
ASUS ROG Phone 7, ASUS ROG Phone 7 Ultimate స్మార్ట్ ఫోన్స్ భారత్ లో లాంచ్ అయ్యాయి. భారత్ తో పాటు ఈ డివైజెస్ తైవాన్, జర్మనీ మరియు యూఎస్ మార్కెట్స్ లో సేల్ కి అందుబాటులో ఉంటాయి. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 165 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి హై-ఎండ్ స్పెసిఫికేషన్స్ తో ASUS ROG Phone 7 సిరీస్ లాంచ్ అయ్యింది.
భారత్ లో ASUS ROG Phone 7, ASUS ROG Phone 7 Ultimate ధర, లభ్యత
- ASUS ROG Phone 7 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర రూ.74,999 గా ఉంది.
- ASUS ROG Phone 7 Ultimate 16జిబి ర్యామ్ మరియు 512జిబి స్టోరేజీ ధర రూ.99,999 గా ఉంది.
- విజయ్ సేల్స్ (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్) ద్వారా ASUS ROG Phone 7 సిరీస్ 2023 మే నెల నుంచి సేల్ కి అందుబాటులో ఉంటుంది. కచ్చితమైన సేల్ తేదీని ఇంకా ప్రకటించలేదు.
గేమింగ్ కోసం స్పెషల్ గా వచ్చిన ASUS ROG Phone 7
గేమింగ్ ఫీచర్స్
- గేమ్ కూల్ 7 కూలింగ్ సిస్టమ్: ఆర్ఓజీ ర్యాపిడ్-సైకిల్ వేపర్ చాంబర్ డిజైన్ 2.1 రెట్లు వేడిని నిరోధిస్తుంది. లిక్విడ్ రిటర్న్ చానల్స్ ద్వారా ఇది వేపర్ చాంబర్ కూలింగ్ కంటే సమర్థంగా పని చేస్తుంది.
ఏరో యాక్టివ్ కూలర్ 7
- ఇంటెగ్రేటెడ్ థర్మోఎలక్ట్రిక్ ఏఐ కూలింగ్ ఫీచర్ ఈ ఫోన్ ఉష్ణోగ్రతను తక్కువ స్థాయిలో ఉంచుతుంది.
గేమ్ఎఫ్ఎక్స్ ఆడియో
- ASUS ROG Phone 7 లో డైరాక్ ట్యూన్డ్ స్పీకర్ సెటప్ అందించారు. ఇది రెండు 5-మ్యాగ్నెట్ 12*16 సూపర్ లైనర్ స్పీకర్స్ ని కలిగి ఉంది.
ఎయిర్‌ట్రిగ్గర్ సిస్టమ్
- ఎయిర్‌ట్రిగ్గర్ బటన్ ఆర్ఓజీ ఫోన్ యొక్క హాల్‌మార్క్ అని చెప్పవచ్చు. కొత్త మోడల్ ఇన్విజిబుల్ అల్ట్రాసోనిక్ బటన్స్ మరియు మోషన్ సెన్సర్ ట్రిగ్గర్స్ ని కలిగి ఉంది. మోషన్ కంట్రోల్ జెశ్చర్స్ మరియు సెన్సిటివిటీ లో ఇవి సమర్థవంతంగా పని చేస్తాయి.
ASUS ROG Phone 7 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
- 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్
- 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్
ASUS ROG Phone 7 డివైజ్ 20.4:9 యాస్పెక్ట్ రేషియోలో తయారైంది. ఈ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంది.
ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ
- స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్
- 50ఎంపి రియర్, 32ఎంపి ఫ్రంట్ కెమెరాలు
- 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 65వాట్ ఫాస్ట్ చార్జింగ్
ASUS ROG Phone 7 లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 740 జీపీయూ వినియోగించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత జెన్ యూఐ మరియు ఆర్ఓజీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళ ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ డివైజ్ లో ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్4.0 టెక్నాలజీ వాడారు.
ASUS ROG Phone 7 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. దీంతో పాటు, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 8ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి కెమెరా ఉంది.
ASUS ROG Phone 7 లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఫాంటమ్ బ్లాక్ మరియు స్టార్మ్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
ASUS ROG Phone 7 Ultimate స్పెసిఫికేషన్స్
ASUS ROG Phone 7 Ultimate లో ASUS ROG Phone 7 లో ఉన్న డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. రెండు ఫోన్లలో ఒకే ప్రాసెసర్ వాడారు. ASUS ROG Phone 7 Ultimate డివైజ్ 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో వచ్చింది. ఈ డివైజ్ కూడా ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆర్ఓజీ యూఐ మరియు జెన్ యూఐ పై పని చేస్తుంది. కెమెరా యూనిట్స్ లో ఏ మార్పు లేదు. రెండింట్లో ఒకే విధమైన కెమెరా సెన్సర్స్ ఉన్నాయి.
ASUS ROG Phone 7 Ultimate రియర్ ప్యానెల్ పైన పీఎమ్ఓఎల్ఈడీ డిస్ప్లే తో వచ్చింది. బ్యాటరీ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే రెండు ఫోన్లలో ఒకే విధంగా ఉన్నాయి.
ASUS ROG Phone 7 Ultimate స్టార్మ్ వైట్ సింగిల్ కలర్ ఆప్షన్ లో అందుబాటులో ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











