Google Pixel 8 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 04 Oct 2023 17:41:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Android 14 OS తో భారత్‌లో లాంచైన Google Pixel 8, Pixel 8 Pro https://www.91mobiles.com/telugu/google-pixel-8-pixel-8-pro-launched-india-price-specs-availability/ Wed, 04 Oct 2023 17:41:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=8275 ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ నేడు భారత్ లో Google Pixel 8 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. లైనప్ లో భాగంగా Google Pixel 8 మరియు Google Pixel 8 Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. స్టైలిష్ లుక్, అడ్వాన్స్డ్ ఫీచర్స్, ఉత్తమమైన స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్లు వచ్చాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో Google Pixel 8 సిరీస్ లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Google Pixel 8 […]

The post Android 14 OS తో భారత్‌లో లాంచైన Google Pixel 8, Pixel 8 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Google Pixel 8 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Pixel 8, Pixel 8 Pro
  • Google Pixel 8 ధర రూ.75,999

ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ నేడు భారత్ లో Google Pixel 8 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. లైనప్ లో భాగంగా Google Pixel 8 మరియు Google Pixel 8 Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. స్టైలిష్ లుక్, అడ్వాన్స్డ్ ఫీచర్స్, ఉత్తమమైన స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్లు వచ్చాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో Google Pixel 8 సిరీస్ లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Google Pixel 8 Pro, Google Pixel 8 డివైజెస్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Google Pixel 8, Google Pixel 8 Pro ధర

Google Pixel 8 డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.75,999 గా ఉంది. Google Pixel 8 Pro 12జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.1,06,999 గా నిర్ణయించారు. ఈ రెండు ఫోన్లు అక్టోబర్ 14 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రీ-బుకింగ్ కి అందుబాటులోకి రానున్నాయి.

Google Pixel 8 Pro స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Google Pixel 8 Pro లో 6.7-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 1344*2992 పిక్సెల్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Google Pixel 8 Pro లో టెన్సర్ జీ3 చిప్సెట్ వాడారు. దీనికి టైటన్ ఎమ్2 సెక్యూరిటీ మైక్రో చిప్ ని జత చేశారు.

కెమెరా: Google Pixel 8 Pro లో 50ఎంపి వైడ్ యాంగిల్ ప్రైమరీ లెన్స్, 48ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 48ఎంపి 30x జూమ్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10.5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Google Pixel 8 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,050 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Google Pixel 8 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో వస్తోన్న మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ ఫోన్ 7 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ పొందనుంది. అంటే రాబోవు ఎన్నో ఆండ్రాయిడ్ వర్షన్స్ ఈ ఫోన్ లో రన్ అవుతాయన్నమాట.

Google Pixel 8 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Google Pixel 8 లో 6.2-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్, అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Google Pixel 8 లో టెన్సర్ జీ3 చిప్ వాడారు. దీనికి టైటన్ ఎమ్2 సెక్యూరిటీ మైక్రో చిప్ ని జతచేశారు.

కెమెరా: Google Pixel 8 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 10.5 ఎంపి సెల్ఫీ కెమెరా అందించారు.

ఓఎస్: Google Pixel 8 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వచ్చింది. ఈ ఫోన్ 7 ఏళ్ళ పాటు మేజర్ ఓఎస్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ పొందనుంది.

బ్యాటరీ: Google Pixel 8 లో పవర్ బ్యాకప్ కోసం 4,575 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 27 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 18 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Android 14 OS తో భారత్‌లో లాంచైన Google Pixel 8, Pixel 8 Pro first appeared on 91Mobiles Telugu.

]]>