హైలైట్స్:
- తైవాన్, హాంగ్ కాంగ్, యూరోప్ లోని కొన్ని దేశాల్లో లాంచ్ అయిన ఆసుస్ జెన్‌ఫోన్ 9
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 4,300ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 120హెర్ట్జ్ ఓఎల్ఈడీ ప్యానెల్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- ఆసుస్ జెన్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర 799 యూరోలు (దాదాపు రూ.64,700)
ఆసుస్ నుంచి వస్తున్న తదుపరి కాంపాక్ట్ సైజ్ స్మార్ట్ ఫోన్ ఆసుస్ జెన్‌ఫోన్ 9. గతేడాది ఆసుస్ నుంచి వచ్చిన ఆసుస్ జెన్‌ఫోన్ 8 కంటే ఈ ఫోన్ ఎంతో చిన్నదిగా కనిపిస్తోంది. అయితే జెన్‌ఫోన్ 8 కంటే జెన్‌ఫోన్ 9 లో ఫీచర్లు అధికంగా ఉన్నాయి. జెన్‌ఫోన్ 9 బ్యాక్ ప్యానెల్ ప్లాస్టిక్ తో తయారవ్వగా, ఫ్రేమ్ అల్యూమినియమ్ తో వస్తోంది. ముందువైపున గొరిల్లా గ్లాస్ విక్టస్ తో భద్రతను కల్పించారు. ఇక సెల్ఫీ షూటర్ కోసం ఫోన్ పైన ఎడమవైపున పంచ్-హోల్ కెమెరాను అందించారు. ఫ్లాగ్ షిప్ ఫోన్లలో ఈమధ్య కాలంలో మనకు కనిపించనిది ఏదైనా ఉందంటే టక్కున గుర్తొచ్చేది 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్. అయితే ఈ ఫోన్ లో ఆ ఫీచర్ ను అందించడం విశేషం.
క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ చిప్, అధిక బ్యాటరీ కెపాసిటీ వెరసి ఆసుస్ జెన్‌ఫోన్ 9, జెన్‌ఫోన్ 8 కంటే బెటర్ గా కనిపిస్తోంది. ఇక ఆసుస్ జెన్‌ఫోన్ 9 తీసుకొస్తున్న అతిపెద్ద ఫీచర్ ఏంటంటే, వావ్ అనిపించే గింబల్-లైక్ కెమెరా స్టెబిలైజేషన్. మామూలు లెన్స్ తో పోలిస్తే ఇది ఎన్నో రెట్లు మెరుగైన రిజల్ట్స్ ని రాబడుతుంది.
ASUS Zenfone 9 ధర, లభ్యత
ఆసుస్ జెన్‌ఫోన్ 9 8జిబి+128జిబి వేరియంట్ ధర 799 యూరోలు (దాదాపు రూ.64,700), 8జిబి+256జిబి వేరియంట్ ధర 849 యూరోలు (దాదాపు రూ.68,700), 16జిబి+256జిబి యూనిట్ ధర 899 యూరోలు (దాదాపు రూ.72,700). భారత్ లో ఆసుస్ జెన్‌ఫోన్ 9 లాంచ్ అయ్యాక ధరల్లో మార్పులు ఉండే అవకాశముంది.
తొలుత ఆసుస్ కంపెనీ తైవాన్, హాంగ్ కాంగ్, యూరోప్ లోని పలు దేశాలకు జెన్‌ఫోన్ 9 ని డెలివరీ చేయనుంది. తర్వాత మిగతా దేశాల్లో ఫోన్ ని అమ్మనుంది (via). ఆసక్తిగల కొనుగోలుదారులు ఆసుస్ జెన్‌ఫోన్ 9 ని మిడ్నైట్ బ్లాక్, స్టారీ బ్లూ, సన్‌సెట్ రెడ్, మూన్లైట్ వైట్ అనే నాలుగు రంగుల ఆప్షన్స్ నుంచి ఎంపిక చేసుకోవచ్చు.
ASUS Zenfone 9 స్పెసిఫికేషన్స్
అద్భుతమైన స్పెసిఫికేషన్స్ కలిగిన ఒక చిన్న ఫోన్ ఆసుస్ జెన్‌ఫోన్ 9. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఇందులో మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమొరీని పెంచుకోలేము. 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్లో ఉన్నాయి.
5.9 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, హెచ్డీఆర్10+ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 800 నిట్స్ బ్రైట్నెస్ ఆసుస్ జెన్‌ఫోన్ 9 లో ఉన్నాయి. పటిష్టతకై, ఆసుస్ జెన్‌ఫోన్ 9 డిస్ప్లే కు గొరిల్లా గ్లాస్ విక్టస్ తో రక్షణ కల్పించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత జెన్‌యూఐ కస్టమ్ స్కిన్ తో ఆసుస్ జెన్‌ఫోన్ 9 పని చేస్తుంది. ఇక ఆసుస్ జెన్‌ఫోన్ 9 రెండు ఆండ్రాయిడ్ అప్డేట్స్, రెండేళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ను పొందుతుంది.
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్
- 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ
- 4,300ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
- 5.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ 120 హెర్ట్జ్ డిస్ప్లే
- ఆండ్రాయిడ్ 12-ఆధారిత జెన్‌యూఐ కస్టమ్ స్కిన్
- 50ఎంపి + 12ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా
- 12ఎంపి ఫ్రంట్ కెమెరా
ఆసుస్ జెన్‌ఫోన్ 9 లో 50ఎంపి ఐఎంఎక్స్766 ప్రైమరీ లెన్స్, 12ఎంపి ఐఎంఎక్స్363 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ఐఎంఎక్స్663 ఫ్రంట్ కెమెరా ఉంది. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, గేమ్ జీనీ మోడ్, ఐపీ68 సర్టిఫికేషన్ వంటి ఫీచర్లు ఆసుస్ జెన్‌ఫోన్ 9 లో ఉన్నాయి.













