Eurofins - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 17 May 2024 09:45:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO: ఇండోనేషియా టెలీకామ్, యూరోఫిన్స్ సర్టిఫికేషన్స్‌ పొందిన A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ https://www.91mobiles.com/telugu/oppo-a3-pro-5g-global-variant-received-indonesia-telecom-and-eurofins-certifications/ Fri, 17 May 2024 09:37:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=11586 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం A3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ని చైనాలో లాంచ్ చేసింది. ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో రావడం ఈ ఫోన్ ప్రత్యేకత. అయితే గ్లోబల్ లాంచ్ కోసం ఒప్పో ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న సమయంలో, తాజాగా ఈ ఫోన్ SDPPI, Eurofins సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ లిస్టింగ్స్ వివరాలను తెలుసుకుందాం పదండి. OPPO A3 Pro 5G గ్లోబల్ […]

The post OPPO: ఇండోనేషియా టెలీకామ్, యూరోఫిన్స్ సర్టిఫికేషన్స్‌ పొందిన A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO A3 Pro 5G గ్లోబల్ లాంచ్
  • ఇప్పటికే చైనాలో లాంచైన డివైజ్
  • ఐపీ69 రేటింగ్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం A3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ని చైనాలో లాంచ్ చేసింది. ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో రావడం ఈ ఫోన్ ప్రత్యేకత. అయితే గ్లోబల్ లాంచ్ కోసం ఒప్పో ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న సమయంలో, తాజాగా ఈ ఫోన్ SDPPI, Eurofins సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ లిస్టింగ్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OPPO A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ బ్యాటరీ, చార్జింగ్ వివరాలు

OPPO A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ ఎస్డీపీపీఐ వెబ్‌సైట్ పై CPH2639 అనే మోడల్ నంబర్‌ని కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ యూరోఫిన్స్ సర్టిఫికేషన్ సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది. యూరోఫిన్స్ డేటాబేస్ పై OPPO A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ 4,970 ఎంఏహెచ్ బ్యాటరీతో లిస్ట్ అయ్యింది. కంపెనీ దీన్ని 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అని ప్రజెంట్ చేయవచ్చు.

యూరోఫిన్స్ లిస్టింగ్ ద్వారా 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యింది. ఇప్పటికే OPPO A3 Pro 5G డివైజ్ చైనాలో అందుబాటులో ఉంది. గ్లోబల్ వేరియంట్ కూడా చైనా మోడల్ మాదిరే ఉంటుందని చెప్పలేం. ఓసారి OPPO A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

OPPO A3 Pro 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: OPPO A3 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO A3 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ68 జీపీయూ ఉపయోగించారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO A3 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్/12జిబి ర్యామ్ + 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 12జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: OPPO A3 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO A3 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post OPPO: ఇండోనేషియా టెలీకామ్, యూరోఫిన్స్ సర్టిఫికేషన్స్‌ పొందిన A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: గీక్‌బెంచ్‌, యూరోఫిన్స్, కెమెరా ఎఫ్‌వీ 5 సైట్స్‌పై లిస్టైన Nord 4 స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-listed-on-geekbench-eurofins-camera-fv-5-websites/ Mon, 29 Apr 2024 10:29:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=11236 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord 4 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్, యూరోఫిన్స్ మరియు కెమెరా ఎఫ్‌వీ5 డేటాబేస్ లపై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్స్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి. OnePlus Nord 4 గీక్‌బెంచ్ లిస్టింగ్ OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్ […]

The post OnePlus: గీక్‌బెంచ్‌, యూరోఫిన్స్, కెమెరా ఎఫ్‌వీ 5 సైట్స్‌పై లిస్టైన Nord 4 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus Nord 4 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్
  • మోడల్ నంబర్ CPH2621

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord 4 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్, యూరోఫిన్స్ మరియు కెమెరా ఎఫ్‌వీ5 డేటాబేస్ లపై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్స్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus Nord 4 గీక్‌బెంచ్ లిస్టింగ్

OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై CPH2621 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1875 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 4934 పాయింట్లు స్కోర్ చేసింది.

పైనాపిల్ అనే కోడ్ పేరుతో ఓ చిప్సెట్ లిస్టింగ్ పై కనిపించింది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ చిప్సెట్ మరియు అడ్రెనో 732 జీపీయూ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

కోడ్ నేమ్ మరియు జీపీయూ ప్రకారం, ఈ వన్‌ప్లస్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ తో వచ్చే అవకాశం ఉంది.

OnePlus Nord 4 డివైజ్ 12జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

OnePlus Nord 4 ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ 14 కస్టమ్ స్కిన్ తో వస్తోంది.

OnePlus Nord 4 యూరోఫిన్స్ లిస్టింగ్

OnePlus Nord 4 డివైజ్ యూరోఫిన్స్ సర్టిఫికేషన్ పొందింది. ఈ లిస్టింగ్ ద్వారా బ్యాటరీ వివరాలు రివీల్ అయ్యాయి.

OnePlus Nord 4 డివైజ్ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు ఈ లిస్టింగ్ ద్వారా ఖరారైంది.

OnePlus Nord 4 డివైజ్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 80 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

OnePlus Nord 4 కెమెరా ఎఫ్‌వీ 5 లిస్టింగ్

OnePlus Nord 4 డివైజ్ Camera FV 5 సర్టిఫికేషన్ పొందింది. ఈ లిస్టింగ్ ద్వారా కెమెరా వివరాలు రివీల్ అయ్యాయి.

OnePlus Nord 4 డివైజ్ ఓఐఎస్, f/1.9 అపర్చర్, 26.4ఎంఎం ఫోకల్ లెంగ్త్ గల ప్రైమరీ కెమెరాతో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

OnePlus Nord 4 డివైజ్ f/2.4 అపర్చర్, ఈఐఎస్, 25.2 ఎంఎం ఫోకల్ లెంగ్త్ గల సెల్ఫీ కెమెరాతో వస్తోంది.

చైనాలో లాంచైన OnePlus Ace 3V కి రీబ్రాండ్ వర్షన్ గా OnePlus Nord 4 ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో కూడా OnePlus Nord 4 లాంచ్ కానుంది. త్వరలోనే కంపెనీ నుంచి లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

The post OnePlus: గీక్‌బెంచ్‌, యూరోఫిన్స్, కెమెరా ఎఫ్‌వీ 5 సైట్స్‌పై లిస్టైన Nord 4 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>