ఈ నెలలోనే భారత్ లో లాంచ్ కానున్న Infinix Zero 30 5G; కన్ఫర్మ్ చేసిన కంపెనీ!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Infinix Zero 30 5G
  • లాంచ్‌ని అధికారికంగా ప్రకటించిన Infinix
  • 10-బిట్ అమోలెడ్ డిస్ప్లేతో రానున్న డివైజ్

Infinix Zero 30 5G డివైజ్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుందని తెలుస్తోంది. ఇక అన్ని గాసిప్స్ కి తెరదించుతూ, Infinix India స్వయంగా తన కొత్త ఫోన్ పై ప్రకటన చేసింది. ఆగస్టు నెలలోనే Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుందని ఇన్ఫినిక్స్ సంస్థ వెల్లడించింది. సరే, ఓసారి Infinix Zero 30 5G గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Zero 30 5G లాంచ్ వివరాలు

ప్రెస్ రిలీజ్ ని షేర్ చేస్తూ, Infinix బ్రాండ్ తన జీ నంబర్ బ్రాండ్ ని భారత్ లో ఎక్స్‌పాండ్ చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం భారత్ లో గత మోడల్ అయిన Infinix Zero 20 సేల్ కి అందుబాటులో ఉంది. ఇప్పుడు Infinix Zero 30 5G డివైజ్ త్వరలోనే లాంచ్ కానుంది. ఆగస్టు చివరి వారంలో Infinix Zero 30 5G భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుందని అంచనా. ప్రస్తుతం కచ్చితమైన లాంచ్ తేదీ కొరకు అంతా వేచి చూస్తున్నారు.

Infinix Zero 30 5G డిజైన్

కంపెనీ షేర్ చేసిన ఫోటోల ద్వారా Infinix Zero 30 5G యొక్క డిజైన్ ఎలా ఉంటుందో రివీల్ అయ్యింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

  • ఇన్ఫినిక్స్ షేర్ చేసిన పిక్స్ లో గోల్డ్ మరియు బ్లూ కలర్స్ కనిపించాయి.
  • ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై గ్లాసీ స్టార్ లైట్ షేప్, వేవ్ ప్యాటర్న్స్ ఉన్నాయి.
  • బ్యాక్ ప్యానెల్ పై భాగంలో రియర్ కెమెరా సెటప్ స్క్వేర్ షేప్ లో ఉంది.
  • రియర్ కెమెరా సెటప్ లో 3 కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. ఇందులో రెండు సెన్సర్స్ భారీ సైజులో ఉన్నాయి. మరొక సెన్సర్ చిన్నగా ఉంది.
  • ఇంకా బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. ప్యానెల్ కి కుడివైపున ఓఐఎస్ అల్ట్రా క్లియర్ లెన్స్ అని వర్టికల్ షేప్ లో రాసి ఉంది.
  • వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఫోన్ కి బాటమ్ లో ఉంది.

Infinix Zero 30 5G ఫీచర్స్

  • Infinix Zero 30 5G డివైజ్ 10-బిట్ అమోలెడ్ డిస్ప్లేతో రానున్నట్లు కంపెనీ ప్రకటించింది.
  • Infinix Zero 30 5G ఫోన్ కర్వ్డ్ స్క్రీన్, 60 డిగ్రీల వంపు తో వస్తోంది.
  • Infinix Zero 30 5G ఫోన్ ఫ్రంట్ మరియు బ్యాక్ గ్లాస్ ప్యానెల్ తో వస్తోంది.
  • Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ లో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందిస్తున్నారు.
  • భారత్ లో ఈ ఫోన్ లెదర్ ఫినిషింగ్ వేరియంట్ లో కూడా లాంచ్ కానుంది.
  • Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ స్లీక్ డిజైన్ తో వస్తోంది.