మే 4 వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలవుతోంది. ఈ సేల్ సందర్భంగా స్మార్ట్ ఫోన్లతో పాటు ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. రానున్న సేల్ లో లభించనున్న ఆఫర్లు, డీల్స్ ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్ కార్ట్ టీజ్ చేస్తోంది. తాజాగా ఫ్లిప్ కార్ట్ Pixel 7, Pixel 7 Pro ఫోన్ల డీల్స్ ని రివీల్ చేసింది. ఓసారి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం పదండి.
Google Pixel 7 Pro, Pixel 7 ఫ్లిప్కార్ట్ ఆఫర్
Google Pixel 7 Pro డివైజ్ భారత్ లో రూ.84,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ లో రూ.69,999 కి కొనుగోలు చేయవచ్చు. అలాగే కొన్ని ఎంపిక చేయబడిన బ్యాంక్స్ యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, పాత ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ అదనంగా రూ.28,250 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అందిస్తోంది.
మే 4 నుంచి ఫ్లిప్ కార్ట్ లో మొదలయ్యే సేల్ సందర్భంగా Google Pixel 7 Pro స్మార్ట్ ఫోన్ ని రూ.65,999 కి కొనుగోలు చేయవచ్చు. ఇది ఎక్స్చేంజ్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ కలపుకుని అని గమనించాలి. Google Pixel 7 Pro స్మార్ట్ ఫోన్ బ్లాక్, వైట్ మరియు గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 12జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీని కలిగి ఉంది.
Google Pixel 7 స్మార్ట్ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా రూ.15000 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ గూగుల్ ఫోన్ ధర రూ.69,999 గా ఉంది. సేల్ సందర్భంగా ఫోన్ ని రూ.44,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ధర బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్, ప్రైస్ కట్ కలుపుకుని అని గమనించాలి. Google Pixel 7 ఫోన్ లైమ్, వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లభిస్తుంది.
Google Pixel 7 మరియు Google Pixel 7 Pro స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
Google Pixel 7 Pro లో 6.7-ఇంచ్ క్యూహెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. Google Pixel 7 లో 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్
Google Pixel 7 Pro, Google Pixel 7 ఫోన్లలో టెన్సర్ జీ2 ప్రాసెసర్ వాడారు. ఈ చిప్సెట్ ని గూగుల్ సొంతంగా అభివృద్ధి చేసింది.
కెమెరా
Google Pixel 7 Pro లో 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 48ఎంపి టెలీఫోటో కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. Google Pixel 7 లో 50ఎంపి వైడ్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్లలో కూడా 10.8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ
Google Pixel 7 Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. Google Pixel 7 లో 4355 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. రెండు ఫోన్లు 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి. ఈ పిక్సెల్ స్మార్ట్ ఫోన్లు Qi-cert వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ కలిగి ఉన్నాయి.
ర్యామ్, స్టోరేజీ
Google Pixel 7 Pro లో 12జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. Google Pixel 7 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
Flipkart Big Saving Days Sale
ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 4 నుంచి మొదలవుతుంది. సేల్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ఓ ఉన్న ప్రొడక్ట్స్ పై 80 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. సేల్ గురించి టీజ్ చేస్తూ ఫ్లిప్ కార్ట్.. ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం, టీవీ మరియు ఇతర ఉపకరణాలపై 70 శాతం, దుస్తులు మరియు షూస్ పై 80 శాతం డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











