
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం A3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ని చైనాలో లాంచ్ చేసింది. ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో రావడం ఈ ఫోన్ ప్రత్యేకత. అయితే గ్లోబల్ లాంచ్ కోసం ఒప్పో ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న సమయంలో, తాజాగా ఈ ఫోన్ SDPPI, Eurofins సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ లిస్టింగ్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.
OPPO A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ బ్యాటరీ, చార్జింగ్ వివరాలు
OPPO A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ ఎస్డీపీపీఐ వెబ్‌సైట్ పై CPH2639 అనే మోడల్ నంబర్‌ని కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ యూరోఫిన్స్ సర్టిఫికేషన్ సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది. యూరోఫిన్స్ డేటాబేస్ పై OPPO A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ 4,970 ఎంఏహెచ్ బ్యాటరీతో లిస్ట్ అయ్యింది. కంపెనీ దీన్ని 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అని ప్రజెంట్ చేయవచ్చు.
యూరోఫిన్స్ లిస్టింగ్ ద్వారా 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యింది. ఇప్పటికే OPPO A3 Pro 5G డివైజ్ చైనాలో అందుబాటులో ఉంది. గ్లోబల్ వేరియంట్ కూడా చైనా మోడల్ మాదిరే ఉంటుందని చెప్పలేం. ఓసారి OPPO A3 Pro 5G గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
OPPO A3 Pro 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)
డిస్ప్లే: OPPO A3 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: OPPO A3 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ68 జీపీయూ ఉపయోగించారు.
ర్యామ్, స్టోరేజీ: OPPO A3 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్/12జిబి ర్యామ్ + 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 12జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించారు.
కెమెరా: OPPO A3 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: OPPO A3 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











