హైలైట్స్
- చవకైన 5జీ ఫోన్ Infinix HOT 20 5G ని లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ సంస్థ
- 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ తో లాంచ్ అయిన Infinix HOT 20 5G
- 12 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేయనున్న Infinix HOT 20 5G

తక్కువ బడ్జెట్ ఫోన్లను తీసుకొస్తూ జనాల్లో చక్కటి ఆదరణ పొందుతోన్న ఇన్ఫినిక్స్ సంస్థ నేడు Infinix HOT 20 5G ఫోన్ ని లాంచ్ చేసింది. Infinix HOT 20 5G సిరీస్ లో మరిన్ని ఫోన్లను సదరు కంపెనీ తీసుకొచ్చే అవకాశం ఉంది. తాజాగా ఎంట్రీ ఇచ్చిన Infinix HOT 20 5G తక్కువ ధర కలిగిన 5జీ ఫోన్ గా నిలుస్తోంది.
Infinix HOT 20 5G మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. ఇంకా ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 7జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 12 5జీ బ్యాండ్స్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేయడం విశేషం. బడ్జెట్ తక్కువైనా 12 5జీ బ్యాండ్స్ ని అందిస్తుండటం మంచి విషయం. ఇమ్మర్సివ్ మరియు స్మూత్ ఏఎఫ్ డిస్ప్లేని తీసుకొచ్చామని కంపెనీ చెబుతోంది. మరి Infinix HOT 20 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Infinix HOT 20 5G స్పెసిఫికేషన్స్
Infinix HOT 20 5G స్మార్ట్ ఫోన్ 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే కలిగి ఉంటుంది. పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ హైపర్ విజన్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ర్యామ్, స్టోరేజీ విషయానికి వస్తే, Infinix HOT 20 5G లో 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజీ ఉన్నాయి. మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా ర్యామ్ ని 3జిబి వరకు పెంచుకోవచ్చు. అంటే మొత్తం 7జిబి ర్యామ్ తో మల్టీ టాస్కింగ్ ఎంతో సులభతరం కానుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1 టెరాబైట్ వరకు మెమొరీ పెంచుకోవచ్చు.
Infinix HOT 20 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్ వాడారు. ఇది 2.4 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. 6ఎన్ఎం ప్రాసెస్ పై ఈ చిప్ తయారైంది. క్లెవర్ 5జీ 2.0 టెక్నాలజీ ద్వారా ఈ చిప్ 20 శాతం పవర్ వినియోగం తక్కువయ్యేలా చూస్తుంది. Infinix HOT 20 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై ఇంకా ఇతర బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.
Infinix HOT 20 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఏఐ లెన్స్ ఉన్నాయి. దీనికి తోడు డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఫంట్ కూడా ఎల్ఈడీ ఫ్లాష్ ఉండటం విశేషం. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. ఇంకా ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది.
Infinix HOT 20 5G ధర, కలర్ ఆప్షన్స్
Infinix HOT 20 5G 4జిబి ర్యామ్, 64జిబి సింగిల్ వేరియంట్ ధర రూ.11,999 గా ఉంది. స్పేస్ బ్లూ, రేసింగ్ బ్లాక్, బ్లాస్టర్ గ్రీన్ అనే మూడు కలర్ వేరియంట్స్ లో ఫోన్ లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











