డిసెంబర్ 8న లాంచ్ అవుతోన్న Infinix Smart 8 HD

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Infinix Smart 8 HD
  • డిసెంబర్ 8 న లాంచ్ అయ్యే అవకాశం
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న Smart 8 HD

తక్కువ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు అందిస్తూ జనాల్లో ఆదరణ పొందిన సంస్థ Infinix. తర్వాత అన్ని సెగ్మెంట్లలోనూ ఫోన్లను లాంచ్ చేస్తూ పోతోంది. తాజాగా ఈ సంస్థ Infinix Smart 8 HD ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, Infinix Smart 8 HD డివైజ్ డిసెంబర్ 8 న లాంచ్ కానుందని సమాచారం. గతంలో వచ్చిన Infinix Smart 7 HD కి Infinix Smart 8 HD సక్సెసర్ గా వస్తోంది.

Infinix Smart 8 HD లాంచ్ వివరాలు

Infinix Smart 8 HD స్మార్ట్‌ఫోన్ భారత్ లో డిసెంబర్ 8 వ తేదీన లాంచ్ అవుతోంది. తక్కువ బడ్జెట్ లోనే ఈ ఫోన్ మార్కెట్ కి రానుంది. 4జీ కనెక్టివిటీ, 6.6-ఇంచ్ హెచ్డీ+ పంచ్-హోల్ కటౌట్, 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటాయి. Infinix Smart 8 HD డివైజ్ క్రిస్టల్ గ్రీన్, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్, గెలాక్సీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఫోన్ ధర తెలియాలంటే లాంచ్ తేదీ డిసెంబర్ 8 వరకు ఆగాల్సిందే.

Infinix Smart 7 HD

  • డిస్ప్లే: Infinix Smart 7 HD స్మార్ట్ ఫోన్ వేవ్ ప్యాటర్న్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఇకపోతే డిస్ప్లే కి మూడు వైపులా సన్నని బెజెల్స్, బాటమ్ లో మందపాటి చిన్ ఉన్నాయి.
  • ఓఎస్, ర్యామ్: Infinix Smart 7 HD డివైజ్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ తో లాంచ్ అయ్యింది. ఎక్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఆండ్రాయిడ్ గో ఎడిషన్ కావున గూగుల్ గో యాప్స్ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో తక్కువ ర్యామ్ ని వాడుకుని యాప్స్ నడుస్తాయి. Infinix Smart 7 HD డివైజ్ 2జిబి ఇంటర్నల్ ర్యామ్ మరియు 2జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. దీంతో యూజర్ కి మొత్తం 4జిబి ర్యామ్ లభిస్తుంది.
  • కెమెరా విభాగం: Infinix Smart 7 HD స్మార్ట్ ఫోన్ లో 8ఎంపి రియర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, కనెక్టివిటీ: Infinix Smart 7 HD లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఈ ఫోన్ లో బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ సిమ్, 4జీ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.