Infinix Hot 30 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 31 Mar 2023 13:35:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 16జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో లాంచైన Infinix Hot 30 https://www.91mobiles.com/telugu/infinix-hot-30-launched-thailand-specifications-availability/ Fri, 31 Mar 2023 13:29:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=5690 ఇన్ఫినిక్స్ సంస్థ మరొక స్మార్ట్ ఫోన్ Infinix Hot 30 ని థాయిలాండ్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ లో ఎన్నో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ88 ఆక్టా-కోర్ గేమింగ్ ప్రాసెసర్ ని అందించారు. కంపెనీ ప్రకారం, ఈ ఫోన్ లో పాపులర్ గేమ్ ఫ్రీ ఫైర్ ని గంటసేపు ఆడవచ్చు. ఆడుతోన్న సమయంలో గరిష్టంగా బ్యాగ్రౌండ్ టెంపరేచర్ 34.5 డిగ్రీలుగా ఉంటుంది. పవర్ బ్యాకప్ […]

The post 16జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో లాంచైన Infinix Hot 30 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • థాయిలాండ్ లో లాంచైన Infinix Hot 30 స్మార్ట్ ఫోన్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన Infinix Hot 30
  • మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ పై పని చేయనున్న Infinix Hot 30

ఇన్ఫినిక్స్ సంస్థ మరొక స్మార్ట్ ఫోన్ Infinix Hot 30 ని థాయిలాండ్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ లో ఎన్నో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ88 ఆక్టా-కోర్ గేమింగ్ ప్రాసెసర్ ని అందించారు. కంపెనీ ప్రకారం, ఈ ఫోన్ లో పాపులర్ గేమ్ ఫ్రీ ఫైర్ ని గంటసేపు ఆడవచ్చు. ఆడుతోన్న సమయంలో గరిష్టంగా బ్యాగ్రౌండ్ టెంపరేచర్ 34.5 డిగ్రీలుగా ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Infinix Hot 30 ధర, సేల్ వివరాలు

థాయిలాండ్ వెబ్ సైట్ లో ఇన్ఫినిక్స్ సంస్థ Infinix Hot 30 ఫోన్ ధర వివరాలు అందించలేదు. అయితే ఈ ఫోన్ ఆఫ్‌లైన్ లో సేల్ కి అందుబాటులో ఉంది. త్వరలోనే మేం Infinix Hot 30 ఫోన్ ధరను మీకు అందిస్తాం.

Infinix Hot 30 స్పెసిఫికేషన్స్

  • 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్
  • మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్
  • ఏఆర్ఎం మాలి-జీ52 ఎంసీ2 జీపీయూ
  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • 8జిబి వర్చువల్ ర్యామ్

Infinix Hot 30 డివైజ్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే తో లాంచైంది. ఈ డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్ ని కలిగి ఉంది. Infinix Hot 30 లో మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్ వాడారు. ఇది 12ఎన్ఎం ప్రాసెస్ పై తయారైన చిప్సెట్. ఈ చిప్ 2.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎం మాలి-జీ52 ఎంసీ2 జీపీయూ వాడారు. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని అందించారు. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ అందించారు. ఈ ఫోన్ ర్యామ్ ని 16జిబి వరకు పెంచుకునే వీలుంది.

Infinix Hot 30 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఏఐ లెన్స్ అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Infinix Hot 30 లో చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ అందించారు. 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా ఈ ఫోన్ లో ఉంది. వై-ఫై, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్ వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. Infinix Hot 30 డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 16జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో లాంచైన Infinix Hot 30 first appeared on 91Mobiles Telugu.

]]>
కన్ఫర్మ్ అయిన Infinix Hot 30 లాంచ్ తేదీ: రివీలైన డిజైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/infinix-hot-30-thailand-launch-date-revealed/ Thu, 30 Mar 2023 06:09:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=5656 ఇన్ఫినిక్స్ సంస్థ రీసెంట్ గా Infinix Hot 30i ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు Infinix Hot 30 థాయిలాండ్ లో లాంచ్ అవుతోంది. మార్చి 31 న ఈ ఫోన్ లాంచ్ కానుందని కంపెనీ ప్రకటించింది. కంపెనీ రిలీజ్ చేసిన టీజర్స్ ద్వారా ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఇప్పటి వరకు ఇన్ఫినిక్స్ నుంచి రివీలైన టీజర్స్ ద్వారా Infinix Hot 30 6.78-ఇంచ్ ఎల్సీడీ ప్యానెల్ […]

The post కన్ఫర్మ్ అయిన Infinix Hot 30 లాంచ్ తేదీ: రివీలైన డిజైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 31 న థాయిలాండ్ లో లాంచ్ అవుతోన్న Infinix Hot 30
  • టీజర్స్ ద్వారా రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫోన్ డిజైన్
  • మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ తో రానున్న డివైజ్

ఇన్ఫినిక్స్ సంస్థ రీసెంట్ గా Infinix Hot 30i ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు Infinix Hot 30 థాయిలాండ్ లో లాంచ్ అవుతోంది. మార్చి 31 న ఈ ఫోన్ లాంచ్ కానుందని కంపెనీ ప్రకటించింది. కంపెనీ రిలీజ్ చేసిన టీజర్స్ ద్వారా ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి.

ఇప్పటి వరకు ఇన్ఫినిక్స్ నుంచి రివీలైన టీజర్స్ ద్వారా Infinix Hot 30 6.78-ఇంచ్ ఎల్సీడీ ప్యానెల్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ డివైజ్ ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్ వాడినట్లు సమాచారం.

Infinix Hot 30 స్పెసిఫికేషన్స్

Infinix Hot 30 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. టీజర్స్ ద్వారా Infinix Hot 30 డివైజ్ ఫ్రంట్, రియర్ డిజైన్స్ రివీల్ అయ్యాయి. ఈ డివైజ్ పంచ్-హోల్ డిస్ప్లే తో వస్తోంది. పంచ్ హోల్ కటౌట్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది.

Infinix Hot 30 బాటమ్ లో స్పీకర్ గ్రిల్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, మైక్రోఫోన్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి. ఫోన్ వెనకాల డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది.

Infinix Hot 30i స్పెసిఫికేషన్స్

భారత్ లో Infinix Hot 30i ధర రూ.8,999 గా ఉంది. ఈ డివైజ్ లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పాండా గ్లాస్ ఉంటాయి. హీలియో జీ37 చిప్సెట్ ఈ ఫోన్ లో వాడారు. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post కన్ఫర్మ్ అయిన Infinix Hot 30 లాంచ్ తేదీ: రివీలైన డిజైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>