HMD Crest - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 25 Jul 2024 16:07:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 HMD Crest: ఓఎల్ఈడీ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన హెచ్ఎండి క్రెస్ట్ https://www.91mobiles.com/telugu/hmd-crest-launched-india-oled-display/ https://www.91mobiles.com/telugu/hmd-crest-launched-india-oled-display/#respond Thu, 25 Jul 2024 16:07:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=12686 Nokia ఫోన్లను తయారు చేసే కంపెనీ HMD తన సొంత బ్రాండ్ ఫోన్లను భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. HMD Crest మరియు HMD Crest Max అనే పేర్లతో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం HMD Crest గురించి తెలుసుకుందాం. HMD Crest Max కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక HMD Crest విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఓఎల్ఈడీ స్క్రీన్, […]

The post HMD Crest: ఓఎల్ఈడీ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన హెచ్ఎండి క్రెస్ట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో HMD Crest లాంచ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 50ఎంపి సెల్ఫీ కెమెరా

Nokia ఫోన్లను తయారు చేసే కంపెనీ HMD తన సొంత బ్రాండ్ ఫోన్లను భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. HMD Crest మరియు HMD Crest Max అనే పేర్లతో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం HMD Crest గురించి తెలుసుకుందాం. HMD Crest Max కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక HMD Crest విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఓఎల్ఈడీ స్క్రీన్, 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

HMD Crest ధర, లభ్యత

HMD Crest స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.14,499 గా నిర్ణయించారు.

HMD Crest డివైజ్‌ను వచ్చే నెల జరిగే అమెజాన్ స్పెషల్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా కేవలం రూ.12,999 కే కొనుగోలు చేయవచ్చు.

HMD Crest స్మార్ట్‌ఫోన్ మిడ్నైట్ బ్లూ, రాయల్ పింక్ మరియు లష్ లైలాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అమెజాన్ మరియు హెచ్ఎండి అధికార వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

HMD Crest స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: HMD Crest స్మార్ట్‌ఫోన్ లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: HMD Crest డివైజ్‌లో యూనిఎస్ఓసీ టీ760 చిప్సెట్ వాడారు.

మెమొరీ: HMD Crest డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 6జిబి వర్చువల్ ర్యామ్ కూడా అందించారు. దీంతో యూజర్‌కి 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: HMD Crest స్మార్ట్‌ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: HMD Crest డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: HMD Crest స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. కంపెనీ ఓఎస్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి అందిస్తుంది.

కనెక్టివిటీ: HMD Crest లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ 2.0, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: HMD Crest లో సింగిల్ స్పీకర్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post HMD Crest: ఓఎల్ఈడీ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన హెచ్ఎండి క్రెస్ట్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/hmd-crest-launched-india-oled-display/feed/ 0