Honor 200 Lite 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 19 Sep 2024 08:53:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Honor 200 Lite 5G భారత్‌లో విడుదల.. అమోలెడ్ డిస్ప్లే, డైమెన్సిటీ 6080 చిప్సెట్ https://www.91mobiles.com/telugu/honor-200-lite-5g-launched-india-amoled-display-dimensity-6080-chipset/ https://www.91mobiles.com/telugu/honor-200-lite-5g-launched-india-amoled-display-dimensity-6080-chipset/#respond Thu, 19 Sep 2024 08:53:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=13601 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor నేడు భారతీయ మార్కెట్ లో 200 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Honor 200 Lite 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. ఈ ఫోన్ 6.78 మి.మీ అల్ట్రా స్లిమ్ డిజైన్ తో రావడం విశేషం. ఈ ఫోన్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా […]

The post Honor 200 Lite 5G భారత్‌లో విడుదల.. అమోలెడ్ డిస్ప్లే, డైమెన్సిటీ 6080 చిప్సెట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Honor 200 Lite 5G లాంచ్
  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • ప్రారంభ ధర రూ.17,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor నేడు భారతీయ మార్కెట్ లో 200 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Honor 200 Lite 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. ఈ ఫోన్ 6.78 మి.మీ అల్ట్రా స్లిమ్ డిజైన్ తో రావడం విశేషం. ఈ ఫోన్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Honor 200 Lite 5G ధర, సేల్ వివరాలు

Honor 200 Lite 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.17,999 గా నిర్ణయించారు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ పై రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ రూ.15,999 కే లభించనుంది. సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి 12 గంటల నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

Honor 200 Lite 5G డిజైన్

Honor 200 Lite 5G స్మార్ట్‌ఫోన్ స్లిమ్ గా ఉంది. ఈ ఫోన్ బాడీ పాలికార్బొనేట్ ప్లాస్టిక్ తో తయారైంది. ఈ ఫోన్ 6.78 మి.మీ మందం, 166 గ్రాముల బరువు ఉంది. ఈ ఫోన్ స్టారీ బ్లూ, సైయన్ లే్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది.

Honor 200 Lite 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Honor 200 Lite 5G లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1200 నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్, 93.7% స్క్రీన్ టు బాడీ రేషియో, 3240 హెర్ట్జ్ హై ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, టీయూవీ సర్టిఫికేషన్ ఉన్నాయి.

చిప్సెట్: Honor 200 Lite 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Honor 200 Lite 5G డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 256జిబి వరకు స్టోరేజీతో వచ్చింది. ఈ ఫోన్ ర్యామ్ టర్బో టెక్నాలజీని కూడా కలిగి ఉంది. దీని ద్వారా 16జిబి వరకు ర్యామ్ పవర్ ను పొందవచ్చు.

కెమెరా: Honor 200 Lite 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ కూడా ఎల్ఈడీ లైట్ ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Honor 200 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Honor 200 Lite 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఏఐ ఫీచర్లు: Honor 200 Lite 5G స్మార్ట్‌ఫోన్ లో మ్యాజిక్ పోర్టల్ 14, మ్యాజిక్ లాక్ స్క్రీన్, ఏఐ ఫోటోగ్రఫీ, ఇన్‌స్టంట్ మూవీ, మ్యాజిక్ క్యాప్సూల్ వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

కనెక్టివిటీ: Honor 200 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

సెక్యూరిటీ: Honor 200 Lite 5G లో భద్రత కోసం ఐపీ52 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ ప్రొటెక్షన్ అందించారు.

The post Honor 200 Lite 5G భారత్‌లో విడుదల.. అమోలెడ్ డిస్ప్లే, డైమెన్సిటీ 6080 చిప్సెట్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/honor-200-lite-5g-launched-india-amoled-display-dimensity-6080-chipset/feed/ 0
Honor 200 Lite 5G ఇండియా లాంచ్ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/honor-200-lite-5g-india-launch-confirmed-know-details/ https://www.91mobiles.com/telugu/honor-200-lite-5g-india-launch-confirmed-know-details/#respond Fri, 13 Sep 2024 06:01:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=13471 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor త్వరలో తన 200 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Honor 200 Lite 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్‌ను కంపెనీ తన ఎక్స్ ఖాతా ద్వారా కన్ఫర్మ్ చేసింది. మరొక లీక్ ద్వారా ఈ ఫోన్ యొక్క భారతీయ మార్కెట్ ధర కూడా రివీల్ అయ్యింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం. Honor […]

The post Honor 200 Lite 5G ఇండియా లాంచ్ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Honor 200 Lite 5G లాంచ్
  • తాజాగా ఇండియా లాంచ్ ఖరారు
  • ఎక్స్ ద్వారా ప్రకటించిన హానర్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor త్వరలో తన 200 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Honor 200 Lite 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్‌ను కంపెనీ తన ఎక్స్ ఖాతా ద్వారా కన్ఫర్మ్ చేసింది. మరొక లీక్ ద్వారా ఈ ఫోన్ యొక్క భారతీయ మార్కెట్ ధర కూడా రివీల్ అయ్యింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం.

Honor 200 Lite 5G భారత్ లాంచ్ ఖరారు

Honor 200 Lite 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను హానర్ సంస్థ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X ద్వారా ఖరారు చేసింది.

తన పోస్ట్ ద్వారా షేర్ చేసిన వీడియోలో Honor 200 Lite 5G పేరును కంపెనీ పేర్కొంది.

Honor 200 Lite 5G డివైజ్ గ్రేట్ సెల్ఫీస్, పర్ఫెక్ట్ పొట్రెయిట్ ఫోటోలను తీస్తుందని కంపెనీ పేర్కొంది.

అయితే, Honor 200 Lite 5G యొక్క లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. త్వరలోనే లాంచ్ తేదీ వెల్లడయ్యే అవకాశం ఉంది.

Honor 200 Lite 5G ధర (లీక్)

Honor 200 Lite 5G స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ నెలలో భారత్ లో లాంచ్ అవుతుందని ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ తన X ఖాతా ద్వారా తెలియజేశారు.

Honor 200 Lite 5G యొక్క భారత మార్కెట్ ధర రూ.25,000 లోపు ఉంటుందని ముకుల్ అంచనా వేశారు.

Honor 200 Lite 5G డివైజ్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Honor 200 Lite 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: Honor 200 Lite 5G లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 1080*2412 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3240 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 10-బిట్ కలర్స్ ఉన్నాయి.

చిప్సెట్: Honor 200 Lite 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఆక్టా-కోర్ చిప్సెట్ ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Honor 200 Lite 5G డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీతో వచ్చింది.

కెమెరా: Honor 200 Lite 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Honor 200 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Honor 200 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Honor 200 Lite 5G స్మార్ట్‌ఫోన్ లో 5జీ, వై-ఫై 5, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.1, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Honor 200 Lite 5G ఇండియా లాంచ్ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/honor-200-lite-5g-india-launch-confirmed-know-details/feed/ 0