Dual display phone - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 04 Oct 2024 09:36:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Lava Agni 3 5G: డ్యూయల్ స్క్రీన్స్, 50MP కెమెరాతో లాంచైన లావా కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-launched-india-dual-screens-and-50mp-camera/ https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-launched-india-dual-screens-and-50mp-camera/#respond Fri, 04 Oct 2024 09:35:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=13917 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్‌లో అగ్ని సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Lava Agni 3 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. భారతదేశపు మొదటి డ్యూయల్ అమోలెడ్ డిస్ప్లే ఫోన్‌ ఇదేనంటూ లావా సంస్థ చెబుతోంది. ఈ ఫోన్‌లో బ్యాక్ ప్యానెల్ పై కూడా ఒక స్క్రీన్ ఉంది. రూ.20,000 నుంచి రూ.25,000 ధరతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, […]

The post Lava Agni 3 5G: డ్యూయల్ స్క్రీన్స్, 50MP కెమెరాతో లాంచైన లావా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Lava Agni 3 5G విడుదల
  • ప్రధానాకర్షణగా డ్యూయల్ డిస్ప్లే
  • ప్రారంభ ధర రూ.20,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava నేడు భారతీయ మార్కెట్‌లో అగ్ని సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Lava Agni 3 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. భారతదేశపు మొదటి డ్యూయల్ అమోలెడ్ డిస్ప్లే ఫోన్‌ ఇదేనంటూ లావా సంస్థ చెబుతోంది. ఈ ఫోన్‌లో బ్యాక్ ప్యానెల్ పై కూడా ఒక స్క్రీన్ ఉంది. రూ.20,000 నుంచి రూ.25,000 ధరతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, డిజైన్ మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం.

Lava Agni 3 5G డిజైన్

Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్ రెండు డిస్ప్లేలతో రావడం విశేషం. ముందువైపు భారీ అమోలెడ్ స్క్రీన్, బ్యాక్ ప్యానెల్ పై చిన్న అమోలెడ్ డిస్ప్లేతో ఈ ఫోన్ వచ్చింది. ఈ బ్యాక్ ప్యానెల్ పై గల స్క్రీన్‌కి కంపెనీ ఇన్‌స్టా స్క్రీన్ అని పేరు పెట్టింది.

Lava Agni 3 5G సెకండరీ స్క్రీన్ ద్వారా మెసేజెస్, నోటిఫికేషన్స్ చెక్ చేయవచ్చు. కెమెరాను కూడా ఈ స్క్రీన్ తో ఆపరేట్ చేయవచ్చు. ఈ ఫోన్ యొక్క కుడివైపు ఫ్రేమ్ పై యాక్షన్ కీ కూడా ఇచ్చారు.

Lava Agni 3 5G ధర

  • Lava Agni 3 5G డివైజ్ మూడు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలను తెలుసుకుందాం.
  • Lava Agni 3 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను చార్జర్ లేకుండా రూ.20,999 గా పెట్టారు.
  • Lava Agni 3 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర చార్జర్ లేకుండా రూ.22,999 గా ఉంది.
  • Lava Agni 3 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.24,999 గా నిర్ణయించారు.

అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ ఫోన్ అమెజాన్ ద్వారా సేల్‌కి వస్తోంది. హీథర్ గ్లాస్ మరియు ప్రిస్టిన్ గ్లాస్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు Lava Agni 3 5G ప్రీ-బుకింగ్స్ కొనసాగుతాయి. ప్రీ-బుకింగ్స్ చేసుకునే వారికి రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది.

అగ్ని 1 ఫోన్ ఎక్స్‌చేంజ్ చేసే వారికి రూ.4,000, అగ్ని 2 ఎక్స్‌చేంజ్ చేసే వారికి రూ.8,000 డిస్కౌంట్ లభిస్తుంది.

Lava Agni 3 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Lava Agni 3 5G లో 6.78-ఇంచ్ 1.5కే స్క్రీన్, 2652*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, 3డీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. వైడ్‌వైన్ ఎల్1 సపోర్ట్ కూడా ఉంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ యాప్స్ లో వెబ్‌సిరీస్ లేదా సినిమాలను హెచ్డీలో చూడవచ్చు.

సెకండరీ డిస్ప్లే: Lava Agni 3 5G ఫోన్‌కి బ్యాక్ ప్యానెల్ పై 1.74-ఇంచ్ 2డీ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఈ స్క్రీన్ 336*480 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది. ఈ డిస్ప్లే ద్వారా బ్యాక్ కెమెరాతో సెల్ఫీ తీసుకోవచ్చు. ఇంకా కాల్స్, మెసేజెస్, నోటిఫికేషణ్స్, మ్యూజిక్ కంట్రోల్, అలారమ్, టైమర్, స్టాప్ వాచ్, ఫిట్నెస్ ట్రాకర్ వంటి వాటిని యాక్సెస్ చేయవచ్చు.

ప్రాసెసర్: Lava Agni 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ ప్రాసెసర్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్. భారీ వేపర్ చాంబర్ కూలింగ్ ను ఇందులో అందించారు.

మెమొరీ: Lava Agni 3 5G డివైజ్ 8జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Lava Agni 3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ టెలీఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Lava Agni 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Lava Agni 3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6ఈ, నావిక్, ఓటీజీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Lava Agni 3 5G ఐపీ64 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.

The post Lava Agni 3 5G: డ్యూయల్ స్క్రీన్స్, 50MP కెమెరాతో లాంచైన లావా కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/lava-agni-3-5g-launched-india-dual-screens-and-50mp-camera/feed/ 0