Chiranjeevi - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 08 Feb 2023 14:32:15 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ అప్డేట్ https://www.91mobiles.com/telugu/megastar-chiranjeevi-starring-waltair-veerayya-film-ott-update-netflix/ Wed, 08 Feb 2023 14:31:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=4851 మెగాస్టార్ చిరంజీవి చిత్రం వస్తుందంటే తెలుగు ప్రేక్షకుల్లో లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు మెగాస్టార్ చిత్రం అనౌన్స్‌మెంట్ ఉంటుందా, ఇంకెప్పుడు థియేటర్లలో ఆ చిత్రాన్ని చూద్దామా అని మెగా అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో చిరు నిరాశలో కూరుకుపోయారు. అయినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో తన తదుపరి చిత్రాలను చేస్తూ పోతున్నారు. ఆయన కష్టానికి తగిన ఫలితం వాల్తేరు వీరయ్య రూపంలో దొరికింది. బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య చిత్రం బాక్సాఫీస్ వద్ద […]

The post మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఓటీటీ ఎంట్రీకి సిద్ధమవుతోన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య
  • ఫిబ్రవరి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న చిత్రం
  • బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య చిత్రంలో కీలక పాత్ర పోషించిన రవితేజ

మెగాస్టార్ చిరంజీవి చిత్రం వస్తుందంటే తెలుగు ప్రేక్షకుల్లో లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు మెగాస్టార్ చిత్రం అనౌన్స్‌మెంట్ ఉంటుందా, ఇంకెప్పుడు థియేటర్లలో ఆ చిత్రాన్ని చూద్దామా అని మెగా అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో చిరు నిరాశలో కూరుకుపోయారు. అయినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో తన తదుపరి చిత్రాలను చేస్తూ పోతున్నారు. ఆయన కష్టానికి తగిన ఫలితం వాల్తేరు వీరయ్య రూపంలో దొరికింది.

బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. కేవలం హిట్ మాత్రమే కాదండోయ్, చిరు కెరీర్ లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రాల జాబితాలో ఒకటిగా వాల్తేరు వీరయ్య నిలిచింది. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Netflix లో ప్రసారం కానున్న వాల్తేరు వీరయ్య

చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 27 న నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుందని సదరు సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ ప్రకటనతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఎప్పుడెప్పుడు ఫిబ్రవరి 27 వస్తుందా అని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో మెగా మాస్ యాక్షన్ ని చూడని వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆత్రుతగా వేచి చూస్తున్నారు.

చిత్ర తారాగణం, సాంకేతిక వర్గం

వాల్తేరు వీరయ్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్, రవితేజ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రకాశ్ రాజ్, బాబీ సింహా, సత్యరాజ్, కేథరిన్, జాన్ విజయ్, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, సప్తగిరి, షకలక శంకర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో కనిపించారు. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆర్థర్ ఏ విల్సన్ సినిమాటోగ్రఫర్ గా చేశారు. నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

చిత్ర కథ

2023 జనవరి 13 న వాల్తేరు వీరయ్య చిత్రం థియేటర్లలో విడుదలైంది. వైజాగ్ లో స్మగ్లింగ్ చేసే వీరయ్య (చిరంజీవి)ని, ఏసీపీ విక్రమ్ సాగర్ (రవితేజ) ఎలా అడ్డుకున్నాడు? తదనంతర పరిణామాలే చిత్ర కథ. వీరయ్య పాత్రలో చిరంజీవి తన నట విశ్వరూపం చూపించారు. మాస్ అవతారంలో చిరు రఫ్ గా కనిపంచారు. మరోవైపు పోలీసు అధికారి పాత్రలో రవితేజ తన మాస్ యాంగిల్ ని పర్ఫెక్ట్ గా చూపించారు. యాక్షన్ సీక్వెన్స్ లో ఇటు చిరు, అటు రవితేజ ఇరగదీశారు. కథానాయిక పాత్రలో శృతిహాసన్ బాగా చేశారు. చిరు, శృతి ఆన్‌స్క్రీన్ కెమెస్ట్రీ బాగుంది.

దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా నచ్చింది. వీరయ్య టైటిల్ సాంగ్, నీకేమో అందమెక్కువ, బాస్ పార్టీ సాంగ్, పూనకాలు లోడింగ్ ఇలా అన్నీ పాటలు వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. బాబీ తన దర్శకత్వ ప్రతిభను మరోసారి చాటారు. ఆయన రాసుకున్న పాత్రలు, సన్నివేశాలు, చిత్రీకరణ బాగున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
మెగాస్టార్ చిరంజీవి నటించిన Godfather మూవీ OTT అప్డేట్ https://www.91mobiles.com/telugu/godfather-movie-ott-streaming-date-netflix-premiere/ Wed, 02 Nov 2022 14:08:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=3202 హైలైట్స్ మలయాళ హిట్ లూసిఫర్ కి రీమేక్ గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా ప్రధాన పాత్రలు పోషించిన చిరంజీవి, నయనతార, సత్యదేవ్, కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నవంబర్ 19 న Netflix లో ప్రసారం కానున్న Godfather మూవీ నవంబర్ నెలలో ఎన్నో దక్షిణాది సినిమాలు ఓటీటీ లో విడుదలయ్యాయి. మొన్నీమధ్యే కింగ్ నాగార్జున తన రీసెంట్ సినిమా ఘోస్ట్ ని ఓటీటీ స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. ఇప్పుడు మెగాస్టార్ […]

The post మెగాస్టార్ చిరంజీవి నటించిన Godfather మూవీ OTT అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • మలయాళ హిట్ లూసిఫర్ కి రీమేక్ గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా
  • ప్రధాన పాత్రలు పోషించిన చిరంజీవి, నయనతార, సత్యదేవ్, కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్
  • నవంబర్ 19 న Netflix లో ప్రసారం కానున్న Godfather మూవీ

నవంబర్ నెలలో ఎన్నో దక్షిణాది సినిమాలు ఓటీటీ లో విడుదలయ్యాయి. మొన్నీమధ్యే కింగ్ నాగార్జున తన రీసెంట్ సినిమా ఘోస్ట్ ని ఓటీటీ స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ సినిమా గాడ్‌ఫాదర్ ని ఓటీటీ ప్రీమియర్ కి సిద్ధం చేశారు. థియేటర్లలో మెగా అభిమానులకు వినోదాన్ని పంచిన గాడ్‌ఫాదర్ ఓటీటీ ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అయ్యింది. తాజాగా ఈ చిత్రం ఓ దిగ్గజ ఓటీటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మరి గాడ్ ఫాదర్ ఓటీటీ ప్రీమియర్ తేదీ, స్ట్రీమింగ్ పార్ట్నర్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Godfather ఓటీటీ విడుదల తేదీ

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో గాడ్ ఫాదర్ చిత్రం రూపొందింది. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. గాడ్‌ఫాదర్ చిత్రం నవంబర్ 19 న ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. మీరు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడకుంటే గనుక హ్యాపీగా మీ కుటుంబ సభ్యులతో కలిసి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ లో చూసేయండి.

చిరంజీవితో కలిసి నటించిన సల్మాన్ ఖాన్

మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రానికి తెలుగు రీమేక్ గా గాడ్‌ఫాదర్ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి తో కలిసి బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అక్టోబర్ 5 న థియేటర్లలో గాడ్‌ఫాదర్ చిత్రం విడుదలైంది. బిగ్ స్క్రీన్ పై ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ కోసం ముస్తాబై వచ్చేసింది. నవంబర్ 19 న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ లో ఈ చిత్రం ప్రీమియర్ అవుతుంది.

పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ గా గాడ్‌ఫాదర్ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్, ఊటీ, ముంబై ల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.

నటీనటుల ప్రదర్శన

ఈ చిత్రంలో సత్యదేవ్, నయనతార కీలక పాత్రల్లో కనిపించారు. చిరంజీవి, సత్యదేవ్ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. థియేటర్లలో జనాలను అలరించిన గాడ్‌ఫాదర్ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. నవంబర్ 19 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో గాడ్‌ఫాదర్ చిత్రం ప్రసారం కానుంది. మీ కుటుంబంతో కలిసి మెగాస్టార్ నటించిన గాడ్‌ఫాదర్ చిత్రాన్ని వీక్షించండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మెగాస్టార్ చిరంజీవి నటించిన Godfather మూవీ OTT అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
సహృదయాన్ని చాటిన మెగాస్టార్ చిరంజీవి https://www.91mobiles.com/telugu/megastar-chiranjeevi-noble-gesture-towards-his-fan/ Wed, 10 Aug 2022 15:11:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=1625 పరిచయం అక్కర్లేని పేరు మెగాస్టార్ చిరంజీవి. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన్ను కొందరు దేవుడిగా కొలుస్తారు. చాలామంది ఆయన్ను జీవితంలో ఒక్కసారైనా కలవాలని తపిస్తారు. నాగరాజు కూడా అలాంటి వారిలో ఒకరు. మరో విషయం ఏంటంటే, చిరంజీవి సొంతూరైన మొగల్తూరు కు చెందిన వ్యక్తే ఈ నాగరాజు. ఎట్టకేలకు నాగరాజుకి చిరంజీవిని కలిసే అవకాశం దొరొకింది. దీంతో నాగరాజు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తన అభిమాన తారను కలిసిన నాగరాజు తన గోడుని చెప్పుకున్నాడు. […]

The post సహృదయాన్ని చాటిన మెగాస్టార్ చిరంజీవి first appeared on 91Mobiles Telugu.

]]>
పరిచయం అక్కర్లేని పేరు మెగాస్టార్ చిరంజీవి. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన్ను కొందరు దేవుడిగా కొలుస్తారు. చాలామంది ఆయన్ను జీవితంలో ఒక్కసారైనా కలవాలని తపిస్తారు. నాగరాజు కూడా అలాంటి వారిలో ఒకరు. మరో విషయం ఏంటంటే, చిరంజీవి సొంతూరైన మొగల్తూరు కు చెందిన వ్యక్తే ఈ నాగరాజు.

ఎట్టకేలకు నాగరాజుకి చిరంజీవిని కలిసే అవకాశం దొరొకింది. దీంతో నాగరాజు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తన అభిమాన తారను కలిసిన నాగరాజు తన గోడుని చెప్పుకున్నాడు. నాగరాజు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆయన రెండు కిడ్నీలు కూడా పని చేయడం లేదు. చాలా రోజుల నుంచి ఇదే పరిస్థితితో కొట్టుమిట్టాడుతున్నాడు నాగరాజు. చిరంజీవిని కలవడం నాగరాజు చివరి కోరిక. ఇక నాగరాజు పరిస్థితి గురించి తెలుసుకున్న చిరంజీవి, అతడికి ఆర్థిక సాయం చేశారు. అలాగే వైద్యపరంగా వీలైన సాయం చేస్తానని భరోసా ఇచ్చారు.

మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఇంటికి వెళ్ళి కలిసాడు నాగరాజు. చిరంజీవి, నాగరాజు గంటపాటు మాట్లాడుకున్నారు. నాగరాజు దీనగాథను విన్న చిరంజీవి అతడికి మానసిక స్థైర్యాన్ని ఇవ్వడంతో పాటు, అన్ని విధాలా వైద్య, ఆర్థిక సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. తన అభిమాన నటుడి నుంచి హామీ రావడంతో నాగరాజు సంతోషించాడు.

ఆన్ స్క్రీనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా తాను హీరోనేనని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించుకున్నారు. సమయం వచ్చిన ప్రతిసారి తన దాతృత్వ హృదయాన్ని చాటి అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు తన అభిమాని చివరి కోరిక తీర్చి అతడిలో సంతోషాన్ని నింపారు మ్యాన్ ఆఫ్ మాసెస్. దీంతో అందరూ చిరంజీవిపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో వాల్తేర్ వీరయ్య, మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా, ఇటీవలె చిరంజీవి, గాడ్ ఫాదర్ చిత్రం షూటింగ్ ని పూర్తి చేశారు. యువ దర్శకులు వెంకీ కుడుముల, మారుతి లతో చిరంజీవి సినిమాలు చేయాల్సి ఉంది. అయితే వీటిపై వచ్చే ఏడాది చిరంజీవి నిర్ణయం తీసుకోనున్నారు.

గాడ్ ఫాదర్ చిత్ర విశేషాలను చూద్దాం. ఈ చిత్రంలో చిరంజీవి ప్రధాన పాత్రధారి కాగా, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర పోషిస్తున్నారు. ఇక చిరంజీవి, సల్మాన్ ఖాన్ లపై ఓ ఫన్నీ డ్యాన్స్ నంబర్ ఉండనుందని సమాచారం. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభు దేవా డాన్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. పది రోజుల క్రితమే ఈ పాట చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. నయనతార ఈ చిత్రంలో కథానాయికగా చేసింది. సునీల్, సత్యదేవ్, పూరీ జగన్నాథ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ కి గాడ్ పాదర్ అఫీషియల్ రీమేక్.

The post సహృదయాన్ని చాటిన మెగాస్టార్ చిరంజీవి first appeared on 91Mobiles Telugu.

]]>