
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Infinix త్వరలో Note 40 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ మలేషియో లాంచ్ తేదీ ఇప్పటికే ఖరారైంది. మార్చి 18న మలేషియాలో నోట్ 40 సిరీస్ లాంచ్ అవుతోంది. ఈ లైనప్ లో Note 40 Pro 5G, Note 40 Pro+ 5G అనే డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. లాంచ్‌కి ముందు, ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. MySmartPrice ఈ విషయాన్ని తన కథనం ద్వారా తెలిపింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Infinix Note 40 Pro 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్
Infinix Note 40 Pro 5G స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై X6851 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
Infinix Note 40 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 1080*2436 పిక్సెల్స్ రెజుల్యూషన్ సపోర్ట్ ఉంటాయని గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ ద్వారా తెలిసింది.
Infinix Note 40 Pro 5G డివైజ్ ని గమనిస్తే ముందువైపున కర్వ్డ్ ఎడ్జెస్ మరియు పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
Infinix Note 40 Pro 5G లో పవర్ మరియు వాల్యూమ్ కీస్ ఫోన్ కి కుడివైపున ఉంటాయి.
Infinix Note 40 Pro 5G స్పెసిఫికేషన్స్
- ప్రాసెసర్: Infinix Note 40 Pro 5G లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఉంటుందని సమాచారం.
- ర్యామ్, స్టోరేజీ: Infinix Note 40 Pro 5G లో 8జిబి ర్యామ్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
- ఓఎస్: Infinix Note 40 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు. అయితే ఈ ఫోన్ 70 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ మరియు 5 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోందని ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా తెలిసింది.
- కెమెరా: Infinix Note 40 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో వాడే సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.












