#Flipkart - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 11 Nov 2023 11:46:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo దీపావళి ఆఫర్స్: Vivo X90, V29, Y-సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్! https://www.91mobiles.com/telugu/vivo-diwali-offers-discount-cashback-on-vivo-x90-v29-y200/ Wed, 08 Nov 2023 14:41:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=8760 ప్రస్తుత పండుగ సీజన్ లో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo దీపావళి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. Vivo X90 సిరీస్, Vivo V29 సిరీస్, Vivo Y-సిరీస్ ఫోన్లపై ఈ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. వివో ఫోన్ కొనాలని అనుకుంటోన్న వారికి ఇదే మంచి సమయమని చెప్పవచ్చు. సరే, ఓసారి Vivo స్మార్ట్‌ఫోన్లపై ప్రస్తుతం లభిస్తోన్న ఆఫర్స్, డీల్స్ వివరాలను తెలుసుకుందాం పదండి. Vivo ఫోన్లపై దీపావళి ఆఫర్లు నవంబర్ 1 న మొదలైన వివో స్మార్ట్‌ఫోన్ డీల్స్ […]

The post Vivo దీపావళి ఆఫర్స్: Vivo X90, V29, Y-సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • X90, V29 సిరీస్‌లపై దీపావళి ఆఫర్స్
  • నవంబర్ 15 వరకు అందుబాటులో డీల్స్
  • Vivo Y200 5G పై రూ.2,500 క్యాష్‌బ్యాక్

ప్రస్తుత పండుగ సీజన్ లో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo దీపావళి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. Vivo X90 సిరీస్, Vivo V29 సిరీస్, Vivo Y-సిరీస్ ఫోన్లపై ఈ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. వివో ఫోన్ కొనాలని అనుకుంటోన్న వారికి ఇదే మంచి సమయమని చెప్పవచ్చు. సరే, ఓసారి Vivo స్మార్ట్‌ఫోన్లపై ప్రస్తుతం లభిస్తోన్న ఆఫర్స్, డీల్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo ఫోన్లపై దీపావళి ఆఫర్లు

  • నవంబర్ 1 న మొదలైన వివో స్మార్ట్‌ఫోన్ డీల్స్ నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటాయి.
  • ఆఫర్ లో భాగంగా, కస్టమర్లు Vivo X90 పై రూ.10,000 వరకు మరియు Vivo V29 సిరీస్ ఫోన్లపై రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
  • నివేదికల ప్రకారం, ఐసీఐసీఐ, ఎస్బీఐ, హెచ్ఎస్‌బీసీ, యస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మరియు వన్‌కార్డ్ లపై క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది.
  • ఈ పండుగ సీజన్ లో Vivo X మరియు Vivo V సిరీస్ ఫోన్లను ఈఎంఐ ద్వారా కనిష్టంగా రూ.101 తో కొనుగోలు చేయవచ్చు.
  • ఇంకా స్పెషల్ సేల్ లో భాగంగా Vivo వి-షీల్డ్ ప్లాన్స్ పై 40 శాతం డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.
  • Vivo Y200 5G పై కస్టమర్లకు రూ.2,500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
  • Vivo Y56, Vivo Y27 డివైజెస్ పై కస్టమర్లు రూ.1,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఐసీఐసీఐ, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా, వన్‌కార్డ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందవచ్చు.
  • కస్టమర్లు ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను రిటైల్ స్టోర్స్ మరియు ఆథరైజ్డ్ పార్ట్నర్ స్టోర్స్ వద్ద పొందవచ్చు.

ఈ-కామర్స్ సంస్థ Flipkart బిగ్ దీవాళీ సేల్ ని ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఎన్నో ఆసక్తికరమైన డీల్స్ కస్టమర్ల కోసం వచ్చాయి. Apple iPhone 14, Google Pixel 7a, Nothing Phone (2), Samsung Galaxy S21 FE 5G, Vivo T2 Pro 5G, Motorola Edge 40, OPPO Reno 10 5G, POCO F5 5G, POCO X5 Pro 5G, Redmi Note 12 Pro 5G, Realme 11 Pro 5G, Samsung Galaxy F14 5G తదితర ఫోన్లపై ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

The post Vivo దీపావళి ఆఫర్స్: Vivo X90, V29, Y-సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్! first appeared on 91Mobiles Telugu.

]]>
Flipkart లో ల్యాప్ టాప్ ఆర్డర్ పెడితే బట్టలు ఉతికే సబ్బులు వచ్చాయి..!! https://www.91mobiles.com/telugu/flipkart-wrong-delivery-laptop-detergent-soaps/ Wed, 28 Sep 2022 12:09:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=2624 హైలైట్స్: ఫ్లిప్ కార్ట్ లో రూ.50 వేల విలువజేసే ల్యాప్ టాప్ ఆర్డర్ పెట్టిన కస్టమర్ ఆర్డర్ బాక్స్ ఓపెన్ చేసి చూడగా డిటర్జెంట్ సబ్బులు ప్రత్యక్షం ఐఐఎం విద్యార్థి యశస్వీ శర్మకు ఎదురైన వింత అనుభవం ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ హడావుడి కొనసాగుతోంది. అయితే షాపింగ్ సందడిలో వినియోగదారులకు షాకులు కూడా తగులుతున్నాయి. తాజాగా ఐఐఎం-అహ్మదాబాద్ విద్యార్థి యశస్వీ శర్మ ఫ్లిప్ కార్ట్ లో రూ.50,000 విలువ గల ల్యాప్ […]

The post Flipkart లో ల్యాప్ టాప్ ఆర్డర్ పెడితే బట్టలు ఉతికే సబ్బులు వచ్చాయి..!! first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఫ్లిప్ కార్ట్ లో రూ.50 వేల విలువజేసే ల్యాప్ టాప్ ఆర్డర్ పెట్టిన కస్టమర్
  • ఆర్డర్ బాక్స్ ఓపెన్ చేసి చూడగా డిటర్జెంట్ సబ్బులు ప్రత్యక్షం
  • ఐఐఎం విద్యార్థి యశస్వీ శర్మకు ఎదురైన వింత అనుభవం

ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ హడావుడి కొనసాగుతోంది. అయితే షాపింగ్ సందడిలో వినియోగదారులకు షాకులు కూడా తగులుతున్నాయి. తాజాగా ఐఐఎం-అహ్మదాబాద్ విద్యార్థి యశస్వీ శర్మ ఫ్లిప్ కార్ట్ లో రూ.50,000 విలువ గల ల్యాప్ టాప్ ని తన తండ్రి కోసం ఆర్డర్ పెట్టాడు. అయితే పార్సెల్ బాక్స్ ఓపెన్ చేసిన వారికి గట్టి షాక్ తగిలింది. ల్యాప్ టాప్ ఉంటుందని భావిస్తే, బాక్స్ లో బట్టలు ఉతుక్కునే సబ్బులు కనిపించాయి.

తన తప్పుని ఒప్పుకోని Flipkart

బాక్సులో సబ్బుల్ని వచ్చాయని ఫ్లిప్ కార్ట్ కస్టమర్ కేర్ కి తెలపగా, తాము ఈ విషయంలో ఏమీ చేయలేమని కస్టమర్ కేర్ సేవా ప్రతినిధి తెలిపినట్లు బాధితుడు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. మరొక విషయం ఏంటంటే, ఆ ప్రోడక్ట్ కి రిటర్న్ పాలసీ లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక సోషల్ మీడియా ద్వారా తన అనుభవాన్ని పంచుకున్నాడు సదరు వినియోగదారుడు.

బాక్స్ తెరిచి అందులో ఆర్డర్ చేసిన వస్తువు ఉంటేనే డెలివరీ ఎగ్జిక్యూటివ్ కి ఓటీపీ చెప్పాలనే నిబంధన తన తండ్రికి తెలియకపోవడంతో పార్సెల్ ని అలాగే తీసుకున్నారని యశస్వీ తెలిపాడు. అయితే ఘటన నిజమేనని నిరూపించేందుకు తన వద్ద సీసీటీవీ రికార్డింగ్స్ ఉన్నాయని యశస్వీ చెప్పాడు. అయితే పార్సెల్ ఓపెన్ చేశాకే ఓటీపీ పంపాలని లేదంటే తాము చేసేదేమీ లేదని ఫ్లిప్ కార్ట్ చేతులెత్తేసిందని సదరు కస్టమర్ తెలిపాడు.

ఫ్లిప్ కార్ట్ అష్యూర్డ్ నుంచి పార్సెల్ వస్తుండటంతో తన తండ్రి నేరుగా బాక్స్ ని తెరచి చూశారని యశస్వీ అన్నాడు. అలాగే డెలివరీ ఎగ్జిక్యూటివ్ కూడా ఓటీపీ అడిగే ముందు బాక్స్ కాన్సెప్ట్ గురించి తన తండ్రికి ముందుగా చెప్పలేదని యశస్వీ చెప్పుకొచ్చాడు.

ఎట్టకేలకు స్టేట్మెంట్ తో వచ్చిన Flipkart

ఘటన తమ దృష్టికి వచ్చిన వెంటనే, కస్టమర్ కేర్ టీమ్ బాధిత కస్టమర్ కి మనీ రిఫండ్ ప్రాసెస్ ను మొదలుపెట్టిందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. 3 నుంచి 4 రోజుల్లో కస్టమర్ కి డబ్బులు రిటర్న్ అవుతాయని చెప్పింది. అలాగే తప్పు ఎక్కడ జరిగిందో విచారణ చేసి, వారిపై చర్యలు తీసుకుంటున్నామని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

ఓపెన్ బాక్స్ డెలివరీ ప్రాసెస్ లో భాగంగా, డెలివరీ పార్ట్నర్ పార్సెల్ ని కస్టమర్ ముందు తెరుస్తాడని, అప్పుడు కస్టమర్లు తాము ఆర్డర్ పెట్టిన వస్తువు ఉందో లేదో సరి చూసుకోవాలని అప్పుడే డెలివరీ ఎగ్జిక్యూటివ్ తో ఓటీపీ షేర్ చేయాలని ఫ్లిప్ కార్ట్ చెప్పింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Flipkart లో ల్యాప్ టాప్ ఆర్డర్ పెడితే బట్టలు ఉతికే సబ్బులు వచ్చాయి..!! first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో మొదలైన Realme GT Neo 3 Thor Love And Thunder ఎడిషన్ సేల్ https://www.91mobiles.com/telugu/realme-gt-neo-3-thor-love-and-thunder-edition-sale-begins-in-india/ Wed, 13 Jul 2022 10:17:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=937 హైలైట్స్: * Realme GT Neo 3 Thor Love And Thunder ఎడిషన్ సేల్ ప్రారంభం. * ఫ్లిప్ కార్ట్, రియల్ మీ వెబ్ సైట్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. * ఈ స్పెషల్ ఎడిషన్ స్పెషల్ థీమ్ తో వస్తోంది. అలాగే రిటైల్ బాక్స్ లో కస్టమ్ గుడీస్ వస్తాయి. రియల్ మీ జీటీ నియో 3 థోర్ లవ్ అండ్ థండర్ ఎడిషన్ ఫోన్ గత నెలలో భారత్ లో […]

The post భారత్ లో మొదలైన Realme GT Neo 3 Thor Love And Thunder ఎడిషన్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* Realme GT Neo 3 Thor Love And Thunder ఎడిషన్ సేల్ ప్రారంభం.

* ఫ్లిప్ కార్ట్, రియల్ మీ వెబ్ సైట్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

* ఈ స్పెషల్ ఎడిషన్ స్పెషల్ థీమ్ తో వస్తోంది. అలాగే రిటైల్ బాక్స్ లో కస్టమ్ గుడీస్ వస్తాయి.

రియల్ మీ జీటీ నియో 3 థోర్ లవ్ అండ్ థండర్ ఎడిషన్ ఫోన్ గత నెలలో భారత్ లో అడుగుపెట్టింది. ఇదొక స్పెషల్ ఎడిషన్, కస్టమ్ థీమ్ తో పాటు రిటైల్ బాక్స్ పర్సనలైజ్డ్ గూడీస్ తో వస్తుంది. అయితే రియల్ మీ జీటీ నియో 3 థోర్ లవ్ అండ్ థండర్ ఎడిషన్, స్టాండర్డ్ వేరియంట్ మాదిరిగానే ఫీచర్లను కలిగి ఉంది. ఇది 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి ఫీచర్లున్నాయి.

సెల్ఫీ షూటర్ కోసం రియల్ మీ జీటీ నియో 3 థోర్ లవ్ అండ్ థండర్ ఎడిషన్ ఫోన్లో పంచ్ హోల్ కటౌట్ ఉంది. వెనకాల ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. నైట్రో బ్లూ కలర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Realme GT Neo 3 Thor Love And Thunder ఎడిషన్ ధర, అమ్మకాలు

రియల్ మీ జీటీ నియో 3 థోర్ లవ్ అండ్ థండర్ ఎడిషన్ 12జిబి+256జిబి మోడల్ ధర రూ.42,999. రియల్ మీ అధికార వెబ్ సైట్ తో పాటు, ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ ని కొనవచ్చు. ప్రీ-ఆర్డర్ చేసిన కస్టమర్లు రూ.3,000 డిస్కౌంట్ పొందనున్నారు. దీంతో వారికి రూ.39,999 కే ఫోన్ సొంతం కానుంది.

ఈ స్పెషల్ ఎడిషన్ థోర్ లవ్ అండ్ థండర్ థీమ్ తో పాటు, Realme X Marvel Thor Love and Thunder లోగో తో వస్తుంది. ఇకపోతే, బాక్స్ లో కస్టమైజ్డ్ గూడీస్ ఉంటాయి. వీటితో పాటు ఇంకా స్టికర్స్, కార్డ్స్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్, ఒక మెడల్ ఉంటాయి.

Realme GT Neo 3 Thor Love and Thunder edition స్పెసిఫికేషన్స్

  • 6.7-అంగుళాల 10-బిట్ అమోలెడ్ ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8100
  • 12GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్ మీ యూఐ
  • 50MP + 8MP + 2MP ట్రిపుల్ కెమెరాలు
  • 16MP ఫ్రంట్ కెమెరా
  • 4,500mAh బ్యాటరీ, 150W ఫాస్ట్ ఛార్జింగ్

6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 10-బిట్ ప్యానెల్, సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్ మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు జీటీ నియో 3 థోర్ లవ్ అండ్ థండర్ ఎడిషన్ ఫోన్లో ఉన్నాయి.

ఇక కెమెరా విషయానికి వస్తే, రియల్ మీ జీటీ నియో 3 థోర్ లవ్ అండ్ థండర్ ఎడిషన్ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటి ఒకటి ఓఐఎస్ తో కూడిన 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్ కాగా, రెండోది 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, మూడోది 2ఎంపి మ్యాక్రో సెన్సర్. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు వైపున 16ఎంపి కెమెరాను అమర్చారు.

రియల్ మీ జీటీ నియో 3 థోర్ లవ్ అండ్ థండర్ ఎడిషన్ లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, జీటీ మోడ్ 3.0, 39606ఎంఎం స్క్వేర్ వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే, ఈ ఫోన్లో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post భారత్ లో మొదలైన Realme GT Neo 3 Thor Love And Thunder ఎడిషన్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
ఇన్వైట్ కోడ్ లేకుండానే నథింగ్ ఫోన్ (1) ని కొనవచ్చు, ఎలాగో ఇక్కడ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/without-invite-code-nothing-phone/ Thu, 07 Jul 2022 06:38:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=812 హైలైట్స్: * Nothing Phone (1) ప్రీ-ఆర్డర్ పాస్ ని రూ.2000 కి ఫ్లిప్ కార్ట్ నందు కొనుగోలు చేయవచ్చు. * అయితే వినియోగదారులు ఎటువంటి ఇన్వైట్ కోడ్ లేకుండానే పాస్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. * జులై 12 న నథింగ్ ఫోన్ (1) లాంచ్ అవుతోంది. జులై 12 న భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా నథింగ్ ఫోన్ (1) లాంచ్ అయ్యేందుకు సిద్దంగా ఉంది. తొలుత డిజైన్ ని […]

The post ఇన్వైట్ కోడ్ లేకుండానే నథింగ్ ఫోన్ (1) ని కొనవచ్చు, ఎలాగో ఇక్కడ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* Nothing Phone (1) ప్రీ-ఆర్డర్ పాస్ ని రూ.2000 కి ఫ్లిప్ కార్ట్ నందు కొనుగోలు చేయవచ్చు.

* అయితే వినియోగదారులు ఎటువంటి ఇన్వైట్ కోడ్ లేకుండానే పాస్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

* జులై 12 న నథింగ్ ఫోన్ (1) లాంచ్ అవుతోంది.

జులై 12 న భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా నథింగ్ ఫోన్ (1) లాంచ్ అయ్యేందుకు సిద్దంగా ఉంది. తొలుత డిజైన్ ని టీజ్ చేసిన కంపెనీ తర్వాత యూట్యూబ్ వీడియో లో పూర్తి స్థాయిలో విడుదల చేసింది. గ్లైప్ ఎల్ఈడీ లైట్ ఇంటర్ ఫేస్, ట్రాన్స్పరంట్ బ్యాక్ ప్యానెల్, పంచ్-హోల్ కటౌట్ తో వస్తున్న ఈ ఫోన్ నథింగ్ బ్రాండ్ నుంచి వస్తున్న తొలి ఫోన్. ఇన్వైట్ కోడ్ ద్వారా ప్రీ-ఆర్డర్ పాస్ లు పొందిన వారు మాత్రమే ఫోన్ ని కొనుగోలు చేయగలరని తొలుత కంపెనీ వెల్లడించింది. కానీ, తర్వాత ప్రణాళికలు మారుతున్నాయి.

ప్రస్తుతం నథింగ్ ఫోన్ (1) ప్రీ-ఆర్డర్ పాస్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. ఎటువంటి ఇన్వైట్ కోడ్ లేకుండానే, వినియోగదారులు ఈ ప్రీ-ఆర్డర్ పాస్ ని కొనుగోలు చేసి, ఫోన్ ని రిజర్వ్ చేసుకోవచ్చు. దీన్నిబట్టి, వినియోగదారులు ఇతరులకు రిఫర్ చేస్తూ, ఇన్వైట్ కోడ్ కోసం వేచి చూడనవసరం లేదని అర్థమవుతోంది.

నథింగ్ ఫోన్ (1) ప్రీ-ఆర్డర్ పాస్

నథింగ్ ఫోన్ (1) ప్రీ-ఆర్డర్ పాస్ ని ఫ్లిప్ కార్ట్ లో రూ.2000 చెల్లించి నేరుగా కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం ఎటువంటి ఇన్వైట్ కోడ్ అక్కర్లేదు. పాస్ ని కొన్న వినియోగదారులు జులై 12 రాత్రి 9 గంటల నుంచి జులై 18 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నథింగ్ ఫోన్ (1) ని కొనుగోలు చేసే అవకాశముంటుంది. ధర, స్పెసిఫికేషన్స్ ని ప్రకటించిన తర్వాత, ఏ కొనుగోలుదారుడైన ఫోన్ ని కొనవద్దని నిర్ణయించుకుంటే, వారికి రూ.2000 రిఫండ్ చేయబడతాయి.

నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్స్

ముకుల్ శర్మ పోస్ట్ ద్వారా నథింగ్ ఫోన్ (1) లైవ్ ఇమేజ్ ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. ఆ పిక్ ని బట్టి, ఈ ఫోన్ 120Hz అమోలెడ్ డిస్ప్లే తో వస్తుందని తెలుస్తోంది. అలాగే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను సెట్టింగ్స్ లో మార్చుకునే వీలు కూడా ఉంది.

నథింగ్ ఫోన్ (1) 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 778+ 5జీ చిప్సెట్, 12జిబి ఎల్పీడీడీఆర్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, నథింగ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

4,500 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తోన్న నథింగ్ ఫోన్ (1) 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంది. 5 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, డాల్బీ అట్మాస్, స్టీరియో స్పీకర్లు ఈ ఫోన్లో ఉంటాయని సమాచారం. ఇక కనెక్టివిటీ ఆప్షన్లు చూస్తే, 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఎన్ఎఫ్సీ వంటి ఫీచర్లున్నాయి.

ఇక కెమెరా విషయానికి వస్తే, నథింగ్ ఫోన్ (1) లో డ్యూయల్ కెమెరాలున్నాయి. 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 16ఎంపి సెకండరీ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు 16ఎంపి కెమెరా ఉంది.

The post ఇన్వైట్ కోడ్ లేకుండానే నథింగ్ ఫోన్ (1) ని కొనవచ్చు, ఎలాగో ఇక్కడ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>