విభిన్న కేటగిరీలకు చెందిన ఎన్నో ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ అందించే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023 ప్రారంభమైంది. ప్రముఖ బ్రాండ్స్ అయిన Samsung, Apple, OPPO, iQOO, Sony, Asus తదితర ఎన్నో కంపెనీలకు చెందిన ఉత్పత్తులు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తున్నాయి. సేల్ లో భాగంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు కూడా అందిస్తున్నారు. మీరు గనుక ఫోటోగ్రఫీ, గేమింగ్ కోసం లేదా 5జీ కనెక్టివిటీ గల ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటే వివిధ ధరల శ్రేణుల్లో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో మీకోసం అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేట్ లో అందుబాటులో ఉన్న ఆఫర్ల వివరాలను అందిస్తున్నాం. అంతేకాదు, ఈ ఇ-కామర్స్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ మరియు కొటక్ బ్యాంక్ లకు చెందిన క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ పై అలాగే ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్లపై లభిస్తోన్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ డీల్స్
Apple iPhone 14 (128 GB)
Apple iPhone 14 పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ లో 6.1-ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే, ప్రో-లెవెల్ 12ఎంపి డ్యూయల్ కెమెరా, ఆటో-ఫోకస్ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. మెరుగైన డీటెయిల్స్ మరియు రంగుల కొరకు Apple iPhone 14 లో ఫోటోనిక్ ఇంజిన్ అందించారు. స్మూద్ మరియు స్టేబుల్ వీడియోలను అందించేందుకు ఈ ఫోన్ లో యాక్షన్ మోడ్ అనే ఫీచర్ ఇచ్చారు. ఈ ఫోన్ లో ఏ15 బయోనిక్ చిప్ వాడారు. అలాగే ఈ డివైజ్ లో 5జీ కనెక్టివిటీ ఉంది.
అసలు ధర: రూ.71,999
డీల్ ధర: రూ.66,359 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలుపుకుని)
Apple iPhone 14 Plus (256 GB)
పెద్ద స్క్రీన్ స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారికి Apple iPhone 14 Plus డివైజ్ సరిగ్గా సరిపోతుంది. ఈ ఫోన్ 6.7-ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే ఉంది. Apple iPhone 14 Plus లో అడ్వాన్స్‌డ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో ఫోటోనిక్ ఇంజిన్ అందించారు. ఏ15 బయోనిక్ చిప్సెట్ ఉండటం వల్లన 26 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్ ని సింగిల్ చార్జ్ పై పొందవచ్చు. ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీతో వచ్చింది. ఈ ఫోన్ లో ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్ తో పాటు క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఉంది.
అసలు ధర: రూ.94,999
డీల్ ధర: రూ.74,999 (బ్యాంక్ డిస్కౌంట్స్ తో కలుపుకుని)
Samsung Galaxy M33 5G
Samsung Galaxy M33 5G డివైజ్ అద్భుతమైన ఆల్-రౌండర్ మిడ్ రేంజ్ ఫోన్. ఈ ఫోన్ 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎగ్జినోస్ 1280 ఆక్టా-కోర్ చిప్సెట్ తో వచ్చింది. Samsung Galaxy M33 5G లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి కెమెరా అందించారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంది. ఇంటెలిజెంట్ వాయిస్ ఫోకస్, పవర్ కూల్ టెక్నాలజీ, ఆటో డేటా స్విచింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అసలు ధర: రూ.17,999
డీల్ ధర: రూ.14,999 (అన్ని డిస్కౌంట్స్ కలిపి)
iQOO Z6 Lite 5G
iQOO Z6 Lite 5G గ్రేట్ మిడ్-రేంజ్ ఫోన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ఐ ఆటో ఫోకస్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ ఉన్నాయి.
అసలు ధర: రూ.13,999
డీల్ ధర: రూ.12,499 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)
Samsung Galaxy M14 5G
Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 90 హెర్ట్జ్ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్, వాయిస్ ఫోకస్, శాంసంగ్ వాలెట్, సెక్యూర్ ఫోల్డర్, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఎగ్జినోస్ 1330 చిప్సెట్ ఉన్నాయి. ఈ ఫోన్ 13 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.
అసలు ధర: రూ.16,490
డీల్ ధర: రూ.12,490 (అన్ని బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)
Redmi 12C
Redmi 12C ఒక చక్కటి బడ్జెట్ ఫోన్. ఈ ఫోన్ లో 6.71-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 500 నిట్స్ బ్రైట్నెస్, 50ఎంపి ఏఐ డ్యూయల్ కెమెరా, 5ఎంపి సెల్ఫీ కెమెరా, పొట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్ ఉన్నాయి. Redmi 12C డివైజ్ బ్యాక్ ప్యానెల్ స్ట్రైప్డ్ డిజైన్ తో వస్తోంది.
అసలు ధర: రూ.11,499
డీల్ ధర: రూ.8,999 (బ్యాంక్ డిస్కౌంట్ కలిపి)
Redmi 10A
Redmi 10A డివైజ్ బ్యూటిఫుల్ EVOL డిజైన్ తో వచ్చింది. ఈ బడ్జెట్ ఫోన్ లో 6.53-ఇంచ్ హెచ్డీ+ఐపీఎస్ డిస్ప్లే, 13ఎంపి రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ వాడారు.
అసలు ధర: రూ.8,999
డీల్ ధర: రూ.7,849 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)
Realme Narzo N55
Realme Narzo N55 స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ సమ్మర్ సేల్ లో భాగంగా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ లో 6.76-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ డిజైన్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 64ఎంపి ఏఐ కెమెరా ఉంది. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ ని ఈ ఫోన్ లో వాడారు. ఈ డివైజ్ లో డైనమిక్ ర్యామ్ ఫీచర్ ఉంది. పవర్ బ్యాకప్ కోసం 5000ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
అసలు ధర: రూ.12,999
డీల్ ధర: రూ.10,999 (అన్ని డిస్కౌంట్స్ కలిపి)
realme narzo 50i Prime
Realme Narzo 50i Prime స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 400 నిట్స్ బ్రైట్నెస్, 8ఎంపి రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 5జీ కనెక్టివిటీ లేదు. 4జీ నెట్వర్క్ సపోర్ట్ ఉంది. యూనిసాక్ టైగర్ టీ612 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు. మల్టీటాస్కింగ్ పెర్ఫామెన్స్ కోసం 4జిబి ర్యామ్ అందించారు.
అసలు ధర: రూ.8,999
డీల్ ధర: రూ.6,299 (అన్ని డిస్కౌంట్స్ కలిపి)
Samsung Galaxy M53 5G
Samsung Galaxy M53 5G డివైజ్ ప్రస్తుతం కొనసాగుతోన్న సేల్ లో ఉత్తమైన ఎంపిక అని చెప్పవచ్చు. ఈ పవర్ఫుల్ మిడ్-రేంజ్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్ వాడారు. ఈ ఫోన్ లో 5జీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 108ఎంపి క్వాడ్ కెమెరా, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో బిల్ట్-ఇన్ వేపర్ కూలింగ్ చాంబర్ అందించారు.
అసలు ధర: రూ.27,999
డీల్ ధర: రూ.23,249 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)
iQOO 11 5G
iQOO 11 5G స్మార్ట్ ఫోన్ సేల్ లో భాగంగా ఆకర్షణీయమైన ధరకి దొరుకుతోంది. ఈ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 2కే ఈ6 అమోలెడ్ 6.78-ఇంచ్ డిస్ప్లే, బిల్ట్-ఇన్ వేపర్ చాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, వీ2 చిప్ ఉన్నాయి. అలాగే 50ఎంపి జీఎన్5 అల్ట్రా-సెన్సింగ్ కెమెరా ని ఈ ఫోన్ లో అందించారు. ఈ ఫోన్ 120 వాట్ ఫ్లాష్ చార్జ్ సపోర్ట్ తో వచ్చింది.
అసలు ధర: రూ.64,990
డీల్ ధర: రూ.49,999 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

![Best camera phones: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు [అక్టోబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/10/Best-camera-phones-under-25k-oct-218x150.jpg?tr=q-70)
![Best performing phones: రూ.20,000 లోపు బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/10/Best-performing-phones-under-20k-sep-2024-218x150.jpg?tr=q-70)
![Fastest charging phones: రూ.25,000 లోపు ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024]](https://static.hub.91mobiles.com/multisite/wp-content/uploads/sites/3/2024/09/Fastest-charging-phones-under-25k-218x150.jpg?tr=q-70)








