Best battery backup phones under 30k - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 20 Aug 2024 04:21:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Best battery backup phones: రూ.30,000 లోపు బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్లు (జులై 2024) https://www.91mobiles.com/telugu/best-battery-backup-phones-under-rs-30000-july-2024-india/ https://www.91mobiles.com/telugu/best-battery-backup-phones-under-rs-30000-july-2024-india/#respond Thu, 01 Aug 2024 18:27:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=12792 మీరు గనుక రూ.30,000 బడ్జెట్ లోపు మంచి బ్యాటరీ లైఫ్ అందించే ఫోన్ కొనాలని భావిస్తుంటే, ఈ ఆర్టికల్ మీకోసమే. రూ.30 వేల ధర లోపు భారత్ లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. 91మొబైల్స్ టీమ్ జరిపిన పీసీమార్క్ టెస్ట్ ఫలితాల ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్స్ జాబితాను రూపొందించాం. ఓసారి లిస్ట్ లో ఉన్న ఫోన్లేవో చదివి తెలుసుకోండి. బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్లు (రూ.30,000 లోపు) OPPO F25 Pro […]

The post Best battery backup phones: రూ.30,000 లోపు బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్లు (జులై 2024) first appeared on 91Mobiles Telugu.

]]>

మీరు గనుక రూ.30,000 బడ్జెట్ లోపు మంచి బ్యాటరీ లైఫ్ అందించే ఫోన్ కొనాలని భావిస్తుంటే, ఈ ఆర్టికల్ మీకోసమే. రూ.30 వేల ధర లోపు భారత్ లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. 91మొబైల్స్ టీమ్ జరిపిన పీసీమార్క్ టెస్ట్ ఫలితాల ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్స్ జాబితాను రూపొందించాం. ఓసారి లిస్ట్ లో ఉన్న ఫోన్లేవో చదివి తెలుసుకోండి.

బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్లు (రూ.30,000 లోపు)

OPPO F25 Pro

OPPO F25 Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. పీసీమార్క్ టెస్ట్ లో ఈ బ్యాటరీ 19 గంటల 57 నిమిషాల స్కోర్ నమోదు చేసింది. 30 నిమిషాల పాటు యూట్యూబ్ లో వీడియోలు చూస్తే 4 శాతం బ్యాటరీ ఖర్చైంది. 90 నిమిషాల పాటు కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ 3, బీజీఎంఐ ఆడితే 20 శాతం బ్యాటరీ ఖర్చైంది. 67 వాట్ ఫాస్ట్ చార్జర్ తో పూర్తిగా చార్జ్ అయ్యేందుకు 45 నిమిషాల సమయం పట్టింది.

OPPO F25 Pro డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.23,999 గా ఉంది.

Realme 12 Pro+

Realme 12 Pro+ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది సింగిల్ చార్జ్ పై ఒక రోజంతా బ్యాకప్ అందిస్తుంది. 91మొబైల్స్ టీమ్ జరిపిన పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ ఫోన్ 19 గంటల 17 నిమిషాలు స్కోర్ నమోదు చేసింది.

కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ 3, బీజీఎంఐ గేమ్స్‌ని 30 నిమిషాల పాటు ఆడితే 17 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. ఇక 30 నిమిషాల పాటు యూట్యూబ్ లో వీడియోలు చూస్తే 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. 67 వాట్ ఫాస్ట్ చార్జర్ తో Realme 12 Pro+ డివైజ్ 0 నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఒక గంట సమయం పట్టింది.

Realme 12 Pro+ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. 8జిబి+256జిబి మోడల్ ధర రూ.31,999 గా ఉంది. 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.33,999 గా ఉంది.

Realme 12+

Realme 12+ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది సాధారణ వాడకం పై ఒక రోజంతా బ్యాకప్ అందిస్తుంది. 91మొబైల్స్ టీమ్ జరిపిన పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఇది 17 గంటల 24 నిమిషాల స్కోర్ నమోగు చేసింది.

యూట్యూబ్ లో 30 నిమిషాల పాటు వీడియోలు చూస్తే 2 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. 90 నిమిషాల పాటు గేమ్స్ ఆడితే 23 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. 67 వాట్ ఫాస్ట్ చార్జర్ తో 0 నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు దాదాపుగా 45 నుంచి 50 నిమిషాల సమయం పట్టింది.

Realme 12+ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.20,999 గా ఉంది. 8జిబి+256జిబి మోడల్ ధర రూ.21,999 గా ఉంది.

OnePlus Nord CE 4

OnePlus Nord CE 4 లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది ఎక్కువ వాడకంపై ఈజీగా ఒక రోజు బ్యాకప్ ఇస్తుంది. లిస్ట్ లో భారీ బ్యాటరీ అయినప్పటికీ, పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో 16 గంటల 2 నిమిషాల స్కోర్ నమోదు చేసింది.

యూట్యూబ్ లో 30 నిమిషాలు వీడియోలు చూస్తే 3 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. 90 నిమిషాలు గేమ్స్ ఆడితే 17 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. 100 వాట్ ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేస్తే 0 శాతం నుంచి 100 శాతం అయ్యేందుకు 30 నిమిషాల సమయం పట్టింది.

OnePlus Nord CE 4 యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999 గా ఉంది. 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది.

Realme 12 Pro

Realme 12 Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. మీడియమ్ నుంచి హెవీ వాడకంపై ఇది మంచి బ్యాకప్ అందిస్తుంది. 91మొబైల్స్ టీమ్ జరిపిన పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఈ డివైజ్ 15 గంటల 42 నిమిషాల స్కోర్ నమోదు చేసింది.

67 వాట్ సూపర్‌వూక్ చార్జర్ తో 0 నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 45 నిమిషాల సమయం పట్టింది. 90 నిమిషాల పాటు గేమ్ ఆడితే 21 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. యూట్యూబ్ లో 30 నిమిషాల పాటు వీడియోలు చూస్తే 5 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది.

Realme 12 Pro 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.25,999 గా ఉంది. 8జిబి+256జిబి మోడల్ ధర రూ.26,999 గా ఉంది.

Vivo V30e

Vivo V30e లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది సాధారణ వాడకంపై ఒక పూర్తి రోజు బ్యాకప్ అందిస్తుంది. 91మొబైల్స్ టీమ్ జరిపిన పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో ఇది 14 గంటల 56 నిమిషాలు స్కోర్ నమోదు చేసింది.

30 నిమిషాల పాటు యూట్యూబ్ లో వీడియోలు చూస్తే 3 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. 90 నిమిషాల పాటు గేమ్స్ ఆడితే 16 శాతం ఖర్చయ్యింది. 44 వాట్ ఫాస్ట్ చార్జర్ తో 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు గంట సమయం పట్టింది.

Vivo V30e 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.27,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది.

The post Best battery backup phones: రూ.30,000 లోపు బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్లు (జులై 2024) first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/best-battery-backup-phones-under-rs-30000-july-2024-india/feed/ 0