియోజకవర్గం
2.యశోద
3.ఊర్వశివో రాక్షసివో
4.లైక్-షేర్ & సబ్‌స్క్రైబ్
1.మాచర్ల నియోజకవర్గం
నితిన్, కృతిశెట్టి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నితిన్ కలెక్టర్ గా కనిపించారు. పొలిటికల్ త్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో పర్వాలేదనిపించింది. అయితే కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. మరి ఓటీటీ ఆడియన్స్ ని అయినా మెప్పిస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రం జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.
2.యశోద
సమంతా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఇటీవలె థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓపెనింగ్స్ బాగానే రాబట్టినప్పటికీ, తర్వాత అదే ఊపుని కొనసాగించలేకపోయింది. దీంతో త్వరగానే థియేటర్ల నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. సమంతా ఈ చిత్రంలో పోరాట సన్నివేశాల్లో కూడా నటించి మెప్పించింది. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, దివ్య శ్రీపాద ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హరి-హరీశ్ దర్శకత్వం వహించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శివలెంక కే ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.
3.ఊర్వశివో రాక్షసివో
ఈ చిత్రంలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలు పోషించారు. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేటి నుంచి ఆహా ఓటీటీ తో పాటు, నెట్‌ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమ్ అవుతోంది. వివాహం గొప్పదా లేక లివ్-ఇన్ రిలేషన్షిప్ బెటరా? అనే విషయాన్ని ఈ చిత్రంలో చర్చించారు.
4.లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్
ఈ చిత్రంలో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, సుదర్శన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సోనిలివ్ ఓటీటీ లో అందుబాటులో ఉంది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాము తూము ఎడిటింగ్ చేశాడు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
మరింకేంటి, ఈ 4 తెలుగు సినిమాలని చూసేసి ఈ వీకెండ్ ని బాగా ఎంజాయ్ చేయండి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.















