Infinix Zero 30 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 02 Sep 2023 15:12:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 50MP సెల్ఫీ కెమెరా, 108MP ప్రైమరీ కెమెరాతో భారత్‌లో లాంచైన Infinix Zero 30 5G https://www.91mobiles.com/telugu/infinix-zero-30-5g-launched-india-price-specs-availability/ Sat, 02 Sep 2023 15:12:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=7848 చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix భారతీయ మార్కెట్ లో Infinix Zero 30 5G అనే కొత్త ఫోన్ ని లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి వచ్చే జీరో సిరీస్ ఫోన్లు అద్భుతమైన స్పెసిఫికేషన్స్ తో వస్తాయి. ఈసారి కూడా Infinix Zero 30 5G యూజర్ల అంచనాలకు తగినట్లే ఉంది. Infinix Zero 30 5G లో 21జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ ఉంది. ఇంకా ఈ ఫోన్ 50ఎంపి సెల్ఫీ కెమెరా, 108ఎంపి […]

The post 50MP సెల్ఫీ కెమెరా, 108MP ప్రైమరీ కెమెరాతో భారత్‌లో లాంచైన Infinix Zero 30 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో Infinix Zero 30 5G ప్రారంభ ధర రూ.23,999
  • ప్రీ-ఆర్డర్ కస్టమర్లకు రూ.2,000 డిస్కౌంట్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా Infinix Zero 30 5G సేల్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix భారతీయ మార్కెట్ లో Infinix Zero 30 5G అనే కొత్త ఫోన్ ని లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి వచ్చే జీరో సిరీస్ ఫోన్లు అద్భుతమైన స్పెసిఫికేషన్స్ తో వస్తాయి. ఈసారి కూడా Infinix Zero 30 5G యూజర్ల అంచనాలకు తగినట్లే ఉంది. Infinix Zero 30 5G లో 21జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ ఉంది. ఇంకా ఈ ఫోన్ 50ఎంపి సెల్ఫీ కెమెరా, 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Infinix Zero 30 5G డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Infinix Zero 30 5G ధర

Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ గల బేస్ వేరియంట్ ధరను రూ.23,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ గల టాప్ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ రోమ్ గ్రీన్, గోల్డెన్ అవర్ అనే రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లెదర్ బ్యాక్ ఫినిష్ తో వచ్చింది. బ్యాంక్ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ పై రూ.2,000 డిస్కౌంట్ లభించనుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ రెండు మెమొరీ వేరియంట్స్ పై వర్తిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా ఈ డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు.

Infinix Zero 30 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ లో 20:9 యాస్పెక్ట్ రేషియో, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ టెక్నాలజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ77 జీపీయూ వినియోగించారు.
  • ఓఎస్: Infinix Zero 30 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • రియర్ కెమెరా: Infinix Zero 30 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, ఏఐ సెన్సర్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
  • ఫ్రంట్ కెమెరా: Infinix Zero 30 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి కెమెరా అందించారు. వ్లాగింగ్ చేసే వారికి 50ఎంపి ఫ్రంట్ కెమెరా బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
  • బ్యాటరీ: Infinix Zero 30 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post 50MP సెల్ఫీ కెమెరా, 108MP ప్రైమరీ కెమెరాతో భారత్‌లో లాంచైన Infinix Zero 30 5G first appeared on 91Mobiles Telugu.

]]>
50MP సెల్ఫీ కెమెరాతో రానున్న Infinix Zero 30 5G; లీకైన టీజర్, ఫోటోస్! https://www.91mobiles.com/telugu/infinix-zero-30-5g-teaser-launch-leaked-photos/ Tue, 22 Aug 2023 15:19:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=7697 Infinix సంస్థ త్వరలో Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడిస్తూ వస్తోంది. తాజాగా మరోసారి, ఇన్ఫినిక్స్ సంస్థ, కొత్త టీజర్ ని విడుదల చేసింది. దీంతో పాటు, ఫోన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఆకట్టుకునే డిజైన్, 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. Infinix Zero 30 5G […]

The post 50MP సెల్ఫీ కెమెరాతో రానున్న Infinix Zero 30 5G; లీకైన టీజర్, ఫోటోస్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Infinix Zero 30 5G
  • 21జిబి వరకు ర్యామ్‌ని ఆఫర్ చేయనున్న డివైజ్
  • లెదర్ మ్యాట్ ఫినిష్ డిజైన్ తో వస్తోన్న Infinix Zero 30 5G

Infinix సంస్థ త్వరలో Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడిస్తూ వస్తోంది. తాజాగా మరోసారి, ఇన్ఫినిక్స్ సంస్థ, కొత్త టీజర్ ని విడుదల చేసింది. దీంతో పాటు, ఫోన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఆకట్టుకునే డిజైన్, 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం.

Infinix Zero 30 5G కొత్త టీజర్

  • ఇన్ఫినిక్స్ సంస్థ Infinix Zero 30 5G యొక్క అధికార టీజర్ వీడియోని విడుదల చేసింది. కమింగ్ సూన్ అని ట్యాగ్‌లైన్ దానికి జోడించింది. దీంతో త్వరలోనే భారతీయ మార్కెట్ లోకి ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.
  • 4కే 60ఎఫ్‌పీఎస్ సపోర్ట్ తో వస్తోన్న Infinix Zero 30 5G
  • Infinix Zero 30 5G డివైజ్ స్క్వేర్ షేప్డ్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్, 3 కెమెరా సెన్సర్స్ ని కలిగి ఉన్నట్లు లేటెస్ట్ టీజర్ ద్వారా తెలుస్తోంది.
  • ఫోన్ ముందు భాగాన్ని పరిశీలిస్తే, పంచ్ హోల్ కటౌట్, కర్వ్డ్ డిస్ప్లే ఉన్నాయి.
  • ఇంకా, Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ గ్రీన్, గోల్డెన్ కాంబో కలర్స్ తో పాటు లెదర్ మ్యాట్ ఫినిష్ డిజైన్ బ్యాక్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

లీకైన Infinix Zero 30 5G ఇమేజెస్

  • Infinix Zero 30 5G డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ తో పాటు ఫోటోస్ లీక్ అయ్యాయి.
  • Infinix Zero 30 5G లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుందని సమాచారం.
  • బ్యాక్ కెమెరా విషయానికి వస్తే, ఇది 4కే 60ఎఫ్‌పీఎస్ సపోర్ట్ తో వస్తోంది.
  • ఇంకా బ్యాక్ కెమెరా ఓఐఎస్ ఫీచర్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది.
  • స్టోరేజీ విషయానికి వస్తే, Infinix Zero 30 5G లో 12జిబి ర్యామ్, 9జిబి వర్చువల్ ర్యామ్ ఉంటాయి. అంటే యూజర్ కి మొత్తం 21జిబి ర్యామ్ లభించనుంది. ఇక ఈ ఫోన్ లో 256జిబి వరకు స్టోరేజీని అందిస్తున్నారు.
  • Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ ఐపీ53 రేటింగ్ తో వస్తోంది.

The post 50MP సెల్ఫీ కెమెరాతో రానున్న Infinix Zero 30 5G; లీకైన టీజర్, ఫోటోస్! first appeared on 91Mobiles Telugu.

]]>
ఈ నెలలోనే భారత్ లో లాంచ్ కానున్న Infinix Zero 30 5G; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/infinix-zero-30-5g-india-launch-confirmed-by-company/ Fri, 11 Aug 2023 14:55:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=7570 Infinix Zero 30 5G డివైజ్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుందని తెలుస్తోంది. ఇక అన్ని గాసిప్స్ కి తెరదించుతూ, Infinix India స్వయంగా తన కొత్త ఫోన్ పై ప్రకటన చేసింది. ఆగస్టు నెలలోనే Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుందని ఇన్ఫినిక్స్ సంస్థ వెల్లడించింది. సరే, ఓసారి Infinix Zero 30 5G గురించి పూర్తి వివరాలు […]

The post ఈ నెలలోనే భారత్ లో లాంచ్ కానున్న Infinix Zero 30 5G; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Infinix Zero 30 5G
  • లాంచ్‌ని అధికారికంగా ప్రకటించిన Infinix
  • 10-బిట్ అమోలెడ్ డిస్ప్లేతో రానున్న డివైజ్

Infinix Zero 30 5G డివైజ్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుందని తెలుస్తోంది. ఇక అన్ని గాసిప్స్ కి తెరదించుతూ, Infinix India స్వయంగా తన కొత్త ఫోన్ పై ప్రకటన చేసింది. ఆగస్టు నెలలోనే Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుందని ఇన్ఫినిక్స్ సంస్థ వెల్లడించింది. సరే, ఓసారి Infinix Zero 30 5G గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Zero 30 5G లాంచ్ వివరాలు

ప్రెస్ రిలీజ్ ని షేర్ చేస్తూ, Infinix బ్రాండ్ తన జీ నంబర్ బ్రాండ్ ని భారత్ లో ఎక్స్‌పాండ్ చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం భారత్ లో గత మోడల్ అయిన Infinix Zero 20 సేల్ కి అందుబాటులో ఉంది. ఇప్పుడు Infinix Zero 30 5G డివైజ్ త్వరలోనే లాంచ్ కానుంది. ఆగస్టు చివరి వారంలో Infinix Zero 30 5G భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుందని అంచనా. ప్రస్తుతం కచ్చితమైన లాంచ్ తేదీ కొరకు అంతా వేచి చూస్తున్నారు.

Infinix Zero 30 5G డిజైన్

కంపెనీ షేర్ చేసిన ఫోటోల ద్వారా Infinix Zero 30 5G యొక్క డిజైన్ ఎలా ఉంటుందో రివీల్ అయ్యింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

  • ఇన్ఫినిక్స్ షేర్ చేసిన పిక్స్ లో గోల్డ్ మరియు బ్లూ కలర్స్ కనిపించాయి.
  • ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై గ్లాసీ స్టార్ లైట్ షేప్, వేవ్ ప్యాటర్న్స్ ఉన్నాయి.
  • బ్యాక్ ప్యానెల్ పై భాగంలో రియర్ కెమెరా సెటప్ స్క్వేర్ షేప్ లో ఉంది.
  • రియర్ కెమెరా సెటప్ లో 3 కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. ఇందులో రెండు సెన్సర్స్ భారీ సైజులో ఉన్నాయి. మరొక సెన్సర్ చిన్నగా ఉంది.
  • ఇంకా బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. ప్యానెల్ కి కుడివైపున ఓఐఎస్ అల్ట్రా క్లియర్ లెన్స్ అని వర్టికల్ షేప్ లో రాసి ఉంది.
  • వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఫోన్ కి బాటమ్ లో ఉంది.

Infinix Zero 30 5G ఫీచర్స్

  • Infinix Zero 30 5G డివైజ్ 10-బిట్ అమోలెడ్ డిస్ప్లేతో రానున్నట్లు కంపెనీ ప్రకటించింది.
  • Infinix Zero 30 5G ఫోన్ కర్వ్డ్ స్క్రీన్, 60 డిగ్రీల వంపు తో వస్తోంది.
  • Infinix Zero 30 5G ఫోన్ ఫ్రంట్ మరియు బ్యాక్ గ్లాస్ ప్యానెల్ తో వస్తోంది.
  • Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ లో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందిస్తున్నారు.
  • భారత్ లో ఈ ఫోన్ లెదర్ ఫినిషింగ్ వేరియంట్ లో కూడా లాంచ్ కానుంది.
  • Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్ తో వస్తోంది.

The post ఈ నెలలోనే భారత్ లో లాంచ్ కానున్న Infinix Zero 30 5G; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
8GB ర్యామ్‌తో గూగుల్ ప్లే కన్సోల్‌ పై కనిపించిన Infinix Zero 30 5G https://www.91mobiles.com/telugu/infinix-zero-30-5g-spotted-google-play-console-database-key-specs/ Tue, 08 Aug 2023 04:28:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=7502 స్మార్ట్ ఫోన్ తయారీదారు Infinix త్వరలోనే జీరో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. Infinix Zero 30 5G అనే పేరుతో మార్కెట్ లోకి రాబోవు ఈ ఫోన్ తాజాగా గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా ప్రధానమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Infinix Zero 30 5G గూగుల్ ప్లే […]

The post 8GB ర్యామ్‌తో గూగుల్ ప్లే కన్సోల్‌ పై కనిపించిన Infinix Zero 30 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జీరో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేయనున్న ఇన్ఫినిక్స్
  • Infinix Zero 20 5G కి సక్సెసర్ గా వస్తోన్న Infinix Zero 30 5G
  • గూగుల్ ప్లే కన్సోల్ పై తాజాగా కనిపించిన డివైజ్

స్మార్ట్ ఫోన్ తయారీదారు Infinix త్వరలోనే జీరో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. Infinix Zero 30 5G అనే పేరుతో మార్కెట్ లోకి రాబోవు ఈ ఫోన్ తాజాగా గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా ప్రధానమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Infinix Zero 30 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు

గూగుల్ ప్లే కన్సోల్ పై Infinix Zero 30 5G లిస్ట్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్ పై ఓ అవగాహన వచ్చినట్లైంది.

  • డిస్ప్లే: Infinix Zero 30 5G డివైజ్ 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 480పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉన్నట్లు లిస్టింగ్ లో ఉంది.
  • ఓఎస్: Infinix Zero 30 5G ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో కనిపించింది.
  • ర్యామ్: Infinix Zero 30 5G డివైజ్ లిస్టింగ్ పై 8జిబి ర్యామ్ తో కనిపించింది. ఈ స్మార్ట్ ఫోన్ మరొక మెమొరీ వేరియంట్ లో కూడా రానుందని అంచనా వేస్తున్నారు.
  • చిప్సెట్: Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో కనిపించింది. మార్కెట్ లోకి మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్ తో రానున్నట్లు సమాచారం.
  • గ్రాఫిక్స్: Infinix Zero 30 5G లో గ్రాఫిక్స్ కోసం 9ఎక్స్ ఏఆర్ఎమ్ మాలి జీ77 జీపీయూ వాడినట్లు లిస్టింగ్ ద్వారా స్పష్టమైంది.

Infinix Zero 30 5G గురించి ఇప్పటి వరకు గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా తెలిసిన వివరాలు ఇంతే. మనం ఓసారి గత మోడల్ అయిన Infinix Zero 20 5G స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం.

Infinix Zero 20 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Infinix Zero 20 5G స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ నాచ్ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • కెమెరా: Infinix Zero 20 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 60ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ 60ఎంపి ఫ్రంట్ కెమెరాని ప్రపంచపు ఉత్తమమైన వ్లాగ్ కెమెరాగా ఇన్ఫినిక్స్ అభివర్ణించింది.
  • చిప్సెట్: Infinix Zero 20 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Zero 20 5G డివైజ్ లో 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • బ్యాటరీ: Infinix Zero 20 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post 8GB ర్యామ్‌తో గూగుల్ ప్లే కన్సోల్‌ పై కనిపించిన Infinix Zero 30 5G first appeared on 91Mobiles Telugu.

]]>