EV Fire - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 08 Nov 2022 10:12:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఒడిషాలో పేలిన Electric స్కూటర్ బ్యాటరీ, దగ్ధమైన బండి https://www.91mobiles.com/telugu/electric-scooter-battery-explosion-odisha-state/ Tue, 08 Nov 2022 10:12:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=3308 హైలైట్స్ పార్క్ చేసి ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్, పేలిన బ్యాటరీ ఒడిషాలో చోటు చేసుకున్న ఘటన, పేలుడు దాటికి దగ్ధమైన బండి ఒడిషా బైట్స్ యూట్యూబ్ చానల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఘటన ఒడిషా రాష్ట్రంలోని సోనేపూర్ జిల్లాలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలింది. సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాటరీ పేలుడు ప్రభావంతో స్కూటర్ కి మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత స్కూటర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన దృశ్యాలు కెమెరా కంటికి […]

The post ఒడిషాలో పేలిన Electric స్కూటర్ బ్యాటరీ, దగ్ధమైన బండి first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • పార్క్ చేసి ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్, పేలిన బ్యాటరీ
  • ఒడిషాలో చోటు చేసుకున్న ఘటన, పేలుడు దాటికి దగ్ధమైన బండి
  • ఒడిషా బైట్స్ యూట్యూబ్ చానల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఘటన
Image: Odisha Bytes

ఒడిషా రాష్ట్రంలోని సోనేపూర్ జిల్లాలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలింది. సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాటరీ పేలుడు ప్రభావంతో స్కూటర్ కి మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత స్కూటర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కడంతో సంబంధిత వీడియో సోషల్ మీడియాకి చేరింది. మంటల దాటికి స్కూటర్ నుంచి రికవర్ చేయడానికి ఏమీ మిగలలేదు.

ఒడిషా సోనేపూర్ లోని ఉలుండా బ్లాక్ ఆఫీస్ వద్ద నుంచి ఈ ఘటన జరిగింది. ఒడిషా బైట్స్ యూట్యూబ్ చానల్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో లో చూస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఈ దగ్ధమైన ఎలక్ట్రిక్ స్కూటర్ రబి నారాయణ్ సేనాపతికి చెందినదిగా గుర్తించారు. ఈయన ఒడిషాలోని ఉలుండా ప్రాంతవాసి అని తెలుస్తోంది.

తన ఇంటికి సమీపంలోని ఓ షాపుకి వెళ్ళిన రబి నారాయణ్ సేనాపతి అక్కడ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని పార్క్ చేసినట్లు సమాచారం. షాపు ముందు బండిని నిలిపి రబి నారాయణ్ వస్తువులు కొనేందుకు వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే బ్యాటరీ పేలుడికి గల కారణాలు ఇంకా తెలియలేదు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ హాని జరగలేదు.

ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి మంటలు చెలరేగడంతో.. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునే లోపే బండి పూర్తిగా దగ్ధమై పోయింది. టూవీలర్ ఏ కంపెనీకి చెందినదో కూడా తెలియలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా బయటకు రావాల్సి ఉంది.

వరుస ప్రమాదాలతో ప్రశ్నార్థకంగా మారిన Electric Vehicles భద్రత

వరుస పేలుడు ఘటనలతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికి ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఇంకా ఈ ఉదంతాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు పెట్రోల్ రేట్లకు తాళలేక ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ, ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై గ్యారంటీ ఇవ్వలేమని తాజాగా వెలుగు చూస్తోన్న ఘటనలే ఉదాహరణ. దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రమాదాలు పరిపాటిగా మారాయి. దీంతో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారు జంకుతున్నారు.

గత నెల ఆరంభంలో ఇటువంటిదే ఈ-స్కూటర్ బ్యాటరీ పేలిన ఘటనలో ఏడేళ్ళ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్ర లోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. అప్పుడు స్కూటర్ బాధితుడి ఇంట్లో చార్జింగ్ లో ఉంది. తెలంగాణలో జరిగిన మరొక ఘటనలో ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూమ్ లో మంటలు చెలరేగాయి. మంటలు పైన ఉన్న లాడ్జి కి వ్యాపించడంతో 8 మంది దుర్మరణం చెందారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఒడిషాలో పేలిన Electric స్కూటర్ బ్యాటరీ, దగ్ధమైన బండి first appeared on 91Mobiles Telugu.

]]>
Electric స్కూటర్ నుంచి చెలరేగిన మంటలు; బండిపై నుంచి దూకేసిన డెలివరీ బాయ్ https://www.91mobiles.com/telugu/fire-broke-out-e-scooter-noida-delivery-boy-big-basket/ Thu, 27 Oct 2022 08:27:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=3094 హైలైట్స్ మంటల్లో చిక్కుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్, బండిపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న డెలివరీ బాయ్ నోయిడాలో చోటు చేసుకున్న ఘటన, సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియో మంటలార్పేందుకు ఘటనస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, అప్పటికే పూర్తిగా దగ్ధమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధం: మొబైల్ ఫోన్ల మాదిరి, బ్యాటరీ తో నడిచే స్కూటర్లు కూడా పేలడం సాధారణ విషయం అయిపోయింది. ఇప్పుడు మరోసారి రోడ్డు నడిమధ్యలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో చిక్కుకుంది. బండి […]

The post Electric స్కూటర్ నుంచి చెలరేగిన మంటలు; బండిపై నుంచి దూకేసిన డెలివరీ బాయ్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • మంటల్లో చిక్కుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్, బండిపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న డెలివరీ బాయ్
  • నోయిడాలో చోటు చేసుకున్న ఘటన, సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియో
  • మంటలార్పేందుకు ఘటనస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, అప్పటికే పూర్తిగా దగ్ధమైన ఎలక్ట్రిక్ స్కూటర్

ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధం: మొబైల్ ఫోన్ల మాదిరి, బ్యాటరీ తో నడిచే స్కూటర్లు కూడా పేలడం సాధారణ విషయం అయిపోయింది. ఇప్పుడు మరోసారి రోడ్డు నడిమధ్యలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ మంటల్లో చిక్కుకుంది. బండి నుంచి మంటలు ఒక్కసారిగా ఎడిసిపడ్డాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా నగరంలో చోటు చేసుకుంది. మీడియా కథనాల ప్రకారం, బిగ్ బాస్కెట్ డెలివరీ బాయ్ నడుపుతోన్న ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సెక్టర్-78 లోని కోట్వాలి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సందర్భంలో సరుకులను డెలివరీ చేయడానికి సదరు డెలివరీ బాయ్ వెళ్తున్నట్లు సమాచారం. ఇక మంటలు చెలరేగడంతో డెలివరీ బాయ్ బండిపై నుంచి దూకేసి తన ప్రాణాలను కాపాడుకున్నాడు.

మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

ఎలక్ట్రిక్ స్కూటర్ నిప్పుల్లో చిక్కుకోవడంతో ఆ మంటలు కాస్తా తీవ్రస్థాయిలో చెలరేగాయి. దీంతో ఘటనని గమనించిన స్థానిక ప్రజలు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేసింది. అయితే అప్పటికే స్కూటర్ పూర్తిగా దగ్ధమైపోయింది.

మీడియా కథనాలను బట్టి, ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రమాదం నోయిడాలోని సివిటెక్ స్టేడియా అనే ప్రాంతంలో చోటు చేసుకుందని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్కెట్ డెలివరీ బాయ్ పేరు చంద్ర ప్రకాశ్ అని సమాచారం. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ తగులబడటానికి గల కారణం ఏంటో ఇంకా తెలియలేదు. సెక్టర్ 80 నుంచి సివిక్ స్టేడియా సొసైటీ కి సరుకులు డెలివరీ చేసేందుకు వెళ్తున్నట్లు బాధితుడు చంద్ర ప్రకాశ్ తెలిపాడు. తాను సివిక్ స్టేడియా సొసైటీకి చేరుకోగానే బ్యాటరీ స్కూటీ నుంచి మంటలు వచ్చాయని చంద్ర ప్రకాశ్ చెప్పుకొచ్చాడు.

మంటలు చెలరేగడానికి గల కారణంతో పాటు, ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ, మోడల్ తదితర వివరాలు ఏమీ బయటకు రాలేదు. అలాగే ఈ ఘటనలో ఎవ్వరికీ హాని కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల నుంచి మంటలు చెలరేగడం ఎక్కువైంది. పెట్రోలు ధరలు ఆకాశాన్నంటుతోన్న తరుణంలో సామాన్యులు బ్యాటరీ స్కూటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ఈ బ్యాటరీ స్కూటర్లు కూడా ఎప్పుడు పేలుతాయో తెలియక జనాలు ఆందోళన చెందుతున్నారు. మరికొందరు అసలు బ్యాటరీతో నడిచే స్కూటర్లను కొనాలా వద్దా అనే సందిగ్ధంలో ఉండిపోయారు. ఏదేమైనా ఎలక్ట్రిక్ స్కూటర్లు పేలకుండా, మంటల్లో చిక్కుకోకుండా ఉండేందుకు సరైన టెక్నాలజీని వినియోగించడమో లేదా అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడమో అవసరం. ఇప్పటికే పలు కంపెనీలు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. మరి పూర్తి సేఫ్టీని అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేది ఎప్పుడో చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Electric స్కూటర్ నుంచి చెలరేగిన మంటలు; బండిపై నుంచి దూకేసిన డెలివరీ బాయ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Electric Scooter బ్యాటరీ పేలి 7 ఏళ్ళ బాలుడు మృతి https://www.91mobiles.com/telugu/ev-fire-electric-scooter-battery-explodes-7-years-old-boy-dies/ Mon, 03 Oct 2022 15:39:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=2719 హైలైట్స్: ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి 7 ఏళ్ళ బాలుడు మృతి, ముంబై లో ఘటన బ్యాటరీ పేలినప్పుడు చార్జింగ్ లో ఉన్న స్కూటర్ ఇంకా బయటకు రాని స్కూటర్ మోడల్ మరియు కంపెనీ పేరు ముంబైలోని వాసై ప్రాంతంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలడంతో ఏడేళ్ళ బాలుడు మృతి చెందాడు. స్కూటర్ చార్జింగ్ లో ఉండగా బ్యాటరీ పేలింది. అప్పుడు బాలుడు పక్కనే నిద్రిస్తున్నట్లు సమాచారం. 70 శాతం గాయాలతో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. […]

The post Electric Scooter బ్యాటరీ పేలి 7 ఏళ్ళ బాలుడు మృతి first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి 7 ఏళ్ళ బాలుడు మృతి, ముంబై లో ఘటన
  • బ్యాటరీ పేలినప్పుడు చార్జింగ్ లో ఉన్న స్కూటర్
  • ఇంకా బయటకు రాని స్కూటర్ మోడల్ మరియు కంపెనీ పేరు

ముంబైలోని వాసై ప్రాంతంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలడంతో ఏడేళ్ళ బాలుడు మృతి చెందాడు. స్కూటర్ చార్జింగ్ లో ఉండగా బ్యాటరీ పేలింది. అప్పుడు బాలుడు పక్కనే నిద్రిస్తున్నట్లు సమాచారం. 70 శాతం గాయాలతో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.

ముంబై లోని వాసై (ఈస్ట్) ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. బ్యాటరీ పేలినప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటి వద్ద చార్జింగ్ లో ఉంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన కథనం ప్రకారం, రాందాస్ నగర్ ప్రాంతంలో సెప్టెంబర్ 23 న ఉదయం 4.30 నుంచి 5.00 గంటల మధ్య పేలుడు సంభవించింది. ఘటన జరిగిన సమయంలో మృతుడు షబ్బీర్ అన్సారి తన నానమ్మతోపాటు హాల్ లో నిద్రిస్తున్నాడు.

అన్సారి తండ్రి తాను పడుకునే ముందు బ్యాటరీకి చార్జింగ్ పెట్టి తన గదిలోకి వెళ్ళాడు. భారీ శబ్దం రావడంతో బాలుడి తల్లిదండ్రులు మేలుకున్నారు. ఇక బాలుడి నానమ్మకి కూడా స్వల్ప గాయాలయ్యాయి. 70 శాతం గాయాలైన అన్సారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అన్సారి కన్ను మూశాడు.

బ్యాటరీని ఎంతసేపు చార్జింగ్ పెట్టారో తెలియదని పోలీసులు చెప్పారు. ఘటనకు ముందు రాత్రి 2.30 గంటలకు స్కూటర్ చార్జింగ్ పెట్టామని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. అంటే పేలుడు జరిగేందుకు రెండు గంటల ముందు చార్జింగ్ పెట్టినట్లు తెలుస్తోంది.

బాధిత కుటుంబం ఏ మోడల్, ఏ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని వాడుతుందో ఇంకా తెలియలేదు. ఏదేమైనా, ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల పేలుడు ఉదంతాలు చాలా చోటు చేసుకుంటున్నాయి. బ్యాటరీలకు నిప్పంటుకోవడం, పేలడం, జనాలు ప్రాణాలు కోల్పోవడం సాధారణమై పోయింది. దీంతో ఈ-స్కూటర్లు కొనాలంటేనే జనాలు వణుకుతున్నారు. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం కూడా ఈవీ కంపెనీలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గత నెలలో సికింద్రాబాద్ లోని ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ లో మంటలు వ్యాపించడంతో 8 మంది దుర్మణం పాలైన విషయం తెలిసిందే. ఈ ఉదంతాలకు అడ్డుకట్ట పడేదెప్పుడో మరి.

అంతకు ముందు, ఇటువంటి ఘటనే కేరళ లోని కోలికోడ్ లో చోటు చేసుకుంది. అక్కడ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ లో 12 స్కూటర్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఓ స్కూటర్ బ్యాటరీ సమస్యను సరిచేస్తుండగా ఉన్నట్లుండి మంటలు చెలరేగాయని సమాచారం. ఆ వెనువెంటనే మిగతా స్కూటర్లకు కూడా మంటలు వ్యాపించడంతో భారీగా మంటలు వ్యాపించాయి.

విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బ్యాటరీలతోనే పేలుడు ఉదంతాలు సంభవిస్తున్నాయని ఏథర్ కంపెనీ సీఈవో అన్నారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల పేలుళ్ళను నివారించేందుకు ఓలా కంపెనీ సరికొత్త బ్యాటరీ టెక్నాలజీని రూపొందిస్తోంది. ఓలా కంపెనీ ఈ విషయంలో ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. ఏదేమైనా, ఎవరో ఒకరి ఆవిష్కరణతో ఈ బ్యాటరీ పేలుళ్ళకు చెక్ పడాలని ఆశిద్దాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Electric Scooter బ్యాటరీ పేలి 7 ఏళ్ళ బాలుడు మృతి first appeared on 91Mobiles Telugu.

]]>