Infinix Note 40 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 18 Mar 2024 18:25:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Infinix: గ్లోబల్‌గా లాంచైన Note 40 Pro 5G, Note 40 Pro+ 5G https://www.91mobiles.com/telugu/infinix-note-40-pro-5g-note-40-pro-plus-5g-globally-launched/ Mon, 18 Mar 2024 18:25:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=10701 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix నేడు గ్లోబల్ గా Infinix Note 40 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Infinix Note 40 Pro+ 5G, Infinix Note 40 Pro 5G, Infinix Note 40, Infinix Note 40 Pro ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Infinix Note 40 Pro+ 5G మరియు Infinix Note 40 Pro 5G డివైజెస్ యొక్క […]

The post Infinix: గ్లోబల్‌గా లాంచైన Note 40 Pro 5G, Note 40 Pro+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Infinix Note 40 సిరీస్ గ్లోబల్ లాంచ్
  • లైనప్‌లో వచ్చిన రెండు మోడల్స్
  • ప్రారంభ ధర 289 యూఎస్ డాలర్లు

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix నేడు గ్లోబల్ గా Infinix Note 40 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Infinix Note 40 Pro+ 5G, Infinix Note 40 Pro 5G, Infinix Note 40, Infinix Note 40 Pro ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Infinix Note 40 Pro+ 5G మరియు Infinix Note 40 Pro 5G డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

Infinix Note 40 Pro 5G ధర

Infinix Note 40 Pro 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో వచ్చింది. దీని ధర 289 డాలర్లు (సుమారు రూ.23,900) గా ఉంది.

Infinix Note 40 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ + 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధర 309 డాలర్లు (సుమారు రూ.25,500) గా ఉంది.

Infinix Note 40 Pro 5G, Note 40 Pro+ 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: రెండు స్మార్ట్‌ఫోన్లలో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 2436*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ 2160 హెర్ట్జ్ ఉంటాయి.
  • ప్రాసెసర్: ఈ రెండు డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ అందించారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
  • ఓఎస్: ఈ ఇన్ఫినిక్స్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో వచ్చాయి.
  • కెమెరా: Infinix Note 40 Pro+ 5G మరియు Infinix Note 40 Pro 5G డివైజెస్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Infinix Note 40 Pro 5G మరియు Infinix Note 40 Pro+ 5G డివైజెస్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. నోట్ 40 ప్రో 5జీ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: ఈ రెండు ఫోన్లలో ఐపీ53 రేటింగ్, 14 5జీ బ్యాండ్స్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Infinix: గ్లోబల్‌గా లాంచైన Note 40 Pro 5G, Note 40 Pro+ 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Infinix: గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్‌పై లిస్టైన Note 40 Pro 5G https://www.91mobiles.com/telugu/infinix-note-40-pro-5g-google-play-console-database/ Sat, 09 Mar 2024 18:10:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=10608 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Infinix త్వరలో Note 40 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ మలేషియో లాంచ్ తేదీ ఇప్పటికే ఖరారైంది. మార్చి 18న మలేషియాలో నోట్ 40 సిరీస్ లాంచ్ అవుతోంది. ఈ లైనప్ లో Note 40 Pro 5G, Note 40 Pro+ 5G అనే డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. లాంచ్‌కి ముందు, ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై లిస్ట్ […]

The post Infinix: గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్‌పై లిస్టైన Note 40 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Infinix Note 40 Pro 5G
  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్
  • కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోన్న Infinix Note 40 Pro 5G

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Infinix త్వరలో Note 40 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ మలేషియో లాంచ్ తేదీ ఇప్పటికే ఖరారైంది. మార్చి 18న మలేషియాలో నోట్ 40 సిరీస్ లాంచ్ అవుతోంది. ఈ లైనప్ లో Note 40 Pro 5G, Note 40 Pro+ 5G అనే డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. లాంచ్‌కి ముందు, ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. MySmartPrice ఈ విషయాన్ని తన కథనం ద్వారా తెలిపింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Infinix Note 40 Pro 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

Infinix Note 40 Pro 5G స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై X6851 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Infinix Note 40 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 1080*2436 పిక్సెల్స్ రెజుల్యూషన్ సపోర్ట్ ఉంటాయని గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ ద్వారా తెలిసింది.

Infinix Note 40 Pro 5G డివైజ్ ని గమనిస్తే ముందువైపున కర్వ్డ్ ఎడ్జెస్ మరియు పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.

Infinix Note 40 Pro 5G లో పవర్ మరియు వాల్యూమ్ కీస్ ఫోన్ కి కుడివైపున ఉంటాయి.

Infinix Note 40 Pro 5G స్పెసిఫికేషన్స్

  • ప్రాసెసర్: Infinix Note 40 Pro 5G లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఉంటుందని సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Note 40 Pro 5G లో 8జిబి ర్యామ్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • ఓఎస్: Infinix Note 40 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు. అయితే ఈ ఫోన్ 70 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ మరియు 5 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోందని ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా తెలిసింది.
  • కెమెరా: Infinix Note 40 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో వాడే సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

The post Infinix: గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్‌పై లిస్టైన Note 40 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Infinix: గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్‌పై లిస్టైన Infinix Note 40, Note 40 Pro https://www.91mobiles.com/telugu/infinix-note-40-note-40-pro-listed-on-google-play-console-website/ Fri, 19 Jan 2024 16:14:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=9811 Infinix సంస్థ త్వరలో Infinix Note 40 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Infinix Note 40 మరియు Infinix Note 40 Pro అనే రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ డివైజెస్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. అయితే ప్రో మోడల్ ఇప్పటికే బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Infinix Note 40 మరియు Infinix Note 40 […]

The post Infinix: గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్‌పై లిస్టైన Infinix Note 40, Note 40 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Infinix Note 40 సిరీస్
  • లైనప్ లో రానున్న Infinix Note 40, Note 40 Pro
  • 8జిబి ర్యామ్‌తో వస్తోన్న రెండు డివైజెస్

Infinix సంస్థ త్వరలో Infinix Note 40 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Infinix Note 40 మరియు Infinix Note 40 Pro అనే రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ డివైజెస్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. అయితే ప్రో మోడల్ ఇప్పటికే బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Infinix Note 40 మరియు Infinix Note 40 Pro డివైజెస్ యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు, ప్రధాన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Infinix Note 40, Infinix Note 40 Pro గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

 

  • Infinix Note 40 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై X6853 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Infinix Note 40 Pro డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై X6850 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్లు 8జిబి వరకు ర్యామ్ తో గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యాయి.
  • చిప్సెట్ MT6789V/CD అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. అంటే ఇది మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ అయ్యుంటుందని భావించవచ్చు.
  • రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Infinix Note 40 మరియు Infinix Note 40 Pro డివైజెస్ 1080*2436 పిక్సెల్ రెజుల్యూషన్, 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో రానున్నాయి.
  • గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై రెండర్స్ కూడా రివీల్ అయ్యాయి. దీంతో ఫోన్ల లుక్ రివీల్ అయ్యింది.
  • రెండు ఫోన్లు కూడా పంచ్ హోల్ కటౌట్ డిస్ప్లే ని కలిగి ఉన్నాయని రెండర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
  • రెండు డివైజెస్ లో కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి.

Infinix Note 40 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Infinix Note 40 మరియు Infinix Note 40 Pro డివైజెస్ లో 1080*2436 పిక్సెల్స రెజుల్యూషన్ గల డిస్ప్లే, 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, పంచ్ హోల్ డిజైన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Note 40, Infinix Note 40 Pro ఫోన్లలో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Note 40 మరియు Infinix Note 40 Pro డివైజెస్ 8జిబి వరకు ర్యామ్, బేస్ మోడల్ 128జిబి స్టోరేజీతో రానున్నాయి.
  • కెమెరా: Infinix Note 40, Infinix Note 40 Pro డివైజెస్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఉండే సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
  • బ్యాటరీ: ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం, ఈ రెండు ఫోన్లు కూడా 5 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, రెండు ఫోన్లలోనూ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇంకా ఇవి 45 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి.
  • ఓఎస్: Infinix Note 40, Infinix Note 40 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తాయి.

The post Infinix: గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్‌పై లిస్టైన Infinix Note 40, Note 40 Pro first appeared on 91Mobiles Telugu.

]]>