Infinix Smart 8 HD - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 08 Dec 2023 13:40:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 UniSOC T606 చిప్, 6GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Infinix Smart 8 HD; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/infinix-smart-8-hd-launched-india-price-specs-availability/ Fri, 08 Dec 2023 13:40:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=9197 ఇటీవలి కాలంలో చవక ఫోన్ల సెగ్మెంట్లో జనాదరణ పొందిన Infinix సంస్థ మరో కొత్త బడ్జెట్ ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. Infinix Smart 8 HD పేరుతో లాంచైన ఈ ఫోన్ యూనిఎస్ఓసీ టీ606 చిప్, 6జిబి ర్యామ్, మ్యాజిక్ రింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, […]

The post UniSOC T606 చిప్, 6GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Infinix Smart 8 HD; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Infinix Smart 8 HD
  • Infinix Smart 8 HD ధర కేవలం రూ.5,699
  • డిసెంబర్ 13 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకం

ఇటీవలి కాలంలో చవక ఫోన్ల సెగ్మెంట్లో జనాదరణ పొందిన Infinix సంస్థ మరో కొత్త బడ్జెట్ ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. Infinix Smart 8 HD పేరుతో లాంచైన ఈ ఫోన్ యూనిఎస్ఓసీ టీ606 చిప్, 6జిబి ర్యామ్, మ్యాజిక్ రింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డైనమిక్ నాచ్ (మ్యాజిక్ రింగ్) ఉన్నాయి. సరే, ఓసారి Infinix Smart 8 HD ధర, పూర్తి స్పెసిఫికేషన్స్, సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Smart 8 HD ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

  • Infinix Smart 8 HD డివైజ్ ధరను రూ.5,699 గా నిర్ణయించారు. చాలా తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ ని కొనుగోలు చేయాలని భావిస్తోన్న వారికి ఈ ఫోన్ చక్కటి ఆప్షన్ గా నిలవనుంది.
  • డిసెంబర్ 13 వ తేదీ నుంచి ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Infinix Smart 8 HD సేల్ మొదలవ్వనుంది.
  • యాక్సిస్ బ్యాంక్ కార్డ్ కలిగిన వారికి మొబైల్ పై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
  • Infinix Smart 8 HD స్మార్ట్‌ఫోన్ క్రిస్టల్ గ్రీన్, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix Smart 8 HD స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Infinix Smart 8 HD లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డైనమిక్ నాచ్ (మ్యాజిక్ రింగ్) ఉన్నాయి.
  • చిప్సెట్: Infinix Smart 8 HD లో యూనిఎస్ఓసీ టీ606 చిప్ వాడారు. ఇది ఎంట్రీ లెవెల్ చిప్సెట్.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Smart 8 HD లో 6జిబి వరకు ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: Infinix Smart 8 HD డివైజ్ ఆండ్రాయిడ్ 13 గో ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Infinix Smart 8 HD లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కూడా ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
  • సెక్యూరిటీ: Infinix Smart 8 HD లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి.
  • కనెక్టివిటీ: Infinix Smart 8 HD లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post UniSOC T606 చిప్, 6GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Infinix Smart 8 HD; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 8న లాంచ్ అవుతోన్న Infinix Smart 8 HD https://www.91mobiles.com/telugu/infinix-smart-8-hd-launch-date-december-8th/ Fri, 24 Nov 2023 05:53:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=8951 తక్కువ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు అందిస్తూ జనాల్లో ఆదరణ పొందిన సంస్థ Infinix. తర్వాత అన్ని సెగ్మెంట్లలోనూ ఫోన్లను లాంచ్ చేస్తూ పోతోంది. తాజాగా ఈ సంస్థ Infinix Smart 8 HD ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, Infinix Smart 8 HD డివైజ్ డిసెంబర్ 8 న లాంచ్ కానుందని సమాచారం. గతంలో వచ్చిన Infinix Smart 7 HD కి Infinix Smart 8 HD సక్సెసర్ […]

The post డిసెంబర్ 8న లాంచ్ అవుతోన్న Infinix Smart 8 HD first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Infinix Smart 8 HD
  • డిసెంబర్ 8 న లాంచ్ అయ్యే అవకాశం
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న Smart 8 HD

తక్కువ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు అందిస్తూ జనాల్లో ఆదరణ పొందిన సంస్థ Infinix. తర్వాత అన్ని సెగ్మెంట్లలోనూ ఫోన్లను లాంచ్ చేస్తూ పోతోంది. తాజాగా ఈ సంస్థ Infinix Smart 8 HD ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, Infinix Smart 8 HD డివైజ్ డిసెంబర్ 8 న లాంచ్ కానుందని సమాచారం. గతంలో వచ్చిన Infinix Smart 7 HD కి Infinix Smart 8 HD సక్సెసర్ గా వస్తోంది.

Infinix Smart 8 HD లాంచ్ వివరాలు

Infinix Smart 8 HD స్మార్ట్‌ఫోన్ భారత్ లో డిసెంబర్ 8 వ తేదీన లాంచ్ అవుతోంది. తక్కువ బడ్జెట్ లోనే ఈ ఫోన్ మార్కెట్ కి రానుంది. 4జీ కనెక్టివిటీ, 6.6-ఇంచ్ హెచ్డీ+ పంచ్-హోల్ కటౌట్, 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటాయి. Infinix Smart 8 HD డివైజ్ క్రిస్టల్ గ్రీన్, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్, గెలాక్సీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఫోన్ ధర తెలియాలంటే లాంచ్ తేదీ డిసెంబర్ 8 వరకు ఆగాల్సిందే.

Infinix Smart 7 HD

  • డిస్ప్లే: Infinix Smart 7 HD స్మార్ట్ ఫోన్ వేవ్ ప్యాటర్న్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఇకపోతే డిస్ప్లే కి మూడు వైపులా సన్నని బెజెల్స్, బాటమ్ లో మందపాటి చిన్ ఉన్నాయి.
  • ఓఎస్, ర్యామ్: Infinix Smart 7 HD డివైజ్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ తో లాంచ్ అయ్యింది. ఎక్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఆండ్రాయిడ్ గో ఎడిషన్ కావున గూగుల్ గో యాప్స్ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో తక్కువ ర్యామ్ ని వాడుకుని యాప్స్ నడుస్తాయి. Infinix Smart 7 HD డివైజ్ 2జిబి ఇంటర్నల్ ర్యామ్ మరియు 2జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. దీంతో యూజర్ కి మొత్తం 4జిబి ర్యామ్ లభిస్తుంది.
  • కెమెరా విభాగం: Infinix Smart 7 HD స్మార్ట్ ఫోన్ లో 8ఎంపి రియర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, కనెక్టివిటీ: Infinix Smart 7 HD లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఈ ఫోన్ లో బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ సిమ్, 4జీ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.

The post డిసెంబర్ 8న లాంచ్ అవుతోన్న Infinix Smart 8 HD first appeared on 91Mobiles Telugu.

]]>