ASUS ROG Phone 7 Ultimate - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 13 Apr 2023 16:38:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 165హెర్ట్జ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన ASUS ROG Phone 7, ROG Phone 7 Ultimate https://www.91mobiles.com/telugu/asus-rog-phone-7-rog-phone-7-ultimate-launched-india-price-specs-availability/ Thu, 13 Apr 2023 16:38:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=5880 ASUS ROG Phone 7, ASUS ROG Phone 7 Ultimate స్మార్ట్ ఫోన్స్ భారత్ లో లాంచ్ అయ్యాయి. భారత్ తో పాటు ఈ డివైజెస్ తైవాన్, జర్మనీ మరియు యూఎస్ మార్కెట్స్ లో సేల్ కి అందుబాటులో ఉంటాయి. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 165 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి హై-ఎండ్ స్పెసిఫికేషన్స్ తో ASUS ROG Phone 7 సిరీస్ లాంచ్ అయ్యింది. భారత్ […]

The post స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 165హెర్ట్జ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన ASUS ROG Phone 7, ROG Phone 7 Ultimate first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో ASUS ROG Phone 7 సిరీస్ ప్రారంభ ధర రూ.74,999
  • విజయ్ సేల్స్ ద్వారా అమ్మకానికి రానున్న ఫ్లాగ్షిప్ డివైజెస్
  • బ్యాక్ ప్యానెల్ పై పీఎమ్ఓఎల్ఈడీ డిస్ప్లేతో వచ్చిన ROG Phone 7 Ultimate

ASUS ROG Phone 7, ASUS ROG Phone 7 Ultimate స్మార్ట్ ఫోన్స్ భారత్ లో లాంచ్ అయ్యాయి. భారత్ తో పాటు ఈ డివైజెస్ తైవాన్, జర్మనీ మరియు యూఎస్ మార్కెట్స్ లో సేల్ కి అందుబాటులో ఉంటాయి. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 165 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి హై-ఎండ్ స్పెసిఫికేషన్స్ తో ASUS ROG Phone 7 సిరీస్ లాంచ్ అయ్యింది.

భారత్ లో ASUS ROG Phone 7, ASUS ROG Phone 7 Ultimate ధర, లభ్యత

  • ASUS ROG Phone 7 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర రూ.74,999 గా ఉంది.
  • ASUS ROG Phone 7 Ultimate 16జిబి ర్యామ్ మరియు 512జిబి స్టోరేజీ ధర రూ.99,999 గా ఉంది.
  • విజయ్ సేల్స్ (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్) ద్వారా ASUS ROG Phone 7 సిరీస్ 2023 మే నెల నుంచి సేల్ కి అందుబాటులో ఉంటుంది. కచ్చితమైన సేల్ తేదీని ఇంకా ప్రకటించలేదు.

గేమింగ్ కోసం స్పెషల్ గా వచ్చిన ASUS ROG Phone 7

గేమింగ్ ఫీచర్స్

  • గేమ్ కూల్ 7 కూలింగ్ సిస్టమ్: ఆర్ఓజీ ర్యాపిడ్-సైకిల్ వేపర్ చాంబర్ డిజైన్ 2.1 రెట్లు వేడిని నిరోధిస్తుంది. లిక్విడ్ రిటర్న్ చానల్స్ ద్వారా ఇది వేపర్ చాంబర్ కూలింగ్ కంటే సమర్థంగా పని చేస్తుంది.

ఏరో యాక్టివ్ కూలర్ 7

  • ఇంటెగ్రేటెడ్ థర్మోఎలక్ట్రిక్ ఏఐ కూలింగ్ ఫీచర్ ఈ ఫోన్ ఉష్ణోగ్రతను తక్కువ స్థాయిలో ఉంచుతుంది.

గేమ్ఎఫ్ఎక్స్ ఆడియో

  • ASUS ROG Phone 7 లో డైరాక్ ట్యూన్డ్ స్పీకర్ సెటప్ అందించారు. ఇది రెండు 5-మ్యాగ్నెట్ 12*16 సూపర్ లైనర్ స్పీకర్స్ ని కలిగి ఉంది.

ఎయిర్‌ట్రిగ్గర్ సిస్టమ్

  • ఎయిర్‌ట్రిగ్గర్ బటన్ ఆర్ఓజీ ఫోన్ యొక్క హాల్‌మార్క్ అని చెప్పవచ్చు. కొత్త మోడల్ ఇన్విజిబుల్ అల్ట్రాసోనిక్ బటన్స్ మరియు మోషన్ సెన్సర్ ట్రిగ్గర్స్ ని కలిగి ఉంది. మోషన్ కంట్రోల్ జెశ్చర్స్ మరియు సెన్సిటివిటీ లో ఇవి సమర్థవంతంగా పని చేస్తాయి.

ASUS ROG Phone 7 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్
  • 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్

ASUS ROG Phone 7 డివైజ్ 20.4:9 యాస్పెక్ట్ రేషియోలో తయారైంది. ఈ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంది.

ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ

  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్
  • 50ఎంపి రియర్, 32ఎంపి ఫ్రంట్ కెమెరాలు
  • 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 65వాట్ ఫాస్ట్ చార్జింగ్

ASUS ROG Phone 7 లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 740 జీపీయూ వినియోగించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత జెన్ యూఐ మరియు ఆర్ఓజీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళ ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ డివైజ్ లో ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్4.0 టెక్నాలజీ వాడారు.

ASUS ROG Phone 7 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. దీంతో పాటు, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 8ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి కెమెరా ఉంది.

ASUS ROG Phone 7 లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఫాంటమ్ బ్లాక్ మరియు స్టార్మ్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ASUS ROG Phone 7 Ultimate స్పెసిఫికేషన్స్

ASUS ROG Phone 7 Ultimate లో ASUS ROG Phone 7 లో ఉన్న డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. రెండు ఫోన్లలో ఒకే ప్రాసెసర్ వాడారు. ASUS ROG Phone 7 Ultimate డివైజ్ 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో వచ్చింది. ఈ డివైజ్ కూడా ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆర్ఓజీ యూఐ మరియు జెన్ యూఐ పై పని చేస్తుంది. కెమెరా యూనిట్స్ లో ఏ మార్పు లేదు. రెండింట్లో ఒకే విధమైన కెమెరా సెన్సర్స్ ఉన్నాయి.

ASUS ROG Phone 7 Ultimate రియర్ ప్యానెల్ పైన పీఎమ్ఓఎల్ఈడీ డిస్ప్లే తో వచ్చింది. బ్యాటరీ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే రెండు ఫోన్లలో ఒకే విధంగా ఉన్నాయి.

ASUS ROG Phone 7 Ultimate స్టార్మ్ వైట్ సింగిల్ కలర్ ఆప్షన్ లో అందుబాటులో ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 165హెర్ట్జ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన ASUS ROG Phone 7, ROG Phone 7 Ultimate first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన ASUS ROG Phone 7 స్పెసిఫికేషన్స్; ఏప్రిల్ 13 న భారత్ లో లాంచ్! https://www.91mobiles.com/telugu/asus-rog-phone-7-specs-leaked-before-launch/ Mon, 27 Mar 2023 14:54:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=5598 ఆసుస్ సంస్థ త్వరలో భారత్ లో ASUS ROG Phone 7 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ASUS ROG Phone 7 డివైజ్ ఏప్రిల్ 13 న లాంచ్ అవుతుందని ఆసుస్ సంస్థ రీసెంట్ గా అఫీషియల్ గా ప్రకటించింది. అయితే, ASUS ROG Phone 7 సిరీస్ లో వచ్చే వర్షన్ ఏంటో తెలపలేదు. కొత్త ROG సిరీస్ లో వచ్చే అవకాశం ఉన్న వర్షన్స్, వాటి ఫీచర్స్ కి సంబంధించిన వివరాలు తాజా […]

The post లీకైన ASUS ROG Phone 7 స్పెసిఫికేషన్స్; ఏప్రిల్ 13 న భారత్ లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ 13 న భారత్ లో లాంచ్ కానున్న ASUS ROG Phone 7
  • ASUS ROG Phone 7 Ultimate కూడా లాంచ్ అవుతుందని అంచనా
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, 16జిబి ర్యామ్ తో రానున్న ASUS ROG Phone 7 సిరీస్

ఆసుస్ సంస్థ త్వరలో భారత్ లో ASUS ROG Phone 7 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ASUS ROG Phone 7 డివైజ్ ఏప్రిల్ 13 న లాంచ్ అవుతుందని ఆసుస్ సంస్థ రీసెంట్ గా అఫీషియల్ గా ప్రకటించింది. అయితే, ASUS ROG Phone 7 సిరీస్ లో వచ్చే వర్షన్ ఏంటో తెలపలేదు. కొత్త ROG సిరీస్ లో వచ్చే అవకాశం ఉన్న వర్షన్స్, వాటి ఫీచర్స్ కి సంబంధించిన వివరాలు తాజా లీక్ ద్వారా బయటకు వచ్చాయి. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ట్విట్టర్ ద్వారా ఈ వివరాలను రివీల్ చేశాడు.

ASUS ROG Phone 7 సిరీస్ లో రానున్న 2 ఫోన్లు

లీకైన రిపోర్ట్ ప్రకారం, ASUS ROG Phone 7 సిరీస్ లో రెండు డివైజెస్ ఉండనున్నాయి. అవి: ASUS ROG Phone 7 మరియు ASUS ROG Phone 7 Ultimate. రిపోర్ట్ ని బట్టి, ఈసారి ASUS ROG Phone 7 Pro ని ఈసారి స్కిప్ చేయాలని ఆసుస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సరే, ఓసారి ASUS ROG Phone 7 సిరీస్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

ఆసుస్ ఇండియా తన కొత్త ఆర్ఓజీ సిరీస్ ని పరిచయం చేసేందుకు రెడీ అయ్యింది. ASUS ROG Phone 7 సిరీస్ ని ఏప్రిల్ 13 న లాంచ్ చేయనున్నామని కంపెనీ రీసెంట్ గా ప్రకటించింది. తాజాగా వచ్చిన లీక్ ద్వారా ASUS ROG Phone 7 సిరీస్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. అవెలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

ASUS ROG Phone 7 స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ట్వీట్ ప్రకారం, ASUS ROG Phone 7 సిరీస్ లో రెండు గేమింగ్ ఫోన్లు రానున్నాయి. అవి: ASUS ROG Phone 7 మరియు ASUS ROG Phone 7 Ultimate. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో ఈ ఫోన్లు రానున్నట్లు సమాచారం. ఓవర్ క్లాక్డ్ వర్షన్ కి బదులుగా ఈ చిప్సెట్ 3.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది.

ASUS ROG Phone 7 సిరీస్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని టిప్ స్టర్ రివీల్ చేశాడు. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 8ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 173 ఎంఎం పొడవు, 77 ఎంఎం వెడల్పు, 10.3 ఎంఎం మందం, 239 గ్రాముల బరువు ఉంటుంది.

ASUS ROG Phone 7 Ultimate డివైజ్ 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో రానుంది. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ కలిగిన మరొక వర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇకపోతే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

గత రిపోర్ట్స్ ప్రకారం, ASUS ROG Phone 7 సిరీస్ 6.8-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నట్లు సమాచారం. ఇది 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు తెలుస్తోంది. ASUS ROG Phone 7 లైనప్ ఏప్రిల్ 13 న లాంచ్ అవుతోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన ASUS ROG Phone 7 స్పెసిఫికేషన్స్; ఏప్రిల్ 13 న భారత్ లో లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>