Bharati Airtel - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 24 Nov 2022 12:21:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Jio వద్ద లేని Airtel దగ్గర ఉన్న ఆ రెండు ప్లాన్స్ ఇవే..!! https://www.91mobiles.com/telugu/airtel-has-two-recharge-plans-that-jio-does-not-have/ Thu, 24 Nov 2022 12:21:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=3652 హైలైట్స్ జియో లో లేని ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న ఆ రెండు ప్యాక్స్ రూ.499 మరియు రూ.3359 రీచార్జ్ ప్లాన్స్ తో లభిస్తున్న అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తోన్న రూ.499, రూ.3359 ప్లాన్స్ Airtel ఇటీవలె తన బేసిక్ ప్లాన్ ధరను 57 శాతం పెంచేసింది. దీంతో ఎయిర్టెల్ కస్టమర్లు కోపోద్రిక్తులయ్యారు. ఇప్పుడు ఎయిర్టెల్ యొక్క చీపెస్ట్ ప్లాన్ ధర రూ.155 నుంచి మొదలవుతుంది. ఇకపోతే ఎయిర్టెల్ […]

The post Jio వద్ద లేని Airtel దగ్గర ఉన్న ఆ రెండు ప్లాన్స్ ఇవే..!! first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • జియో లో లేని ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న ఆ రెండు ప్యాక్స్
  • రూ.499 మరియు రూ.3359 రీచార్జ్ ప్లాన్స్ తో లభిస్తున్న అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్
  • అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తోన్న రూ.499, రూ.3359 ప్లాన్స్

Airtel ఇటీవలె తన బేసిక్ ప్లాన్ ధరను 57 శాతం పెంచేసింది. దీంతో ఎయిర్టెల్ కస్టమర్లు కోపోద్రిక్తులయ్యారు. ఇప్పుడు ఎయిర్టెల్ యొక్క చీపెస్ట్ ప్లాన్ ధర రూ.155 నుంచి మొదలవుతుంది. ఇకపోతే ఎయిర్టెల్ లో రెండు చక్కటి ప్లాన్స్ ఉన్నాయి. ఆ తరహా ప్లాన్స్ ని Jio కూడా అందించడం లేదు. జియోకి, ఎయిర్టెల్ కి మధ్య తేడా ఇక్కడే ఉంది. అవును మరి, అద్భుతమైన రెండు కాంబో ప్లాన్స్ ఎయిర్టెల్ వద్ద ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

ఈ రీచార్జ్ లతో లభించనున్న Disney+ Hotstar సభ్యత్వం

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.499 మరియు రూ.3359 ప్లాన్స్ ద్వారా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సభ్యత్వం లభిస్తుంది. అదే జియో వద్ద ఇలా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తో కూడిన ప్లాన్స్ అందుబాటులో లేవు. సరే కాసేపు జియో విషయం పక్కనబెడితే, రూ.499 మరియు రూ.3359 ప్లాన్స్ అందిస్తోన్న బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Airtel Rs.499 ప్లాన్

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.499 ప్లాన్ ద్వారా యూజర్లకు అపరిమిత కాలింగ్ సౌకర్యం, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లు, డెయిలీ 2జిబి డేటా లభిస్తాయి. అలాగే ఈ ప్లాన్ 28 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. అంతేనా, ఫాస్టాగ్ పై రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇంకా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, వింక్ మ్యూజిక్, హలో ట్యూన్స్ లభిస్తాయి. అపోలో 24*7 బెనిఫిట్స్ మూడు నెలల వరకు లభిస్తాయి.

Airtel Rs.3359 ప్లాన్

ఎయిర్టెల్ అందిస్తోన్న మరొక చక్కటి ప్లాన్ రూ.3359. ఈ ప్లాన్ ని రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు Amazon Prime Video Mobile Edition సభ్యత్వం ఉచితంగా లభిస్తుంది. అంతేకాదండోయ్, Disney+ Hotstar సభ్యత్వం ఏడాది పాటు ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ తో అదనపు లాభాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, ఈ ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 2.5జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాల్స్ లభిస్తాయి.

ఇన్ని విధాలుగా బెనిఫిట్స్ అందిస్తోన్న ఈ ఎయిర్టెల్ రీచార్జ్ ప్లాన్స్ గురించి ఇప్పుడు మీకు తెలిసింది కదా. మీరు కనుక ఇటువంటి కాంబో ప్యాక్ కోసం చూస్తున్నట్లయితే ఓసారి ట్రై చేయండి. ఏడాది వ్యాలిడిటీ ఉన్న ప్యాక్ కోసం చూస్తుంటే రూ.3359 సరైన ఆప్షన్. అందునా, ఈ ప్లాన్ తో ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సభ్యత్వం కూడా ఉచితంగా లభిస్తోంది. 28 రోజుల వ్యాలిడిటీ చాలనుకుంటే అప్పుడు రూ.499 ప్యాక్ ని ప్రయత్నించండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Jio వద్ద లేని Airtel దగ్గర ఉన్న ఆ రెండు ప్లాన్స్ ఇవే..!! first appeared on 91Mobiles Telugu.

]]>
షాకింగ్: ఆ రెండు రాష్ట్రాల్లో మినిమమ్ ప్లాన్ ధరను 57శాతం పెంచేసిన Airtel https://www.91mobiles.com/telugu/airtel-increases-minimum-monthly-recharge-plan-price-by-57-percent/ Tue, 22 Nov 2022 05:27:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=3573 హైలైట్స్ తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్ రూ.99 ని నిలిపివేస్తున్న Airtel, ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో అమలు కొత్తగా రూ.155 విలువజేసే లోయెస్ట్ ప్రీపెయిడ్ మంత్లీ రీచార్జ్ ప్లాన్ తీసుకొచ్చిన ఎయిర్టెల్ ప్లాన్ బెనిఫిట్స్: 24 రోజుల వ్యాలిడిటీ, 1జిబి డేటా, అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్ తక్కువ ధర కలిగిన ప్లాన్స్ జాబితాలోకి భారతి ఎయిర్టెల్ మరొక కొత్త ప్లాన్ ని జత చేసింది. ఎయిర్టెల్ కంపెనీ తాజాగా రూ.155 విలువజేసే కొత్త రీచార్జ్ ప్లాన్ […]

The post షాకింగ్: ఆ రెండు రాష్ట్రాల్లో మినిమమ్ ప్లాన్ ధరను 57శాతం పెంచేసిన Airtel first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్ రూ.99 ని నిలిపివేస్తున్న Airtel, ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో అమలు
  • కొత్తగా రూ.155 విలువజేసే లోయెస్ట్ ప్రీపెయిడ్ మంత్లీ రీచార్జ్ ప్లాన్ తీసుకొచ్చిన ఎయిర్టెల్
  • ప్లాన్ బెనిఫిట్స్: 24 రోజుల వ్యాలిడిటీ, 1జిబి డేటా, అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్

తక్కువ ధర కలిగిన ప్లాన్స్ జాబితాలోకి భారతి ఎయిర్టెల్ మరొక కొత్త ప్లాన్ ని జత చేసింది. ఎయిర్టెల్ కంపెనీ తాజాగా రూ.155 విలువజేసే కొత్త రీచార్జ్ ప్లాన్ ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా ఇంటర్నెట్ డేటా, వాయిస్ కాలింగ్ ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ యొక్క పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం పదండి.

ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, ఇకపై రూ.155 ప్లాన్ మినిమమ్ మంత్లీ రీచార్జ్ ప్లాన్ గా పరిగణించబడుతుంది. అంటే రూ.99 ప్లాన్ ని ఎయిర్టెల్ నిలిపివేస్తోంది. ప్రస్తుతం ఈ మార్పు ఒడిశా మరియు హర్యానా రాష్ట్రాల్లో అమలువుతుంది. త్వరలోనే దేశంలోని ఇతర సర్కిల్స్ లో కూడా ప్రవేశపెట్టనున్నారు.

మినిమమ్ రీచార్జ్ ప్లాన్ ధరను పెంచేసిన Airtel

హర్యానా మరియు ఒడిశా రాష్ట్రాల్లో ఎయిర్టెల్ కంపెనీ తన కనీస నెలవారీ రీచార్జ్ ప్లాన్ ధరను 57 శాతం పెంచేసింది. ప్రస్తుతం కొనసాగుతోన్న రూ.99 ప్లాన్ ని ఈ రెండు రాష్ట్రాల్లో నిలిపివేసింది. ఇప్పుడు దీని స్థానంలో రూ.155 ప్లాన్ అమలులో ఉంటుంది. ఈ రూ.155 ప్లాన్ ని త్వరలోనే దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర సర్కిల్స్ లో కూడా ప్రవేశపెట్టాలని ఎయిర్టెల్ భావిస్తోంది.

Airtel 155 ప్లాన్

ఎయిర్టెల్ తీసుకొచ్చిన కనీస నెలవారీ రీచార్జ్ ప్లాన్ రూ.155 ప్రస్తుతం హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక ఈ ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే, 24 రోజుల వ్యాలిడిటీ ఈ ప్లాన్ ద్వారా లభిస్తుంది. ఇంకా 1జిబి ఇంటర్నెట్ డేటా కూడా ఈ ప్లాన్ ద్వారా యూజర్లు పొందుతారు.

రూ.155 రీచార్జ్ ప్లాన్ ద్వారా 1జిబి 4జీ డేటా ఎటువంటి డెయిలీ లిమిట్ లేకుండా వస్తుంది. ఈ డేటాను వ్యాలిడిటీ సమయంలో ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇంటర్నెట్ డేటా కాకుండా, ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 300 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. వీటిపై కూడా డెయిలీ లిమిట్ ఏమీ లేదు. 24 రోజుల వ్యాలిడిటీలో యూజర్లు ఎప్పుడైనా ఈ ఎస్ఎంఎస్ వాడుకోవచ్చు. ఈ ఎస్ఎంఎస్ లను దేశంలో ఎక్కడికైనా ఉచితంగా పంపించవచ్చు.

ఎయిర్టెల్ 155 ప్లాన్ ద్వారా వాయిస్ కాలింగ్ సౌకర్యం లభించనుంది. దీని ద్వారా అపరిమితంగా ఏ నెట్వర్క్ కైనా కాల్స్ మాట్లాడుకోవచ్చు. 24 రోజుల పాటు ఈ అపరిమిత ఉచిత కాల్స్ వినియోగించుకోవచ్చు. రోమింగ్ లో ఉన్నప్పుడు కూడా వినియోగంలో ఉంటాయి. అంతేకాదండోయ్, ఈ ప్లాన్ ద్వారా ఎయిర్టెల్ ఉచిత హలో ట్యూన్స్, ఫ్రీ వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ ని అందిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post షాకింగ్: ఆ రెండు రాష్ట్రాల్లో మినిమమ్ ప్లాన్ ధరను 57శాతం పెంచేసిన Airtel first appeared on 91Mobiles Telugu.

]]>