16జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో లాంచైన Infinix Hot 30

Highlights

  • థాయిలాండ్ లో లాంచైన Infinix Hot 30 స్మార్ట్ ఫోన్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన Infinix Hot 30
  • మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ పై పని చేయనున్న Infinix Hot 30

ఇన్ఫినిక్స్ సంస్థ మరొక స్మార్ట్ ఫోన్ Infinix Hot 30 ని థాయిలాండ్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ లో ఎన్నో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ88 ఆక్టా-కోర్ గేమింగ్ ప్రాసెసర్ ని అందించారు. కంపెనీ ప్రకారం, ఈ ఫోన్ లో పాపులర్ గేమ్ ఫ్రీ ఫైర్ ని గంటసేపు ఆడవచ్చు. ఆడుతోన్న సమయంలో గరిష్టంగా బ్యాగ్రౌండ్ టెంపరేచర్ 34.5 డిగ్రీలుగా ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Infinix Hot 30 ధర, సేల్ వివరాలు

థాయిలాండ్ వెబ్ సైట్ లో ఇన్ఫినిక్స్ సంస్థ Infinix Hot 30 ఫోన్ ధర వివరాలు అందించలేదు. అయితే ఈ ఫోన్ ఆఫ్‌లైన్ లో సేల్ కి అందుబాటులో ఉంది. త్వరలోనే మేం Infinix Hot 30 ఫోన్ ధరను మీకు అందిస్తాం.

Infinix Hot 30 స్పెసిఫికేషన్స్

  • 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్
  • మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్
  • ఏఆర్ఎం మాలి-జీ52 ఎంసీ2 జీపీయూ
  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • 8జిబి వర్చువల్ ర్యామ్

Infinix Hot 30 డివైజ్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే తో లాంచైంది. ఈ డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్ ని కలిగి ఉంది. Infinix Hot 30 లో మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్ వాడారు. ఇది 12ఎన్ఎం ప్రాసెస్ పై తయారైన చిప్సెట్. ఈ చిప్ 2.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎం మాలి-జీ52 ఎంసీ2 జీపీయూ వాడారు. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని అందించారు. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ అందించారు. ఈ ఫోన్ ర్యామ్ ని 16జిబి వరకు పెంచుకునే వీలుంది.

Infinix Hot 30 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఏఐ లెన్స్ అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Infinix Hot 30 లో చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ అందించారు. 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా ఈ ఫోన్ లో ఉంది. వై-ఫై, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్ వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. Infinix Hot 30 డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.