HMD Crest Max: 50MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచైన హెచ్ఎండి క్రెస్ట్ మ్యాక్స్

Highlights

  • భారత్‌లో HMD Crest Max లాంచ్
  • 6.6-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్
  • యూనిఎస్ఓసీ టీ760 చిప్సెట్

Nokia లైసెన్స్ హోల్డర్ HMD నేడు భారతీయ మార్కెట్ లో తన సొంత బ్రాండ్ ఫోన్లను లాంచ్ చేసింది. HMD Crest మరియు HMD Crest Max అనే పేర్లతో ఈ ఫోన్లు భారత్ లో లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం HMD Crest Max గురించి తెలుసుకుందాం. హెచ్ఎండి క్రెస్ట్ మ్యాక్స్ ఫోన్ 50ఎంపి సెల్ఫీ కెమెరా, 8జిబి ర్యామ్, యూనిఎస్ఓసీ టీ760 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

HMD Crest Max ధర, లభ్యత

HMD Crest Max స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.16,499 గా పెట్టారు. డీప్ పర్పుల్, రాయల్ పింక్ మరియు ఆక్వా గ్రీన్ కలర్స్ లో లభిస్తుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో ఈ ఫోన్‌ని రూ.1,500 డిస్కౌంట్ తో రూ.14,999 కే కొనుగోలు చేయవచ్చు.

HMD Crest Max స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: HMD Crest Max లో 6.6-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, పంచ్ హోల్ కటౌట్, ఓఎల్ఈడీ ప్యానెల్ ఉన్నాయి.

ప్రాసెసర్: HMD Crest Max స్మార్ట్‌ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ760 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

మెమొరీ: HMD Crest Max స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది.

కెమెరా: HMD Crest Max లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: HMD Crest Max లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: HMD Crest Max డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

Previous articleMotorola Edge 50 ఇండియా లాంచ్ తేదీ ఖరారు
Next articleHMD Crest: ఓఎల్ఈడీ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన హెచ్ఎండి క్రెస్ట్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.