హైలైట్స్
- తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్ రూ.99 ని నిలిపివేస్తున్న Airtel, ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో అమలు
- కొత్తగా రూ.155 విలువజేసే లోయెస్ట్ ప్రీపెయిడ్ మంత్లీ రీచార్జ్ ప్లాన్ తీసుకొచ్చిన ఎయిర్టెల్
- ప్లాన్ బెనిఫిట్స్: 24 రోజుల వ్యాలిడిటీ, 1జిబి డేటా, అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్
తక్కువ ధర కలిగిన ప్లాన్స్ జాబితాలోకి భారతి ఎయిర్టెల్ మరొక కొత్త ప్లాన్ ని జత చేసింది. ఎయిర్టెల్ కంపెనీ తాజాగా రూ.155 విలువజేసే కొత్త రీచార్జ్ ప్లాన్ ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా ఇంటర్నెట్ డేటా, వాయిస్ కాలింగ్ ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ యొక్క పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం పదండి.
ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, ఇకపై రూ.155 ప్లాన్ మినిమమ్ మంత్లీ రీచార్జ్ ప్లాన్ గా పరిగణించబడుతుంది. అంటే రూ.99 ప్లాన్ ని ఎయిర్టెల్ నిలిపివేస్తోంది. ప్రస్తుతం ఈ మార్పు ఒడిశా మరియు హర్యానా రాష్ట్రాల్లో అమలువుతుంది. త్వరలోనే దేశంలోని ఇతర సర్కిల్స్ లో కూడా ప్రవేశపెట్టనున్నారు.
మినిమమ్ రీచార్జ్ ప్లాన్ ధరను పెంచేసిన Airtel
హర్యానా మరియు ఒడిశా రాష్ట్రాల్లో ఎయిర్టెల్ కంపెనీ తన కనీస నెలవారీ రీచార్జ్ ప్లాన్ ధరను 57 శాతం పెంచేసింది. ప్రస్తుతం కొనసాగుతోన్న రూ.99 ప్లాన్ ని ఈ రెండు రాష్ట్రాల్లో నిలిపివేసింది. ఇప్పుడు దీని స్థానంలో రూ.155 ప్లాన్ అమలులో ఉంటుంది. ఈ రూ.155 ప్లాన్ ని త్వరలోనే దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర సర్కిల్స్ లో కూడా ప్రవేశపెట్టాలని ఎయిర్టెల్ భావిస్తోంది.
Airtel 155 ప్లాన్
ఎయిర్టెల్ తీసుకొచ్చిన కనీస నెలవారీ రీచార్జ్ ప్లాన్ రూ.155 ప్రస్తుతం హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక ఈ ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే, 24 రోజుల వ్యాలిడిటీ ఈ ప్లాన్ ద్వారా లభిస్తుంది. ఇంకా 1జిబి ఇంటర్నెట్ డేటా కూడా ఈ ప్లాన్ ద్వారా యూజర్లు పొందుతారు.
రూ.155 రీచార్జ్ ప్లాన్ ద్వారా 1జిబి 4జీ డేటా ఎటువంటి డెయిలీ లిమిట్ లేకుండా వస్తుంది. ఈ డేటాను వ్యాలిడిటీ సమయంలో ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇంటర్నెట్ డేటా కాకుండా, ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 300 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. వీటిపై కూడా డెయిలీ లిమిట్ ఏమీ లేదు. 24 రోజుల వ్యాలిడిటీలో యూజర్లు ఎప్పుడైనా ఈ ఎస్ఎంఎస్ వాడుకోవచ్చు. ఈ ఎస్ఎంఎస్ లను దేశంలో ఎక్కడికైనా ఉచితంగా పంపించవచ్చు.
ఎయిర్టెల్ 155 ప్లాన్ ద్వారా వాయిస్ కాలింగ్ సౌకర్యం లభించనుంది. దీని ద్వారా అపరిమితంగా ఏ నెట్వర్క్ కైనా కాల్స్ మాట్లాడుకోవచ్చు. 24 రోజుల పాటు ఈ అపరిమిత ఉచిత కాల్స్ వినియోగించుకోవచ్చు. రోమింగ్ లో ఉన్నప్పుడు కూడా వినియోగంలో ఉంటాయి. అంతేకాదండోయ్, ఈ ప్లాన్ ద్వారా ఎయిర్టెల్ ఉచిత హలో ట్యూన్స్, ఫ్రీ వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ ని అందిస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












