Infinix Hot 20 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 16 Jan 2023 11:33:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 అందుబాటులోకి వచ్చిన Infinix Hot 20 5G 6GB ర్యామ్ వేరియంట్ https://www.91mobiles.com/telugu/infinix-hot-20-5g-6gb-ram-variant-available-flipkart-india/ Mon, 16 Jan 2023 11:33:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=4471 హైలైట్స్ గత నెలలో భారత్ లో లాంచైన Infinix Hot 20 5G కేవలం 4జిబి + 64జిబి ఆప్షన్ తో లాంచైన Infinix Hot 20 5G ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ గత నెలలో భారత్ లో Infinix Hot 20 5G ఫోన్ ని లాంచ్ చేసింది. లాంచ్ అయినప్పుడు ఈ కేవలం 4జిబి ర్యామ్ + […]

The post అందుబాటులోకి వచ్చిన Infinix Hot 20 5G 6GB ర్యామ్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • గత నెలలో భారత్ లో లాంచైన Infinix Hot 20 5G
  • కేవలం 4జిబి + 64జిబి ఆప్షన్ తో లాంచైన Infinix Hot 20 5G
  • ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ గత నెలలో భారత్ లో Infinix Hot 20 5G ఫోన్ ని లాంచ్ చేసింది. లాంచ్ అయినప్పుడు ఈ కేవలం 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ సంస్థ కొత్త ర్యామ్, స్టోరేజీ కన్ఫిగరేషన్ తో మరొక మోడల్ ని లాంచ్ చేసింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

Infinix Hot 20 5G ప్రస్తుతం 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ధర రూ.12,479 తో ప్రారంభమవుతుంది. జనవరి 15 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. సిటి మరియు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ హోల్డర్స్ ఈ ఫోన్ కొనుగోలుపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ని పొందవచ్చు.

Infinix Hot 20 5G స్పెసిఫికేషన్స్

  • MediaTek Dimensity 810 చిప్సెట్
  • 6.6-inch FHD+ 120Hz డిస్ప్లే
  • LCD ప్యానెల్
  • సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్
  • 50ఎంపి + 2ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా
  • 8ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్

Infinix Hot 20 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి. ఇప్పుడు Infinix Hot 20 5G యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం.

Infinix Hot 20 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.

Infinix Hot 20 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో 6జిబి ర్యామ్, 5జిబి వర్చువల్ ర్యామ్ కలిపి మొత్తం 11జిబి ర్యామ్ యూజర్ కి లభిస్తుంది. ఇకపోతే 128జిబి ఆన్‌బోర్డ్ స్టోరేజీ, ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఈ ఫోన్ లో ఉంటాయి. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Infinix Hot 20 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Infinix Hot 20 5G స్మార్ట్ ఫోన్ 12 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లూటూత్ 5.1, వై-ఫై మరియు 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి.

Infinix Hot 20 5G ధర

Infinix Hot 20 5G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,479 గా నిర్ణయించారు. జనవరి 15 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. సిటి మరియు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ హోల్డర్స్ ఈ ఫోన్ కొనుగోలుపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ని పొందవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post అందుబాటులోకి వచ్చిన Infinix Hot 20 5G 6GB ర్యామ్ వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
7GB ర్యామ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయిన Infinix HOT 20 5G https://www.91mobiles.com/telugu/infinix-hot-20-5g-launched-with-7gb-ram-5000-mah-battery/ Thu, 01 Dec 2022 06:33:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=3792 హైలైట్స్ చవకైన 5జీ ఫోన్ Infinix HOT 20 5G ని లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ సంస్థ 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ తో లాంచ్ అయిన Infinix HOT 20 5G 12 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేయనున్న Infinix HOT 20 5G తక్కువ బడ్జెట్ ఫోన్లను తీసుకొస్తూ జనాల్లో చక్కటి ఆదరణ పొందుతోన్న ఇన్ఫినిక్స్ సంస్థ నేడు Infinix HOT 20 […]

The post 7GB ర్యామ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయిన Infinix HOT 20 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చవకైన 5జీ ఫోన్ Infinix HOT 20 5G ని లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ సంస్థ
  • 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ తో లాంచ్ అయిన Infinix HOT 20 5G
  • 12 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేయనున్న Infinix HOT 20 5G

తక్కువ బడ్జెట్ ఫోన్లను తీసుకొస్తూ జనాల్లో చక్కటి ఆదరణ పొందుతోన్న ఇన్ఫినిక్స్ సంస్థ నేడు Infinix HOT 20 5G ఫోన్ ని లాంచ్ చేసింది. Infinix HOT 20 5G సిరీస్ లో మరిన్ని ఫోన్లను సదరు కంపెనీ తీసుకొచ్చే అవకాశం ఉంది. తాజాగా ఎంట్రీ ఇచ్చిన Infinix HOT 20 5G తక్కువ ధర కలిగిన 5జీ ఫోన్ గా నిలుస్తోంది.

Infinix HOT 20 5G మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. ఇంకా ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 7జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 12 5జీ బ్యాండ్స్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేయడం విశేషం. బడ్జెట్ తక్కువైనా 12 5జీ బ్యాండ్స్ ని అందిస్తుండటం మంచి విషయం. ఇమ్మర్సివ్ మరియు స్మూత్ ఏఎఫ్ డిస్ప్లేని తీసుకొచ్చామని కంపెనీ చెబుతోంది. మరి Infinix HOT 20 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Infinix HOT 20 5G స్పెసిఫికేషన్స్

Infinix HOT 20 5G స్మార్ట్ ఫోన్ 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే కలిగి ఉంటుంది. పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ హైపర్ విజన్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ర్యామ్, స్టోరేజీ విషయానికి వస్తే, Infinix HOT 20 5G లో 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజీ ఉన్నాయి. మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా ర్యామ్ ని 3జిబి వరకు పెంచుకోవచ్చు. అంటే మొత్తం 7జిబి ర్యామ్ తో మల్టీ టాస్కింగ్ ఎంతో సులభతరం కానుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1 టెరాబైట్ వరకు మెమొరీ పెంచుకోవచ్చు.

Infinix HOT 20 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్ వాడారు. ఇది 2.4 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. 6ఎన్ఎం ప్రాసెస్ పై ఈ చిప్ తయారైంది. క్లెవర్ 5జీ 2.0 టెక్నాలజీ ద్వారా ఈ చిప్ 20 శాతం పవర్ వినియోగం తక్కువయ్యేలా చూస్తుంది. Infinix HOT 20 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై ఇంకా ఇతర బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

Infinix HOT 20 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఏఐ లెన్స్ ఉన్నాయి. దీనికి తోడు డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఫంట్ కూడా ఎల్ఈడీ ఫ్లాష్ ఉండటం విశేషం. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. ఇంకా ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది.

Infinix HOT 20 5G ధర, కలర్ ఆప్షన్స్

Infinix HOT 20 5G 4జిబి ర్యామ్, 64జిబి సింగిల్ వేరియంట్ ధర రూ.11,999 గా ఉంది. స్పేస్ బ్లూ, రేసింగ్ బ్లాక్, బ్లాస్టర్ గ్రీన్ అనే మూడు కలర్ వేరియంట్స్ లో ఫోన్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 7GB ర్యామ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయిన Infinix HOT 20 5G first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అవుతోన్న Infinix Hot 20 సిరీస్; కన్ఫర్మ్ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/infinix-20-series-india-launch-confirmed-by-company/ Mon, 14 Nov 2022 08:24:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=3409 హైలైట్స్ తక్కువ ధరలో 5జీ ఫోన్లను తీసుకొస్తోన్న Infinix సంస్థ ఇటీవలె గ్లోబల్ గా లాంచ్ అయిన Infinix Hot 20 సిరీస్ త్వరలో భారత్ లో అడుగుపెట్టనున్న Infinix Hot 20 సిరీస్ Infinix సంస్థ త్వరలో Infinix Hot 20 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలె Infinix Hot 20 సిరీస్ ని సదరు సంస్థ గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసింది. తాజాగా ఇండియా లాంచ్ కి […]

The post భారత్ లో లాంచ్ అవుతోన్న Infinix Hot 20 సిరీస్; కన్ఫర్మ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • తక్కువ ధరలో 5జీ ఫోన్లను తీసుకొస్తోన్న Infinix సంస్థ
  • ఇటీవలె గ్లోబల్ గా లాంచ్ అయిన Infinix Hot 20 సిరీస్
  • త్వరలో భారత్ లో అడుగుపెట్టనున్న Infinix Hot 20 సిరీస్

Infinix సంస్థ త్వరలో Infinix Hot 20 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలె Infinix Hot 20 సిరీస్ ని సదరు సంస్థ గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసింది. తాజాగా ఇండియా లాంచ్ కి సంబంధించిన విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఇన్ఫినిక్స్ టీజ్ చేసింది. Infinix Hot 20 సిరీస్ లో Infinix Hot 20 Play, Infinix Hot 20i, Infinix Hot 20, Infinix Hot 20s, Infinix Hot 20 5G అనే మోడల్స్ ఉంటాయి. అయితే ఈ మోడల్స్ అన్నీ భారత్ లోకి ప్రవేశిస్తాయా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.

అయితే కంపెనీ చేసిన ట్వీట్ లో దాగి ఉన్న హింట్ ప్రకారం, Infinix Hot 20 5జీ ఫోన్ లాంచ్ అవుతుందని తెలుస్తోంది. అలాగే శుద్ధ్5జీ అనే హ్యాష్ ట్యాగ్ ని కూడా తన ట్వీట్ కి జత చేసింది.

Infinix Hot 20 5G స్పెసిఫికేషన్స్

Infinix Hot 20 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ని కలిగి ఉంటుంది.

Infinix Hot 20 5G ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ కలిగి ఉంటుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ 5 వాట్ రివర్స్ చార్జింగ్ ఫీచర్ తో వస్తోంది.

భద్రత కోసం Infinix Hot 20 5G లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

ఇప్పుడు Infinix Hot 20 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఇందులో 50 మెగా పిక్సెల్ శాంసంగ్ జెఎన్1 సెన్సర్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరాలో ఐ ట్రాకింగ్, పొట్రెయిట్ మోడ్, షార్ట్ వీడియో మోడ్, సూపర్ నైట్ మోడ్ ఉంటాయి.

Infinix Hot 20 5G 166.25 మిల్లీ మీటర్ల పొడవు, 76.45 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.93 మిల్లీ మీటర్ల మందం, 204 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ రేసింగ్ బ్లాక్, స్పేస్ బ్లూ, బ్లాస్టర్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Infinix Hot 20 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 180 యూరోలు (సుమారు రూ.14,500). భారతీయ మార్కెట్ లో ఫోన్ ధర రూ.15,000 లోపే పెట్టే అవకాశం ఉంది.

Infinix Hot 20 Play స్పెసిఫికేషన్స్

Infinix Hot 20 Play స్మార్ట్ ఫోన్ 6.82-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్ వినియోగించారు. ఇదొక ఆక్టాకోర్ ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ ని వాడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Infinix Hot 20 Play లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13 ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెన్సర్, 8ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. చార్జింగ్ కోసం టైప్ సీ పోర్ట్ అందించారు. ఈ ఫోన్ లో రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఈ ఫోన్ 171.0 మిల్లీ మీటర్ల పొడవు, 78.0 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.85 మిల్లీ మీటర్ల మందం, 209.6 గ్రాముల బరువు ఉంటుంది.

Infinix Hot 20 Play రేసింగ్ బ్లాక్, లునా బ్లూ, అరోరా గ్రీన్, ఫాంటసీ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్ లో లాంచ్ అవుతోన్న Infinix Hot 20 సిరీస్; కన్ఫర్మ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.15,000 ధర, 50MP కెమెరా, 7GB ర్యామ్ తో లాంచ్ అయిన Infinix Hot 20 5G https://www.91mobiles.com/telugu/infinix-hot-20-5g-launched-globally-price-specs/ Fri, 07 Oct 2022 10:38:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=2794 హైలైట్స్: Infinix Hot 20 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన Infinix కంపెనీ 50ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ డిస్ప్లే, 4జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్ తో వస్తోన్న Infinix Hot 20 5G Infinix Hot 20 5G ధర 180 యూరోలు (సుమారు రూ.14,514) ఇన్ఫినిక్స్ కంపెనీ నేడు Infinix Hot 20 5G అనే కొత్త ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది హాట్ సిరీస్ లైనప్ […]

The post రూ.15,000 ధర, 50MP కెమెరా, 7GB ర్యామ్ తో లాంచ్ అయిన Infinix Hot 20 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • Infinix Hot 20 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన Infinix కంపెనీ
  • 50ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ డిస్ప్లే, 4జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్ తో వస్తోన్న Infinix Hot 20 5G
  • Infinix Hot 20 5G ధర 180 యూరోలు (సుమారు రూ.14,514)

ఇన్ఫినిక్స్ కంపెనీ నేడు Infinix Hot 20 5G అనే కొత్త ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది హాట్ సిరీస్ లైనప్ లో న్యూ మోడల్. ఈ 5జీ ఫోన్ లో 50 మెగా పిక్సెల్ కెమెరా, 120 హెర్ట్జ్ డిస్ప్లే, 4జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ ఉన్నాయి. Infinix Hot 20 5G స్మార్ట్ ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Infinix Hot 20 5G స్పెసిఫికేషన్స్

Infinix Hot 20 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. ఈ ఫోన్ స్క్రీన్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ పై తయారైంది. అలాగే ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్ప్లే వాటర్ డ్రాప్ నాచ్, మూడు వైపులా బెజెల్-లెస్ ఎడ్జెస్, బాటమ్ లో సన్నపాటి చిన్ ని కలిగి ఉంది.

Infinix Hot 20 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్, XOS 10.6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ అమర్చారు. ఈ చిప్ 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టాకోర్ ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి జీ57 జీపీయూ వాడారు. 4జిబి ర్యామ్, 3జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ని Infinix Hot 20 5G కలిగి ఉంది.

ఇప్పుడు Infinix Hot 20 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Infinix Hot 20 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ శాంసంగ్ జెఎన్1 ప్రధాన కెమెరా, 2 మెగా పిక్సెల్ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో ముందు వైపున 8 మెగా పిక్సెల్ కెమెరా అమర్చారు. పవర్ బ్యాకప్ కోసం Infinix Hot 20 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Infinix Hot 20 5G ధర

Infinix Hot 20 5G స్మార్ట్ ఫోన్ ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్స్ లో కేవలం సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ఈ మొబైల్ ఫోన్ 128 జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్ కలిగి ఉంది. Infinix Hot 20 5G ధర 180 యూరోలు (సుమారు రూ.14,514) గా ఉంది. Infinix Hot 20 5G ఫోన్ రేసింగ్ బ్లాక్, స్పేస్ బ్లూ, బ్లాస్టర్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. ప్రస్తుతం Infinix Hot 20 5G మొబైల్ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ పై స్పష్టత లేదు. త్వరలోనే కంపెనీ నుంచి ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post రూ.15,000 ధర, 50MP కెమెరా, 7GB ర్యామ్ తో లాంచ్ అయిన Infinix Hot 20 5G first appeared on 91Mobiles Telugu.

]]>