హైలైట్స్
- తన అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ CE 04 టీజర్ ని రిలీజ్ చేసిన BMW
- US తో సహా ఇతర మార్కెట్స్ లో ఇప్పటికే అమ్మకానికి వచ్చిన BMW CE 04
- భారత్ లో త్వరలో లాంచ్ కానున్న BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్
BMW Motorrad సంస్థ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ BMW CE 04 ని న్యూఢిల్లీ లోని జాయ్ టౌన్ ఈవెంట్ లో ప్రజెంట్ చేసింది. దీంతో త్వరలోనే BMW CE 04 స్కూటర్ భారత్ లో లాంచ్ కావడం ఖాయమని స్పష్టమైంది. అయితే భారత్ లో ఏ తేదీన ఈ స్కూటర్ లాంచ్ అవుతుందో కంపెనీ వెల్లడించలేదు. అయితే తొలిసారిగా BMW CE 04 ఎలక్ట్రిక్ వెహికిల్ ని కాన్సెప్ట్ అవతార్ లో 2020 లో ప్రదర్శించారు. భారత్ కంటే ముందుగానే యూఎస్ తో సహా పలు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచైన ఈ వెహికిల్ అక్కడ అమ్మకాలు కూడా జరుపుకుంటోంది. ఓసారి BMW CE 04 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
BMW CE 04 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
- 10.5-ఇంచ్ హెచ్డీ టీఎఫ్‌టీ డిస్ప్లే
- 15-ఇంచ్ వీల్స్
- 8.9 కిలోవాట్ అవర్ లిథియమ్ అయాన్ బ్యాటరీ
- 4.20 గంటల చార్జింగ్ టైమ్
- 130 కిలోమీటర్ల రేంజ్
- 2.6 సెకన్లలో 0 నుంచి 50 కేఎంపీహెచ్ వేగం
BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇతర దేశాల్లో అమ్ముడవుతోంది. దీంతో ఈ బండి యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలిసింది. భారత్ లో కూడా ఇవే ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తో BMW CE 04 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్కూటర్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఇందులో 10.25-ఇంచ్ హెచ్డీ టీఎఫ్‌టీ డిస్ప్లే, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ఇంటిగ్రేటెడ్ మ్యాప్స్, రైడ్ మోడ్ రీడౌట్, 15-ఇంచ్ వీల్స్ ఉన్నాయి.
BMW CE 04 రేంజ్, బ్యాటరీ, టాప్ స్పీడ్
రేంజ్ మరియు బ్యాటరీ: BMW CE 04 లో 8.9 కిలోవాట్ అవర్ లిథియమ్-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 4 గంటల 20 నిమిషాలలో పూర్తిగా చార్జ్ అవుతుంది. బండితో పాటు 2.3 కిలోవాట్ చార్జర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ బండి 6.9 కిలోవాట్ అవర్ ఫాస్ట్ చార్జర్ ని కూడా కలిగి ఉంది. దీంతో చార్జ్ చేస్తే గనుక 1 గంటా 40 నిమిషాల్లో బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవుతుంది. సింగిల్ చార్జ్ పై ఈ బండి 130 కిలోమీటర్ల దూరం వెళ్తుందని కంపెనీ చెబుతోంది.
టాప్ స్పీడ్: BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.6 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. అలాగే, పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటర్ ని వెనక వీల్ కి మధ్యలో ఇచ్చారు. ఇది గరిష్టంగా 42 బీహెచ్‌పీ పవర్, 62 ఎన్ఎం టార్క్ ని విడుదల చేస్తుంది.
ఏబీఎస్ బ్రేకింగ్: యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ని ఈ స్కూటర్ లో అందించారు. ఇదే కాకుండా, ఏబీఎస్ ప్రొ బ్యాంకింగ్ సెన్సర్ ని ఆప్షనల్ సిస్టమ్ గా ఇచ్చారు. 265 ఎంఎం డిస్క్స్ మరియు సింగిల్ రియర్ డిస్క్ బ్రేక్ నుంచి బ్రేకింగ్ పవర్ అందుతుంది.
BMW CE 04 ధర
BMW CE 04 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క యూఎస్ మార్కెట్ ధర 11,795 డాలర్లు (సుమారు రూ.9.71 లక్షలు) గా ఉంది. అలాగే, భారతీయ మార్కెట్ లో కూడా దాదాపుగా ఇదే ధరలో BMW CE 04 స్కూటర్ ని సదరు కంపెనీ తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే కచ్చితమైన ధర లాంచ్ సమయంలో తెలియనుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












