Annual plans - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 28 Mar 2024 10:50:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Airtel: త్వరలో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెరిగే అవకాశం, 365 రోజుల వ్యాలిడిటీ గల ఈ రీచార్జ్ ప్లాన్స్ చెక్ చేయండి! https://www.91mobiles.com/telugu/airtel-prepaid-plans-prices-to-be-hiked-check-1-year-validity-plans/ Thu, 28 Mar 2024 10:49:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=10875 భారతదేశంలో టెలీకామ్ ఆపరేటర్లు త్వరలో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దిగ్గజ టెలీకామ్ ఆపరేట్ అయిన AIRTEL కూడా త్వరలో ప్లాన్ల ధరలు పెంచనుందని ఇప్పటికే స్పష్టమైంది. 2024 ఎన్నికల తర్వాత ఈ ధరల పెంపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి, ధరలు పెరిగాక బాధపడే బదులు, ఇప్పుడు తెలివిగా ఏడాది ప్లాన్‌ని ఎంచుకుని రీచార్జ్ చేసుకుంటే డబ్బుల్ని మిగిల్చుకునే అవకాశం ఉంటుంది. సరే, ఓసారి Airtel అందిస్తోన్న ఏడాది రీచార్జ్ ప్లాన్స్ ఏవో […]

The post Airtel: త్వరలో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెరిగే అవకాశం, 365 రోజుల వ్యాలిడిటీ గల ఈ రీచార్జ్ ప్లాన్స్ చెక్ చేయండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో పెరగనున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు
  • ఇప్పుడే 12 నెలల రీచార్జ్ చేసుకుంటే లాభం
  • ఏడాది ప్లాన్స్ ఆఫర్ చేస్తోన్న ఎయిర్టెల్

భారతదేశంలో టెలీకామ్ ఆపరేటర్లు త్వరలో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దిగ్గజ టెలీకామ్ ఆపరేట్ అయిన AIRTEL కూడా త్వరలో ప్లాన్ల ధరలు పెంచనుందని ఇప్పటికే స్పష్టమైంది. 2024 ఎన్నికల తర్వాత ఈ ధరల పెంపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి, ధరలు పెరిగాక బాధపడే బదులు, ఇప్పుడు తెలివిగా ఏడాది ప్లాన్‌ని ఎంచుకుని రీచార్జ్ చేసుకుంటే డబ్బుల్ని మిగిల్చుకునే అవకాశం ఉంటుంది. సరే, ఓసారి Airtel అందిస్తోన్న ఏడాది రీచార్జ్ ప్లాన్స్ ఏవో తెలుసుకుందాం పదండి.

365 రోజుల వ్యాలిడిటీ అందించే Airtel ప్రీపెయిడ్ ప్లాన్స్

Airtel రూ.1,799 రీచార్జ్ ప్లాన్: ఎయిర్టెల్ అందిస్తోన్న ఏడాది వ్యాలిడిటీ గల ప్లాన్ ఇది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ కి 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ ద్వారా 3,600 ఎస్ఎంఎస్‌లు, 24జిబి డేటా, ఉచిత వాయిస్ కాల్స్ ప్రయోజనాలు లభిస్తాయి. ఇంకా వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్స్, అపోలో 24*7 సర్కిల్ మరియు ఫాస్టాగ్ పై రూ.150 క్యాష్‌బ్యాక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

Airtel రూ.2,999 రీచార్జ్ ప్లాన్: Airtel అందిస్తోన్న మరొక ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ ఇది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్‌కి డెయిలీ 2జిబి డేటా, ఉచిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్‌‌లు, ఉచిత హలోట్యూన్స్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

Airtel రూ.3,359 రీచార్జ్ ప్లాన్: ఎయిర్టెల్ అందిస్తోన్న ఏడాది వ్యాలిడిటీ గల మరో ప్లాన్ ఇది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్‌కి 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా డెయిలీ 2.5జిబి డేటా, ఉచిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఏడాది కాలపరిమితితో లభిస్తుంది. అలాగే వింక్ మ్యూజిక్ యాప్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

ఐపీఎల్ 2024 ప్రారంభంతో దేశంలో డేటా వినియోగం చాలా పెరిగింది. ఇంకా ఈ టోర్నీ కొనసాగినన్ని రోజులు కూడా వినియోగదారులు డేటాని పెద్దమొత్తంలో వాడుతారు. దీంతో యూజర్లు ఎక్కువ డేటా కోసం ప్లాన్స్ ని కొనాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎన్నికల తర్వాత ప్లాన్స్ ధరల పెంపు ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఏకంగా 15% ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎయిర్టెల్ సంస్థ త్వరలోనే ధరల పెంపు ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇప్పటికే హింట్ ఇచ్చిన ఎయిర్టెల్ అధినేత

భారతి ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. భారత్ లో టెలీకామ్ సేవల ధరలు పెరుగుతాయని ఆయన అన్నారు. అయితే ఎప్పుడు, ఎంత పెంపు ఉంటుందని వెల్లడించలేదు. భారత్ లో ప్రస్తుతం ఎయిర్టెల్ రెండో అతిపెద్ద టెలీకామ్ ఆపరేటర్ గా కొనసాగుతోంది.

The post Airtel: త్వరలో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెరిగే అవకాశం, 365 రోజుల వ్యాలిడిటీ గల ఈ రీచార్జ్ ప్లాన్స్ చెక్ చేయండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Jio Annual Plans: ఏడాది వ్యాలిడిటీ అందించే Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ https://www.91mobiles.com/telugu/jio-annual-recharge-plans-benefits/ Mon, 14 Aug 2023 16:56:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=7599 భారతదేశంలో ఉన్న టెలీకామ్ సంస్థల్లో అగ్ర స్థానంలో ఉంది రిలయన్స్ జియో. ఈ కంపెనీకి ఎయిర్టెల్ సంస్థ గట్టి పోటీనిస్తోంది. మూడో స్థానంలో ఉన్న వొడాఫోన్ ఐడియా మార్కెట్ లో నిలబడేందుకు బాగా శ్రమిస్తోంది. ఇక ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీతో 4జీ కి అప్‌గ్రేడ్ అవుతోంది. టీసీఎస్ సంస్థ సహకారంతో 4జీ, 5జీ నెట్వర్క్ ల ఏర్పాటు దిశగా బీఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తోంది. ఇక జియో సంస్థ అన్ని రకాల […]

The post Jio Annual Plans: ఏడాది వ్యాలిడిటీ అందించే Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>

భారతదేశంలో ఉన్న టెలీకామ్ సంస్థల్లో అగ్ర స్థానంలో ఉంది రిలయన్స్ జియో. ఈ కంపెనీకి ఎయిర్టెల్ సంస్థ గట్టి పోటీనిస్తోంది. మూడో స్థానంలో ఉన్న వొడాఫోన్ ఐడియా మార్కెట్ లో నిలబడేందుకు బాగా శ్రమిస్తోంది. ఇక ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీతో 4జీ కి అప్‌గ్రేడ్ అవుతోంది. టీసీఎస్ సంస్థ సహకారంతో 4జీ, 5జీ నెట్వర్క్ ల ఏర్పాటు దిశగా బీఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తోంది.

ఇక జియో సంస్థ అన్ని రకాల బడ్జెట్ శ్రేణుల్లో వివిధ ప్లాన్స్ ని ఆఫర్ చేస్తోంది. అయితే అధిక వ్యాలిడిటీ అందించే ప్లాన్స్ కి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మరి జియో వద్ద కూడా అటువంటి ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. అవి ఏడాది పాటు వ్యాలిడిటీ అందిస్తాయి. సరే, ఆ ప్లాన్స్ వివరాలను మీకోసం అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Jio అందిస్తోన్న ఏడాది వ్యాలిడిటీ గల ప్రీపెయిడ్ ప్లాన్స్

  • రూ.2999 ఇండిపెండెన్స్ ఆఫర్
  • రూ.2545 ప్రీపెయిడ్ ప్లాన్

రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ కి 365 రోజుల వ్యాలిడిటీ, 2.5జిబి డెయిలీ డేటా లభిస్తుంది. ఇంకా అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. అలాగే ఈ ప్లాన్ ద్వారా జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

రూ.2,999 అదనపు ప్రయోజనాలు

  • రూ.249 విలువగల స్విగ్గీ ఆర్డర్స్ పై రూ.100 డిస్కౌంట్
  • యాత్ర ద్వారా చేసే ఫ్లైట్ బుకింగ్స్ పై రూ.1,500 వరకు తగ్గింపు
  • యాత్ర ద్వారా చేసే డొమెస్టిక్ హోటల్ బుకింగ్ పై 15 శాతం డిస్కౌంట్
  • అజియో లో రూ.999 పైబడి కొనుగోలు చేసే ఎంపిక చేయబడిన ప్రొడక్ట్స్ పై రూ.200 డిస్కౌంట్.
  • రిలయన్స్ డిజిటల్ ద్వారా కొనుగోలు చేసే ఎంపిక చేయబడిన ఆడియో ప్రొడక్ట్స్, గృహోపకరణాలపై 10 శాతం డిస్కౌంట్.
  • జియో తీసుకొచ్చిన ఇండిపెండెన్స్ డే రీచార్జ్ ప్యాక్ 2023 ద్వారా కస్టమర్లకు 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
  • ఇంకా ప్రతిరోజూ 2.5జిబి డేటా లభిస్తుంది. ఇంకా అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
  • అధిక వ్యాలిడిటీ, డెయిలీ డేటా కావాలని కోరుకునే వారికి ఈ ప్లన్ బాగా సరిపోతుంది. అలాగే మీరు గనుక టెక్స్ట్ మెసేజెస్ ఎక్కువగా వాడితే రోజూ 100 ఎస్ఎంఎస్ లను ఉపయోగించుకోవచ్చు.

రూ.2545 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • జియో అందిస్తోన్న రూ.2545 రీచార్జ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
  • ఇంకా ఈ ప్లాన్ ద్వారా ప్రతీ రోజూ 1.5జిబి డేటా లభిస్తుంది.
  • అలాగే ఏ నెట్వర్క్ కి అయినా ఉచితంగా కాల్స్ అపరిమితంగా మాట్లాడుకోవచ్చు.
  • ఇంకా డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి.

ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

రూ.2545 ప్లాన్ అదనపు ప్రయోజనాలు

  • జియో తీసుకొచ్చిన రూ.2545 ప్లాన్ ద్వారా కస్టమర్ కి సాధారణ ప్రయోజనాలతో పాటు అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి బెనిఫిట్స్ లభిస్తాయి.
  • ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది.

ఈ ఆర్టికల్ ద్వారా మీకు జియో అందిస్తోన్న యాన్యువల్ ప్లాన్స్ వివరాలను అందించడం జరిగింది. రూ.2999 ప్లాన్ తో పాటు, రూ.2545 ప్లాన్ సమాచారాన్ని, ప్రయోజనాలను తెలుసుకున్నారు కదా? రెండింట్లో మీ బడ్జెట్ కి తగిన ప్లాన్ ఏదో ఎంచుకోండి. అలాగే రీచార్జ్ చేసుకుని బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేయండి.

The post Jio Annual Plans: ఏడాది వ్యాలిడిటీ అందించే Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>