Asus Zenfone 9 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 29 Jul 2022 10:59:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ASUS Zenfone 9 లాంచ్: గింబల్-లైక్ కెమెరా, కాంపాక్ట్ సైజ్ తో అదిరిపోయిన లుక్ https://www.91mobiles.com/telugu/asus-zenfone9-launched-specs-price/ Fri, 29 Jul 2022 10:59:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=1368 హైలైట్స్: తైవాన్, హాంగ్ కాంగ్, యూరోప్ లోని కొన్ని దేశాల్లో లాంచ్ అయిన ఆసుస్ జెన్‌ఫోన్ 9 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 4,300ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 120హెర్ట్జ్ ఓఎల్ఈడీ ప్యానెల్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు ఆసుస్ జెన్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర 799 యూరోలు (దాదాపు రూ.64,700) ఆసుస్ నుంచి వస్తున్న తదుపరి కాంపాక్ట్ సైజ్ స్మార్ట్ ఫోన్ ఆసుస్ జెన్‌ఫోన్ 9. గతేడాది ఆసుస్ నుంచి […]

The post ASUS Zenfone 9 లాంచ్: గింబల్-లైక్ కెమెరా, కాంపాక్ట్ సైజ్ తో అదిరిపోయిన లుక్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • తైవాన్, హాంగ్ కాంగ్, యూరోప్ లోని కొన్ని దేశాల్లో లాంచ్ అయిన ఆసుస్ జెన్‌ఫోన్ 9
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 4,300ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 120హెర్ట్జ్ ఓఎల్ఈడీ ప్యానెల్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • ఆసుస్ జెన్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర 799 యూరోలు (దాదాపు రూ.64,700)

ఆసుస్ నుంచి వస్తున్న తదుపరి కాంపాక్ట్ సైజ్ స్మార్ట్ ఫోన్ ఆసుస్ జెన్‌ఫోన్ 9. గతేడాది ఆసుస్ నుంచి వచ్చిన ఆసుస్ జెన్‌ఫోన్ 8 కంటే ఈ ఫోన్ ఎంతో చిన్నదిగా కనిపిస్తోంది. అయితే జెన్‌ఫోన్ 8 కంటే జెన్‌ఫోన్ 9 లో ఫీచర్లు అధికంగా ఉన్నాయి. జెన్‌ఫోన్ 9 బ్యాక్ ప్యానెల్ ప్లాస్టిక్ తో తయారవ్వగా, ఫ్రేమ్ అల్యూమినియమ్ తో వస్తోంది. ముందువైపున గొరిల్లా గ్లాస్ విక్టస్ తో భద్రతను కల్పించారు. ఇక సెల్ఫీ షూటర్ కోసం ఫోన్ పైన ఎడమవైపున పంచ్-హోల్ కెమెరాను అందించారు. ఫ్లాగ్ షిప్ ఫోన్లలో ఈమధ్య కాలంలో మనకు కనిపించనిది ఏదైనా ఉందంటే టక్కున గుర్తొచ్చేది 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్. అయితే ఈ ఫోన్ లో ఆ ఫీచర్ ను అందించడం విశేషం.

క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ చిప్, అధిక బ్యాటరీ కెపాసిటీ వెరసి ఆసుస్ జెన్‌ఫోన్ 9, జెన్‌ఫోన్ 8 కంటే బెటర్ గా కనిపిస్తోంది. ఇక ఆసుస్ జెన్‌ఫోన్ 9 తీసుకొస్తున్న అతిపెద్ద ఫీచర్ ఏంటంటే, వావ్ అనిపించే గింబల్-లైక్ కెమెరా స్టెబిలైజేషన్. మామూలు లెన్స్ తో పోలిస్తే ఇది ఎన్నో రెట్లు మెరుగైన రిజల్ట్స్ ని రాబడుతుంది.

ASUS Zenfone 9 ధర, లభ్యత

ఆసుస్ జెన్‌ఫోన్ 9 8జిబి+128జిబి వేరియంట్ ధర 799 యూరోలు (దాదాపు రూ.64,700), 8జిబి+256జిబి వేరియంట్ ధర 849 యూరోలు (దాదాపు రూ.68,700), 16జిబి+256జిబి యూనిట్ ధర 899 యూరోలు (దాదాపు రూ.72,700). భారత్ లో ఆసుస్ జెన్‌ఫోన్ 9 లాంచ్ అయ్యాక ధరల్లో మార్పులు ఉండే అవకాశముంది.

తొలుత ఆసుస్ కంపెనీ తైవాన్, హాంగ్ కాంగ్, యూరోప్ లోని పలు దేశాలకు జెన్‌ఫోన్ 9 ని డెలివరీ చేయనుంది. తర్వాత మిగతా దేశాల్లో ఫోన్ ని అమ్మనుంది (via). ఆసక్తిగల కొనుగోలుదారులు ఆసుస్ జెన్‌ఫోన్ 9 ని మిడ్‌నైట్ బ్లాక్, స్టారీ బ్లూ, సన్‌సెట్ రెడ్, మూన్‌లైట్ వైట్ అనే నాలుగు రంగుల ఆప్షన్స్ నుంచి ఎంపిక చేసుకోవచ్చు.

ASUS Zenfone 9 స్పెసిఫికేషన్స్

అద్భుతమైన స్పెసిఫికేషన్స్ కలిగిన ఒక చిన్న ఫోన్ ఆసుస్ జెన్‌ఫోన్ 9. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఇందులో మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమొరీని పెంచుకోలేము. 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్లో ఉన్నాయి.

5.9 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, హెచ్డీఆర్10+ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 800 నిట్స్ బ్రైట్నెస్ ఆసుస్ జెన్‌ఫోన్ 9 లో ఉన్నాయి. పటిష్టతకై, ఆసుస్ జెన్‌ఫోన్ 9 డిస్ప్లే కు గొరిల్లా గ్లాస్ విక్టస్ తో రక్షణ కల్పించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత జెన్‌యూఐ కస్టమ్ స్కిన్ తో ఆసుస్ జెన్‌ఫోన్ 9 పని చేస్తుంది. ఇక ఆసుస్ జెన్‌ఫోన్ 9 రెండు ఆండ్రాయిడ్ అప్డేట్స్, రెండేళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ను పొందుతుంది.

  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్
  • 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ
  • 4,300ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
  • 5.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ 120 హెర్ట్జ్ డిస్ప్లే
  • ఆండ్రాయిడ్ 12-ఆధారిత జెన్‌యూఐ కస్టమ్ స్కిన్
  • 50ఎంపి + 12ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా
  • 12ఎంపి ఫ్రంట్ కెమెరా

ఆసుస్ జెన్‌ఫోన్ 9 లో 50ఎంపి ఐఎంఎక్స్766 ప్రైమరీ లెన్స్, 12ఎంపి ఐఎంఎక్స్363 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ఐఎంఎక్స్663 ఫ్రంట్ కెమెరా ఉంది. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, గేమ్ జీనీ మోడ్, ఐపీ68 సర్టిఫికేషన్ వంటి ఫీచర్లు ఆసుస్ జెన్‌ఫోన్ 9 లో ఉన్నాయి.

The post ASUS Zenfone 9 లాంచ్: గింబల్-లైక్ కెమెరా, కాంపాక్ట్ సైజ్ తో అదిరిపోయిన లుక్ first appeared on 91Mobiles Telugu.

]]>
అనుకోకుండా లీకైన Asus Zenfone 9 ప్రోమో వీడియో https://www.91mobiles.com/telugu/asus-zenfone9-promo-video-leaked-specifications-out-compact-design-gimbal-camera/ Fri, 08 Jul 2022 08:26:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=846 హైలైట్స్: * ఆసుస్ జెన్ ఫోన్ 9 ప్రమోషనల్ వీడియోను పొరబాటున పోస్ట్ చేసిన ఆసుస్ కంపెనీ * వెనుక రెండు కెమెరాలు, పంచ్-హోల్ కటౌట్, స్మార్ట్ స్లైడర్ కీ, సైడ్ మౌంటెడ్-ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తున్న జెన్ ఫోన్ 9 * 5.9 అంగుళాల డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1, 50ఎంపి డ్యూయల్-కెమెరాలు, 120Hz అమోలెడ్ డిస్ప్లే తో వస్తున్న ఆసుస్ జెన్ ఫోన్ 9 గతేడాది లాంచ్ అయిన ఆసుస్ […]

The post అనుకోకుండా లీకైన Asus Zenfone 9 ప్రోమో వీడియో first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* ఆసుస్ జెన్ ఫోన్ 9 ప్రమోషనల్ వీడియోను పొరబాటున పోస్ట్ చేసిన ఆసుస్ కంపెనీ

* వెనుక రెండు కెమెరాలు, పంచ్-హోల్ కటౌట్, స్మార్ట్ స్లైడర్ కీ, సైడ్ మౌంటెడ్-ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తున్న జెన్ ఫోన్ 9

* 5.9 అంగుళాల డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1, 50ఎంపి డ్యూయల్-కెమెరాలు, 120Hz అమోలెడ్ డిస్ప్లే తో వస్తున్న ఆసుస్ జెన్ ఫోన్ 9

గతేడాది లాంచ్ అయిన ఆసుస్ 8 ఫోన్ కి సక్సెసర్ గా Zenfone 9 ని లాంచ్ చేసేందుకు ఆసుస్ కంపెనీ సిద్దమవుతోంది. ఇదీ కూడా, Asus 8Z ని భారత్ లో లాంచ్ చేసిన కొన్ని వారాల వ్యవధిలోనే వస్తుండటం విశేషం. ఆసుస్ నుంచి ప్రకటన కోసం అంతా ఎదురు చూస్తున్న తరుణంలో, ఆసుస్ పొరబాటున జెన్ ఫోన్ 9 యొక్క ప్రోమో వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఫోన్ యొక్క పూర్తి డిజైన్, స్పెసిఫికేషన్స్ కనిపిస్తున్నాయి. జెన్ ఫోన్ 9 నలుపు, తెలుపు, ఎరుపు, నీలం రంగుల్లో లభ్యం కానుంది. గతేడాది వచ్చిన ఆసుస్ 8జెడ్ ఫోన్ మాదిరిగానే జెన్ ఫోన్ 9 కూడా ఫ్లాగ్ షిప్ కేటగిరీకి చెందిన, కాంపాక్ట్ డిజైన్ తో వస్తోంది.

ప్రమోషనల్ వీడియో ఆన్ లైన్ లో లీకవ్వడంతో, ఫోన్ లాంచ్ కూడా దగ్గర్లోనే ఉండనుందని తెలుస్తోంది. జెన్ ఫోన్ 8 జెడ్ లాగా కాకుండా, నాన్చకుండా ఆసుస్ జెన్ ఫోన్ 9 ని త్వరగానే లాంచ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇక Asus 8Z Flip ఫోన్ కి సక్సెసర్ ని తీసుకొచ్చే అవకాశం ఉందో లేదో ఇంకా తెలియదు.

ఆసుస్ జెన్ ఫోన్ 9 డిజైన్ (Asus Zenfone 9 design)

ఫస్ట్ లుక్ ని బట్టి ఆసుస్ జెన్ ఫోన్ 9 కాంపాక్ట్ ఫోన్ అని స్పష్టమవుతోంది. ఈ ఫోన్ కి టాప్ లెఫ్ట్ కార్నర్ లో పంచ్ హోల్ లో కెమెరా ఉంది. అలాగే సన్నని బెజెల్స్ కనిపిస్తున్నాయి. వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్మార్ట్ స్లైడ్ కీ కుడివైపున ఉన్నాయి. 3.5 ఎంఎం ఆడియో జాక్, సెకండరీ మైక్రోఫోన్ పైభాగాన ఉన్నాయి. స్పీకర్ గ్రిల్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ క్రింద భాగాన ఉన్నాయి.

ఇక బ్యాక్ ప్యానెల్ విషయానికి వస్తే, రెండు భారీ డ్యూయల్ కెమెరా సెన్సర్లు, ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తున్నాయి. 50ఎంపి గింబల్ స్టెబిలైజేషన్, 9 అని కనిపించేలా ప్యానెల్ పై డిజైన్ ఉంది.

ఆసుస్ జెన్ ఫోన్ 9 స్పెసిఫికేషన్స్ (Asus Zenfone 9 Specifications)

ఆసుస్ జెన్ ఫోన్ 9 ఫోన్లో 5.9 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, స్లిప్ బెజెల్స్ ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ను కలిగి ఉంది. వీడియోని బట్టి ఈ ఫోన్ 4,300mAh బ్యాటరీని కలిగి ఉన్నట్లు అర్థమవుతోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఎలాగూ ఉంటుందనుకోండి. ఇంకా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, నోటిఫికేషన్ ఎల్ఈడీ, సరికొత్త స్మార్ట్ స్లైడర్ కీ వంటివి ఉన్నాయి.

ఆసుస్ జెన్ ఫోన్ 9 లో కెమెరా విభాగాన్ని పటిష్టం చేసినట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్లో 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్ తో పాటు 6-యాక్సిస్ హైబ్రిడ్ గింబల్ స్టెబిలైజేషన్ ఉంది. ఇంకా 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ68 వాటర్ రెసిస్టంట్ వంటి ఫీచర్లు ఉండటం శుభపరిణామం.

ఆసుస్ జెన్ ఫోన్ 9 అంచనా ధర (Asus Zenfone 9 expected price)

ట్విట్టర్ యూజర్ స్నూపీ టెక్ ప్రకారం, జెన్ ఫోన్ 9 యొక్క ధర దాదాపు రూ.64,700-72,800 మధ్య ఉంటుందని అంచనా. మరి ఈ ధర ఎంత వరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

The post అనుకోకుండా లీకైన Asus Zenfone 9 ప్రోమో వీడియో first appeared on 91Mobiles Telugu.

]]>