
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గత వారం భారతీయ మార్కెట్ లో T3 Ultra 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క సేల్ నేటి (సెప్టెంబర్ 19) నుంచి మొదలైంది. ఫస్ట్ సేల్ లో భాగంగా ఈ ఫోన్ పై కంపెనీ స్పెషల్ ఆఫర్లను అందిస్తోంది. దీంతో కస్టమర్లు రూ.3,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఓసారి డిస్కౌంట్ ఆఫర్ వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Vivo T3 Ultra 5G ధర, ఆఫర్ వివరాలు
Vivo T3 Ultra 5G స్మార్ట్‌ఫోన్ నేడు రాత్రి 7 గంటల నుంచి కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు ఫ్లాట్ డిస్కౌంట్ లేదా ఎక్స్‌చేంజ్ బోనస్ రూ.3,000 వరకు లభించనుంది. ఈ డిస్కౌంట్ అన్ని వేరియంట్స్ కు వర్తిస్తుంది. ఫ్లాట్ డిస్కౌంట్ కేవలం హెచ్డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై మాత్రమే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే రెండింట్లో ఏదైనా ఒక కార్డ్ ఆఫర్ ను మాత్రమే మీరు పొందవచ్చు.
Vivo T3 Ultra 5G ఫోన్‌ని హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ తో కూడా కొనుగోలు చేయవచ్చు. 3 నుంచి 6 నెలల కాలపరిమితిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా రూ.1,500 వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఈ బ్యాంక్ ఆఫర్ తో, Vivo T3 Ultra 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ మీకు రూ.28,999 కే లభిస్తుంది.
8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మిడ్ వేరియంట్‌ను రూ.30,999 కి, 12జిబి+256జిబి టాప్ మోడల్‌ను రూ.32,999 కి కొనుగోలు చేయవచ్చు.
Vivo T3 Ultra 5G స్మార్ట్‌ఫోన్‌ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ పై పైన పేర్కొనబడిన అన్ని ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లో కూడా అందుబాటులో ఉంటుంది.
Vivo T3 Ultra 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Vivo T3 Ultra లో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీ3 సినిమా గ్రేడ్ కలర్ గ్యామట్, 8000000:1 కాంట్రాస్ట్ రేషియో, హెచ్డీఆర్ 10+ ఉన్నాయి.
ప్రాసెసర్: Vivo T3 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. 91మొబైల్స్ చేసిన టెస్ట్ లో అంటుటు స్కోర్ 14,45,926 గా ఉంది. అయితే వివో మాత్రం, అంటుటు ప్లాట్ఫామ్ పై స్కోర్ 16,09,257 గా నమోదైందని తెలిపింది.
ర్యామ్, స్టోరేజీ: Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లో 12జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
కెమెరా: Vivo T3 Ultra లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్921 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది ఆటోఫోకస్, ఏఐ ఫేసియల్ కలరింగ్ టెక్నాలజీతో వచ్చింది.
బ్యాటరీ, చార్జింగ్: Vivo T3 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Vivo T3 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Vivo T3 Ultra డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.













