Flipkart Big Diwali Sale 2022 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 18 Oct 2022 15:07:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 అక్టోబర్ 19 నుంచి మొదలు కానున్న Flipkart Big Diwali Sale https://www.91mobiles.com/telugu/flipkart-big-diwali-sale-2022-date-revealed/ Tue, 18 Oct 2022 15:07:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=2956 హైలైట్స్ అక్టోబర్ 19 నుంచి మొదలు కానున్న Flipkart Big Diwali Sale సేల్ సందర్భంగా అన్ని కొనుగోళ్ళపై 10 శాతం డిస్కౌంట్ పొందనున్న ఎస్బీఐ యూజర్లు ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీలపై 80 శాతం వరకు డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్ ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ రివీల్ అయ్యింది. దీపావళి పండుగ ఇంకొన్ని రోజులే ఉన్న క్రమంలో ఫ్లిప్ కార్ట్ ఎన్నో ప్రొడక్ట్స్ పై డీల్స్, డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తోంది. ఇటీవలె […]

The post అక్టోబర్ 19 నుంచి మొదలు కానున్న Flipkart Big Diwali Sale first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • అక్టోబర్ 19 నుంచి మొదలు కానున్న Flipkart Big Diwali Sale
  • సేల్ సందర్భంగా అన్ని కొనుగోళ్ళపై 10 శాతం డిస్కౌంట్ పొందనున్న ఎస్బీఐ యూజర్లు
  • ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీలపై 80 శాతం వరకు డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్

ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ రివీల్ అయ్యింది. దీపావళి పండుగ ఇంకొన్ని రోజులే ఉన్న క్రమంలో ఫ్లిప్ కార్ట్ ఎన్నో ప్రొడక్ట్స్ పై డీల్స్, డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తోంది. ఇటీవలె బిగ్ బిలియన్ డేస్ సేల్ ని తీసుకొచ్చిన ఫ్లిప్ కార్ట్ తాజాగా బిగ్ దివాళీ సేల్ తో జనాల ముందుకు వచ్చింది. వాల్ మార్ట్ యొక్క సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్, ఎస్బీఐ తో కలిసి 10 శాతం అదనపు డిస్కౌంట్ ని దివాళీ సేల్ సందర్భంగా అందించబోతోంది.

Flipkart బిగ్ దివాళీ సేల్ తేదీ

అక్టోబర్ 19 నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న ఈ సేల్ ముగుస్తుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ కి అక్టోబర్ 18 నుంచి సేల్ అందుబాటులో ఉంటుంది. సేల్ సందర్భంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లు 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా నెరిపే ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు కూడా ఇది వర్తిస్తుంది.

ఇదే కాకుండా, పేటీఎమ్ వ్యాలెట్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా జరిపే లావాదేవీలపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతే కాదండోయ్, ఫ్లిప్ కార్ట్ పే లేటర్ విధానం ద్వారా కొనుగోళ్ళు జరిపే అవకాశం కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. స్మార్ట్ ఫోన్ కొనేవారికి రూ.199 కే మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ లభిస్తుంది.

ల్యాప్ టాప్స్, స్మార్ట్ వాచెస్, స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ తదితర వాటిపై ఫ్లిప్ కార్ట్ డీల్స్ ని అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజం సౌండ్ బార్స్ ని రూ.1000 లోపు ధరలో అందిస్తోంది. సేల్ సమయంలో కొనుగోలుదారులు, అన్ని ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీలపై 80 శాతం వరకు డిస్కౌంట్ ని పొందే అవకాశం ఉంది.

ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన డీల్స్ ని రివీల్ చేయలేదు. కానీ, వెబ్ సైట్ లో రియల్మీ, పోకో, ఒప్పో, రెడ్మీ తదితర స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్స్ కనిపిస్తున్నాయి. టీవీలు, హోమ్ అప్లయన్సెస్ పై ఫ్లిప్ కార్ట్ 80 శాతం వరకు డిస్కౌంట్ ని ప్రకటించింది.

ఇటీవలె బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఎన్నో ఆఫర్లను తీసుకొచ్చిన ఫ్లిప్ కార్ట్ ఆ సేల్ ని ఘనంగా ముగించింది. ఇప్పుడు దీపావళి పండుగ సీజన్ ను క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే బిగ్ దివాళీ సేల్ అనే పేరుతో మరొక సేల్ తో జనాల ముందుకు వచ్చింది. ఈ సేల్ లో ఎన్నో ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ ని ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. ఇందులో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి ఎస్బీఐ కస్టమర్లకు ఈ సేల్ ద్వారా లాభం చేకూరనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post అక్టోబర్ 19 నుంచి మొదలు కానున్న Flipkart Big Diwali Sale first appeared on 91Mobiles Telugu.

]]>
అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న Flipkart Big Diwali Sale: SBI, Kotak బ్యాంక్ ఆఫర్స్, మొబైల్ డీల్స్ ఇంకా మరెన్నో..!! https://www.91mobiles.com/telugu/flipkart-big-diwali-sale-2022-bank-offers/ Mon, 10 Oct 2022 16:40:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=2840 హైలైట్స్: ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ కి అందుబాటులో ఉన్న సేల్ రేపటి నుంచి అందరికీ అందుబాటులోకి రానున్న Flipkart Big Diwali Sale సేల్ సందర్భంగా Realme GT Neo 3T, Google Pixel 6a, Xiaomi 11i HyperCharge, Galaxy S22+ ఇంకా మరెన్నో ఫోన్లపై డిస్కౌంట్ Flipkart ప్రస్తుతం Big Diwali Sale 2022 ని తీసుకొచ్చింది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ […]

The post అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న Flipkart Big Diwali Sale: SBI, Kotak బ్యాంక్ ఆఫర్స్, మొబైల్ డీల్స్ ఇంకా మరెన్నో..!! first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ కి అందుబాటులో ఉన్న సేల్
  • రేపటి నుంచి అందరికీ అందుబాటులోకి రానున్న Flipkart Big Diwali Sale
  • సేల్ సందర్భంగా Realme GT Neo 3T, Google Pixel 6a, Xiaomi 11i HyperCharge, Galaxy S22+ ఇంకా మరెన్నో ఫోన్లపై డిస్కౌంట్

Flipkart ప్రస్తుతం Big Diwali Sale 2022 ని తీసుకొచ్చింది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ పై డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ కి ఈ సేల్ అందుబాటులో ఉంది. అక్టోబర్ 11 నుంచి సేల్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇక అక్టోబర్ 16 తో సేల్ అందరికీ ముగుస్తుంది.

బిగ్ బిలియన్ డేస్ సేల్, బిగ్ దసరా సేల్ తర్వాత మూడోసారి దీపావళి సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది ఫ్లిప్ కార్ట్. ఈ సేల్ లో చాలా ప్రోడక్ట్స్ పై డీల్స్, ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది.

Flipkart Big Diwali Sale 2022: బ్యాంక్ ఆఫర్లు

ఏడు రోజుల పాటు కొనసాగే ఫ్లిప్ కార్ట్ సేల్ లో కొనుగోలుదారులు ఎటువంటి ఆఫర్లు పొందనున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

  • ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పై 10 శాతం డిస్కౌంట్, నాన్-ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.1,750, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.2,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్
  • కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై రూ.1750 వరకు నాన్-ఈఎంఐ డిస్కౌంట్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.2000 డిస్కౌంట్
  • పేటీఎం యూపీఐ, వాలెట్ పై రూ.125 వరకు క్యాష్ బ్యాక్
  • నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు
  • రూ.29,999 ఆపై క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై రూ.1000 బోనస్ డిస్కౌంట్

Flipkart Big Diwali Sale 2022: టాప్ ఆఫర్లు

సేల్ సందర్భంగా ఏయే స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్స్ లభించనున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.21,999 కి లభించనున్న Realme GT Neo 3T
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.12,499 కి లభించనున్న Vivo T1 44W
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.14,999 కి లభించనున్న Realme 9 5G SE
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.14,749 కి లభించనున్న Moto G62
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.13,999 కి లభించనున్న Poco X4 Pro 5G
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.20,499 కి లభించనున్న Xiaomi 11i HyperCharge
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.33,749 కి లభించనున్న Samsung Galaxy S21 FE 5G
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.56,749 కి లభించనున్న Samsung Galaxy S22+

పైన పేర్కొన్న స్మార్ట్ ఫోన్ల పైనే కాకుండా దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్స్ పై బ్యాంక్ ఆఫర్లు, అదనపు ఆఫర్లు సేల్ సమయంలో లభించనున్నాయి.

బిగ్ దివాళీ సేల్ సందర్భంగా స్మార్ట్ వాచెస్ పై కూడా ఆఫర్లు ఉన్నాయి. Apple watch సిరీస్ రూ.19,999 తో ప్రారంభమవుతుంది. ఇక మరెన్నో బడ్జెట్ వాచెస్ రూ.10,000 మరియు రూ.5,000 లోపు ధరలో లభిస్తున్నాయి. మీరు గనుక ఒక సూపర్బ్ వాచ్ కోసం చూస్తున్నట్లయితే, GalaxyWatch 4 ని రూ.10,499 కి కార్డ్ ఆఫర్స్ పై సొంతం చేసుకోవచ్చు.

స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు, ల్యాప్‌టాప్స్, ఫ్యాషన్ వేర్ తదితర వాటిపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న Flipkart Big Diwali Sale: SBI, Kotak బ్యాంక్ ఆఫర్స్, మొబైల్ డీల్స్ ఇంకా మరెన్నో..!! first appeared on 91Mobiles Telugu.

]]>