Flipkart Big Saving Days Sale - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sun, 16 Jul 2023 15:32:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Flipkart Big Saving Days సేల్‌లో iPhone 13 ధర రూ.56,999, Amazon Prime Day సేల్ లో iPhone 12 ధర రూ.52,999; రెండింట్లో ఏది బెస్ట్ డీల్? https://www.91mobiles.com/telugu/iphone-12-iphone-13-deals-flipkart-big-saving-days-amazon-prime-day-sale/ Sun, 16 Jul 2023 15:30:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=7196 అమెజాన్ ప్రైమ్ డే 2023 సేల్ మరియు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ స్పెషల్ సేల్స్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై మంచి డీల్స్ వచ్చాయి. iQOO Neo 7 Pro, iQOO 11 5G, Samsung Galaxy M34 తదితర ఎన్నో ఫోన్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్, రియల్మీ, షావోమి బ్రాండ్స్ ఫోన్లపై కూడా డీల్స్ ని మనం గమనించవచ్చు. సరే, మీరు గనుక ఐఫోన్ కొనాలని భావిస్తుంటే ఇదే […]

The post Flipkart Big Saving Days సేల్‌లో iPhone 13 ధర రూ.56,999, Amazon Prime Day సేల్ లో iPhone 12 ధర రూ.52,999; రెండింట్లో ఏది బెస్ట్ డీల్? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త ఐఫోన్ కొనాలనుకునే వారికి iPhone 12, 13 పై బెస్ట్ డీల్స్
  • ఫ్లిప్‌కార్ట్ లో భారీ డిస్కౌంట్ పై లభిస్తోన్న iPhone 13
  • అమెజాన్ లో తగ్గింపు ధరలో అందుబాటులో ఉన్న iPhone 12

అమెజాన్ ప్రైమ్ డే 2023 సేల్ మరియు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ స్పెషల్ సేల్స్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై మంచి డీల్స్ వచ్చాయి. iQOO Neo 7 Pro, iQOO 11 5G, Samsung Galaxy M34 తదితర ఎన్నో ఫోన్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్, రియల్మీ, షావోమి బ్రాండ్స్ ఫోన్లపై కూడా డీల్స్ ని మనం గమనించవచ్చు. సరే, మీరు గనుక ఐఫోన్ కొనాలని భావిస్తుంటే ఇదే మంచి సమయం. ఎందుకంటే, iPhone 12, iPhone 13 డివైజెస్ పై మంచి డీల్స్ వచ్చాయి.

రూ.52,499 ధరకి అమెజాన్ లో iPhone 12 ని సొంతం చేసుకోవచ్చు. మరోవైపు iPhone 13 ని ఫ్లిప్ కార్ట్ లో రూ.56,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆర్టికల్ లో రెండు డీల్స్ లో ఏది ఉత్తమమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

iPhone 12, iPhone 13 ఆఫర్ వివరాలు

అమెజాన్ లో ప్రస్తుతం iPhone 12 ధర రూ.53,999 గా ఉంది. ఇది 64జిబి వేరియంట్. ఈ ఫోన్ రెడ్, బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. దీనికి తోడు, యూజర్లు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ పై రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.52,999 కి తగ్గుతుంది. ఇక ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా ఫోన్ కొంటే ధర రూ.52,499 కి చేరుతుంది.

మరోవైపు, iPhone 13 డివైజ్ 128జిబి మోడల్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.57,999 గా ఉంది. ఈ ఫోన్ రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్, పింక్ మరియు స్టార్‌లైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇక బ్యాంక్ ఆఫర్స్ చూద్దాం. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.1000 డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఫోన్ ధర రూ.56,999 కి లభించనుంది. ఇంకా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొంటే రూ.2,900 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.55,099 కి చేరుతుంది.

iPhone 12 vs iPhone 13 స్పెసిఫికేషన్స్, పోలిక

రెండు ఫోన్ల మధ్య ధరలో రూ.5,000 వ్యత్యాసం ఉంది. మరి రెండు మోడల్స్ లో ఉన్న హెచ్చుతగ్గులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

పైన టేబుల్ లో కనిపిస్తున్న విధంగా, iPhone 13 లో అప్‌గ్రేడ్ కాబడిన ప్రాసెసర్ ఉంది. అలాగే భారీ బ్యాటరీ, రెట్టింపు స్టోరేజీ ఉన్నాయి. ఎస్ఈ వేరియంట్ కాకుండా రెగ్యులర్ సైజ్ ఐఫోన్ ని వాడాలనుకుంటే వారికి iPhone 12 బెస్ట్ ఆప్షన్ అవ్వవచ్చు. అయితే, ధరని బట్టి చూస్తే, iPhone 13 బెటర్ వాల్యూని అందిస్తుంది. అంతేకాదు, ఎక్కువ స్టోరేజీ ఈ ఫోన్ లో లభిస్తోంది. ఈరోజుల్లో స్టోరేజీ ప్రాధాన్యత ఏంటో మీకు తెలిసిందే.

ఇక మీరు గనుక టైట్ బడ్జెట్ లో ఉంటే, అదనంగా రూ.5,000 పెట్టలేకపోతే, అప్పుడు iPhone 12 కి వెళ్తే మంచిది. లేదంటే iPhone 13 ని ఎంచుకోండి.

The post Flipkart Big Saving Days సేల్‌లో iPhone 13 ధర రూ.56,999, Amazon Prime Day సేల్ లో iPhone 12 ధర రూ.52,999; రెండింట్లో ఏది బెస్ట్ డీల్? first appeared on 91Mobiles Telugu.

]]>
Google Pixel 7 Pro, Pixel 7 స్మార్ట్‌ఫోన్లపై రూ.15,000 డిస్కౌంట్! https://www.91mobiles.com/telugu/google-pixel-7-pro-pixel-7-price-cut-bank-offers-flipkart-big-saving-days-sale/ Tue, 02 May 2023 10:17:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=6126 మే 4 వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలవుతోంది. ఈ సేల్ సందర్భంగా స్మార్ట్ ఫోన్లతో పాటు ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. రానున్న సేల్ లో లభించనున్న ఆఫర్లు, డీల్స్ ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్ కార్ట్ టీజ్ చేస్తోంది. తాజాగా ఫ్లిప్ కార్ట్ Pixel 7, Pixel 7 Pro ఫోన్ల డీల్స్ ని రివీల్ చేసింది. ఓసారి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం పదండి. […]

The post Google Pixel 7 Pro, Pixel 7 స్మార్ట్‌ఫోన్లపై రూ.15,000 డిస్కౌంట్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Google Pixel 7 Pro లాంచ్ ధర రూ.84,999
  • ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ధర రూ.69,999
  • డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ పై 10 శాతం క్యాష్‌బ్యాక్

మే 4 వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలవుతోంది. ఈ సేల్ సందర్భంగా స్మార్ట్ ఫోన్లతో పాటు ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. రానున్న సేల్ లో లభించనున్న ఆఫర్లు, డీల్స్ ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్ కార్ట్ టీజ్ చేస్తోంది. తాజాగా ఫ్లిప్ కార్ట్ Pixel 7, Pixel 7 Pro ఫోన్ల డీల్స్ ని రివీల్ చేసింది. ఓసారి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Google Pixel 7 Pro, Pixel 7 ఫ్లిప్‌కార్ట్ ఆఫర్

Google Pixel 7 Pro డివైజ్ భారత్ లో రూ.84,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ లో రూ.69,999 కి కొనుగోలు చేయవచ్చు. అలాగే కొన్ని ఎంపిక చేయబడిన బ్యాంక్స్ యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, పాత ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ అదనంగా రూ.28,250 ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ అందిస్తోంది.

మే 4 నుంచి ఫ్లిప్ కార్ట్ లో మొదలయ్యే సేల్ సందర్భంగా Google Pixel 7 Pro స్మార్ట్ ఫోన్ ని రూ.65,999 కి కొనుగోలు చేయవచ్చు. ఇది ఎక్స్‌చేంజ్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ కలపుకుని అని గమనించాలి. Google Pixel 7 Pro స్మార్ట్ ఫోన్ బ్లాక్, వైట్ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 12జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీని కలిగి ఉంది.

Google Pixel 7 స్మార్ట్ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా రూ.15000 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ గూగుల్ ఫోన్ ధర రూ.69,999 గా ఉంది. సేల్ సందర్భంగా ఫోన్ ని రూ.44,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ధర బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్, ప్రైస్ కట్ కలుపుకుని అని గమనించాలి. Google Pixel 7 ఫోన్ లైమ్, వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లభిస్తుంది.

Google Pixel 7 మరియు Google Pixel 7 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Google Pixel 7 Pro లో 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. Google Pixel 7 లో 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్

Google Pixel 7 Pro, Google Pixel 7 ఫోన్లలో టెన్సర్ జీ2 ప్రాసెసర్ వాడారు. ఈ చిప్సెట్ ని గూగుల్ సొంతంగా అభివృద్ధి చేసింది.

కెమెరా

Google Pixel 7 Pro లో 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 48ఎంపి టెలీఫోటో కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. Google Pixel 7 లో 50ఎంపి వైడ్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలో కూడా 10.8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ

Google Pixel 7 Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. Google Pixel 7 లో 4355 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. రెండు ఫోన్లు 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి. ఈ పిక్సెల్ స్మార్ట్ ఫోన్లు Qi-cert వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ కలిగి ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ

Google Pixel 7 Pro లో 12జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. Google Pixel 7 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

Flipkart Big Saving Days Sale

ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 4 నుంచి మొదలవుతుంది. సేల్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ఓ ఉన్న ప్రొడక్ట్స్ పై 80 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. సేల్ గురించి టీజ్ చేస్తూ ఫ్లిప్ కార్ట్.. ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం, టీవీ మరియు ఇతర ఉపకరణాలపై 70 శాతం, దుస్తులు మరియు షూస్ పై 80 శాతం డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Google Pixel 7 Pro, Pixel 7 స్మార్ట్‌ఫోన్లపై రూ.15,000 డిస్కౌంట్! first appeared on 91Mobiles Telugu.

]]>
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్: OPPO, POCO, Realme, Redmi, Vivo, Pixel ఫోన్లపై డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/flipkart-big-saving-days-sale-offers-smartphones-home-appliances/ Fri, 16 Dec 2022 07:56:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=4021 హైలైట్స్ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 21 వరకు కొనసాగనున్న Flipkart Big Saving Days సేల్ సేల్ లో భాగంగా వివిధ ఉత్పత్తులపై డిస్కౌంట్ ఆఫర్లు OPPO K10, POCO M4 Pro 5G, Realme 9i, Redmi 9i Sport, Vivo T1 44W, Realme C35, Google Pixel 6A ఫోన్లపై డిస్కౌంట్ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రకటించింది. డిసెంబర్ 16 నుంచి, అంటే […]

The post ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్: OPPO, POCO, Realme, Redmi, Vivo, Pixel ఫోన్లపై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 21 వరకు కొనసాగనున్న Flipkart Big Saving Days సేల్
  • సేల్ లో భాగంగా వివిధ ఉత్పత్తులపై డిస్కౌంట్ ఆఫర్లు
  • OPPO K10, POCO M4 Pro 5G, Realme 9i, Redmi 9i Sport, Vivo T1 44W, Realme C35, Google Pixel 6A ఫోన్లపై డిస్కౌంట్

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రకటించింది. డిసెంబర్ 16 నుంచి, అంటే నేటి నుంచి ఈ సేల్ మొదలైంది. డిసెంబర్ 21 వరకు సేల్ కొనసాగుతుంది. ఏడాది చివర్లో వచ్చిన ఈ స్పెషల్ సేల్ పలు ఉత్పత్తులపై డిస్కౌంట్స్ ని తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, గృహోపకరణాలు, కిచెన్ యాక్ససరీస్, లైఫ్‌స్టైల్ తదితర ప్రోడక్ట్స్ పై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.

బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా అందుబాటులో ఉంటాయని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఇంకా ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి 5 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది. ఇకపోతే ఫ్లిప్ కార్ట్ పే లేటర్ ఆప్షన్ తో యూజర్లు రూ.250 గిఫ్ట్ కార్డ్ పొందుతారు.

స్మార్ట్‌ఫోన్ డీల్స్

ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్స్ డీల్స్ ని రివీల్ చేసింది. సేల్ లో భాగంగా, ఒప్పో, పోకో, రెడ్మీ, రియల్మీ, వివో, గూగుల్ పిక్సెల్ ఫోన్లపై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఇక్కడ కొన్ని డీల్స్ ని మీకోసం అందిస్తున్నాం. ఓసారి ఆ జాబితాపై కన్నేయండి.

OPPO K10 లాంచ్ ధర రూ.14,990 కాగా, సేల్ లో భాగంగా రూ.12,990 కే లభిస్తోంది.

POCO M4 Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ ధర రూ.10,999 కాగా, సేల్ సమయంలో రూ.9,999 కే లభిస్తోంది.

POCO X4 Pro 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ ధర రూ.18,999 కాగా, సేల్ లో భాగంగా రూ.14,499 కే లభిస్తోంది.

Realme 9i స్మార్ట్ ఫోన్ లాంచ్ ధర రూ.13,999 కాగా, సేల్ సమయంలో రూ.11,499 కే లభించనుంది.

Redmi 9i Sport స్మార్ట్ ఫోన్ లాంచ్ ధర రూ.7,999 కాగా, సేల్ లో భాగంగా రూ.7,099 కే లభిస్తోంది.

Vivo T1 44W డివైజ్ రూ.14,499 ధరతో లాంచైంది. అయితే సేల్ లో భాగంగా ఈ ఫోన్ రూ.13,499 కే లభిస్తోంది.

Realme C35 లాంచ్ ధర రూ.11,999 కాగా, లాంచ్ సమయంలో ఈ ఫోన్ రూ.10,999 కే లభిస్తోంది.

Google Pixel 6A ఫోన్ రూ.43,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే సేల్ సమయంలో రూ.28,999 కే లభిస్తోంది.

ఇవే కాకుండా ఇంకా మరెన్నో డీల్స్ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో లభిస్తున్నాయి. ఓసారి అన్ని డీల్స్ ని చెక్ చేసి, మీకు సరైనదేదో ఎంచుకోండి. ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్: OPPO, POCO, Realme, Redmi, Vivo, Pixel ఫోన్లపై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్: POCO C31, M4 Pro 5G, X4 Pro 5G, F4 5G ఫోన్లపై డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/flipkart-big-saving-days-sale-offers-poco-phones/ Tue, 13 Dec 2022 14:08:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=3972 హైలైట్స్ ఫ్లిప్ కార్ట్ లో డిసెంబర్ 16 నుంచి మొదలు కానున్న సేవింగ్ డేస్ సేల్ సేల్ లో భాగంగా POCO C31, M4 Pro 5G, X4 Pro 5G లతో పాటు ఇతర ఫోన్లపై డిస్కౌంట్ డిసెంబర్ 21 వరకు కొనసాగనున్న Flipkart Big Saving Days Sale ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ POCO మరోసారి ఆఫర్లతో వచ్చింది. 2022 డిసెంబర్ 16 న మొదలు కానున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ […]

The post Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్: POCO C31, M4 Pro 5G, X4 Pro 5G, F4 5G ఫోన్లపై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఫ్లిప్ కార్ట్ లో డిసెంబర్ 16 నుంచి మొదలు కానున్న సేవింగ్ డేస్ సేల్
  • సేల్ లో భాగంగా POCO C31, M4 Pro 5G, X4 Pro 5G లతో పాటు ఇతర ఫోన్లపై డిస్కౌంట్
  • డిసెంబర్ 21 వరకు కొనసాగనున్న Flipkart Big Saving Days Sale

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ POCO మరోసారి ఆఫర్లతో వచ్చింది. 2022 డిసెంబర్ 16 న మొదలు కానున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ లో పోకో తన ఫోన్లపై డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ సేల్ డిసెంబర్ 21 వరకు కొనసాగనుంది. POCO C31, M4 Pro 5G, X4 Pro 5G, POCO F4 5G లపై పోకో సంస్థ డిస్కౌంట్స్ ప్రకటించింది.

అంతేకాదు, ఈ డిస్కౌంట్స్ తో పాటు ఎస్బీఐ, కొటక్ మహీంద్ర బ్రాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా డిస్కౌంట్స్ లభించనున్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రూ.2,000 డిస్కౌంట్ ఇస్తుండగా, కొటక్ బ్యాంక్ రూ.1000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. కొటక్ మహింద్రా బ్యాంక్ ఆఫర్ డిసెంబర్ 13 నుంచి అందుబాటులో ఉంది.

ఫ్లిప్ కార్ట్ సేవింగ్స్ డేస్ సేల్ సందర్భంగా ఏయే పోకో స్మార్ట్ ఫోన్స్ పై డిస్కౌంట్స్ లభించనుందో ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చూడండి.

Flipkart Big Saving Days Sale Offers

POCO C31

POCO C31 స్మార్ట్ ఫోన్ 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ అసలు ధర రూ.10,999 కాగా, ఆఫర్ లో రూ.6,499 కే లభిస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్, 6.53-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ డివైజ్ రాయల్ బ్లూ, షాడో గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

POCO M4 Pro 5G

POCO M4 Pro 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ ప్రస్తుతం రూ.12,249 కే లభిస్తోంది. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్, 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది. ఈ డివైజ్ పవర్ బ్లాక్, కూల్ బ్లూ, యెల్లో కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

POCO X4 Pro 5G

POCO X4 Pro 5G స్మార్ట్ ఫోన్ బేస్ మోడల్ ధర రూ.18,999 గా ఉండగా, ఆఫర్ లో ప్రస్తుతం రూ.14,449 కే లభిస్తోంది. ఈ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ వినియోగించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపి మ్యాక్రో కెమెరా, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

POCO M4 5G

POCO M4 5G స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రూ.10,549 కే లభిస్తోది. ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. 6.58-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

POCO M4 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

POCO F4 5G

POCO F4 5G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 కాగా, ప్రస్తుతం ఆఫర్ లో రూ.22,999 కే లభిస్తోంది. POCO F4 5G డివైజ్ లో హెచ్డీఆర్10+ సర్టిఫైడ్ స్క్రీన్, 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇంకా 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్: POCO C31, M4 Pro 5G, X4 Pro 5G, F4 5G ఫోన్లపై డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>