Airtel: త్వరలో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెరిగే అవకాశం, 365 రోజుల వ్యాలిడిటీ గల ఈ రీచార్జ్ ప్లాన్స్ చెక్ చేయండి!

Highlights

  • త్వరలో పెరగనున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు
  • ఇప్పుడే 12 నెలల రీచార్జ్ చేసుకుంటే లాభం
  • ఏడాది ప్లాన్స్ ఆఫర్ చేస్తోన్న ఎయిర్టెల్

భారతదేశంలో టెలీకామ్ ఆపరేటర్లు త్వరలో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దిగ్గజ టెలీకామ్ ఆపరేట్ అయిన AIRTEL కూడా త్వరలో ప్లాన్ల ధరలు పెంచనుందని ఇప్పటికే స్పష్టమైంది. 2024 ఎన్నికల తర్వాత ఈ ధరల పెంపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి, ధరలు పెరిగాక బాధపడే బదులు, ఇప్పుడు తెలివిగా ఏడాది ప్లాన్‌ని ఎంచుకుని రీచార్జ్ చేసుకుంటే డబ్బుల్ని మిగిల్చుకునే అవకాశం ఉంటుంది. సరే, ఓసారి Airtel అందిస్తోన్న ఏడాది రీచార్జ్ ప్లాన్స్ ఏవో తెలుసుకుందాం పదండి.

365 రోజుల వ్యాలిడిటీ అందించే Airtel ప్రీపెయిడ్ ప్లాన్స్

Airtel రూ.1,799 రీచార్జ్ ప్లాన్: ఎయిర్టెల్ అందిస్తోన్న ఏడాది వ్యాలిడిటీ గల ప్లాన్ ఇది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ కి 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ ద్వారా 3,600 ఎస్ఎంఎస్‌లు, 24జిబి డేటా, ఉచిత వాయిస్ కాల్స్ ప్రయోజనాలు లభిస్తాయి. ఇంకా వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్స్, అపోలో 24*7 సర్కిల్ మరియు ఫాస్టాగ్ పై రూ.150 క్యాష్‌బ్యాక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

Airtel రూ.2,999 రీచార్జ్ ప్లాన్: Airtel అందిస్తోన్న మరొక ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ ఇది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్‌కి డెయిలీ 2జిబి డేటా, ఉచిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్‌‌లు, ఉచిత హలోట్యూన్స్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

Airtel రూ.3,359 రీచార్జ్ ప్లాన్: ఎయిర్టెల్ అందిస్తోన్న ఏడాది వ్యాలిడిటీ గల మరో ప్లాన్ ఇది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్‌కి 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా డెయిలీ 2.5జిబి డేటా, ఉచిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఏడాది కాలపరిమితితో లభిస్తుంది. అలాగే వింక్ మ్యూజిక్ యాప్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

ఐపీఎల్ 2024 ప్రారంభంతో దేశంలో డేటా వినియోగం చాలా పెరిగింది. ఇంకా ఈ టోర్నీ కొనసాగినన్ని రోజులు కూడా వినియోగదారులు డేటాని పెద్దమొత్తంలో వాడుతారు. దీంతో యూజర్లు ఎక్కువ డేటా కోసం ప్లాన్స్ ని కొనాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎన్నికల తర్వాత ప్లాన్స్ ధరల పెంపు ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఏకంగా 15% ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎయిర్టెల్ సంస్థ త్వరలోనే ధరల పెంపు ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇప్పటికే హింట్ ఇచ్చిన ఎయిర్టెల్ అధినేత

భారతి ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. భారత్ లో టెలీకామ్ సేవల ధరలు పెరుగుతాయని ఆయన అన్నారు. అయితే ఎప్పుడు, ఎంత పెంపు ఉంటుందని వెల్లడించలేదు. భారత్ లో ప్రస్తుతం ఎయిర్టెల్ రెండో అతిపెద్ద టెలీకామ్ ఆపరేటర్ గా కొనసాగుతోంది.