Free data - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 05 May 2023 17:16:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ‘మహా రీచార్జ్’ ఆఫర్ తీసుకొచ్చిన వొడాఫోన్ ఐడియా; కస్టమర్లకు లభించనున్న 5జిబి ఉచిత డేటా! https://www.91mobiles.com/telugu/vodafone-idea-maha-recharge-offer-free-data/ Fri, 05 May 2023 17:16:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=6200 తమ కస్టమర్ల కోసం రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు సమయానుగుణంగా కొత్త ఆఫర్లు, స్కీమ్స్ ని తీసుకొస్తుంటాయి. కస్టమర్లను కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి ఆఫర్లు, స్కీమ్‌లు ప్రవేశపెడుతూ ఉండాల్సిందే. లేదంటే, కస్టమర్ తమకు నచ్చిన ఆఫర్లు ఇచ్చే నెట్వర్క్ కి మారేందుకు వెనకాడరు. ఇక విషయంలోకి వెళ్తే, వొడాఫోన్ ఐడియా సంస్థ తాజాగా ఒక కొత్త ఆఫర్ ని పరిచయం చేసింది. ఈ ఆఫర్ లో భాగంగా వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు 5జిబి డేటా […]

The post ‘మహా రీచార్జ్’ ఆఫర్ తీసుకొచ్చిన వొడాఫోన్ ఐడియా; కస్టమర్లకు లభించనున్న 5జిబి ఉచిత డేటా! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వీఐ యూజర్లకు లభించనున్న ఉచిత డేటా
  • మహా రీచార్జ్ ఆఫర్ పేరుతో వచ్చిన స్కీమ్
  • 5జిబి ఉచిత డేటాను పొందనున్న వీఐ కస్టమర్లు

తమ కస్టమర్ల కోసం రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు సమయానుగుణంగా కొత్త ఆఫర్లు, స్కీమ్స్ ని తీసుకొస్తుంటాయి. కస్టమర్లను కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి ఆఫర్లు, స్కీమ్‌లు ప్రవేశపెడుతూ ఉండాల్సిందే. లేదంటే, కస్టమర్ తమకు నచ్చిన ఆఫర్లు ఇచ్చే నెట్వర్క్ కి మారేందుకు వెనకాడరు. ఇక విషయంలోకి వెళ్తే, వొడాఫోన్ ఐడియా సంస్థ తాజాగా ఒక కొత్త ఆఫర్ ని పరిచయం చేసింది. ఈ ఆఫర్ లో భాగంగా వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు 5జిబి డేటా ఉచితంగా లభించనుంది. ఇది కూడా చదవండి: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023: బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్

వొడాఫోన్ ఐడియా యూజర్లు ఉచిత డేటా పొందడం ఎలా?

వీఐ తీసుకొచ్చిన మహా రీచార్జ్ ఆఫర్ లో భాగంగా వొడాఫోన్ ఐడియా కస్టమర్లు ఎవరైతే రీచార్జ్ చేస్తారో వారికి ఉచిత ఇంటర్నెట్ డేటా లభించనుంది. ఉచిత డేటా ప్రయోజనం 2జిబి నుంచి మొదలై, 5జిబి వరకు ఉంటుంది. ఇది కూడా చదవండి: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023: ల్యాప్‌టాప్స్ పై బెస్ట్ డీల్స్

వివరంగా మాట్లాడుకుంటే, వొడాఫోన్ ఐడియా స్కీమ్ ప్రకారం, ఏ వీఐ యూజర్ అయితే రూ.199 నుంచి రూ.299 మధ్య రీచార్జ్ చేస్తారో వారికి కంపెనీ 2జిబి డేటా ఇవ్వనుంది.

అదే విధంగా వీఐ కస్టమర్లు ఎవరైతే రూ.299 లేదా అంతకన్నా పైన రీచార్జ్ చేస్తారో, వారికి కంపెనీ 5జిబి ఉచిత డేటాను అందిస్తుంది.

వొడాఫోన్ ఐడియా ఉచిత డేటా వ్యాలిడిటీ ఎంత?

ఆఫర్ లో భాగంగా ఉచితంగా కస్టమర్ కి లభిస్తోన్న డేటా బెనిఫిట్ 3 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. కస్టమర్ రీచార్జ్ చేసిన తొలిరోజు నుంచి ఉచిత డేటా ప్రయోజనాన్ని వాడుకోవచ్చు. ఈ డేటా బెనిఫిట్ తదుపరి 3 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. అయితే మహా రీచార్జ్ ఆఫర్ ఎన్ని రోజుల పాటు అందుబాటులో ఉంటుందో తెలియదు. వొడాఫోన్ ఐడియా సంస్థ దీనికి సంబంధించి ఏ సమాచారం ఇవ్వలేదు.

ఉచిత డేటాను ఎవరు పొందవచ్చు?

వొడాఫోన్ ఐడియా మహా రీచార్జ్ ఆఫర్ కి అర్హత సాధించాలంటే, కస్టమర్లు కంపెనీ యొక్క అఫీషియల్ వీఐ యాప్ ద్వారా మాత్రమే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర యాప్స్ లేదా రిటైల్ షాపుల ద్వారా రీచార్జ్ చేస్తే, స్కీమ్ ద్వారా లభించే ప్రయోజనాన్ని పొందలేరు. ఇది కూడా చదవండి: Paytm UPI Lite సర్వీస్‌ని ఫోన్లో యాక్టివేట్ చేయడం ఎలా?

The post ‘మహా రీచార్జ్’ ఆఫర్ తీసుకొచ్చిన వొడాఫోన్ ఐడియా; కస్టమర్లకు లభించనున్న 5జిబి ఉచిత డేటా! first appeared on 91Mobiles Telugu.

]]>