Fast Charging Speed - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 08 Jul 2022 16:25:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Nothing Phone (1) ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే https://www.91mobiles.com/telugu/nothing-phone-1-fast-charging-speed-tuv-certification-33w-45w/ Fri, 08 Jul 2022 16:25:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=859 హైలైట్స్: * నథింగ్ ఫోన్ (1) 33 వాట్ సపోర్ట్ తో వస్తోందని టీయూవీ సర్టిఫికేషన్ రివీల్ చేసింది. * అయితే 45 వాట్ మాగ్జిమమ్ సపోర్ట్ ఉండనున్నట్లు సమాచారం. * నథింగ్ ఫోన్ (1) భారత్ లో జులై 12 న రాత్రి 8.30 గంటలకు లాంచ్ అవుతోంది. Nothing Phone (1) టీయూవీ సర్టిఫికేషన్స్ ని గమనిస్తే నిర్ధిష్టంగా లేని ఛార్జింగ్ స్పీడ్స్ కనిపిస్తున్నాయి. టిప్ స్టర్ ముకుల్ శర్మ షేర్ చేసిన నథింగ్ […]

The post Nothing Phone (1) ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* నథింగ్ ఫోన్ (1) 33 వాట్ సపోర్ట్ తో వస్తోందని టీయూవీ సర్టిఫికేషన్ రివీల్ చేసింది.

* అయితే 45 వాట్ మాగ్జిమమ్ సపోర్ట్ ఉండనున్నట్లు సమాచారం.

* నథింగ్ ఫోన్ (1) భారత్ లో జులై 12 న రాత్రి 8.30 గంటలకు లాంచ్ అవుతోంది.

Nothing Phone (1) టీయూవీ సర్టిఫికేషన్స్ ని గమనిస్తే నిర్ధిష్టంగా లేని ఛార్జింగ్ స్పీడ్స్ కనిపిస్తున్నాయి. టిప్ స్టర్ ముకుల్ శర్మ షేర్ చేసిన నథింగ్ ఫోన్ (1) TUV SUD లిస్టింగ్ లో 33W ఛార్జింగ్ సపోర్ట్ (11Vdc, 3A) మరియు 45W మాగ్జిమమ్ సపోర్ట్ అని ఉంది. గత నివేదికలు నథింగ్ ఫోన్ (1) 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుందని తెలిపాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నథింగ్ ఫోన్ (1) బాక్స్ లో ఛార్జర్ తో రావడం లేదు.

నథింగ్ ఫోన్ (1) క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778+ 5జీ చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత నథింగ్ ఓఎస్, డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ గ్లైప్ ఎల్ఈడీ లైట్ ఇంటర్ఫేస్ ను వెనుక భాగాన కలిగి ఉంది. తమిళనాడులో ఫోన్ తయారవ్వడం వల్లన భారత్ లో నథింగ్ ఫోన్ (1) సరసనమైన ధరలో లభించనుంది. జులై 12 న రాత్రి 8.30 గంటలకు భారత్ లో నథింగ్ ఫోన్ (1) లాంచ్ కి ముహూర్తం ఖరారైంది. ఫ్లిప్ కార్ట్, రిలయన్స్ డిజిటల్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

Nothing Phone (1) లాంచ్, ధర వివరాలు

TUV SUD లిస్టింగ్ ని బట్టి చూస్తే, నథింగ్ ఫోన్ (1) 33 వాట్ లేదా 45 వాట్ లలో ఏ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుందోనన్న దానిపై స్పష్టత లేదు. కానీ, టాక్ ని బట్టి చూస్తే, నథింగ్ ఫోన్ (1) బాక్స్ లో ఛార్జర్ తో రావడం లేదని తెలుస్తోంది. కొన్ని రోజులు ఆగితే గాని అసలు విషయం ఏంటో తెలిసేలా లేదు. నథింగ్ ఫోన్ (1) నలుపు, తెలుపు రంగుల్లో లభ్యం కానుంది. ధర రూ.35,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Nothing Phone (1) స్పెసిఫికేషన్స్

స్నాప్ డ్రాగన్ 778+ 5జీ చిప్సెట్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 33W/45W ఛార్జింగ్ సపోర్ట్, 6.43-అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత నథింగ్ ఓఎస్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 16ఎంపి సెల్పీ కెమెరా, 50ఎంపి మెయిన్ కెమెరా, 16ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా వంటి ఫీచర్లు నథింగ్ ఫోన్ (1) లో ఉండనున్నాయి.

The post Nothing Phone (1) ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే first appeared on 91Mobiles Telugu.

]]>