BMW CE 04 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 12 Dec 2022 13:21:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారత్ లో ప్రదర్శించిన BMW https://www.91mobiles.com/telugu/bmw-ce-04-electric-scooter-introduced-in-india/ Mon, 12 Dec 2022 13:21:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=3943 హైలైట్స్ తన అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ CE 04 టీజర్ ని రిలీజ్ చేసిన BMW US తో సహా ఇతర మార్కెట్స్ లో ఇప్పటికే అమ్మకానికి వచ్చిన BMW CE 04 భారత్ లో త్వరలో లాంచ్ కానున్న BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ BMW Motorrad సంస్థ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ BMW CE 04 ని న్యూఢిల్లీ లోని జాయ్ టౌన్ ఈవెంట్ లో ప్రజెంట్ చేసింది. దీంతో త్వరలోనే […]

The post తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారత్ లో ప్రదర్శించిన BMW first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • తన అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ CE 04 టీజర్ ని రిలీజ్ చేసిన BMW
  • US తో సహా ఇతర మార్కెట్స్ లో ఇప్పటికే అమ్మకానికి వచ్చిన BMW CE 04
  • భారత్ లో త్వరలో లాంచ్ కానున్న BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్

BMW Motorrad సంస్థ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ BMW CE 04 ని న్యూఢిల్లీ లోని జాయ్ టౌన్ ఈవెంట్ లో ప్రజెంట్ చేసింది. దీంతో త్వరలోనే BMW CE 04 స్కూటర్ భారత్ లో లాంచ్ కావడం ఖాయమని స్పష్టమైంది. అయితే భారత్ లో ఏ తేదీన ఈ స్కూటర్ లాంచ్ అవుతుందో కంపెనీ వెల్లడించలేదు. అయితే తొలిసారిగా BMW CE 04 ఎలక్ట్రిక్ వెహికిల్ ని కాన్సెప్ట్ అవతార్ లో 2020 లో ప్రదర్శించారు. భారత్ కంటే ముందుగానే యూఎస్ తో సహా పలు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైన ఈ వెహికిల్ అక్కడ అమ్మకాలు కూడా జరుపుకుంటోంది. ఓసారి BMW CE 04 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

BMW CE 04 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • 10.5-ఇంచ్ హెచ్డీ టీఎఫ్‌టీ డిస్ప్లే
  • 15-ఇంచ్ వీల్స్
  • 8.9 కిలోవాట్ అవర్ లిథియమ్ అయాన్ బ్యాటరీ
  • 4.20 గంటల చార్జింగ్ టైమ్
  • 130 కిలోమీటర్ల రేంజ్
  • 2.6 సెకన్లలో 0 నుంచి 50 కేఎంపీహెచ్ వేగం

BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇతర దేశాల్లో అమ్ముడవుతోంది. దీంతో ఈ బండి యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలిసింది. భారత్ లో కూడా ఇవే ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తో BMW CE 04 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్కూటర్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఇందులో 10.25-ఇంచ్ హెచ్డీ టీఎఫ్‌టీ డిస్ప్లే, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ఇంటిగ్రేటెడ్ మ్యాప్స్, రైడ్ మోడ్ రీడౌట్, 15-ఇంచ్ వీల్స్ ఉన్నాయి.

BMW CE 04 రేంజ్, బ్యాటరీ, టాప్ స్పీడ్

రేంజ్ మరియు బ్యాటరీ: BMW CE 04 లో 8.9 కిలోవాట్ అవర్ లిథియమ్-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 4 గంటల 20 నిమిషాలలో పూర్తిగా చార్జ్ అవుతుంది. బండితో పాటు 2.3 కిలోవాట్ చార్జర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ బండి 6.9 కిలోవాట్ అవర్ ఫాస్ట్ చార్జర్ ని కూడా కలిగి ఉంది. దీంతో చార్జ్ చేస్తే గనుక 1 గంటా 40 నిమిషాల్లో బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవుతుంది. సింగిల్ చార్జ్ పై ఈ బండి 130 కిలోమీటర్ల దూరం వెళ్తుందని కంపెనీ చెబుతోంది.

టాప్ స్పీడ్: BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.6 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. అలాగే, పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటర్ ని వెనక వీల్ కి మధ్యలో ఇచ్చారు. ఇది గరిష్టంగా 42 బీహెచ్‌పీ పవర్, 62 ఎన్ఎం టార్క్ ని విడుదల చేస్తుంది.

ఏబీఎస్ బ్రేకింగ్: యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ని ఈ స్కూటర్ లో అందించారు. ఇదే కాకుండా, ఏబీఎస్ ప్రొ బ్యాంకింగ్ సెన్సర్ ని ఆప్షనల్ సిస్టమ్ గా ఇచ్చారు. 265 ఎంఎం డిస్క్స్ మరియు సింగిల్ రియర్ డిస్క్ బ్రేక్ నుంచి బ్రేకింగ్ పవర్ అందుతుంది.

BMW CE 04 ధర

BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క యూఎస్ మార్కెట్ ధర 11,795 డాలర్లు (సుమారు రూ.9.71 లక్షలు) గా ఉంది. అలాగే, భారతీయ మార్కెట్ లో కూడా దాదాపుగా ఇదే ధరలో BMW CE 04 స్కూటర్ ని సదరు కంపెనీ తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే కచ్చితమైన ధర లాంచ్ సమయంలో తెలియనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారత్ లో ప్రదర్శించిన BMW first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ కానున్న BMW ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ https://www.91mobiles.com/telugu/bmw-premium-electric-scooter-india-launch-key-specs-price/ Mon, 25 Jul 2022 17:38:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=1238 హైలైట్స్: భారత్ లో త్వరలో ఒక అల్ట్రా ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయనున్న బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఎన్నో ప్రత్యేకతలు కలిగిన గ్లోబల్ వెహికిల్ ఈ బీఎండబ్ల్యూ సీఈ 04 ఈ-స్కూటర్ ఈ-స్కూటర్ రేంజ్ 130 కిలో మీటర్లు, టాప్ స్పీడ్ గంటకు 120 కిలోమీటర్లు, 2.6 సెకన్లలో 0 నుంచి 50 కేఎంపీహెచ్ వేగం అందుకోనున్న సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ బవేరియన్ ఆటోమోటివ్ జెయింట్, బీఎండబ్ల్యూ యొక్క మోటర్ సైక్లింగ్ డివిజన్, త్వరలో […]

The post భారత్ లో లాంచ్ కానున్న BMW ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో త్వరలో ఒక అల్ట్రా ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయనున్న బీఎండబ్ల్యూ మోటోరాడ్
  • ఎన్నో ప్రత్యేకతలు కలిగిన గ్లోబల్ వెహికిల్ ఈ బీఎండబ్ల్యూ సీఈ 04 ఈ-స్కూటర్
  • ఈ-స్కూటర్ రేంజ్ 130 కిలో మీటర్లు, టాప్ స్పీడ్ గంటకు 120 కిలోమీటర్లు, 2.6 సెకన్లలో 0 నుంచి 50 కేఎంపీహెచ్ వేగం అందుకోనున్న సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్

బవేరియన్ ఆటోమోటివ్ జెయింట్, బీఎండబ్ల్యూ యొక్క మోటర్ సైక్లింగ్ డివిజన్, త్వరలో ఒక కొత్త ప్రీమియమ్ ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్, బీఎండబ్ల్యూ సీఈ 04 ని భారత్ లో లాంచ్ చేయాలని భావిస్తోంది. ఈమధ్యే, బీఎండబ్ల్యూ మోటోరాడ్ భారత విభాగం, బీఎండబ్ల్యూ సీ 400 జీటీ మ్యాక్సీ స్కూటర్ ను భారత్ లో లాంచ్ చేసింది. రూ.10 లక్షలకు పైగా ధర ఉన్నప్పటికీ, ఆ స్కూటర్ సక్సెస్ కావడం విశేషం. దీంతో కంపెనీ, బీఎండబ్ల్యూ సీఈ 04 ఈ-స్కూటర్ ను భారత్ లో లాంచ్ చేయాలని నిర్ణయించింది.

యూనిక్ కాన్సెప్ట్ డిజైన్ కలిగిన బీఎండబ్ల్యూ సీఈ 04 ను ధనిక ఔత్సాహికులను టార్గెట్ చేస్తూ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. సీబీయూ రూట్ ద్వారా బీఎండబ్ల్యూ సీఈ 04 ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారత్ లోకి తీసుకురావాలని బీఎండబ్ల్యూ ప్లాన్ చేస్తోంది.

భారత్ లో ఎంట్రీ ఇవ్వనున్న BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్

బీఎండబ్ల్యూ సీఈ 400 జీటీ భారత్ లో బాగా అమ్ముడవుతుండటంతో, బీఎండబ్ల్యూ ఉన్నతాధికారులు, బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ భారత మార్కెట్ లో అల్ట్రా-ప్రీమియమ్ ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్ మ్యాజిక్ చేయడం ఖాయమని భావిస్తున్నారు. సీబీయూ ఇంపోర్ట్ అయిన బీఎండబ్ల్యూ సీఈ 04 ధర రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉండనుంది. ఇక గ్లోబల్ మార్కెట్స్ లో బేస్ మోడల్ ధర రూ.9.05 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

కాన్సెప్ట్ మోడల్ మాదిరి ఉన్న బీఎండబ్ల్యూ సీఈ 04 అల్ట్రా-ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తన డిజైన్ తో బయ్యర్లను రాబట్టనుందని అంచనా వేస్తున్నారు. 2008 లో క్రిస్టోఫర్ నొలన్ తీసిన ద డార్క్ నైట్ సినిమాలో బ్యాట్ మ్యాన్ నడిపిన బ్యాట్ సైకిల్ లాగా ఈ స్కూటర్ డిజైన్ ఉండటం విశేషం. ట్యూబ్యులర్ సెంటర్ ఫ్రేమ్ చే స్కూటర్ యొక్క వీల్స్ చివరలకు నెట్టబడ్డాయి. ఇక రియర్ వీల్, స్కూటర్ మిగతా బాడీకి దూరంగా ఉండటం డ్రమాటిక్ లుక్ ని ఇచ్చింది. ఇక సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్, మోనో షాక్ లతో స్కూటర్ లుక్ వెరైటీగా కనిపిస్తోంది. ఇక సీటు పై ఆరెంజ్ కలర్ లో హైలైట్స్ ఉండటం గమనించవచ్చు. బాడీ గ్రాఫిక్స్, స్క్వేర్ షేపులో ఉన్న విండ్ షీల్డ్ ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఈ స్కూటర్ 20 హెచ్పీ లిక్విడ్ కూల్డ్ పీఎంఎస్ఎం తో కూడిన 8.9kWh బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉంది. ఇది 130 కిలోమీటర్ల రేంజ్ ను సింగిల్ ఛార్జ్ తో చేరుకోగలదు. 2.6 సెకన్లలో ఈ వెహికిల్ 120 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకోగలదు. ఇక బండి ముందు డ్యూయల్ డిస్క్స్, వెనుకవైపు సింగిల్ డిస్క్ మరియు ఏబీఎస్ ఉన్నాయి. ఇక సీట్ హైట్ 780ఎంఎం కాగా, బండి బరువు 231 కిలోగ్రాములు.

బీఎండబ్ల్యూ బ్రాండ్ నుంచి వస్తోన్న బండి కనుక, ఈ ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఎన్నో ఆప్షనల్ యాడ్-ఆన్స్, యాక్సెసరీలు అందుబాటులో ఉన్నాయి. అయితే, బీఎండబ్ల్యూ వాటిని భారతీయ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తీసుకొస్తుందో లేదో చూడాలి. భారత్ లో బీఎండబ్ల్యూ మోటరాడ్ కుటుంబం మరింత ఎదగాలని ఆశిస్తోంది. అందుకోసమే బీఎండబ్ల్యూ సీ 400 జీటీ మ్యాక్సీ, బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ వంటి బండ్లను రంగంలోకి దింపుతోంది.

The post భారత్ లో లాంచ్ కానున్న BMW ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ first appeared on 91Mobiles Telugu.

]]>