India - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 19 Sep 2024 11:33:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo T3 Ultra 5G సేల్ ప్రారంభం, రూ.3,000 వరకు డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-5g-sale-begins-discount-offers-up-to-rs-3000-know-full-details/ https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-5g-sale-begins-discount-offers-up-to-rs-3000-know-full-details/#respond Thu, 19 Sep 2024 11:33:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=13610 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గత వారం భారతీయ మార్కెట్ లో T3 Ultra 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క సేల్ నేటి (సెప్టెంబర్ 19) నుంచి మొదలైంది. ఫస్ట్ సేల్ లో భాగంగా ఈ ఫోన్ పై కంపెనీ స్పెషల్ ఆఫర్లను అందిస్తోంది. దీంతో కస్టమర్లు రూ.3,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Vivo […]

The post Vivo T3 Ultra 5G సేల్ ప్రారంభం, రూ.3,000 వరకు డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేటి నుంచి వివో టీ3 అల్ట్రా సేల్
  • రూ.3,000 వరకు డిస్కౌంట్
  • ప్రారంభ ధర రూ.28,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గత వారం భారతీయ మార్కెట్ లో T3 Ultra 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క సేల్ నేటి (సెప్టెంబర్ 19) నుంచి మొదలైంది. ఫస్ట్ సేల్ లో భాగంగా ఈ ఫోన్ పై కంపెనీ స్పెషల్ ఆఫర్లను అందిస్తోంది. దీంతో కస్టమర్లు రూ.3,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vivo T3 Ultra 5G ధర, ఆఫర్ వివరాలు

Vivo T3 Ultra 5G స్మార్ట్‌ఫోన్ నేడు రాత్రి 7 గంటల నుంచి కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు ఫ్లాట్ డిస్కౌంట్ లేదా ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.3,000 వరకు లభించనుంది. ఈ డిస్కౌంట్ అన్ని వేరియంట్స్ కు వర్తిస్తుంది. ఫ్లాట్ డిస్కౌంట్ కేవలం హెచ్డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై మాత్రమే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే రెండింట్లో ఏదైనా ఒక కార్డ్ ఆఫర్ ను మాత్రమే మీరు పొందవచ్చు.

Vivo T3 Ultra 5G ఫోన్‌ని హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ తో కూడా కొనుగోలు చేయవచ్చు. 3 నుంచి 6 నెలల కాలపరిమితిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా రూ.1,500 వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ బ్యాంక్ ఆఫర్ తో, Vivo T3 Ultra 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ మీకు రూ.28,999 కే లభిస్తుంది.

8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మిడ్ వేరియంట్‌ను రూ.30,999 కి, 12జిబి+256జిబి టాప్ మోడల్‌ను రూ.32,999 కి కొనుగోలు చేయవచ్చు.

Vivo T3 Ultra 5G స్మార్ట్‌ఫోన్‌ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ పై పైన పేర్కొనబడిన అన్ని ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ లింక్

Vivo T3 Ultra 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo T3 Ultra లో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీ3 సినిమా గ్రేడ్ కలర్ గ్యామట్, 8000000:1 కాంట్రాస్ట్ రేషియో, హెచ్డీఆర్ 10+ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. 91మొబైల్స్ చేసిన టెస్ట్ లో అంటుటు స్కోర్ 14,45,926 గా ఉంది. అయితే వివో మాత్రం, అంటుటు ప్లాట్ఫామ్ పై స్కోర్ 16,09,257 గా నమోదైందని తెలిపింది.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లో 12జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 Ultra లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్921 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది ఆటోఫోకస్, ఏఐ ఫేసియల్ కలరింగ్ టెక్నాలజీతో వచ్చింది.

బ్యాటరీ, చార్జింగ్: Vivo T3 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo T3 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo T3 Ultra డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo T3 Ultra 5G సేల్ ప్రారంభం, రూ.3,000 వరకు డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-ultra-5g-sale-begins-discount-offers-up-to-rs-3000-know-full-details/feed/ 0
2022 చివరి కల్లా 75శాతం ప్రధాన నగరాలకు విస్తరించనున్న 5G నెట్వర్క్ https://www.91mobiles.com/telugu/5g-network-launched-india-availability/ Mon, 03 Oct 2022 05:14:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=2702 హైలైట్స్: అక్టోబర్ 1 న భారత్ లో లాంచ్ అయిన 5జీ సేవలు 2022 చివరి కల్లా 75 శాతం ప్రధాన నగరాలకు విస్తరించనున్న 5జీ నెట్వర్క్ 8 ముఖ్య నగరాల్లో తమ 5జీ సేవలు ప్రారంభమవుతాయని ప్రకటించిన ఎయిర్టెల్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5జీ సేవలను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అక్టోబర్ 1 నుంచి 5జీ రోలౌట్ భారత్ లో ప్రారంభమైంది. జియో, ఎయిర్టెల్ తొలుత దేశంలో […]

The post 2022 చివరి కల్లా 75శాతం ప్రధాన నగరాలకు విస్తరించనున్న 5G నెట్వర్క్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • అక్టోబర్ 1 న భారత్ లో లాంచ్ అయిన 5జీ సేవలు
  • 2022 చివరి కల్లా 75 శాతం ప్రధాన నగరాలకు విస్తరించనున్న 5జీ నెట్వర్క్
  • 8 ముఖ్య నగరాల్లో తమ 5జీ సేవలు ప్రారంభమవుతాయని ప్రకటించిన ఎయిర్టెల్

ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5జీ సేవలను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అక్టోబర్ 1 నుంచి 5జీ రోలౌట్ భారత్ లో ప్రారంభమైంది. జియో, ఎయిర్టెల్ తొలుత దేశంలో 5జీ సేవలను ప్రారంభించనున్నాయి. ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు లను కలుపుకుని మొత్తం 8 నగరాల్లో తమ 5జీ సేవలు మొదలవుతాయని ఎయిర్టెల్ ప్రకటించింది.

5G లభ్యత

5జీ రోలౌట్ అయిన నగరాల్లో కనుక మీరు ఉన్నట్లయితే సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే 5జీ సేవలను మీరు ఉపయోగించుకోలేక పోతే దానికి పలు కారణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. మీరు 5జీ టవర్ కి సమీపంలో ఉండటం ఎంతో అవసరం. లేకపోతే 5జీ సిగ్నల్ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం 5జీ టవర్స్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో తెలియదు. అంటే కచ్చితంగా మీ కార్యాలయానికి లేదా మీ ఇంటికి సమీపంలో 5జీ టవర్ ఉంటే మీరు సేవలను వాడుకోవచ్చు.

అయితే ఏమి, 2022 సంవత్సరం పూర్తయ్యే కల్లా భారత్ లోని 75 శాతం నగరాల్లో 5జీ సేవలు విస్తరిస్తాయని సమాచారం. 2023 డిసెంబర్ కల్లా గ్రామీణ ప్రాంతాలకు కూడా జియో 5జీ సేవలను తీసుకెళ్తామని ముకేశ్ అంబాని ప్రకటించడం జరిగింది. మరోవైపు, తొలిదశలో ఎయిర్టెల్ 5జీ సేవలు ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, ముంబై లతో కలుపుకుని మొత్తం 8 నగరాల్లో అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. ఆమేరకు ఎయిర్టెల్ అధినేత సునీల్ మిత్తల్ ప్రకటన చేశారు. 2024 మార్చి కల్లా దేశం మొత్తం తమ 5జీ సేవలు విస్తరిస్తాయని మిత్తల్ తెలిపారు.

5జీ సిగ్నల్ రాకపోవడానికి మరో కారణమేంటంటే, మీ ఫోన్ తయారీదారు 5జీ సపోర్ట్ ని ఎనేబుల్ చేయకపోవడమే. మార్కెట్ లో లభిస్తున్న దాదాపు అన్ని 5జీ స్మార్ట్ ఫోన్స్ 5జీ సపోర్ట్ డిసేబుల్ అయి ఉంటున్నాయి. అప్డేట్ ద్వారా 5జీ సపోర్ట్ ఎనేబుల్ అవుతుంది. మీరు అప్డేట్ కోసం వేచి చూడాలి. ఇప్పటికే రియల్మీ సంస్థ 5జీ సపోర్ట్ ని ఓటీఏ అప్డేట్ ద్వారా రోలౌట్ చేయడం మొదలు పెట్టింది.

5G సెట్టింగ్స్ ఎనేబుల్ చేయాలి

5జీ సేవలను వాడుకునేందుకు స్మార్ట్ ఫోన్స్ లో 5జీ సెట్టింగ్స్ ని ఎనేబుల్ చేసుకోవాలని ఎయిర్టెల్ చెబుతోంది. కనెక్షన్స్ లేదా మొబైల్ నెట్వర్క్ ఆప్షన్స్ ద్వారా మీరు 5జీ సెట్టింగ్స్ ని ఎనేబుల్ చేసుకోవచ్చు. 4జీ లేదా ఎల్టీఈ తో పాటు 5జీ ఆప్షన్ ని మీరు ఎంచుకోవల్సి ఉంటుంది. దాదాపు అన్ని సిమ్ కార్డులు 5జీ ఎనేబుల్ అయి ఉన్నాయి. దీంతో మీ 5జీ స్మార్ట్ ఫోన్స్ పై సిమ్ కార్డ్స్ సాఫీగా పని చేస్తాయి.

5G ధరలు

4జీ మాదిరి, మీరు 5జీ సేవలను వాడుకోవాలంటే, 5జీ ప్లాన్ ని రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అతి త్వరలో ఎయిర్టెల్ 5జీ టారిఫ్స్ ని లాంచ్ చేయబోతోంది. ప్రస్తుతం ఉన్న 4జీ రేట్లకే 5జీ సేవలు లభిస్తాయని ఎయిర్టెల్ కు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేనంత చౌకగా జియో 5జీ రేట్లు ఉంటాయని జియో సంస్థ ప్రకటించింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 2022 చివరి కల్లా 75శాతం ప్రధాన నగరాలకు విస్తరించనున్న 5G నెట్వర్క్ first appeared on 91Mobiles Telugu.

]]>
అక్టోబర్ 1 న 5G నెట్వర్క్ లాంచ్ అవుతుందా? https://www.91mobiles.com/telugu/5g-launch-india-timeline-details/ Mon, 26 Sep 2022 15:53:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=2584 హైలైట్స్: 5జీ నెట్వర్క్ లాంచ్ కోసం ఎదురు చూస్తోన్న యావత్ దేశం మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న 5జీ సేవలు తొలి దశలో ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితం కానున్న 5జీ నెట్వర్క్ యావత్ దేశం 5జీ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది. అయితే ఆ ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడనుంది. మరొక నాలుగు రోజుల్లో దేశంలో 5జీ సేవలు మొదలు కానున్నాయి. అక్టోబర్ 1 న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ […]

The post అక్టోబర్ 1 న 5G నెట్వర్క్ లాంచ్ అవుతుందా? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 5జీ నెట్వర్క్ లాంచ్ కోసం ఎదురు చూస్తోన్న యావత్ దేశం
  • మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న 5జీ సేవలు
  • తొలి దశలో ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితం కానున్న 5జీ నెట్వర్క్

యావత్ దేశం 5జీ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది. అయితే ఆ ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడనుంది. మరొక నాలుగు రోజుల్లో దేశంలో 5జీ సేవలు మొదలు కానున్నాయి. అక్టోబర్ 1 న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 5జీ నెట్వర్క్ ని ప్రారంభించనున్నారు. అక్టోబర్ 1 న జరిగే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉంటుందని నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ తన ట్విట్టర్ హ్యాండిల్ పై ప్రకటించింది.

దీపావళి నాటికి ఎయిర్టెల్ 5జీ, జియో 5జీ, వీఐ 5జీ సేవలు కూడా ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎన్బీఎస్ తన ట్వీట్ ని ఓ రోజు తర్వాత తొలగించింది. దీంతో అసలు గందరగోళం మొదలైంది. 5జీ సేవలు అక్టోబర్ 1 నే మొదలవుతాయా? లేక ఇంకా జాప్యమవుతుందా అని అందరిలో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

అక్టోబర్ 1 న 5G సేవలు లాంచ్ అవుతాయా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అక్టోబర్ 1 న జరిగే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో 5జీ సేవలను ప్రారంభిస్తారని నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ తన ట్వీట్ లో తెలిపింది. కానీ ఆ ట్వీట్ ని తర్వాత ఎన్బీఎస్ తొలగించింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ నుంచి కూడా 5జీ లాంచ్ కి సంబంధించి ఎటువంటి సంకేతాలు రాలేదు. దీని బట్టి దేశంలో 5జీ సేవలు అక్టోబర్ 1 న ప్రారంభమవుతాయన్న విషయం నిరాధారమైనదిగా భావిస్తున్నారు.

అక్టోబర్ 12 న లాంచ్ కానున్న 5G

అక్టోబర్ 12 న దేశంలో 5జీ నెట్వర్క్ లాంచ్ అవుతుందని, అందుకోసం టెలీకామ్ ఆపరేటర్లు సిద్ధమవుతున్నారని కేంద్ర టెలీకామ్ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో అక్టోబర్ 12 న 5జీ లాంచ్ అవుతుందని, తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాలకు విస్తరిస్తుందని భావిస్తున్నారు. రానున్న రెండు మూడేళ్ళలో దేశంలో ఉన్న అన్ని మారుమూల ప్రాంతాలకు 5జీ సేవలు వ్యాపించాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

5జీ సేవలు భారత్ లో 2022 ఆగస్టు 15 వ తేదీన లాంచ్ అవుతాయని 5జీ స్పెక్ట్రమ్ వేలం ముగిసాక వార్తలు వచ్చాయి. కానీ, అది జరగలేదు. అదే విధంగా జియో, ఎయిర్టెల్ సంస్థలు దీపావళి కి 5జీ నెట్వర్క్ లాంచ్ చేస్తామని తెలిపాయి. మరి ఇది జరుగుతుందో లేదో చూడాలి.

తొలి దశలో 5జీ సేవలు పొందే నగరాలివే

తొలిదశలో దేశంలోని 13 ప్రధాన నగరాలకు 5జీ సేవలు ప్రారంభమవుతాయని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ వెల్లడించింది. దాని ప్రకారం, 2022 లో హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చంఢీఘర్, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్ నగర్, కోల్‌కతా, చెన్నై, లక్నో, పూణె, ఢిల్లీ, ముంబై నగరాలకు 5జీ సేవలు అందనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post అక్టోబర్ 1 న 5G నెట్వర్క్ లాంచ్ అవుతుందా? first appeared on 91Mobiles Telugu.

]]>