Google Pixel 8 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 04 Oct 2023 17:41:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Android 14 OS తో భారత్‌లో లాంచైన Google Pixel 8, Pixel 8 Pro https://www.91mobiles.com/telugu/google-pixel-8-pixel-8-pro-launched-india-price-specs-availability/ Wed, 04 Oct 2023 17:41:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=8275 ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ నేడు భారత్ లో Google Pixel 8 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. లైనప్ లో భాగంగా Google Pixel 8 మరియు Google Pixel 8 Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. స్టైలిష్ లుక్, అడ్వాన్స్డ్ ఫీచర్స్, ఉత్తమమైన స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్లు వచ్చాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో Google Pixel 8 సిరీస్ లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Google Pixel 8 […]

The post Android 14 OS తో భారత్‌లో లాంచైన Google Pixel 8, Pixel 8 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Google Pixel 8 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Pixel 8, Pixel 8 Pro
  • Google Pixel 8 ధర రూ.75,999

ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ నేడు భారత్ లో Google Pixel 8 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. లైనప్ లో భాగంగా Google Pixel 8 మరియు Google Pixel 8 Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. స్టైలిష్ లుక్, అడ్వాన్స్డ్ ఫీచర్స్, ఉత్తమమైన స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్లు వచ్చాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో Google Pixel 8 సిరీస్ లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Google Pixel 8 Pro, Google Pixel 8 డివైజెస్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Google Pixel 8, Google Pixel 8 Pro ధర

Google Pixel 8 డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.75,999 గా ఉంది. Google Pixel 8 Pro 12జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.1,06,999 గా నిర్ణయించారు. ఈ రెండు ఫోన్లు అక్టోబర్ 14 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రీ-బుకింగ్ కి అందుబాటులోకి రానున్నాయి.

Google Pixel 8 Pro స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Google Pixel 8 Pro లో 6.7-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 1344*2992 పిక్సెల్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Google Pixel 8 Pro లో టెన్సర్ జీ3 చిప్సెట్ వాడారు. దీనికి టైటన్ ఎమ్2 సెక్యూరిటీ మైక్రో చిప్ ని జత చేశారు.

కెమెరా: Google Pixel 8 Pro లో 50ఎంపి వైడ్ యాంగిల్ ప్రైమరీ లెన్స్, 48ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 48ఎంపి 30x జూమ్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10.5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Google Pixel 8 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,050 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Google Pixel 8 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో వస్తోన్న మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ ఫోన్ 7 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ పొందనుంది. అంటే రాబోవు ఎన్నో ఆండ్రాయిడ్ వర్షన్స్ ఈ ఫోన్ లో రన్ అవుతాయన్నమాట.

Google Pixel 8 స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Google Pixel 8 లో 6.2-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్, అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Google Pixel 8 లో టెన్సర్ జీ3 చిప్ వాడారు. దీనికి టైటన్ ఎమ్2 సెక్యూరిటీ మైక్రో చిప్ ని జతచేశారు.

కెమెరా: Google Pixel 8 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 10.5 ఎంపి సెల్ఫీ కెమెరా అందించారు.

ఓఎస్: Google Pixel 8 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వచ్చింది. ఈ ఫోన్ 7 ఏళ్ళ పాటు మేజర్ ఓఎస్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ పొందనుంది.

బ్యాటరీ: Google Pixel 8 లో పవర్ బ్యాకప్ కోసం 4,575 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 27 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 18 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Android 14 OS తో భారత్‌లో లాంచైన Google Pixel 8, Pixel 8 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
2023 అక్టోబర్‌లో లాంచ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్లు ఇవే! https://www.91mobiles.com/telugu/upcoming-smartphones-october-2023/ Wed, 27 Sep 2023 17:00:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=8183 పండుగ సీజన్ వచ్చిందంటే చాలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వరుసబెట్టి తమ కొత్త ఫోన్లను లాంచ్ చేస్తుంటాయి. గత కొన్నేళ్ళుగా జరుగుతోన్న సాధారణ విషయమే ఇది. కానీ, కొత్త ఫోన్ వస్తుందంటే మొబైల్ ఫోన్ లవర్స్ లో ఉండే ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఫోన్ లాంచ్, స్పెసిఫికేషన్స్, రివ్యూలు.. ఇలా అన్నింటి గురించి తెలుసుకోవాలని వారు ఆసక్తి చూపిస్తుంటారు. మరికొందరు తమ డ్రీమ్ ఫోన్ ని ఈ పండుగ సీజన్ లోనే కొనుగోలు చేస్తుంటారు. ఈసారి కూడా […]

The post 2023 అక్టోబర్‌లో లాంచ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్లు ఇవే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అక్టోబర్ లో లాంచ్ కానున్న పలు స్మార్ట్ ఫోన్లు
  • శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో నుంచి రానున్న కొత్త ఫోన్లు
  • అక్టోబర్ 4 న లాంచ్ అవుతోన్న Vivo V29 Pro

పండుగ సీజన్ వచ్చిందంటే చాలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వరుసబెట్టి తమ కొత్త ఫోన్లను లాంచ్ చేస్తుంటాయి. గత కొన్నేళ్ళుగా జరుగుతోన్న సాధారణ విషయమే ఇది. కానీ, కొత్త ఫోన్ వస్తుందంటే మొబైల్ ఫోన్ లవర్స్ లో ఉండే ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఫోన్ లాంచ్, స్పెసిఫికేషన్స్, రివ్యూలు.. ఇలా అన్నింటి గురించి తెలుసుకోవాలని వారు ఆసక్తి చూపిస్తుంటారు. మరికొందరు తమ డ్రీమ్ ఫోన్ ని ఈ పండుగ సీజన్ లోనే కొనుగోలు చేస్తుంటారు. ఈసారి కూడా పండుగ సీజన్ వచ్చేసింది. ఈ ఆర్టికల్ లో 2023 అక్టోబర్ లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్ల జాబితాను తెలుసుకుందాం.

వన్‌ప్లస్ నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్ OnePlus Open, గూగుల్ నుంచి కొత్త పిక్సెల్ సిరీస్, శాంసంగ్ నుంచి Galaxy S23 FE భారతీయ మార్కెట్ లో లాంచ్ కానున్నాయి. సరే, పూర్తి జాబితాను క్రింద చూడండి.

అక్టోబర్ 2023 లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్లు

1. Samsung Galaxy S23 FE

శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ ఫోన్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలో Samsung Galaxy S23 FE డివైజ్ త్వరలోనే భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ కోసం శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్ అక్టోబర్ 4 వ తేదీన లాంచ్ అవుతుందని సమాచారం.

Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy S23 FE లో 6.4-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S23 FE లో ఎగ్జినోస్ 2200 చిప్సెట్ ఉంటుంది. అమెరికా, కెనడా మార్కెట్స్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ ఉండవచ్చు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy S23 FE లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Samsung Galaxy S23 FE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 8ఎంపి ఓఐఎస్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S23 FE లో పవర్ బ్యాకప్ కోసం 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy S23 FE లో ఐపీ68 రేటింగ్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఉంటాయి.

Vivo V29 సిరీస్

Vivo V29 సిరీస్ కూడా అక్టోబర్ లో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. అక్టోబర్ 4 వ తేదీన Vivo V29 సిరీస్ ఫోన్లు విడుదలవ్వనున్నాయి. ఈ సిరీస్ లో Vivo V29 మరియు Vivo V29 Pro డివైజెస్ రానున్నాయి. ఈ రెండు కొత్త డివైజెస్ కర్వ్డ్ డిస్ప్లే, ఆరా రింగ్ లైట్, బ్లూ, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ తో వస్తున్నాయి.

Vivo V29 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo V29 5G లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే (2800*1260 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, హెచ్డీఆర్10+ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo V29 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్, అడ్రెనో 642ఎల్ జీపీయూ ఉంటాయి.
  • మెమొరీ: Vivo V29 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • రియర్ కెమెరా: Vivo V29 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. వీటికి తోడు ఆరా లైట్ ఫ్లాష్ ఉంటుంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo V29 5G లో 50ఎంపి సెల్ఫీ కెమెరా, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo V29 5G లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.
  • భద్రత: Vivo V29 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.
  • కనెక్టివిటీ: Vivo V29 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్ ఉంటాయి.

OnePlus Open

OnePlus సంస్థ యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ గా OnePlus Open మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అక్టోబర్ 19 న ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. Oppo Find N3 కి రీబ్రాండ్ వర్షన్ గా OnePlus Open వస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారత్ లో OnePlus Open డివైజ్ పరిమిత సంఖ్యలో సేల్ కి అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.

OnePlus Open స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus Open డివైజ్ లో 7.8-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కవర్ స్క్రీన్: OnePlus Open లో 6.3-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Open లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడనున్నట్లు సమాచారం. గ్రాఫిక్స్ కోసం ఈ డివైజ్ లో అడ్రెనో జీపీయూ వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Open లో 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: OnePlus Open లో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 48ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 64ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. కవర్ స్క్రీన్ పై 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇక ఫోన్ లోపల స్క్రీన్ పై 20ఎంపి సెన్సర్ ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus Open లో పవర్ బ్యాకప్ కోసం 4800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OnePlus Open డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Google Pixel 8, Pixel 8 Pro

Google Pixel 8, Pixel 8 Pro ఫోన్లు గ్లోబల్ గా అక్టోబర్ 4 న లాంచ్ అవుతున్నాయి. గూగుల్ రూపొందించిన కొత్త Tensor G3 చిప్సెట్ ని ఈ డివైజెస్ లో వాడనున్నారు. దీంతో పాటు టైటాన్ సెక్యూరిటీ ఎమ్2 చిప్ కూడా ఉంటుంది. ఈసారి మెరుగైన కెమెరా మార్పులతో పిక్సెల్ 8 సిరీస్ వస్తోంది. కంపెనీ 7 ఏళ్ళ పాటు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ని ప్రామిస్ చేస్తోంది.

Google Pixel 8, Pixel 8 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Google Pixel 8, Pixel 8 Pro డివైజెస్ లో 6.2-ఇంచ్, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ప్రో మోడల్ లో ఎల్టీపీవో టెక్నాలజీ వాడుతున్నారు.
  • మెమొరీ: Google Pixel 8 లో 256జిబి వరకు స్టోరేజీ, Google Pixel 8 Pro లో 512జిబి వరకు స్టోరేజీని అందిస్తున్నారు.
  • బ్యాటరీ: Google Pixel 8, Pixel 8 Pro డివైజెస్ 4500 ఎంఏహెచ్ మరియు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీలతో వచ్చే అవకాశం ఉంది.
  • కెమెరా: Google Pixel 8 లో 50ఎంపి + 12ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. Google Pixel 8 Pro లో 50ఎంపి + 48ఎంపి + 48ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. రెండు ఫోన్లలో కూడా 10.5ఎంపి సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది.

The post 2023 అక్టోబర్‌లో లాంచ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్లు ఇవే! first appeared on 91Mobiles Telugu.

]]>